అయ్యా! శ్రీ శంకరయ్య గారూ! శుభాశీస్సులు. మీరు నిన్ననే బ్లాగులో దర్శనమిచ్చుట ఆనందమయినది. ఇప్పుడు బాగుగనున్నారు అనుకొనుచున్నాము. చిన్న దెబ్బలకే నొప్పులెక్కువ అంటారు. మీ దంపతులు త్వరలో కోలుకుంటారని ఆశించుచున్నాము. స్వస్తి.
శ్రీ వరప్రసాదు గారికి శుభాశీస్సులు. మీ పద్యము బాగుగ నున్నది. వాతలెట్టు కి బదులుగా వాతలిడెడి అందాము. 2వ పాదములో ఒక లఘువు తక్కువగా నున్నది. "పులియు" అని యు ను చేర్చుదాము. ఇంకా బాగుగ అన్వయమును చూపించాలి. స్వస్తి.
కవిమిత్రులకు నమస్కృతులు... నా ఆరోగ్యం ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్నది. నేను త్వరగా కోలుకోవాలని కోరుకున్న అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా నా అశక్తతను గుర్తించి మిత్రుల పూరణల, పద్యాల గుణదోష విచారణ చేసి, సవరణలను సూచించిన పండిత నేమాని వారికి ఎంతగానో ఋణపడి ఉన్నాను. వారి సౌహార్దానికి ధన్యవాదాలు.
రథోద్ధతము:
రిప్లయితొలగించండిమేక వన్నె పులి మేయ నెంచునే?
యాకు లెవ్వియు మహాత్మ! జంతులన్
గాక, నమ్మకుము కల్మషాత్ములన్
పోకు దగ్గరకు, మోసపోకుమా!
అయ్యా! శ్రీ శంకరయ్య గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీరు నిన్ననే బ్లాగులో దర్శనమిచ్చుట ఆనందమయినది. ఇప్పుడు బాగుగనున్నారు అనుకొనుచున్నాము. చిన్న దెబ్బలకే నొప్పులెక్కువ అంటారు. మీ దంపతులు త్వరలో కోలుకుంటారని ఆశించుచున్నాము. స్వస్తి.
మేక వన్నె పులులు మ్లేచ్చులు కొందరు
రిప్లయితొలగించండిమంచి నటన జూపి మాయ జేసి
మోసగింతురయ్య ముందుగా గనుగొని
జాగరూకు లగుచు సాగిపొండు.
మంచి మాట లాడి వంచన చేయుచు
రిప్లయితొలగించండినొల్లు కొన్న దేమొ ? పొల్లు గాక
మేక వన్నె లేల మేలును దలపరే
ఇచ్చువాడు హరియు మెచ్చు తమను !
గురువు గారు భగవంతుని కృపతో స్వల్ప గాయాలతో తేరుకొంటున్నందులకు చాలా సంతోషము.
రిప్లయితొలగించండిమేక వన్నె పులులు నేకమై యొకత్రాట
రిప్లయితొలగించండిరాజ్య మేలు చున్న రాజ సమున
దారు ణంపు గతిని దైవిక మ్మటంచు
సాహ సించి జనులు చావ లేక
ఈనాటి వర్ణన అంశము: మేక వన్నె పులి
రిప్లయితొలగించండిఈ నాడు వర్ణనలు ఎక్కువుగా రాలేదు. వ్రాసిన వారందరికి శుభాభినందనలు.
శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు:
ఈ పులుల నుండి జాగ్రత్తగా మెలగాలి అని సెలవిచ్చేరు. బాగుగనున్నది.
తమ్ముడు డా. చి. నరసింహ మూర్తి:
వంచన చేసేవారు మేలును తలపరు అని చెప్పెను. బాగుగ నున్నది.
శ్రీమతి రాజేశ్వరి గారు:
మేక వన్నె పులులే రాజ్యము చేస్తున్నాయి - అందుచేత ప్రజలకు ఇక్కట్లు అన్నారు. చాల బాగుగనున్నది.
స్వస్తి.
గురువులకు ప్రణామములు + ధన్య వాదములు
రిప్లయితొలగించండిశ్రీ శంకరయ్య గురువర్యులకు, శ్రీ నేమాని గురువర్యులకు పాదాభివందనములతో
రిప్లయితొలగించండిశ్రీ నేమాని గురువర్యులకు ధన్యవాదములు
మన రాజకీయ నాయకులపై
====+======
వాత లెట్టు చున్న నేతనేడు మనుకు
మేకవన్నె పులి,తోకలేని
కోతి వలెను దిరిగి ఖ్యాతి నొందెడి వాడు
గలడు, నిదుర వీడు కలియుగమున
శ్రీ వరప్రసాదు గారికి శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పద్యము బాగుగ నున్నది. వాతలెట్టు కి బదులుగా వాతలిడెడి అందాము. 2వ పాదములో ఒక లఘువు తక్కువగా నున్నది. "పులియు" అని యు ను చేర్చుదాము. ఇంకా బాగుగ అన్వయమును చూపించాలి. స్వస్తి.
కవిమిత్రులకు నమస్కృతులు...
రిప్లయితొలగించండినా ఆరోగ్యం ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్నది. నేను త్వరగా కోలుకోవాలని కోరుకున్న అందరికీ ధన్యవాదాలు.
ముఖ్యంగా నా అశక్తతను గుర్తించి మిత్రుల పూరణల, పద్యాల గుణదోష విచారణ చేసి, సవరణలను సూచించిన పండిత నేమాని వారికి ఎంతగానో ఋణపడి ఉన్నాను. వారి సౌహార్దానికి ధన్యవాదాలు.