విష్ణువు తానె నరసింహుడు నారయణుడూనూ అంటే ఆయన నుండి ఆయనే అవతరించుతాడు కావున ఆయనే తండ్రి ఆయనే కొడుకు అనే భావనతో వ్రాసాను. అంతే కాక "ఆత్మావై పుత్ర నామాసి " అని ఉండనే ఉన్నది . ఒకవేళ నా పూరణ లో కానీ భావన లో కాని తప్పు ఉన్న యెడల పండితులు మన్నించి సవరింతురు గాక
గురువులు దీవెన లిడగ న చిరకాలమె పెండ్లి యగును జ్యేష్ఠ సుతుండున్ వరుడౌటయు నిక్కము నీ నరసింహుని ప్రియసుతుండు నారాయణుడే !
మా జ్యేష్ఠపుత్రుడు చిరంజీవి భార్గవ నారాయణమూర్తి వివాహము చిరంజీవి సౌభాగ్యవతి పరిగె హారికతో నిశ్చయ మైన శుభవార్తను గురువు గారి వేదికపై మిత్రులతో పంచుకొంటున్నాను. మా ద్వితీయపుత్రుడు చిరంజీవి భవానీ శంకర్ ( గురువు గారి పేరింటి వాడు ) కూడా మాకు ప్రియసుతుడే !
గురువర్యులు శ్రీ శంకరయ్య గారికి, అన్నయ్య గారు శ్రీ పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారికి, సోదరీమణులు శ్రీమతి నేదునూరి రాజేశ్వరి గారికి ,శ్రీమతి లక్ష్మీ దేవి గారికి , మిత్రులు శ్రీ గుండు మధుసూదన్ గారికి, శ్రీ సుబారావు గారికి,శ్రీ షీనా గారికి, శ్రీ మిస్సన్న గారికి, డా.విష్ణునందన్ గారికి, శ్రీ రవి గారికి మనతెలుగు చంద్రశేఖరుల వారికి, శ్రీ గోలి హనుమచ్ఛాస్రి గారికి, సోదరులు శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి, హృదయ పూర్వక ధన్యవాదములు. ( శాస్త్రి గారూ శ్రీ పరిగె సుధాకర్ గారిది మీ గుంటూరే !)
ఈనాటి సమస్యకు ఒక ప్రత్యేకత ఉన్నది. కొందరు గన్నవరపు నరసింహ మూర్తి గారికి శుభాకాంక్షలు తెలుపడానికి పూరణను సాధనంగా చేసుకున్నారు. చక్కని పూరణలు చెప్పిన కవిమిత్రులు... పండిత నేమాని వారికి, లక్ష్మీదేవి గారికి, (శీనా) శ్రీనివాస్ గారికి, గుండు మధుసూదన్ గారికి, సుబ్బారావు గారికి, రవి గారికి, మిస్సన్న గారికి, డా. విష్ణునందన్ గారికి, రాజేశ్వరి అక్కయ్యకు, (తమమీద తామే పూరణ చెప్పుకున్న) గన్నవరపు వారికి, అభినందనలు, ధన్యవాదాలు.
నరసింహుడు అనగా నరులలో శ్రేష్ఠుడు - దశరథుడు - అను భావముతో ఈ నా పూరన:
రిప్లయితొలగించండిధరణిన్ ధర్మమును సము
ద్ధరించుటకు నవతరించె దశరథసుతుడై
హరి, దశరథ భూవరుడను
నరసింహుని ప్రియసుతుండు నారాయణుడే
వరమడుగుచు పూజించితి
రిప్లయితొలగించండినరసింహుని; ప్రియసుతుండు నారాయణుడే
ధర దిగి వచ్చెననుచు నే
మురిసితి మనమున, మరి మరి మోదము హెచ్చెన్.
హరినీ పది యవతారము
రిప్లయితొలగించండిలెరిగిన వారికి కలుగదులే సందియమే
హరి తానె పితయు సుతుడును
నరసింహుని ప్రియసుతుండు నారాయణుఁడే.
విష్ణువు తానె నరసింహుడు నారయణుడూనూ అంటే ఆయన నుండి ఆయనే అవతరించుతాడు కావున ఆయనే తండ్రి ఆయనే కొడుకు అనే భావనతో వ్రాసాను. అంతే కాక "ఆత్మావై పుత్ర నామాసి " అని ఉండనే ఉన్నది . ఒకవేళ నా పూరణ లో కానీ భావన లో కాని తప్పు ఉన్న యెడల పండితులు మన్నించి సవరింతురు గాక
రిప్లయితొలగించండిగురువులు దీవెన లిడగ న
రిప్లయితొలగించండిచిరకాలమె పెండ్లి యగును జ్యేష్ఠ సుతుండున్
వరుడౌటయు నిక్కము నీ
నరసింహుని ప్రియసుతుండు నారాయణుడే !
మా జ్యేష్ఠపుత్రుడు చిరంజీవి భార్గవ నారాయణమూర్తి వివాహము చిరంజీవి సౌభాగ్యవతి పరిగె హారికతో నిశ్చయ మైన శుభవార్తను గురువు గారి వేదికపై మిత్రులతో పంచుకొంటున్నాను. మా ద్వితీయపుత్రుడు చిరంజీవి భవానీ శంకర్ ( గురువు గారి పేరింటి వాడు ) కూడా మాకు ప్రియసుతుడే !
మిత్రులు శ్రీ గన్నవరపు నరసింహమూర్తిగారికి ప్రియపుత్ర వివాహ శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండినరసింహమూర్తికుదయిం
చెర వరసుతుఁడని యనుచు వచించెదఁ దా ని
ద్ధర నారాయణమూర్తియె!
నరసింహుని ప్రియసుతుండు నారాయణుఁడే!!
వరహృదయుడు గన్నవరపు
రిప్లయితొలగించండివరాహ నరసింహ మూర్తి వైద్య నిపుణుడున్
పరమ హితుడు కవివరుడా
నరసింహుని ప్రియసుతుండు నారాయణుడే
అరవిందు డనెడు వాడే
రిప్లయితొలగించండినరసింహుని ప్రి య సుతుండు,నారాయణుడే
నరులను బోషించు భువిని
నరనారాయణు లిరువురు నందుని కాప్తుల్
కనకకశిపుడు నరసింహుని చూచిన తర్వాత స్వగతంలో:
రిప్లయితొలగించండిఅరయగ నైతి కుమతినై
నరసింహుని; ప్రియసుతుండు నారాయణుఁడే
పరదైవమ్మని కుశలము
నెరపునెడ పెడచెవి బెట్టి నిందించితినే.
యిరువురు భామల నేల, ము
రిప్లయితొలగించండిరారికి తగును విజయ నగరాధీశునకు త
గు,రిపుంజయుడతడు, తుళువ
నరసింహుని ప్రియ సుతుండు నారాయణుడే
నరసింహుని పుత్రిక యే
రిప్లయితొలగించండివరముల బొందినదొ గన్నవర పన్వయమే
దొరకొన్నది! వరుడా? మన
నరసింహుని ప్రియసుతుండు నారాయణుడే !
సోదరులు గన్నవరపు వారి ప్రియ పుత్రుని వివాహ సందర్భమున నూతన వధూ వరులకు పాత దంపతులు సోదరులు గన్నవరపు వారు వారి సతీమణి గారికీ హృదయ పూర్వక శుభా కాంక్షలు
రిప్లయితొలగించండిసుతుని వివాహము నిశ్చయింపబడిన శుభ సందర్భములో - గన్నవరపు భిషగ్వరుల వారి కుటుంబానికంతటికీ ఆనందం ద్విగుణీకృతము కావాలని ఆశిస్తూ -
రిప్లయితొలగించండిస్థిర మంగళకర పరిణయ
మరయగనౌ ; నయము మీర హారిక నిదుగో
వరియించెను 'గన్నవరపు
నరసింహుని' ప్రియసుతుండు నారాయణుఁడే !
యిరువురు భామల నేల, ము
రిప్లయితొలగించండిరారికి తగును విజయ నగరాధీశునకు న
ప్పు ,రిపుంజయుడతడు, తుళువ
నరసింహుని ప్రియ సుతుండు నారాయణుడే
చిన్న సవరణ తో ఈ పూరణను తిరిగి పంపిస్తున్నాను. గమనించ గలరు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివరపుత్రు డాత్మజుండట
రిప్లయితొలగించండినరసిం హుని ప్రియ సుతుండు నారాయణు డే !
పరి పరి విధముల మురియుచు
సుర లోకము పొగిడి నంత సూనృత మదియే !
ఖరకరజాగ్రజుఁడౌ వా
రిప్లయితొలగించండినరసింహుని ప్రియసుతుండు, నారాయణుఁడే
కరుణించఁగ, "నంగదుఁ"డటు
పరుగునఁ జనె వార్తికునిగఁ బౌలస్త్యు సభన్.
శ్రీపండిత నేమాని గురువులకు, శంకరార్యులకు, అన్న మిస్సన్నగార్కి బ్లాగు మిత్రులందరికీ నమస్సులతో
రిప్లయితొలగించండిభ్రాతృసమాన శ్రీ గన్నవరపు వరాహ నరసింహమూర్తి గారి అబ్బాయి వివాహనిశ్చితార్థ వేడుక కన్నుల పండుగగా జరగాలని కోరుతూ
పరిగతమైనదిట పరిగె
నరసింహుని “హారిక’కును నాయకుడౌటన్
వరుడిట మాగన్నవరపు
నరసింహుని ప్రియసుతుండు నారాయణుఁడే.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగురువర్యులు శ్రీ శంకరయ్య గారికి, అన్నయ్య గారు శ్రీ పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారికి, సోదరీమణులు శ్రీమతి నేదునూరి రాజేశ్వరి గారికి ,శ్రీమతి లక్ష్మీ దేవి గారికి , మిత్రులు శ్రీ గుండు మధుసూదన్ గారికి, శ్రీ సుబారావు గారికి,శ్రీ షీనా గారికి, శ్రీ మిస్సన్న గారికి, డా.విష్ణునందన్ గారికి, శ్రీ రవి గారికి మనతెలుగు చంద్రశేఖరుల వారికి, శ్రీ గోలి హనుమచ్ఛాస్రి గారికి, సోదరులు శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి, హృదయ పూర్వక ధన్యవాదములు.
రిప్లయితొలగించండి( శాస్త్రి గారూ శ్రీ పరిగె సుధాకర్ గారిది మీ గుంటూరే !)
శ్రీ సుబ్బారావు గారూ ! అచ్చుతప్పునకు మన్నించండి.
రిప్లయితొలగించండిఈనాటి సమస్యకు ఒక ప్రత్యేకత ఉన్నది. కొందరు గన్నవరపు నరసింహ మూర్తి గారికి శుభాకాంక్షలు తెలుపడానికి పూరణను సాధనంగా చేసుకున్నారు. చక్కని పూరణలు చెప్పిన కవిమిత్రులు...
రిప్లయితొలగించండిపండిత నేమాని వారికి,
లక్ష్మీదేవి గారికి,
(శీనా) శ్రీనివాస్ గారికి,
గుండు మధుసూదన్ గారికి,
సుబ్బారావు గారికి,
రవి గారికి,
మిస్సన్న గారికి,
డా. విష్ణునందన్ గారికి,
రాజేశ్వరి అక్కయ్యకు,
(తమమీద తామే పూరణ చెప్పుకున్న) గన్నవరపు వారికి,
అభినందనలు, ధన్యవాదాలు.
తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
రిప్లయితొలగించండిఅభినందనలు.
అరవక తెలుపుము శంకర!
రిప్లయితొలగించండినరసింహుని ప్రియసుతుండు నారాయణుఁడే
తరగతి లోనిది పాఠము?
పరమార్థము తెలుపుమయ్య పరపతి దక్కున్!
రిప్లయితొలగించండిఅరవపు యమ్మణి కథలన్
బరబర బేర్చెను గడగడ పరగడుపునట
న్నరయగ కథనంబందున
నరసింహుని ప్రియసుతుండు నారాయణుఁడే :)
జిలేబి
నరవర! ప్రహ్లాదుండే
రిప్లయితొలగించండినరసింహుని ప్రియసుతుండు; నారాయణుఁడే
నరసింహుని రూపమ్మున
ధరణిని నెల్లూరునందు తనరెను కొండన్