20, అక్టోబర్ 2016, గురువారం

సమస్య - 2175 (స్తనములు లేని పూరుషుఁడు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"స్తనములు లేని పూరుషుఁడు సంస్తవనీయుఁడు గాఁడు ధాత్రిలో"
లేదా...
"స్తనములు లేని పురుషుండు స్తవనీయుండే"

108 కామెంట్‌లు:

  1. రిప్లయిలు


    1. ఘనమై నొప్పు రమణికి
      స్తనములు; లేని పురుషుండు స్తవనీయుండే
      మనమున దోసపుటాలో
      చనలున్ ; యీ వాక్యమిట్లు చదువగ తగునౌ‌!

      జిలేబి

      తొలగించండి
    2. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది.
      మొదటి పాదంలో గణదోషం. 'ఆలోచనలున్+ఈ' అన్నపుడు యడాగమం రాదు. "ఘనమై యొప్పు రమణికిన్... దోసపు టాలో।చనలును; నీ వాక్య...' అనండి.

      తొలగించండి
  2. క్రొవ్విడి వెంకట రాజారావు:

    గురువుగారూ! నమస్కారములు. నిన్నటి " న్యస్తాక్షరి " నిప్పుడే చూసాను. దానికి సంబంధించిన క్రింది పద్యాన్ని పరిశీలించగలరు.

    శంకరాభరణము సరి వేదికయ్యెను
    కవితలు వెలయించు కవులకెల్ల
    రమ్య మైన పద్య రసములు బంచు న
    య్యది నిలిపెడు నట్టి నఖిల గురుడు
    శంకలన్ని నెఱిన సవరింత సేయుచు
    కవితలందు ధార క్రమము పఱచి
    రకము గూడు కవిత లందించి తేర్చు న
    య్యగ పొసగును వాని నభినుతింతు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
      మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  3. వినయము సాధువర్తనము విస్తృతసుందరతా నిధానముల్
    ఘనదురితాపహారములు కామిత సత్ఫలదాయకంబులున్
    వనజపరీమళంబు లవి భామల కందముగూర్చునట్టివౌ
    స్తనములు లేని పూరుషుడు సంస్తవనీయుడు గాడు ధాత్రిలో.
    హ.వేం.స.నా.మూర్తి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  4. వనితకు సొగసుల దెచ్చును
    చనుదోయి! మగడను వాని ఛాతిని నారీ
    జనము పొగడ పడతికి వలె
    స్తనములు లేని పురుషుండు స్తవనీయుండే!

    రిప్లయితొలగించండి
  5. ధనమిల సర్వమంచు కడు దర్పముతోడను నీల్గుచున్ మహా
    ఘనుని విధంబుగా మసలు గాని యెఱుంగఁడు వాస్తవంబుగా
    మనుజుని దివ్యు జేయు బహ మాన్యత జెందిన గాన, సాహితీ
    స్తనములు లేని పూరుషుఁడు సంస్తవనీయుఁడు గాఁడు ధాత్రిలో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. సరస్వతీ స్తనముల ప్రస్తావన మీరే మొదట తెచ్చారు. కాని వాణీదేవిని ప్రస్తావిస్తే ఇంకా బాగుండేది.
      బహు మాన్యత... బహ మాన్యత .. అని టైపయింది.

      తొలగించండి
  6. క్రొవ్విడి వెంకట రాజారావు:

    అనువున కూనకు పాలిడు
    స్తనములు జననికి సొబగిడు; సత్తువ జాటే
    ఘన ఱొమ్ము0డీ కొమవలె
    స్తనములు లేని పురుషుండు స్తవనీయుండే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  7. శ్రీగురుభ్యోనమః

    తనదగు ధర్మము నెరపి ధన్యత నొందును మాతృమూర్తి తాన్
    కనులకు రెప్పలట్లుగను గాచుచు బిడ్డల బెంపు చేయుచున్
    ఘనమగు విద్య నేర్పుచును గౌరవ శోభల గూరు బాధ్యతా
    స్తనములు లేని పూరుషుఁడు సంస్తవనీయుఁడు గాఁడు ధాత్రిలో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీపతి శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ధర్మము న్నెరపి... శోభల గూర్చు...' టైపాట్లు.

      తొలగించండి
    2. గురువుగారికి నమస్సులు, ధన్యవాదములు.

      తొలగించండి
  8. వనవాసము జేసిననూ
    మనుగడకై నటన గాన మాడను పాడన్
    అనువుగ బృహన్నలైనను
    స్తనములు లేని పురుషుండు స్తవనీయుండే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జి.పి. శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      '..జేసిననూ' అనడం సాధువు కాదు. 'వనవాసమ్మును జేసిన' అనండి.

      తొలగించండి
    2. గురువు గారూ:

      తప్పు అర్ధమైనది. సవరణకు కృతజ్ఞతలు.

      తొలగించండి
  9. వినయము సౌశీల్యము దయ
    మనమున మమకారమున్న మనుజులకవియే
    ఘనమగు భూషలు, మరి గో
    స్తనములు లేని పురుషుండు స్తవనీయుండే!!!

    గోస్తనము= ముత్యాలహారము

    రిప్లయితొలగించండి

  10. స్తనములయందునొక్కటి ప్రశస్తముగా
    స్వరముల్ సృజింపగా
    వినమధురమ్ము, రెండవది ప్రీతికరమ్మగు సాహితీ కళన్
    తనరగనిచ్చు లోకులకు ధన్యతఁ గూర్చెడు తత్ సరస్వతీ
    స్తనములు లేని పూరుషుఁడు సంస్తవనీయుఁడు గాఁడు ధాత్రిలో ||

    వినసొంపగు సంగీతము,
    ఘనతర సాహిత్యమనెడు ఘటముల్ రెండౌ
    ననవద్యపు శ్రీ వాణీ
    స్తనములు లేని పురుషుండు స్తవనీయుండే ||


    సంగీతమపి సాహిత్యం సరస్వత్యాః స్తనాలమీద |
    ఏకమాపాతమధురం అన్యదాలోచనామృతమ్ ||

    ఈ స్తనద్వయం పూరుషునికి ఉండవలెను.అది లేని వాడు పూజనీయుడు కాడు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. మాడుగుల అనిల్ కుమార్ గారూ,
      మీ రెండు పూరణలు అమృత మధురాలై అలరించాయి. అభినందనలు.

      తొలగించండి
    2. ఆర్య! అనేక నమస్కారములు. హృదయపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  11. Print mistake adjustment

    సంగీతమపి సాహిత్యం సరస్వత్యాః స్తనద్వయమ్ |
    ఏకమాపాతమధురం అన్యదాలోచనామృతమ్ ||

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అనిల్ కుమార్ గారు చక్కటి శ్లోకమును ప్రస్తావించి సంశయాత్మకులకు సమస్యౌన్నత్యాన్ని ప్రకటించారు. అభినందనలు.

      తొలగించండి
    2. ఆర్య! కామేశ్వరరావు గారూ ! అనేక నమస్కారములు. మీ అభినందన మోదదాయకము. హృదయపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  12. సంగీత సాహిత్య కళా విహీనః
    సాక్షాత్ పశుః పుచ్చ విషాణ హీనః |
    తృణం న ఖాదన్నపి జీవమానః తత్ భాగధేయం పరమం పశూనామ్ ||

    రిప్లయితొలగించండి
  13. మిత్రులందఱకు నమస్సులు!

    సునిశిత భావజాలయుత సూక్ష్మపు ధర్మములున్న పద్యముల్
    మనమున రూపుఁదాల్చఁ దన మంజుమనోహర గాన వాహినిన్
    మనములఁ దేల్చునట్టి జనమాన్యత నందెడి యా సరస్వతీ

    స్తనములు లేని పూరుషుఁడు సంస్తవనీయుఁడు గాఁడు ధాత్రిలో!

    రిప్లయితొలగించండి
  14. జన హృదయాను రంజన సుశబ్దలయాత్మక రూపముల్ గదా
    తనరగ యోచనామృతము ధన్యకవిత్వము, దివ్య సామవే
    ద నియమాత్త గానకళ, తద్దయు రెండును నొప్పు భారతీ
    స్తనములు; లేని పూరుషుఁడు సంస్తవనీయుఁడు గాఁడు ధాత్రిలో?

    జన హృదయ రంజకములై
    తనరెడు రెండు కళలు కవితా గానమ్ముల్
    వనజభవ పత్ని వాణీ
    స్తనములు లేని పురుషుండు స్తవనీయుండే?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సరస్వతీ స్తన ద్వయాన్ని ఎవరూ ప్రస్తావించలేదు కదా అని నేను నా పూరణలను టైప్ చేసి పోస్ట్ చేసే సరికి ముగ్గురు మిత్రుల పూరణలు వచ్చాయి. ఎలాగూ టైప్ చేశాను కదా అని నా పూరణలను పోస్ట్ చేశాను.

      తొలగించండి
  15. తన జనులన్నవారు తన దారిని జూపరు పెద్దనిద్రలో
    ధనమది వెంటరాదు గద ధాత్రిని వీడగ రుద్రభూమిలో
    కినుక వహింపకుండు ఘన కీర్తియు లబ్ధ ప్రతిష్ఠ లన్నయా
    స్తనములు లేని పూరుషుఁడు సంస్తవనీయుఁడు గాఁడు ధాత్రిలో

    రిప్లయితొలగించండి
  16. Such obscene puzzles are undesirable. Do we need to prove our literry skill by completing such distasteful lines. Let us not degrade poems to jabardast level sie.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Sir obscenity generates in our minds depending upon the glasses through which we see the things.

      తొలగించండి
    2. GKK గారూ,
      ఇది నేను సృష్టించిన సమస్య కాదు. గతంలో గౌరవనీయ పండితులూ, భాషాభిమానులూ పాల్గొన్న పెక్కు అవధానాలలో పృచ్ఛకులు అడిగిందే! ఇంతకంటె అశ్లీలమైన, అభ్యంతరకరమైన సమస్యలను అవధానాలలో అడగడం జరిగింది. అశ్లీలాన్ని, అసంబద్ధతను తొలగించి అవధాని తన ప్రావీణ్యాన్ని, సమయస్ఫూర్తిని ప్రకటించుకుంటాడు.
      సమస్య అంటేనే 'distasteful line'. దానిని 'tasteful line'గా మార్చడమే సమస్యాపూరణం.
      ఇక్కడ ప్రస్తావించడం బాగుండదు కాని, మీ మెయిల్ చిరునామా ఇస్తే గతంలో గొప్ప అవధానాలలో లబ్ధ ప్రతిష్ఠులు పృచ్ఛకులుగా ఇచ్చిన సమస్యలను కొన్నిటిని అవధానం జరిగిన తేదీ, అవధాని పేరు, (దొరికితే) పృచ్ఛకుని పేరు, వాటి పూరణలను పంపిస్తాను. అవి ఇప్పటివి కావు, తిరుపతి వేంకట కవుల, కొప్పరపు కవుల కాలానికి చెందినవి. అవి చదివితే మీకే అర్థమవుతుంది. ఈరోజు ఇచ్చిన సమస్యలో అశ్లీలత లేదని!

      తొలగించండి
    3. భారత భాగవత రామాయణ ప్రబంధ సంస్క్రతాంధ్ర కావ్యాలలో స్తన ప్రస్తావన లేని కావ్యము శూన్యమే గదా!
      అయోనిజ, వరారోహ, పృథుశ్రోణి, నితంబిని, అబ్జయోని మున్నగు పదములు బహుళ ప్రయోగములే కదా!

      తొలగించండి
    4. ఒకానొక అష్టావధానంలో మేడసాని మోహన్ గారి పూరణ


      అనుపమమైన సంపదల అద్భుతహేల వహించి యుండియున్
      ఘనతర వీరవిక్రమ విఘట్టిత క్షాత్రవులై యెసంగియున్
      నినదిత దివ్య భావుక ఘణీకృత సార ధురీణ భారతీ
      స్తనములులేని పూరుషుడు సంస్థవనీయుడుకాడు ధాత్రిలో

      తొలగించండి
    5. Dear shree GKK
      Please read the famous novel ' Seven mminutes ' to decide what is obscene and what is not. More so it is our required task to complete the puzzle with a meaningful, and reasonably fair concept.

      తొలగించండి
  17. వినుమా పురుషుల కుండవు
    స్తనములు, లేని పురుషుండు స్తవ నీ యుండే
    మనమున బెను దుర్బుధ్ధులు
    వినయము గా నుండు నెడల బెరుగును సిరులున్

    రిప్లయితొలగించండి
  18. రిప్లయిలు
    1. కనికర మించు కైనఁ బొడగానని కర్కశ చిత్తు డెన్నగన్
      ధనములు ధాన్య సంపదలు దర్ప పదోన్నతు లెన్ని యున్ననున్
      ఘన కుల జాతు డైనను వికార విదూరపు వైభవైషమ
      స్తనములు లేని పూరుషుఁడు సంస్తవనీయుఁడు గాఁడు ధాత్రిలో

      [ వైభవ+ఐషమస్తనములు; ఐషమస్తనములు = ఈ సంవత్సరపువి (ప్రస్తుతము)]


      జన సంచయ ప్రవర్తక
      ధన మాన ప్రాణ సముచిత త్రాణమ్ముల్
      ఘన కృత సత్కా ర్యాధ
      స్తనములు లేని పురుషుండు స్తవనీయుండే

      [అధస్తనములు: పూర్వపువి]

      తొలగించండి
    2. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ పుణ్యాన క్రొత్త క్రొత్త పదాల పరిచయం లభిస్తున్నది. సంతోషం!
      అనుకూలత గలిగి అనుసరణీయమైన ప్రస్తుతకాలం, పుణ్యకార్యాలు చేసిన గతకాలం లేని వారిని గురించిన మీ రెండు పూరణలు ఉత్తమంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
  19. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    { ఒక వేశ్య విటునితో అన్న మాటలు :-

    వేశ్య చె౦తకు వచ్చు వాడు

    స్వర్ణహారములను తేవలెను . కనీసము

    గోస్తనముల నైన తీసుకొని రావలెను . వేశ్య

    కిచ్చుటకు గోస్తనము లైన లేనివాడు ఒక

    W a s te fellow }


    అనె నిటు నల్క తోడ గణికా౦గన ,

    ……… " ఓ విట చక్రవర్తి ! నే , ే

    నిను వరి యి౦చి , య౦దముల నీకు

    …… సమర్పణ జేసి , నిన్ను స్వ౦

    జన దివి య౦దు దేల్చ వలె | స్వైరిణి c

    ……………… గూడగ వచ్చు వాడు కా౦

    చనపు సర౦బు లెన్నియొ నొస౦గు | కనీసము

    …………… వేశ్య కీయ గో

    స్తనములు లేని పూరుషుడు , స౦స్తవ

    …………… నీయుడు గాడు ధాత్రి లో "

    { గణికా౦గన = స్వైరిణి = వేశ్య ;

    స్వ౦జనము = కౌగిలి ; స్వ౦జన దివి =

    కౌగిలి యనే స్వర్గము ;

    గో స్త న ము = పూ స ల స ర ము }

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      సరసమైన మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  20. .” వనితల కందమాస్తులవి|వంశ పురోగతి పాలకుండలౌ
    స్తనములు”|”లేని పూరుషుడు సంస్తవ నీయుడుగాడుధాత్రిలో
    అనగల మాటలెందుల కనర్హత దట్టదు దైవ లీలలో
    మనుగడ సృష్టి కార్యమున మర్మపు ధర్మము నిర్మలత్వమే”|
    2.వినుటకు వింతగదోచును
    స్తనములు లేని పురుషుండు స్తవ నీయుండే
    యనగలిగిన?మనజాలము
    కనజాలని మార్పులందు కలయుగ మగుటే|

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి.
      టైపాట్లు ఉన్నవి.

      తొలగించండి
  21. శ్రీ కంది శంకరయ్య గురువుగారికి నమస్కారములు
    మీ సూచన ప్రకారము మార్చి వ్రాశాను చూడండి
    ధనమిల సర్వమంచు కడు దర్పముతోడను నీల్గుచున్ మహా
    ఘనుని విధంబుగా మసలు గాని యెఱుంగఁడు వాస్తవంబుగా
    మనుజుని మార్చితేజమిడు మాటల బోటి సు గాన, సాహితీ
    స్తనములు లేని పూరుషుఁడు సంస్తవనీయుఁడు గాఁడు ధాత్రిలో

    రిప్లయితొలగించండి
  22. త్రినయనుడు దాల్చె సతి గిరి
    జను వామపు భాగమందు స్తనముండును.ద
    క్షిణవక్షపు భాగములో
    స్తనములు లేని పురుషుండు.స్తవనీయుండే

    రిప్లయితొలగించండి
  23. స్తనములు లేని పూ రుషుడు సంస్తవ నీయుడు గాడు ధాత్రిలో
    వినగను నేహ్య భావము న వేమఱు మాటలు బల్క నేరనే
    స్తనములు గల్గు పూరుషుని శాస్త్రము జెప్పు నపుంస కుండుగా
    వినుముర చంద్ర శేఖర వివేక ముతోడ ను బల్కు మాయికన్

    రిప్లయితొలగించండి
  24. చనుదోయి సరస్వతికి,క
    వనమును,సంగీతములగు పావనమౌభా
    వనమున ధరనా రెండగు
    స్తనములు లేని పురుషుండు స్తవనీయుండే?

    రిప్లయితొలగించండి
  25. వినయము విజ్ఞతన్ మరియు పెద్దల యందున భక్తి వీడకన్
    జనముల మెప్పుపొందగల సద్గుణ శీలత తోడసాహితీ
    వనమున సంచరించగల పాటవమున్ కళలున్ సరస్వతీ
    స్తనములు లేని పూరుషుఁడు సంస్తవనీయుఁడు గాఁడు ధాత్రిలో

    వినపము విజ్ఞానమ్ములు
    ఘనమగు సాహిత్యపటిమ కాదంబరి దీ
    వెనలై యొప్పెడు వాణీ
    స్తనములు లేని పురుషుండు స్తవనీయుండే?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'వినపము'..టైపాటు.

      తొలగించండి
  26. రిప్లయిలు
    1. అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణదోషం. 'గనినన్' అనండి.

      తొలగించండి
    2. గురువు గారు సంయుక్తాక్షరము స్త వలన గురువు రాదా?దయచేసి అన్యథా భావించకండి.ఇది తెలియక అడుగుతున్న సందేహం

      తొలగించండి
    3. గురువు గారు సంయుక్తాక్షరము స్త వలన గురువు రాదా?దయచేసి అన్యథా భావించకండి.ఇది తెలియక అడుగుతున్న సందేహం

      తొలగించండి
    4. మూర్తి గారు మీ సందేహనివృత్తికి నీ క్రింది వివరణను చూడండి.

      సంయుక్తాక్షరాలకు ముందున్న అక్షరాలు గురువులు. ఒక హల్లుకు మరొక హల్లు వత్తుగా వచ్చినప్పుడు అది సంయుక్తాక్షరం. ‘చక్రి’ లో ‘క్రి’ సంయుక్తాక్షరం. ఈ పదాన్ని మనం చక్-రి అన్న విధంగా పలుకుతాము. పొల్లు అక్షరం కారణంగా ‘చక్’ గురువవుతుంది. కనుక ‘చక్రి’లోని ‘చ’ గురువు. అలాగే అగ్ని, సత్య, విద్య, శిల్పి, కర్మ, హర్ష మొదలైన పదాలలో ముందున్న అక్షరాలు గురువులు. అక్షరమాలలోని ‘క్ష’ సంయుక్తాక్షరమే. కనుక ‘పక్షి’ అన్నపుడు ‘ప’ గురువే. కొందరు కృ, మృ మొదలైన ఋత్వం ఉన్న అక్షరాలను సంయుక్తాక్షరాలుగా పొరబడి దాని ముందున్న అక్షరాన్ని గురువుగా భావిస్తారు. కాని ఋత్వం హల్లు కాదు, అచ్చు. క్+అ=క అయినట్లు క్+ఋ=కృ అవుతుంది. కనుక ‘వికృతి, అమృతము’ మొదలైన చోట్ల వి, అ గురువులు కావు.
      గమనిక :- ‘అతఁడు త్యాగమూర్తి’ అన్నచోట ‘త్యా’ అనే సంయుక్తాక్షరం ముందున్న ‘డు’ గురువు కాదు. ఎందుకంటే అతఁడు అనేది తెలుగు పదం. దాని తర్వాత ఉన్న ‘త్యా’ అనే అక్షరం ‘డు’ పైన ఒత్తిడి తీసుకురాదు. అతఁడుత్-యాగమూర్తి అని పలుకము. కేవలం ఊనిక లేకుండా అతఁడు-త్యాగమూర్తి అంటాం. కనుక ‘డు’ లఘువే. తెలుగు పదాల తర్వాత సంయుక్తాక్షరం ఉన్నా ఆ తెలుగు పదం చివరి అక్షరం గురువు కాదని గమనించండి.
      ‘సూర్యజ్యోతి’ అన్నపుడు సూర్య, జ్యోతి అనే రెండు పదాలు సమాసంగా ఏర్పడం వల్ల ‘ర్య’ గురువు. ‘సూర్యుని జ్యోతి’ అన్నపుడు ‘సూర్యుని’ అనేది తెలుగు పదమయింది. కనుక అక్కడి ‘ని’ గురువు కాదు.


      విద్యాలక్ష్మి (UUUI) - ద్యా,క్ష్మి సంయుక్తాక్షరాలు కనుక వాటి ముందున్నవి గురువులు.
      రాజద్రోహము (UUUII) - రెండు సంస్కృతపదాల సమాసం కనుక ‘ద్రో’కు ముందున్న ‘జ’ గురువు.
      రాజుకు ద్రోహము (UII UII) - ‘రాజుకు’ అన్నది తెలుగుపదం కనుక ‘కు’ లఘువే.

      తొలగించండి
    5. ఈ పేజీ లో కుడి వైపున ఉన్న "వర్గాలు" అంశము క్రింద నున్న "ఛందస్సు (22)" ను చూడండి.

      తొలగించండి
  27. I totally agree with Sri Kandi Sankaraiah Garu's explanation about obscenity in Samasya Pooranam. I don' t want to boast, but for 40 years I was professionally occupied with Theoretical Physics which is supposed to be the most challenging subject. But now I find that Samasya Pooranam is much more challenging intellectually.

    Regards

    రిప్లయితొలగించండి
  28. ఘన దురితాప్రహారులు నగణ్య పరాక్రమ తేజ మూర్తులై
    మనుగడ సాగగావలెను మాన్యత కీర్తి విశిష్ట సంపదన్
    వినుమిదె చెప్పనేర్చెద నుపేక్షను వీడుము ధైర్య సాహస
    స్తనములు లేని పూరుషుఁడు సంస్తవనీయుఁడు గాఁడు ధాత్రిలో

    రిప్లయితొలగించండి
  29. గణికకు కన్నెరికమ్మును
    ఘనముగ చేయు సమయమున కరమగుతుష్టిన్
    తనహస్తమునందున గో
    స్తనములు లేని పురుషుండు స్తవనీయుండే?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  30. ఘనమగు కటితో చక్కని
    చనుగవ కలిగిన మగువలు చతురత తోడన్
    మనములు గెల్తురు మరి గో
    స్తనములు లేని పురుషుండు స్తవనీయుండే.

    రిప్లయితొలగించండి
  31. వనితకు సహజము గద తగు
    స్తనములు; లేని పురుషుండు స్తవనీయుండే;
    తనరుచు ఘన ఛాతిని
    తన దారకు తగిన పతిగ ధర పలుకంగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాగవతుల కృష్ణారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణదోషం. చాతి అన్నది అన్యదేశ్యం. 'తనరెడు వక్షము గలిగిన' అంటే అన్వయం కూడా చక్కగా కుదురుతుందని నా సూచన.

      తొలగించండి
  32. వినుటయు నిజమ్ము చనుగవ

    వనితల కందమ్ము పెంచు,పసి బిడ్డలకున్

    ఘనమగు పోషకముల నిడు

    స్తనములు లేని పురుషుండు స్తవనీయుండే.

    రిప్లయితొలగించండి
  33. ఘనుడౌ నాశివ శివసతి
    దనయుండంకమును జేరి దాక్షీరంబున్
    గొనియావంకన్ గాంచిన
    స్తనములు లేని పురుషుండు స్తవనీయుండే"
    గురువు గారు సవరించాను. నమస్సులు

    రిప్లయితొలగించండి
  34. నేనునూ వాగ్మాత నాశ్రయించెద

    అన విన రంజిలు గానము
    తనరఁగ జెప్పెడు కవనముఁ దద్క్షీరములన్
    గొనవలెనిడ వాణీ మా
    స్తనములు, లేని పురుషుఁడు స్తవనీయుండే?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      ఈరోజు ఏదో తొందరలో ఉండి పూరించినట్టుంది.
      వాక్+మాత = వాఙ్మాత అవుతుంది. రెండవ పాదం చివర గణదోషం. 'వాణీ మా స్తనములు' అన్నది అర్థం కాలేదు. "వాణీ! మా స్తనములు.." అని మీ ఉద్దేశమా?

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు. తప్పు దొరలినందులకు మన్నించండి. రెండవ పాదం (నల,భ,నల,గగ,స) మరో మారు పరిశీలించ ప్రార్థన. సవరించిన పద్యం:

      నేనునూ వాఙ్మాత నాశ్రయించెద.

      అన విన రంజిలు గానము
      తనరఁగ జెప్పెడు కవనముఁ దద్క్షీరములన్
      గొనవలెనిడ వాణీమా
      స్తనములు, లేని పురుషుఁడు స్తవనీయుండే?

      తొలగించండి
    3. "దద్క్షీరములన్" ఇక్కడ టైపాటు వల్ల సరిగా అర్థ కావడం లేదు. 'దద్క్షీ' గగం ఎలా అవుతున్నది?

      తొలగించండి
    4. గురువుగారూ, తత్+ క్షీరములన్ (సంధి) పరిశీలించ ప్రార్థన

      తొలగించండి
  35. 'వనితావిజయము' నాటక
    మున నొక్కఁడు వనిత వేషమును వేసియు సి
    గ్గునఁ బెట్టఁ డయ్యె కృత్రిమ
    స్తనములు; లేని పురుషుండు స్తవనీయుండే?

    రిప్లయితొలగించండి
  36. వినయవిధేయతల్ గలిగి విద్యల నేర్చియు విశ్వ మందునన్
    ఘనుడని పేరునొందినను కమ్మని గీతము విన్న తీపి కై
    తను గన సంతసించమిని ధన్యత నొందడు లోన వాణివౌ
    స్తనములు లేని పూరుషుఁడు సంస్తవనీయుఁడు గాఁడు ధాత్రిలో

    రిప్లయితొలగించండి
  37. గురువుగారూ సమస్యను సహజార్థంలో ఉన్నదున్నట్లుగా యిమిడ్చిన మీ పూరణ చాలా బాగుంది.

    రిప్లయితొలగించండి
  38. వినగనె యేదియింపగుచు వీనుల విందును గూర్చుచుండెడిన్
    మనమున కేది హ్లాదమును మానక నిత్యము జేయుచుండెడిన్
    కనగను గానమున్ గవిత కావె సరస్వతి దేవి మాతవౌ
    స్థనములు లేని పూరుషుడు సంస్థవ నీయుడు గాడు ధాత్రిలో

    రిప్లయితొలగించండి
  39. డా.పిట్టా
    ఆరోజు సమస్యలేకుంటే శంకరయ్య పూరణ స్తన పూరణ ఒకే చోట పంపినాను.మీ వ్యాఖ్య?

    రిప్లయితొలగించండి
  40. డా.పిట్టా
    ఘనత శరీర దార్ఢ్యతను గానని వానికి దక్కబోదు యా
    ననమునకాంతి లేనియెడ నానదు శాంతి శరీరమాద్యమై
    యెనయును సర్వ శక్తులును, హెచ్చిన క్యాన్సరు నడ్డ గోయగా
    స్తనములు లేని పూరుషుడు సంస్తవనీయుడు గాడు ధాత్రిలో

    ఘనముగ పొట్టను బెంచగ
    గనడాయెనుఛాతిపెంపు కండరపుష్టిన్
    మనలేక యాసనాదుల
    స్తనములులేని పురుషుండు స్తవనీయుండే

    రిప్లయితొలగించండి
  41. డా.పిట్టా
    శం.క.ర.య్య సమస్య చూడండి
    శంకలబాపెడి ఛందస్సు నయమాలు
    కంకరలనుబోలు కందములును
    రంకెలేయ నన్ని రహిని తప్పులవయ య
    య్యంకమందె యొదుగ నాయె కవిత


    రిప్లయితొలగించండి
  42. సవరించిందిలా. శంకలబాపెడి చంధస్సు నియమాలు
    కంకరలనుబోలు కందములును
    రంకెలేయ న న్ని రహిని తప్పులవి య
    య్యంకమందె యొదగ నాశు కవిత! డా.పిట్టా

    రిప్లయితొలగించండి
  43. ఘనముగ పాల నిచ్చుటకు కావలె గేదెకు గొప్ప గొప్పవౌ
    స్తనములు;...లేని పూరుషుఁడు సంస్తవనీయుఁడు గాఁడు ధాత్రిలో...
    కనుముర లాలు యాదవును కన్నుల పండుగ జేసి పిండుచున్
    జనుల మనమ్ము దోచుచును సన్నుతి నొందెను ముఖ్యమంత్రిగా!

    రిప్లయితొలగించండి