15, అక్టోబర్ 2016, శనివారం

దత్తపది - 100 (వడ-పూరి-దోస-గారె)

వడ - పూరి - దోస - గారె
పై పదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూ
భారతార్థంలో నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.

75 కామెంట్‌లు:



  1. పూరించగ శంఖంబును
    సారధి, వడవడ వణికిరి జనులెల్లరునూ,
    గారెను రక్తము, యేరుగ
    పారెనదో సెగ లొలుకుగ పార్థుని శరముల్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఎల్లరునూ' అనడం గ్రామ్యం. 'రక్తము+ఏరుగ' అన్నప్పుడు సంధి నిత్యం, యడాగమం రాదు. "జను లెల్ల రటన్| గారెను రక్త మ్మేరుగ...." అనండి.

      తొలగించండి
  2. వైరివర్గబలము వడవడ వడంకఁ
    బోటు మగలెల్ల నని నోడి పూరిఁ గఱవ
    దోర్బలముఁ జూపి భీముండు దుస్ససేను
    దోస మెంచి గుండెను జీల్చి తునుమఁ గృష్ణ
    కనులనుండి హర్షాశ్రువుల్ గారె నపుడు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శంకరయ్య గారూ...మీ పూరణం చాలా బాగున్నది. అభినందనలు!

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీ పూరణ మత్యంత సహజ కృత పద్యము గా నున్నది. దత్త పద మన్న ధ్యాసే లేదు.

      తొలగించండి
  3. శంఖంబు 'పూరింప శాత్రవ సంఘంబు
    భయ'పూరితంబుగఁ బార జొచ్చె
    యె'వడ'న్చు చూడక నెదిరించి గూల్చెద
    అంగముల్విడి'వడ' నరయ జూసి
    'దోస'మం చెరిగియు ద్రోణాది పెద్దల
    దో సత్వ మహిమల దునుమ జూతు (దో: బాహు)
    నిర్భీతి 'గారె'చ్చి నిటలాక్షుడై జొచ్చి
    సములు 'గారె'వరైన సంహరింతు
    తేగీ
    యనుచు ననితర సాధ్యుడై యర్జునుండు
    కృష్ణ సారథ్య మాహాత్య కృపను గూడి
    యుద్ధ పాండిత్య శోభల యుక్తు డగుచు
    రణ వినోద క్రియా సుసంరంభి యయ్యె
    ఇతఃపూర్వమే నేను పూరించినది

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
      ద్విరుక్తాలైన దత్త పదాలతో మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
      ఈ దత్తపదిని గతంలో మన బ్లాగులో ఇచ్చానా? నాకు గుర్తు లేదు.

      తొలగించండి
  4. క్రొవ్విడి వెంకట రాజారావు:

    పాండవ దమను లర్కుని వలె వెలుగుచు
    దోసకారులౌ కౌరవ దుర్మతులను
    ఆజిని వడలిడగ జేసి నత్తరమున
    పూరిని దరిగిన విధము వారి నునిచి
    నంత రక్తము గారెను నదము వలెను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్రొవ్విడి వెంకట రాజారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  5. యుద్ధరంగమున శ్రీ కృష్ణుడు...అర్జునునితో....

    పార్ధ! శరము వదలి నీవు వడఁక నేల?
    చింత యేలకొ పూరించు చేవ తోడ
    దోస మది నీది కాదుబో! వేసరిలకు
    విధి వశులు గారె యెవరేని వెఁడగ దేల?!

    రిప్లయితొలగించండి
  6. దోస మెఱుగని ఙ్ఞాతుల దూషణమ్ము
    విడని నీ యుల్లము, నొడలు వడకు చుండ
    కదనమున పూరి గఱతువు కౌరవేంద్ర!
    శాంతి నెలకొను నన్న యాశ లడగారె!
    (రాయబారం సందర్భంగా చివరిగా శ్రీకృష్ణుడు దుర్యోధనునితో అన్న మాటలు).

    రిప్లయితొలగించండి
  7. డా.పిట్టా
    విన్నను భారతంబె సరి వీక్షణ గారెయె లౌక్యపూరితం
    బన్నను యీ కథాశ్రవణ భాగ్యమె దోసములెన్ను వారిచే
    కన్నయ చిక్కునన్ వడగ, గట్టగ జూడరె రాయబారపుం
    మన్నన లేని కౌరవుల మాయల ద్రోయడె విశ్వరూపుడై?!డా.పిట్టా

    రిప్లయితొలగించండి
  8. వడలగ వదనమ్ము వడకుచు నిలచిన
    .... పార్థుని గని చక్రపాణి పలికె
    పూరించి శంఖమ్ము పూనుము యుద్ధాన
    .... శత్రు చయమ్మును సంహరింప
    నీవు కర్తవు కాదు నీ దోసమే లేదు
    ....నేనే హరింతు నీ సేన లెల్ల
    నీరుగారెద వేల నేనుండ నీచెంత
    ....నీదు ప్రతిజ్ఞను నిలుపుకొనక

    నీవు చంపక యున్నను నిఖిల సైన్య
    ములను బ్రతికెడు వారలీ యిలను లేరు
    విను నిమిత్తమాత్రుడ నీవు వీడు భీతి
    ధనువు చేగొని ముందుకు చనుము విజయ.

    రిప్లయితొలగించండి
  9. చావడమిద్దె ఖాయముగ శత్రువులెల్లరటంచు దల్చుచా
    రావముజేసెనర్జునుడరాతులుగారె వికంపితుల్ ధనుః
    పూరితసాయకుండు శరపుంజము వేయగనొక్కమారుగా
    దూరెను గుండెలందు పడదో సరమై శవముల్ దివమ్ముకున్ ||

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. మాడుగుల అనిల్ కుమార్ గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  10. శంకరవర్యా! నమస్తే! నాకు తెలుగు చాలా ఇష్టము. కానీ రాదు. నేను 40 ఏళ్ళు బెంగాలులో ఫిసిక్సు చెప్పి రెటైరయ్యాను. కనుక నా తప్పులు మన్నించి దిద్దవలె!

    ***************************

    దడవడ వొణికెడి కాళ్ళతొ
    తడబడు చేతులతొ శంకు దడవక బావా!
    బడబడ పూరించు దోసము
    చిడిచిడి నెంచకకు గుండె శతురుల గారెన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శాస్త్రి గారూ,
      మీ ప్రయత్నం ప్రశంసనీయం.
      మీరు నిస్సంకోచంగా మీ పద్యాలను పంపిస్తూ ఉండండి. మార్గదర్శనం చేయడానికి నేను, మిత్రులు ఉన్నాము.
      తో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు. మూడవ పాదంలో గణదోషం.

      ప్రయాణంలో ఉన్నాను కాబట్టి ప్రస్తుతం సవరణ సూచించలేను.

      తొలగించండి
    2. చాలా సంతోషము! దోషములు అర్ధమైనవి.

      తొలగించండి
    3. శంకరవర్యా! ఐదేళ్ళ క్రితం మీ పరిచయము నాకు అదృశ్యముగా నైనది. నేనా రోజు "లలనా జనాపాంగ" అర్ధం కోసం వెదుకుతుండే వాడను. అద్భుతమైన మీ వ్యాఖ్య మనోహరమైనది!!!

      తొలగించండి
    4. సవరణకు చిన్న ప్రయత్నము:

      [యుద్ధారంభంలో శ్రీకృష్ణుఁ డర్జునునితోఁ బలికిన సందర్భము]

      వడవడ వణకగ నే॑లా?
      దడబడెదో? సములు వారె? తఱచియు బావా
      బడబడ పూరింపు దరము!
      చిడిముడి పడి యేడ్చువారు శత్రులు గారే?

      తొలగించండి
  11. కౌరవ సభలో శ్రీకృష్ణుని మాటలు.....

    ఎవఁడని యెంచినాఁడవొ మహేంద్రసుతుం డతఁ డాగ్రహింపఁ దా
    నెవనిని గాని పూరిఁ గఱపించెడి వీరుడు గాఁడె నీవు పాం
    డవులకు రాజ్య మిచ్చుట కొడంబడకున్నను దోస మౌను బాం
    ధవ హిత మెంచువారలె సధర్ములు విజ్ఞులు గారె చూడఁగన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మాస్టరు గారూ! కృష్ణుని పలుకులతో కలిపి మధురమైన పలహారం వడ్డించారు ....బాగుంది.

      తొలగించండి
    2. గోలి వారికి, గుండా వారికి ధన్యవాదాలు.

      తొలగించండి
    3. శంకరయ్య గారూ...మీ పూరణ మద్భుతంగా ఉన్నది! అభినందనలు!

      తొలగించండి
    4. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీ పూరణ మనోహరముగా నున్నది.
      మీ వడ ధర యెక్కువ. మధ్యలో నర్ధానుస్వారముతో చేసారు కదా!

      తొలగించండి
  12. మాస్టరుగారూ! 9-5-15 న ఈ దత్తపది ఇచ్చినారు.....అప్పటి నాపూరణ.

    దేవదత్తమ్ము పూరించి తేజమలర
    చనెనిదో సమరమునకు గనుడు నరుడు
    కౌరవేయుల కప్పుడే గారె చెమట
    వైరి జనులంత వడవడ వణకిరపుడు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
      ఈమధ్య మతిమరుపు ఎక్కువయింది.
      మీ అప్పటి పూరణ మళ్ళీ చదివే అవకాశం లభించింది. ధన్యవాదాలు.

      తొలగించండి
  13. అణగారె నేల ధైర్యము
    రణమున్ జేయంగ దోస రహితము సుమ్మీ
    విను, శంఖము పూరించుచు
    దునుమాడ వడకరె రిపులు తోడగు జయమే


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      దోషరహితం... సాధువు. దోసరహితం అనరాదు.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ:
      అణగారె నేల ధైర్యము
      రణమది దోసమ్ము కాదు రాజ్యమొసంగున్
      విను, శంఖము పూరించుచు
      దునుమాడ వడకరె రిపులు తోడగు జయమే

      తొలగించండి
  14. ఊరకే వడకుదు వేమి యుత్తరా కటా మహా
    వీరుడ నని పల్కి యిట్లు వెన్ను జూప దోసమౌ
    నీరు గారె దేల చెంత నేను విజయు నుండ లే
    పూరి గఱతు రరులు చేయ పోరు తేరు నడపుమా.

    రిప్లయితొలగించండి
  15. మిత్రులందఱకు నమస్సులు!

    [అంతఃపుర కాంతల కుత్తరుఁడు, తన యుద్ధప్రావీణ్యమునుం గాంచి, వైరివీరు లేమందురో తెలుపు సందర్భము]

    "సృణియోధోద్భవభీతరావసరణిన్ శ్వేతమ్ముఁ బూరింపఁగన్
    గుణవిచ్ఛేదిత కార్ముకార్తులయి, తాఁకుల్ వడంగాను, దా
    రుణ యుద్ధమ్మును మాని, ’దోసమయె! మొఱ్ఱో! మమ్ము రక్షింపు మీ
    రణమున్ వీడెద’ మండ్రు గారె యరిభిత్ప్రావీణ్యమున్ మెచ్చుచున్?"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండు మధుసూదన్ గారూ,
      అద్భుతమైన పూరణ చెప్పారు. కాని పానకంలో పుడకలా 'తాఁకుల్ వడంగాను' అన్నచోట గణదోషం. సవరించండి.

      తొలగించండి
    2. టైపాటు దొరలినది. మన్నింపుఁడు. సరిచేసితిని.

      "సృణియోధోద్భవభీతరావసరణిన్ శ్వేతమ్ముఁ బూరింపఁగన్
      గుణవిచ్ఛేదిత కార్ముకార్తులయి, తాఁకుల్ మై వడంగాను, దా
      రుణ యుద్ధమ్మును మాని, ’దోసమయె! మొఱ్ఱో! మమ్ము రక్షింపు మీ
      రణమున్ వీడెద’ మండ్రు గారె యరిభిత్ప్రావీణ్యమున్ మెచ్చుచున్?"

      తొలగించండి
  16. వడకించెన్ కురు సైన్య వాహినిని యా వీరాభి మన్యండహో !
    పడ దోసెనరి వీరు లెందరినొ యా బాలుండె పూరీతినిన్
    దడ పుట్టించెను పోరు వారి కనిలో దార్ఢ్యమ్మునే జూపుచున్
    కడు విభ్రాంతులు గారె చూపరులె యా కార్యార్థినే జూచినన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుఱ్ఱం జనార్దన రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వాహినిని+ఆ' అన్నప్పుడు యడాగమం రాదు. 'వాహినినె యా...' అనండి. అలాగే 'పడదోసె న్నరి..' అనండి.

      తొలగించండి
    2. మొదటి పాదంలో యతిభంగమయింది జనార్దన రావు గారూ!

      తొలగించండి
  17. [2]

    "పూరిఁ గఱపించెదను నేను కౌరవులకు!
    వడవడ వడఁకఁ జేసెద బవరమందు!
    దోసమును సైఁచుమన్నచోఁ దొఱఁగి, సనెద!
    పిఱికివారలు గారె యా విమతులంత?"

    రిప్లయితొలగించండి
  18. శంఖ మయ్యది పూరించ చక్రి యపుడు
    వణకి పోయిరి శత్రు వు ల్వ డ వడిగను
    దోస కారులు మరణించ దురము నందు
    గా రె రక్తము సెలయేరు వోలె యచట

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      '... వోలె నచట' అనండి.

      తొలగించండి
  19. పూరించ దేవదత్తము
    పోరున విజయుడు, వడకెను మూక భయముతోఁ
    గారెను నెత్తురు వరదలు
    కౌరవ దోసములు పండి కదనమునందున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కౌరవ దోసములు పండి - దుష్ట సమాసము అని పిస్తుంది - వైరుల దోసములు పండి బవరము నందున్ - అంటే సరిపోతుంది.

      తొలగించండి

  20. పెద్దల సూచనలమేరకు సవరించిన పూరణ:
    కంది శకరయ్య్ గారూ! & గుండు మధు సూదన్ గారూ ! ధన్యవాదాలు !
    ***xxxxx***
    "వడ"కించెన్ కురు సైన్య వాహినినె యా పార్థుంసుతుండాజిలో !
    పడ "దోసె"న్నరి వీరు లెందరినొ యా బాలుండె "పూరీ"తినిన్*
    దడ పుట్టించెను పోరు వారి కనిలో దార్ఢ్యమ్మునే జూపుచున్
    కడు విభ్రాంతులు "గారె" చూపరులె యా కార్యార్థినే జూచినన్.
    *పూరీతినిన్= పూవుల రీతిగా; పూవుల వలెనే
    =========
    దోసెన్నరి అన్నప్పుడు ద్విత్వమే టైప్ చేశాను. టైప్ కాలేదు. మరొక్క మారు కృతజ్ఞతలు.
    ****)()()(****
    భంగ్యంతర పూరణ (స్వల్ప మార్పులతో)
    "వడ"కించెన్ కురు సైన్య వాహినినె యా పార్థుండె యుద్ధావనిన్ !
    పడ "దోసె"న్నరి వీరు లెందరినొ యా శూరుండె "పూరీ"తినిన్*
    దడ పుట్టించెను పోరు వారి కనిలో దార్ఢ్యమ్మునే జూపుచున్
    కడు విభ్రాంతులు "గారె" చూపరులె యా కార్యార్థినే జూచినన్.

    రిప్లయితొలగించండి
  21. పవడపుఁ దళుకులన్మించు పావడలను
    కనకరజపూరీకృత కంచుకముల
    దోసములు లేని ముత్యముల్ దోసిలినిడి
    ఉత్తర వెలుగారె నచట నుచ్ఛ రీతి

    రిప్లయితొలగించండి
  22. సమర మందున చంపుటల్ చావడములు
    సహజ మేగద... పూరించు శంఖమిపుడు
    అర్జునా యెట్టి దోసమ్ము నంటబోదు
    కౌరవుల్ గారె కారకుల్ కదనమునకు !!!

    రిప్లయితొలగించండి
  23. ధృతరాష్ట్రుడిచ్చిన చిన్న యుపనగరము నింద్రప్రస్త పురముగా తీర్చి దిద్దిన పాండవులను చూపిస్తూ కృష్ణుడు ప్రశంసించు సందర్భము:

    ప్రాభవ డంబర పూరిత
    వైభవ హస్తిపుర నాథవర హస్తక శుం
    డాభప్రదోసపురమా
    శోభేంద్రప్రస్త వాస సుమతులు గారే

    [ప్రద+ఉసపురము = ప్రదోసపురము; ఉసపురము =పేట, శాఖానగరము]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రాభవ డంబర పూరిత
      వైభవ హస్తిపుర నాథవర హస్తక శుం
      డాభప్రదోసపుర నా
      కాభేంద్రప్రస్త వాసు లమలురు గారే

      తొలగించండి
    2. ఇంద్రప్రస్థపురమందు వడ - పూరి - దోస - గారె లనిమిడ్చిన మీ ప్రజ్ఞావిశేష మసాధారణము! అభినందనలు!

      తొలగించండి
    3. కవి పుంగవులు మధుసూదన్ గారు మీయభిమాన ప్రశంసకు నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  24. అణగారెను తిమిరమ్ము ల
    రుణోదయ మదో!సవితుని రూపూరించం
    గను కుంతి మంత్రము జపిం
    చెను,రవి దిగి వచ్చి తనను జేరగ వడకెన్


    రిప్లయితొలగించండి
  25. కృష్ణుడు రాయబారంలో శాంతిని కోరుతూ హితవాక్కులుగా నూహించి

    సమర శంఖమ్ము పూరింప శాంతి తొలగి
    శరముల వడగళ్ళుగురియు మరువ బోకు
    పాండవుల్ గారె శత్రువుల్ వారి నింక
    నాదరింప దోసమవబోదవని మెచ్చు

    రిప్లయితొలగించండి
  26. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    దోస మెరుగని పడతిని దూరి , కొట్టి
    పావడ ను బట్టి బలిమిని బయటి కీడ్చి
    విటుడు విషపూరి తమ్మగు వేశ్యపొందు
    గోరి యడగారే రోగియై "కుష్టు" కతన

    రిప్లయితొలగించండి
  27. శ్రీకృష్ణరాయభారాన కౌరవులతోదెలిపినమాటలు
    ఒక్కటి గారె సోదరులు నోర్పున పాండవ కౌరవుల్ సదా
    నిక్కము ధర్మపూరితులు| నేర్పగు మార్పన యెల్లవారికిన్
    మక్కువ నౌను|దోసమన?మాన్యులుమెచ్చరు రాజరాజగా
    చక్కటిరాయభారమిది|సంస్కృతినే వడగట్టి దేల్పుమా

    రిప్లయితొలగించండి
  28. పావడ గట్ట?పూలజడ,పార్థుని గాంచి సుభద్ర నవ్వగా?
    దైవము సంతసించెనట|దంపతు లవ్వగ దోస మెంచకే
    జీవన పూరితంబునకు చిత్రవిచిత్రము మార్పులెన్నియో
    గావగ ?భాగ్యమై వరలుగారె|వివాహపుముచ్చటందునన్.

    రిప్లయితొలగించండి
  29. భ్రుకుటుల్ముడివడ రోషాగ్ని వెలువడ
    మనవడ! రమ్మంచు మాటలనుచు
    పూరిత ప్రజ్ఞుండు పూరీకృత వచుండు
    హస్తిపురీవృద్ధు డరి హరుండు
    దో సమృధ్దిన్ జూపి దోసమయుడు గెల్వ
    పగతుర పడదోసి పటిమజూపి
    ఒడలన్గారెడు నుష్ణ రుధిరమున్
    జూడంగారేగుచున్ శూలి పగిది
    తే.కార్ముక వినిర్ముక్త ఘనమార్గణ గణముల
    హరినరులకును నరహరి యనగ నొప్పి
    ఆహవంబున నర్జును డదిరి చెదర
    భీష్ముడు గ్రీష్మ బాస్కర వేషుడయ్యె

    రిప్లయితొలగించండి
  30. ఉత్తరునితో బృహన్నల...

    వడవడ వడకుట తగునా
    గడగడ లాడించు దోసకారుల రాజా!
    అడగారెనా ప్రతాపము
    దడియక పూరించి దరము ధనువును గొనుమా!!!

    రిప్లయితొలగించండి
  31. పూరి గుడిశెను నివశించు మునులు గారె
    పాండు సుతులంత వడగాడ్పు పాల బడగ
    కాన లందున దిరిగెడి ఖర్మ బట్టె
    దుష్ట విధిగాక జేసిన దోస మేమి ?

    రిప్లయితొలగించండి
  32. బంధువుల్, హితుల్,గురువుల బవరమందు

    సంహరించుట దోసమౌ చంప లేన

    నంగ నర్జునుడు, హరియు నతని కెపుడు

    గీత సారము బోధించినంత నపుడు

    సమర శంఖము పూరించి శత్రుసేన

    వడక నతి భీకరంబగు పద్ధతిన్ త

    లలు నరక నేరులై గారె రక్తమచట.

    రిప్లయితొలగించండి
  33. సవరణలు :-
    మూడవ పాదంలో....
    హరియు నతని కపుడు.. అని చదువ గలరు.
    నాలుగవ పాదంలో....
    బోధించినంత నరుడు...అని చదువ గలరు.

    రిప్లయితొలగించండి
  34. సవరణలు :-
    మూడవ పాదంలో....
    హరియు నతని కపుడు.. అని చదువ గలరు.
    నాలుగవ పాదంలో....
    బోధించినంత నరుడు...అని చదువ గలరు.

    రిప్లయితొలగించండి
  35. భారత రణమందు పార్థుడు పూరించ
    ముందు చెప్పె దోసములను శౌరి
    నిదియు పోరు భూమి నెవరడ్డెదరనంగ
    గారెవరిట నేనె కర్త ననియె.

    వడవడ వణుకుచు ద్రౌపది
    తడబడు తా దోసమెల్ల తనవిధి యనగన్
    వడిగా గారెను స్వేదము
    ముడివిడ పూరించె కనులు ముకుళిత వదనై.

    సీ.అర్జునుండేతెంచి యాహవరంగాన
    పూరించె శంఖమున్ పుడమి యందు
    కకుభమ్ములట వడకంగ భీతిల్లి
    వారువంబులు వారె వడిగ తాము
    దోసము చేసిన దుర్మార్గు నిలలోన
    వదలి పెట్టననుచు ప్రతిన చేయ
    సైంధవున కచట చమటలు గారె,కౌ
    రవులెల్ల జూడంగ రహము తోడ
    ఆ.వె:సుతుని జంపినతని సూర్యాస్తమయములో
    చంపె క్రీడి తాను సంజ లోపు
    ప్రతిన దీర్చి నట్టి పార్థుని కనుగొని
    దేవతలిల మెచ్చి దీవె నిడిరి.
    సీ.నాతికురులు పట్టినందుకని యతని
    దోసములను చూపి దురమునందు
    భీమసేనుండట భీకరముగ పోర
    కంపమందె వడలు కౌరవునకు
    తనువు తూట్లు పడగ తత్తర పాటున
    రణభూమిలో గారె రక్త ధార
    దుస్ససేనుని జంపి ద్రుపదజ కోరికన్
    పూరించి సతికట ముదము కూర్చి
    ఆ.వె:మానధనుడు నచట మడుగులో దాగంగ
    తొడలు జీల్చి వాని దురము నందు
    కూల్చినట్టి పాండు కొమరుడెవరటన్న
    వీరవిక్రము డగు విజయు భ్రాత.


    రిప్లయితొలగించండి