లక్ష్మీదేవి గారూ, మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు. * పండిత నేమాని వారూ, అంజనా పుత్రు శుభగాత్రు నతిపవిత్రుఁ దలచి హృదయరంజకముగాఁ దచ్చరితము సీసమాలికన్ జెప్పిన సత్కవివర! మా నమస్కృతు లెవియె నేమాని వారు! * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ సీసపద్యం మనోహరంగా ఉంది. అభినందనలు. * రాజేశ్వరి అక్కయ్యా, మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
పంచముఖుడు హనుమంతుని
రిప్లయితొలగించండిపంచన మనముండ చింత వంతలు దీరున్
సంచిత పాపము తొలగగ
నెంచి భజించెద - హనుమయె హృదయము నిండన్.
శ్రీకంఠు నంశతో క్షితి నాంజనేయుడై
రిప్లయితొలగించండి....పవమాన సూనుడై ప్రభవమొంది
బిసరుహాప్తుని గొల్చి వేదశాస్త్రాదులౌ
....విద్యలన్నింట ప్రావీణ్యమొంది
సురబృందములనుండి వరము లెన్నియొ పొంది
....యతుల తేజోవిక్రమాన్వితుడయి
సూర్య నందనుడైన సుగ్రీవ విభునకు
....సచివ వర్యాంచిత స్థానమొంది
భావి కాలమ్ములో బ్రహ్మ పదమ్ముచే
....బట్ట గల్గిన వైభవమ్ము గలిగి
శ్రీరామ దూతయై వారాశి లంఘించి
....జానకీదేవి కష్టముల బాపి
లంకా పురీశుడౌ రావణాసురునకు
....హృదయమ్ములో దడ నెసగ జేసి
లంక నంతయు గాల్చి రాము సన్నిధి జేరి
....క్ష్మాసుత యొక్క క్షేమమును దెలిపి
సంజీవనీ మహాక్ష్మాధరమ్మును దెచ్చి
....ప్రాణదానమొనర్చి లక్ష్మణునకు
సకల దుష్ట పిశాచ శాకినీ ముఖ్య సం
....హారకుండనగ భయప్రదుడయి
సంతత శ్రీరామచంద్రాంఘ్రి సేవాను
....రక్తుడై భక్తుడై రహి జెలంగి
పంచ వక్త్రుడై యాయుధ ప్రతతి బూని
అభయ వరముల నొసగుచు నాశ్రితులకు
నమరభూజమౌ స్వామి నే నాత్మ దలతు
నంజనాపుత్రు శుభగాత్రు నతిపవిత్రు
తన బుద్ధి బలముతో దనరారె నెవ్వాడు
....వానరేశ్వరు మంత్రివర్యు డగుచు
తన వాగ్విభవముతో ఘనముగా నెవ్వాడు
....జానకీపతి ప్రశంసలను బొందె
తనదు సద్గుణ మహాధనముతో నెవ్వాడు
....శతయోజనమ్ముల జలధి దాటె
తన బాహుబలముచే దనుజుల నెవ్వాడు
....యమ మహాపురమున కనిపె నహహ!
జానకీ రాములను తన మనస్సదనమందు
నిలిపి సేవించు సద్యోగ నిరతు డెవ్వ
డమ్మహాత్ముని సుచరిత్రు నాత్మ దలతు
నంజనాపుత్రు శుభగాత్రు నతి పవిత్రు
రిప్లయితొలగించండిపడిత నేమాని వారి విపులమైన హనుమత్ స్త్తుతి తర్వాత వ్రాయడం అనవసర మనిపిస్తున్నది.
అయ్యా! డా. కమనీయం గారూ!
రిప్లయితొలగించండినమస్కారములు.
మీరు మంచి ఉత్సాహముతో వ్రాయాలి అనే మా ఆకాంక్ష. ముఖే ముఖే సరస్వతి. స్వస్తి.
జానకీ రాములను తన మనస్సదనమందు
రిప్లయితొలగించండిఇందులో "తన" వలన గణాలు ఎక్కువైనాయని సందేహము.
అమ్మా! శ్రీమతి లక్ష్మీ దేవి గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పరిశీలన బాగుగనే యున్నది. తన్మయత్త్వములో "తన" ను గమనించలేదు నేను. స్వస్తి.
ఆకాశయానమ్ము నవలీలగా సేయు
రిప్లయితొలగించండిపవన పుత్రుడతడు బాల్యమందు
అగ్నులెగయు రవి నరచేతనే పట్టె
జలనిధినే దాటె శౌర్య ధనుడు
పుడమిపుత్రిక జాడ బుద్ధిబలము జూపి
స్వామికే జెప్పె నసాధ్యుడతడు
రోమరోమమునందు రాముడే కనిపించు
భావి బ్రహ్మ యమిత బాహుబలుడు
పంచభూతములాయన పట్టునుండు
పంచబాణునివైరి యా పరమ శివుడె
పంచవక్తృడు మారుతి భక్త జనుల
పంచనుండును మనకెట్టి భయము వలదు.
హను మంతుడు బల వంతుడు
రిప్లయితొలగించండివిను వీధుల విహరించు వేలుపు తానై !
మనమున కొలువై యుండిన
మననము జేయంగ తనరు మహిమాన్వితు డై !
లక్ష్మీదేవి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
*
పండిత నేమాని వారూ,
అంజనా పుత్రు శుభగాత్రు నతిపవిత్రుఁ
దలచి హృదయరంజకముగాఁ దచ్చరితము
సీసమాలికన్ జెప్పిన సత్కవివర!
మా నమస్కృతు లెవియె నేమాని వారు!
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ సీసపద్యం మనోహరంగా ఉంది. అభినందనలు.
*
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
నేమాని పండితార్యా! నమోన్నమః:
రిప్లయితొలగించండిచేతు నమస్సుమాంజలిని శ్రీ రఘు రాముని దూతకుం, బటు
ఖ్యాతికి, వాత సూతికిని, నంజన ప్రీతికి, శంభు తేజ సం-
జాతికి, లంక ఘాతికిని, జానకి కూతకు, రాక్ష సాళికిన్
భీతికి, నేతకున్, సురస భేదికి, వానర జాతి గీతికిన్.
చేతుల జేర్చి దగ్గరకు జేతును దండము రామమూర్తికిన్-
సీతకు నిల్చి వారధిగ క్షేమ మొనర్చిన చిద్విభూతికిన్,
త్రాతకు, తత్త్వ వేత్తకు, విధాతకు, మారుతి కెల్లవేళలన్
ప్రీతిగ గొల్చు వారలకు భీతిని బాపెడు దివ్య మూర్తికిన్.
చేతును వందనమ్ములను చిత్తము నందున మించు భక్తితో
ప్రీతిగ రామ నామమును వీడక యుండెడు వాని, కగ్నికిన్
బ్రీతిగ లంక గాల్చి యరి బీచ మడంచిన వాని, కెన్నగా
భూత పిశాచ సంఘముల పోరును బాపెడు వాని కెప్పుడున్.

భక్తి రస ప్రశస్తములు, పావన భావ సమన్వితంబులున్
రిప్లయితొలగించండిసూక్తి మయమ్ములున్ సరస సుందర వర్ణయుతంబులై
రక్తిని గూర్చు భవ్యసుమ రాసుల నుత్పలమాల లల్లు నిన్
భక్త వరప్రదుండయిన పావని బ్రోచుత లెస్స మిస్సనా!
శ్రీ మిస్సన్న గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండినేను వ్రాసిన ఉత్పలమాలలో 2వ పాదము చివర "సదా" అనే 2 అక్షరములు చేర్చుదాము. స్వస్తి.
నేమాని పండితార్యా! ధన్యుడను.
రిప్లయితొలగించండిమిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిఅనుప్రాసాలంకార శోభితమైన మీ పద్యాలు మనోహరంగా ఉన్నాయి. నేమాని వారి ప్రశంసకు అర్హమైనందుకు ఆనందంగా ఉంది. అభినందనలు.