శ్రీ శ్రీనివస్ గారూ! శుభాశీస్సులు. మీ పద్యము 3వ పాదము అంతములో చేకూర్చకన్ అని అన్నారు. చేకూర్చక అనే వ్యతిరేకార్థక పదము చివర న్ అనే ద్రుతము రాదు. అందుచేత చేకూర్చకే అనుట కొంత నయము. స్వస్తి.
నేమాని మాష్టారుకు నమస్సులు, చిత్తం.. మీరన్నట్లుగా గణములలో తేడా ఉండదు. కానీ, పాదాదిలోయున్న 'త్ర' కు మీరు సూచించిన 'తృ' కు యతి సరిపోతునందా అని చిన్న అనుమానము.. అందుకే పూర్తిగా మార్చాను. అక్కడ ఆ యతి సరిపోవునో లేదో నన్న నా అనుమానమును దయచేసి తీర్చగలరు. ధన్యవాదములు.
శంకరాభరణం బ్లాగు మిత్రులకు నమస్కారం. ఈరోజు ఉదయం నా మిత్రుడు శంకరయ్య, ఆయన భార్య స్కూటర్ మీద వెళ్తూ స్కిడ్ అయి పడి గాయాలయ్యాయి. శంకరయ్య మోకాలికి, మోచేతికి భుజానికి గాయాలయ్యాయి. శాంతి చెల్లెకు చేతికి గాయమయింది. అంత ప్రమాదకరమైన గాయాలు కావు కానీ షాక్ లో ఉన్నారు. బ్లాగులో కామెంట్ పెట్టమన్నాడు... కంది శంకరయ్య మిత్రుడు, కె. వినోద్ కుమార్.
అమ్మా! రాజేశ్వరి గారూ! శుభాశీస్సులు. మీరు నా పద్యము 2వ పాదములో ఒక అక్షరమును ఎక్కువగ నున్నట్లు తెలిపేరు. సంతోషము. అది సమస్యగా ఈయబడిన పాదమే. నేను టైపు చేయుటలో తప్పు దొరలినది. అందుచేత పూరణలో దోషము లేదు. స్వస్తి.
శ్రీ శంకరయ్య గురువర్యులకు గాయములు తగిలినట్లు గురువు గారి మిత్రుడు వినోద్ కుమార్ గారి ద్వారా వినియున్నాము. వారు త్వరలో కోలుకోవాలి అని భగవానుని ప్రార్థిస్తూ.
శ్రీ నేమాని వారికి, నమస్కారములు మరియు సవరణను తెలియ చేసినందుకు కృతఙ్ఞతలు తెలియచేసుకుంటున్నాను . శ్రీ శంకరయ్య మరియు వారిశ్రీమతి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను .
వివిధాధ్వమ్ముల నేని జూడక మహావేగమ్ముతో జంకుతో
రిప్లయితొలగించండినవధానమ్మున జేయకూడదు సమస్యాపూరణమం బెప్పుడున్
శ్రవణానందకరమ్ముగా స్థిరమతిన్ శబ్దార్థ సౌందర్య వై
భవమేపారగ జేయుటొప్పు జన సద్వంద్యంబుగా ధీనిధీ!
సవన మ్మీ యవధాన, మిందుఁ గనఁగన్ సద్యః స్ఫురద్భావముల్
రిప్లయితొలగించండిసెవులన్ విందుల నోలలాడ నిడుఁ, గించిత్తైన యాలస్య మీ
యవధానమ్మునఁ జేయఁ గూడదు; సమస్యాపూరణ మ్మెప్పుడున్
మివులన్ మెప్పులఁ దెచ్చుఁ బండితులకున్ మేల్మేలనంగన్ భళా!
చెవి రిక్కించుచు వేచియుందురుగదా చెల్వొందగా సభ్యులే
రిప్లయితొలగించండియవధానే యిక నేమి చెప్పునొ యనిన్ హాస్యమ్మునే కోరుచున్
కవనారంభము నందు వాణిని మదిన్ కారుణ్యతన్ వేడకే
యవధానమ్మునఁ జేయఁ గూడదు సమస్యాపూరణ మ్మెప్పుడున్
శ్రవణానందముఁ గాని పద్యముల, నిస్సారంపు సాహిత్యమున్,
రిప్లయితొలగించండికవనాలంకృతి లేని పోలికలతో, గాంభీర్యమెమ్మాత్రమున్
నవలంబింపని పల్కులన్ పలుకుచో, నవ్యత్వమే లేనిచో
నవధానమ్మునఁ జేయకూడదు సమస్యాపూరణ మ్మెప్పుడున్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికవి తానెప్పుడు చెప్పు పద్యముల నేకార్ధంబులన్గూర్చుచున్
రిప్లయితొలగించండిసువిధానంబున శోభ లుట్టిపడ గా శోధించి సాధించు తా
నవ సారస్వత పూరణల్; జనుల కానందంబు చేకూర్చ కన్
యవధానమ్మునఁ జేయఁ గూడదు సమస్యాపూరణ మ్మెప్పుడున్
నవనీతంబును దాచిమందసములోఁనందించునేరీతిఁబు
రిప్లయితొలగించండిత్రవితానంబునమాత యట్లెకవి శ్రోతశ్రేణిఁదాఁపంచునే
కవితాస్త్యేనము తేపతేపకును; ఏకావృత్తిఁబూర్ణంబుగా
నవధానమ్మునఁజేయకూడదు సమస్యాపూరణమ్మెప్పుడున్||
శ్రీ శ్రీనివస్ గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పద్యము 3వ పాదము అంతములో చేకూర్చకన్ అని అన్నారు. చేకూర్చక అనే వ్యతిరేకార్థక పదము చివర న్ అనే ద్రుతము రాదు. అందుచేత చేకూర్చకే అనుట కొంత నయము. స్వస్తి.
శ్రీ రఘురాం గారూ! అభినందనలు.
రిప్లయితొలగించండిమీ పద్యములో శ్రోత శ్రేణి అని అన్నారు. శ్రోతృశ్రేణి అనుట సాధు ప్రయోగము కదా. స్వస్తి.
పండిత నేమని వారికి,
రిప్లయితొలగించండినమస్కారములు మరియు సవరణ ను తెలియ చేసినందుకు కృతఙ్ఞతలు తెలియ చేసుకుంటున్నాను .
శ్రీనివాస్
నేమాని మాష్టారు గారూ.. మీ సూచనకు ధన్యవాదములు
రిప్లయితొలగించండిఆ పాదాంతమును, "శ్రోతాళిన్ సమర్పించు సత్" అని మార్చిన దోషముండదు కదా..
అవధానమ్మున జేయ కూడదు సమస్యా పూరణ మ్మెప్పుడు
రిప్లయితొలగించండిన్నవమానంబులుజేయుచున్ విబుధులన్ సాహిత్య సన్మూర్తులన్ .
అవనిన్ పండిత శ్రేణి మెచ్చును గదానత్యంత రమ్యంబుగా
నవదానమ్మునుజేయగా పదములందందాలుచిందించుచున్ !!!
అయ్యా శ్రీరఘురాం గారూ! అభినందనలు.
రిప్లయితొలగించండిమీరు శ్రోతృశ్రేణి అనినా సరిపోతుంది. గణములలో ఏమియు తేడా ఉండదు. స్వస్తి.
అయ్యా! శ్రీ పీతాంబర్ గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పద్యము 3వ పాదములో గదా నత్యంత అని నుగాగమము చేసేరు. గదా యత్యంత అని యడాగమము చేయాలి. స్వస్తి.
జవరాలిన్ తనియించుటే పతికి సంసారంబునంజూడగ
రిప్లయితొలగించండిన్నవధానంబగు - వల్వలుం బసిడి, సౌఖ్యార్థంబులుందేవలెన్,
వివరింపంగను రాదు కష్టములు ధిక్! వింతౌన్! మహిన్ భర్తగా
అవధానమ్మునఁ జేయకూడదు సమస్యాపూరణ మ్మెప్పుడున్
క్షమించాలి
రిప్లయితొలగించండిశ్రీ పండితుల వారి పద్యం రెండవ పాదంలో ఒక అక్షరం ఎక్కువగా తోచు చున్నది " పూరణమం బెప్పుడున్ !అన్నచోట . " నేను పొరబదిన యెడల మన్నించ గలరు
నేమాని మాష్టారుకు నమస్సులు,
రిప్లయితొలగించండిచిత్తం.. మీరన్నట్లుగా గణములలో తేడా ఉండదు.
కానీ, పాదాదిలోయున్న 'త్ర' కు మీరు సూచించిన 'తృ' కు యతి సరిపోతునందా అని చిన్న అనుమానము.. అందుకే పూర్తిగా మార్చాను.
అక్కడ ఆ యతి సరిపోవునో లేదో నన్న నా అనుమానమును దయచేసి తీర్చగలరు.
ధన్యవాదములు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅవధా నంబున భావముల్ మిగుల నుత్సాహంబు పెంపొందగా
రిప్లయితొలగించండికవనం బల్లుట భావ్య మంచు కవులా కావ్యా రసాలోలతన్
సువి సాలం బగు స్పూర్తితా నిడుచు సుశ్లో కంబులన్ జేయకన్
నవధానమ్మునఁ జేయకూడదు సమస్యా పూరణ మ్మెప్పుడున్ !
శంకరాభరణం బ్లాగు మిత్రులకు నమస్కారం.
రిప్లయితొలగించండిఈరోజు ఉదయం నా మిత్రుడు శంకరయ్య, ఆయన భార్య స్కూటర్ మీద వెళ్తూ స్కిడ్ అయి పడి గాయాలయ్యాయి. శంకరయ్య మోకాలికి, మోచేతికి భుజానికి గాయాలయ్యాయి. శాంతి చెల్లెకు చేతికి గాయమయింది. అంత ప్రమాదకరమైన గాయాలు కావు కానీ షాక్ లో ఉన్నారు. బ్లాగులో కామెంట్ పెట్టమన్నాడు...
కంది శంకరయ్య మిత్రుడు,
కె. వినోద్ కుమార్.
అమ్మా! రాజేశ్వరి గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీరు నా పద్యము 2వ పాదములో ఒక అక్షరమును ఎక్కువగ నున్నట్లు తెలిపేరు. సంతోషము. అది సమస్యగా ఈయబడిన పాదమే. నేను టైపు చేయుటలో తప్పు దొరలినది. అందుచేత పూరణలో దోషము లేదు. స్వస్తి.
అయ్యా రఘురాం గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీరు సూచించ సవరణ బాగుగనే యున్నది. అలాగే మార్చండి. స్వస్తి.
మిత్రులారా! శ్రీ శంకరయ్య గారికి చిన్న చిన్న గాయములు తగిలినట్లు విన్నాము కదా. వారు త్వరలో కోలుకోవాలి అని భగవానుని ప్రార్థించుదాము. స్వస్తి.
రిప్లయితొలగించండిపూజ్య గురువులు శ్రీ పండిత నేమాని వారికి ప్రణామములు
రిప్లయితొలగించండిసహృదయముతో వివరణ జేసి తెలియ జెప్పినందులకు కృతజ్ఞతలు.
సోదరులు శ్రీ శకరయ్య గారిని వారి శ్రీమతి శాంత గారిని తొందరగా కోలుకోవాలని ఆశీర్వదిస్తూ ఆ భగవంతుని వేడు కొంటున్నాను
శ్రీ శంకరం మాస్టరు గారికి ప్రమాదం జరగటం దురదృష్టకరం. వారికి త్వరగా స్వస్థత చేకూరాలని ఆకాంక్షించుచున్నాను.
రిప్లయితొలగించండిశ్రీ శంకరయ్య గురువర్యులకు గాయములు తగిలినట్లు గురువు గారి మిత్రుడు వినోద్ కుమార్ గారి ద్వారా వినియున్నాము. వారు త్వరలో కోలుకోవాలి అని భగవానుని ప్రార్థిస్తూ.
రిప్లయితొలగించండిశ్రీ నేమాని వారికి,
రిప్లయితొలగించండినమస్కారములు మరియు సవరణను తెలియ చేసినందుకు కృతఙ్ఞతలు తెలియచేసుకుంటున్నాను .
శ్రీ శంకరయ్య మరియు వారిశ్రీమతి త్వరగా కోలుకోవాలని
కోరుకుంటున్నాను .
శంకరయ్య గారికి ప్రమాదం జరిగిందని చాలా బాధగా ఉన్నది. శ్రీ శంకరయ్య మరియు వారి శ్రీమతి త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను.
రిప్లయితొలగించండిమాష్టారు వారి కుటుంబ సభ్యులూ త్వరగా కోలుకోవాలని ఆకాక్షిస్తూ! - బ్లాగు మిత్రులు.
రిప్లయితొలగించండిగురువుగారు శ్రీ శంకరయ్య గారు, వారి సతీమణి త్వరగా తప్పక దైవానుగ్రహము వలన కోలుకొంటారు.
రిప్లయితొలగించండిమంచి మంచి పూరణ లందించిన కవిమిత్రులు....
రిప్లయితొలగించండిపండిత నేమాని వారికి,
గుండు మధుసూదన్ గారికి,
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
లక్ష్మీదేవి గారికి,
‘శీనా’ శ్రీనివాస్ గారికి,
గూడ రఘురామ్ గారికి,
మంద పీతాంబర్ గారికి,
రవి గారికి,
రాజేశ్వరి అక్కయ్యకు,
అభినందనలు.
*
నా ప్రమాదం గురించి తెలిసి సానుభూతి తెలియజేసిన మిత్రులు.....
పండిత నేమాని వారికి,
రాజేశ్వరి అక్కయ్యకు,
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
వరప్రసాద్ గారికి,
మంద పీతాంబర్ గారికి,
లక్కరాజు వారికి,
చంద్రశేఖర్ గారికి,
గన్నవరపు నరసింహ మూర్తి గారికి,
(ఫోన్ చేసిన) గుండు మధుసూదన్ గారికి
ధన్యవాదాలు.
కవనంబందున కూర్చెడిన్ పదములన్ కౌశల్యమున్ లేకయే
రిప్లయితొలగించండిలవలేశమ్మును గాత్రమున్ మధురమౌ లావణ్యమున్ లేకయే
చ్యవన ప్రాసను మ్రింగుటన్ విరివిగా చాదస్తమున్ గాంచకే
యవధానమ్మునఁ జేయకూడదు సమస్యాపూరణ మ్మెప్పుడున్