కవిమిత్రుకు నమస్కృతులు. నిన్న మా బావమరది ఇంట్లో ఒక కార్యక్రమానికి వెళ్ళి రాత్రి ఆలస్యంగా ఇల్లు చేరాను. అలసట కారణంగా రాత్రి మీ పూరణలపై, పద్యాలపై స్పందించలేకపోయాను. మన్నించండి. * పండిత నేమాని వారూ, సమస్య పాదాన్ని విరిచి చక్కని పూరణను చెప్పి మిగిలిన కవిమిత్రులకు మార్గదర్శకులయ్యారు. దాదాపుగా అందరూ మా మార్గాన్నే (భావంతో సహా) అనుసరించారు. మీకు అభినందనలు, ధన్యవాదాలు. * గుండు మధుసూదన్ గారూ, మీ మూడు పూరణలూ వైవిధ్యంగా ఉండి అలరించాయి. అభినందనలు. * లక్ష్మీదేవి గారూ, బాగుంది మీ పూరణ. అభినందనలు. * గన్నవరపు నరసింహ మూర్తి గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. * గండూరి లక్ష్మినారాయణ గారూ, బాగుంది మీ పూరణ. అభినందనలు. "శీతలగిరిరా సుత" అన్నా, "నగజాత" అన్నా ఒకటే కదా.. ఇక్కడ పునరుక్తి దోషం ఉంది. * రాజేశ్వరి అక్కయ్యా, బాగుంది మీ పూరణ. అభినందనలు. * శ్రీనివాస్ గారూ, మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు. * జిగురు సత్యనారాయణ గారూ, వైవిధ్యంగా ఆలోచించి పూరణలు చేయడంలో మీకు మీరే సాటి. అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు. * తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు.
చేతమలర శ్రీరాముడు
రిప్లయితొలగించండిసీతమ్మను బెండ్లియాడె, శివుడు ముదమునన్
శీతాద్రిజతో జని కని
యా తరుణమునందు గవకు నాశిషములిడెన్
గురుతుల్యులు పండిత నేమానివారి మార్గదర్శనమునకుఁ గృతజ్ఞతలు తెలుపుకొనుచు...
రిప్లయితొలగించండిప్రీతుండై శ్రీరాముఁడు
సీతమ్మను బెండ్లియాడె; శివుఁడు ముదమునన్
మాతంగి యుతుఁడునై చని,
సీతారాములకు "స్వస్తి" చెప్పియుఁ దరలెన్. ౧
క్రమాలంకారమునఁ బూరణము:
ప్రీతిన్ రాముం డేమయె?
శీతాద్రిజ పతి యెవండు? చిరకాలమ్మున్
జేత మ్మెటులుండవలెన్?
సీతమ్మను బెండ్లియాడె; శివుఁడు; ముదమునన్.
శ్వేతాబ్జ యంచు రాముడు
రిప్లయితొలగించండిసీతమ్మనుఁ బెండ్లియాడె, శివుడు ముదమునన్
శీతాద్రిజతో దీవన
లా తరుణమునందొసగగ రంజిలె జగముల్
అన్నయ్యగారి బాటే నా బాట కూడా ,
రిప్లయితొలగించండిఖ్యాతి యలర శ్రీరాముడు
సీతమ్మను బెండ్లియాడె, శివుడు ముదమునన్
భూతగణము, పార్వతితో
నూతన దంపతులను గని నుతులను నుడివెన్!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిప్రీతిగ శివు డను వాడికి
రిప్లయితొలగించండిసీత యను యువతికి బెండ్లి జేసిరి పెద్దల్
జాతకములు కలిసె నటుల ;
సీతమ్మను బెండ్లి యాడె శివుడు ముదమునన్
( తరువాత వారు తమ పేర్లను మార్చుకొన్నా రనుకోండి ! )
ప్రేతిన్ శ్రీ రఘురాముడు
రిప్లయితొలగించండిసీతమ్మను పెండ్లియాడె, శివుడు ముదమునన్
శీతలగిరి రా సుత నగ
జాతను చేకొనియె సురులు చల్లిరి విరులన్.
ప్రేతిన్ శ్రీ రఘురాముడు
రిప్లయితొలగించండిసీతమ్మను పెండ్లియాడె శివుడు ముదమునన్
శీతలగిరిరా సుత నగ
జాతను చేకొనియె సురులు చల్లిరి విరులన్
ప్రీతిగ విల్లును విఱచగ
రిప్లయితొలగించండిసీతమ్మను పెండ్లి యాడె , శివుడు ముదమునన్ !
శీతాద్రి నుండి సతిగొని
భూతలమున కనుల విందు భోగము గాంచన్
శ్రీ తారక రాముడపుడు
రిప్లయితొలగించండిసీతమ్మను పెండ్లి యాడె: శివుడు ముదమునన్
శీతాద్రిజకు తెలిపెనట
సీతా రాముల కధలను శివ మగు వినినన్
శ్రీ తారక రాముడపుడు
రిప్లయితొలగించండిసీతమ్మను పెండ్లి యాడె: శివుడు ముదమునన్
శీతాద్రిజకు తెలిపెనట
సీతా రాముల కధలను శివ మగు వినినన్
ప్రీతిన్ శ్రీ రఘురాముడు
రిప్లయితొలగించండిసీతమ్మను బెండ్లి యాడె, శివుడు ముదమునన్
శీతల గిరి రా సుత నగ
జాతను చేకొనియె సురులు చల్లిరి విరులన్ .
మాతను, తాపస లోక పు
రిప్లయితొలగించండినీతను, దివిజాంగనలకు నేతను, పరమా
ద్వైతను, గిరిజాతను, మది
సీతమ్మను పెండ్లియాడె శివుఁడు ముదమునన్!!
సీతు = చల్లనైన
మది సీతు + అమ్మ = మది సీతమ్మ = చల్లనైన మనసు కలిగినది
శ్రీ జిగురు సత్యనారయణ గారికి శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిసమస్య పరిష్కారమునకు చక్కని మార్గమును ఎన్నుకొనినారు. సంతోషము. స్వస్తి.
గుండు మధుసూదన్ gaari pUraNa....
రిప్లయితొలగించండిసీత పొరుగింటి శివుఁడటఁ
జేతము లొక్కటిగఁ గాఁగ స్థిర జీవికకై
మాతాపిత సమ్మతితో
సీతమ్మను బెండ్లియాడె శివుఁడు ముదమునన్. ౩
శ్రీపండితనేమాని గురువులకు నమస్సులతో
రిప్లయితొలగించండిత్రేతా యుగమున రాముడు
సీతమ్మను పెండ్లియాడె, శివుఁడు ముదమునన్
త్రాతగ నొప్పారు వారిని
ప్రీతిన్ దీవించెనంత భీమాయుతుడై.
కవిమిత్రుకు నమస్కృతులు.
రిప్లయితొలగించండినిన్న మా బావమరది ఇంట్లో ఒక కార్యక్రమానికి వెళ్ళి రాత్రి ఆలస్యంగా ఇల్లు చేరాను. అలసట కారణంగా రాత్రి మీ పూరణలపై, పద్యాలపై స్పందించలేకపోయాను. మన్నించండి.
*
పండిత నేమాని వారూ,
సమస్య పాదాన్ని విరిచి చక్కని పూరణను చెప్పి మిగిలిన కవిమిత్రులకు మార్గదర్శకులయ్యారు. దాదాపుగా అందరూ మా మార్గాన్నే (భావంతో సహా) అనుసరించారు. మీకు అభినందనలు, ధన్యవాదాలు.
*
గుండు మధుసూదన్ గారూ,
మీ మూడు పూరణలూ వైవిధ్యంగా ఉండి అలరించాయి. అభినందనలు.
*
లక్ష్మీదేవి గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
*
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
గండూరి లక్ష్మినారాయణ గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
"శీతలగిరిరా సుత" అన్నా, "నగజాత" అన్నా ఒకటే కదా.. ఇక్కడ పునరుక్తి దోషం ఉంది.
*
రాజేశ్వరి అక్కయ్యా,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
*
శ్రీనివాస్ గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
*
జిగురు సత్యనారాయణ గారూ,
వైవిధ్యంగా ఆలోచించి పూరణలు చేయడంలో మీకు మీరే సాటి. అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
*
తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
గురువు గారికి, పండిత నేమాని గురువులకు
రిప్లయితొలగించండిధన్యవాదములు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసీతమ్మను సుందరినిన్
రిప్లయితొలగించండిరీతిగ నాగేశ్వరుండు ప్రేమించంగా
భూతల వైకుంఠములో
సీతమ్మను పెండ్లియాడె శివుఁడు ముదమునన్
నీతో నుండెద నెపుడని
రిప్లయితొలగించండిప్రీతిగ ననుచును వదలక వెంటన్ బడుచున్
యాతన లిడుటను సమమౌ
సీతమ్మను పెండ్లియాడె శివుఁడు ముదమునన్