కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
గొడ్రాలిన్ బ్రభవించె బాలుడయి,తా గోపాలకృష్ణుండిలన్.
(కొప్పరపు కవులు ఎదుర్కొన్న సమస్య)
చింతా రామకృష్ణారావు గారికి ధన్యవాదాలతో....
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
గొడ్రాలిన్ బ్రభవించె బాలుడయి,తా గోపాలకృష్ణుండిలన్.
(కొప్పరపు కవులు ఎదుర్కొన్న సమస్య)
చింతా రామకృష్ణారావు గారికి ధన్యవాదాలతో....
మిత్రులారా! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిఈ నాటి సమస్య ప్రాసాక్షరమునకే ప్రాధాన్యము నిచ్చినది. అందుచేత ఏదో విధముగా మిగిలిన పాదములను పూరించినచో సరిపోవును కదా. నా పూరణ తిలకించండి:
ఈ డ్రా ప్రాసనొసంగె శంకరుడు తా నే రీతిగా నింపునో?
చూడ్రా కృష్ణుని లీల గూర్చి యగుటన్ చోద్యంబుగా నెంతువే?
వీడ్రా శంకలు చక్రధారి కథలన్ విన్నాము మేమెన్నియో
గొడ్రాలిన్ బ్రభవించె బాలుడయి తా గోపాలకృష్ణుండిలన్
ఈ సమస్యను శ్రీ చింతా రామకృష్ణా రావు గారు మరియు శ్రీ కంది శంకరయ్య గారు చక్కగా పూరించి అలరింప జేస్తారని నమ్ముచు నిరీక్షించుచున్నాను. స్వస్తి.
రిప్లయితొలగించండిమిత్రులారా! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిశ్రీ శంకరయ్య గారికి కొన్ని అనారోగ్యాది కారణముల వలన బ్లాగుకి ఎక్కువ సమయము కేటాయించ లేకపోవు చున్నా - మనలో కూడా చాల మందికి ఉత్సాహము సన్నగిల్లుచున్నట్లు తోచుచున్నది. ఉరకలు వేస్తూ పూరించే మిత్రులు ఎవ్వరు ఈ మధ్య ఉత్సాహమును చూపించుట లేదు అన్నట్లున్నది. స్వస్తి.
గుండు మధుసూదన్ గారి పూరణ....
రిప్లయితొలగించండిఓ డ్రామా నట వేయ నందు నటులై యున్నట్టి పాత్రల్ భళా
షాడ్రుచ్యంబులు తిన్నయట్లు నటియించంగన్ సమర్థంబుగన్
గొడ్రా లొక్కతె దేవకీసతి యయెన్; గూడెన్ మహాశ్చర్యముల్
గొడ్రాలిన్ బ్రభవించె బాలుడయి తా గోపాలకృష్ణుండిలన్
సాహసంతో ఏదో కిట్టించే ప్రయత్నం చేస్తున్నా.. పెద్దలు, మిత్రులు మొగమోటం లేకుండా గుణదోష విచారణ చేయవలసిందిగా మనవి.....
రిప్లయితొలగించండివాడ్రే వన్న పురమ్ములో హరికథన్ భక్తిన్ రక్తి యింపొందఁ జె
ప్పాడ్రా మా హరిదాసు కృష్ణజనన వ్యాఖ్యాతయై యుండఁగా,
షడ్రోగస్థయు నయ్యు వచ్చి చేరె ననుచున్ సర్వుల్ బ్రశంసింపఁగా
గొడ్రాలిన్; "బ్రభవించె బాలుడయి తా గోపాలకృష్ణుం డిలన్"
గొడ్రాలంచు జగంబు నిందనిడ గా గోవిందు డాయమ్మ కా
రిప్లయితొలగించండినాడ్రాత్రిన్ కలలో వరంబు నొసగెన్ నమ్మంగ నాయమ్మకున్
గొడ్రాలైనను గాని భక్తి గలుగన్ గోవిందు డే వచ్చి యా
గొడ్రాలిన్ బ్రభవించె బాలుడయి, తా గోపాల కృష్ణుం డిలన్
అయ్యా! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిSree Samkarayya gaaroo!
మీ పద్యము బాగుగ నున్నది. 3వ పాదములో 2 అక్షరములు ఎక్కువగ నున్నవి. మీరే సాహసము అంటే మరి మావంటి వారి సంగతి ఏమిటి? స్వస్తి.
లేడ్రా కృష్ణున కీడు ముజ్జగములన్, శ్రీ దేవకీ పుత్రుడై
రిప్లయితొలగించండినాడ్రా, కంసుని జంప దాటి యమునన్ నందాంగనా సూనుడై
నాడ్రా, వంద్య లనంగ నా సుదతులన్ న్యాయమ్మె? దోసమ్మనన్
గొడ్రాలిన్ బ్రభవించె బాలుడయి తా గోపాలకృష్ణుండిలన్
*************************************
కాడ్రా కృష్ణుడు వంద్య పుత్రు డిలలో, కారా గృహమ్మందు పు
ట్టేడ్రా దేవకికిన్, యశోద కిల నట్టింటన్ కుమారుండురా,
చూడ్రా వంద్య లనంగ నా వనితలన్ చోద్యంబు! కీడౌ ననన్
గొడ్రాలిన్ బ్రభవించె బాలుడయి తా గోపాలకృష్ణుండిలన్
గొడ్రాలయ్యెను దేవకీ జనని తా కోల్పోయి సంతానమున్
రిప్లయితొలగించండిషడ్రోగంబుల పోలు శత్రు వహుఁడై చంపంగ కంసుండు.ఈ
గొడ్రాలన్నయపప్రథన్ తుడవగా కూర్మిన్ మహోదారతన్
గొడ్రాలిన్ బ్రభవించె బాలుడయి,తా గోపాలకృష్ణుండిలన్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ సమస్యకు కొప్పరపు కవుల పూరణము.
రిప్లయితొలగించండిరాడ్రత్నాయిత బొమ్మదేవర కులేంద్రా! వింటె యీచిత్రమున్?
గొడ్రాళ్ళుందురు కాకమున్, కదళినిన్ బోలంగ నందోర్తు,నా
నిడ్రజానన దేవకీరమణి యుండెన్, గావ నా సాధ్వినా
గొడ్రాలిన్, బ్రభవించె బాలుడయి,తా గోపాలకృష్ణుండిలన్
మిత్రులారా! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిఏదో రోజుకొక సమస్య తప్పనిసరి అగుచున్నది కదా. ఈనాడిచ్చిన సమస్య వంటి దుష్కర ప్రాసతో సమస్యలను నింపుటకు ప్రయత్నించితే చాలును పూర్తిగా మార్కులు వెయ్యవలసినదే. అందుచేత ఈ నాడు పూరణలు చేసిన వారెల్లరకు శుభాభినందనలు - ప్రశంసలు. స్వస్తి.
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ నాకూ, మిత్రులకు మార్గదర్శకం అయింది. ధన్యవాదాలు.
నా పూరణ ‘బాగుంది’ అని నాకు మనోవ్యగ్రతను తొలగించారు. ధన్యోస్మి!
*
గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
శీనా శ్రీనివాస్ గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
*
మిస్సన్న గారూ,
మేమంతా ఒక్క పూరణ చేయడానికే తలక్రిందులౌతుంటే మీరు రెండు చక్కని పూరణలు అందించారు. బాగున్నవి అభినందనలు.
*
చింతా రామకృష్ణారావు గారూ,
నేమాని వారు కోరినట్లుగా చక్కని పూరణను అందించారు. అభినందనలు.
కొప్పవరపు సోదరుల పూరణను అందించినందుకు ధన్యవాదాలు.
*
నా పూరణలో మూడవ పాదంలో రెండక్షరాలు ఎక్కువయ్యాయని నేమాని వారు చెప్పారు.
మొదటి పాదంలో ఒక అక్షరం ఎక్కువయిందని గుండు మధుసూదన్ గారు ఫోన్లో చెప్పారు.
నిజమే! ఏదో కిట్టించాలనే తొందరపాటు వల్ల జరిగిన దోషం.. ధన్యవాదాలు. సవరిస్తున్నాను.
*
సవరించిన నా పూరణ....
వాడ్రే వన్న పురమ్ములో హరికథన్ భక్తిన్ రసస్ఫూర్తిఁ జె
ప్పాడ్రా మా హరిదాసు కృష్ణజనన వ్యాఖ్యాతయై మించుచున్,
షడ్రోగస్థయు నయ్యు వచ్చె ననుచున్ సర్వుల్ బ్రశంసింపఁగా
గొడ్రాలిన్; "బ్రభవించె బాలుడయి తా గోపాలకృష్ణుం డిలన్"
రుడ్రుంద్రమ్మయినట్టి చిత్తమున నాక్రోశమ్ము నిండారగా
రిప్లయితొలగించండిరాడ్రౌద్రాకృతి కంసుడత్తరి శిశు ప్రాణంబులన్ దీసె ; భూ
సృడ్రూపుండయి దేవకీ సతికి రాజీవాక్షుడే పుట్టె నా
గొడ్రాలిన్ బ్రభవించె బాలుడయి తా గోపాలకృష్ణుండిలన్ !
డా. విష్ణునందన్ గారూ,
రిప్లయితొలగించండిఅన్యదేశ్యాలు, వ్యావహారికాలు లేకుండా (మాకు తప్పలేదు!) అత్యద్భతమైన పూరణ నందించారు. అభినందనలు, ధన్యవాదాలు.
వాడ్రే వారట నింటి పేరు కనగా వాగీశ్వరీ సంత తౌ
రిప్లయితొలగించండిచూడ్రా మాయిల వేలుపే యనుచు తాచోద్యంబు గాజెప్పి నన్
లేడ్రా వానిని గాంచి నంత గలుగున్ లేదెమ్మెరల్ సౌరులే
గొడ్రాలిన్ ప్రభ వించె బాలుడయితా గోపాల కృష్ణుం డిలన్ !
హమ్మయ్య . కిట్టించాను గానీ ప్చ్ ! ...?.....?....?
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.