12, జూన్ 2013, బుధవారం

సమస్యాపూరణం – 1080 (నననన నాననా ననన)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
నననన నాననా ననన నానన నానన నాననా ననా!
("అవధాన విద్య" గ్రంథం నుండి)

14 కామెంట్‌లు:

  1. నననల బేర్చి కూర్చి యిడి నాల్గవ పాదముగా పద త్రయం
    బును మును జేర్చుడీ యనుడు, పూరణ చూడుడు, దేనికేని మున్
    నన యన రాదు కాదనదె? నాయన! వద్దుర వద్దు నానలున్
    నననన నాననా ననన నానన నానన నాననాననా

    రిప్లయితొలగించండి



  2. వినుటకు సొంపుగా నమరు వీనుల నొల్కుచు దీపి దేనియల్
    చనునిది చంపక మ్మనగ సామజ భంగిమ గంధ మూరుచున్
    గణముల సాము లెందులకు ? గానము సల్పగ సాగు నుద్ధతిన్
    నననన నాననా ననన నానన నానన నాననా ననా!

    రిప్లయితొలగించండి
  3. వినుమిక వీనులందమృత వృష్టి విశేషముగానగున్, భళా!
    నననన నాననా ననన నానన నానన నాననా ననా!
    యనుచు స్వరమ్ములం బలుక; నజ్ఞత మెండుగ గల్గియుంటి, నా
    కనుటకు నోటఁ బల్కునె? మహత్వముఁ గల్గిన జ్ఞానమయ్యదే!

    రిప్లయితొలగించండి
  4. గన సరిగా సరీగమలు గానము నందు నవి స్వరంబులై
    మనమున సంతసంబునిడు మానని గాయము మాన్పు నౌషధం
    బనగను పాడియౌ మరియు పాములు సైతము నాడవే యనన్
    నననన నాననా ననన నానన నానన నాననాననా

    రిప్లయితొలగించండి
  5. అనుదినమున్ కుమారునకు నాయన నేర్పుచు నుండు రాగముల్
    నననన నాననా ననన నానన నానన నాననాననా
    తనయుడు నేర్చుచుండు తన తండ్రి మహత్తర రాగ విద్యలన్
    నననన నాననా ననన నానన నానన నాననాననా.

    రిప్లయితొలగించండి
  6. గురువు శిష్యునితోఁ బలికిన విధము...

    మనమున వెల్గు భావముల మాన్య కవిత్వమునందుఁ గూర్చ నీ
    దినమునఁ బద్యమందు నినదించెడు రీతిని వ్రాయఁ బూనియున్
    దనరెడు చంపకమ్మునను ధాటిగ, ధారగఁ బల్కుమిట్టులన్
    నననన నాననా ననన నానన నానన నాననా ననా.

    రిప్లయితొలగించండి
  7. కనులకు విందు చేసె నదె కాటుక కన్నుల చిన్న దేయనన్
    మనమున పొంగు భావములు మౌనపు గీతము లాల పించగా
    తనరుచు ప్రేమ మీరమది తాళక నూహల తేలి పోవుచున్
    ననన ననాన నానన ననాన ననాన ననాన నాననా !

    రిప్లయితొలగించండి




  8. మనమున జింతఁ జేయుదును మన్మధ వైరిని శంభు,శంకరున్
    జననము సార్థ మొందగను జంద్రకళాధరుఁ గాలకంఠునిన్
    దనువది భక్తి నాడగను దాండవ శ్రేష్ఠుని గొల్చి పాడనే
    నననన నాననా ననన నానన నానన నాననా ననా!!!

    రిప్లయితొలగించండి
  9. మధ్యాక్కర గర్భిత చంపకమాల:
    నననన నాననా ననన నానన నానన నాననాననా
    యనుచు నొకండు రాగముల నాదృతి దీయుచునుండె వింటివే?
    మన మలరంగ జేయు రసమాధురి నొల్కెడు వాన్కి వేడ్కతో
    ననుపమ మద్భుతం బని నయమ్మున సత్కృతి గూర్తు ధీనిధీ!

    (ఈ చంపకమాల లోని ప్రతి పాదములో చివరి 3 అక్షరములు తొలగించినచో మధ్యాక్కర వచ్చును)

    రిప్లయితొలగించండి
  10. మంచి పూరణలను అందించిన కవిమిత్రులు...
    పండిత నేమాని వారికి,
    గన్నవరపు నరసింహ మూర్తి గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    శ్రీనివాస్ గారికి,
    మిస్సన్న గారికి,
    గుండు మధుసూదన్ గారికి,
    రాజేశ్వరి అక్కయ్యకు
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  11. కనుమిది నాన! నాన! మరి కష్టము నాకిది చంపకమ్మనన్
    వినుమిక చెప్పుదింక నొక వీనులవిందగు మంత్రమొక్కటే
    ననుచును చెప్పె దండ్రి కన నా లతొ గూడిన నవ్య మంత్రమే
    నననన నాననా ననన నానన నానన నాననా ననా!

    రిప్లయితొలగించండి
  12. కనుచు నిరాని యాంటినహ కన్నులు గొట్టుచు దర్వు వేయుచున్
    తనరగ నోడి పోవనట తన్నుల నొంది యమేఠినిన్ భళా
    వినుటకు సొంపు రీతినిక వేకువ జామున పాడె రాహులే:
    "నననన నాననా ననన నానన నానన నాననా ననా!"

    రిప్లయితొలగించండి