13, జూన్ 2013, గురువారం

పద్య రచన - 371

కవిమిత్రులారా, 
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

12 కామెంట్‌లు:

  1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  2. వీ ణ డప్పులు ధరియించి వీధి వీధి
    తిరిగి వాయించు గొనుచును దిరిపె మడిగి
    బ్రదుకు చున్నట్టి వారిని నాదు కొనగ
    దాత లెవరైన రండిటు దయను దలచి

    రిప్లయితొలగించండి
  3. సహజముగ నబ్బు సంగీత జ్ఞానమదియె
    నలరఁ జేయుచుండు; రసజ్ఞులైన వారు
    వినుచు నాస్వాదించుట కద్దు, విద్య యొకరి
    సొత్తె? పరిమళమునుఁ బోలు సుమమునందు.

    రిప్లయితొలగించండి
  4. ఉప్పొంగి జాన పదములు
    తప్పెట తాళమును వేసి తమకము నందున్
    మెప్పును పొందుచు పాడుచు
    ముప్పొద్దుల నూరి జనుల మోద మొనర్పన

    రిప్లయితొలగించండి
  5. సుబ్బారావు గారూ,
    లక్ష్మీదేవి గారూ.,
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. అమ్మా! శ్రీమతి లక్ష్మీ దేవి గారూ! శుభాశీస్సులు.
    శ్రీ శంకరయ్య గారు అభినందించేరు - బాగున్నది మీ పద్యము.
    3వ పాదములో ఒక చిన్న పొరపాటు దొరలినది గణభంగము. ఇంద్రగణమునకు బదులుగా మగణము వేసేరు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  7. సహజముగ నబ్బు సంగీత జ్ఞానమదియె
    నలరఁ జేయుచుండు; రసజ్ఞులైన వారు
    వినుచు సంతసించుట కద్దు, విద్య యొకరి
    సొత్తె? పరిమళమునుఁ బోలు సుమమునందు.

    గురువుగారికి, నేమాని వారికి ధన్యవాదములు. పొరబాటుకు మన్నించగలరు. పద్యము సవరించినాను.

    రిప్లయితొలగించండి
  8. అమ్మా లక్ష్మీ దేవి గారూ! మరొక చిన్న సవరణ కూడా అవసరముతోలి పాదములో సంగీత + జ్ఞానము అని సమాసము అగును, అందుచేత సంగీతలో చివరి త గురువు అగును - గణ భంగము అగును. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  9. జానపదులు వీధులందు సహజమైన శైలిలో
    గానము నొనరించుచుండి కథల నెన్నొ చెప్పగా
    వీనులకు సుఖమ్మటంచు వినెడు వారె లేరహో
    దీనులైరి గాయకులు విధీ! యిదేమి కష్టమో?

    రిప్లయితొలగించండి
  10. అయ్యా, సవరించినాను.

    సహజముగ నబ్బు గాత్రపు జ్ఞానమదియె

    ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  11. పండిత నేమాని వారూ,
    నేను ఆశించిన భానం మీ పద్యంలో ప్రతిబింబించింది. జానపద కళారూపాలకు ఆదరణ కరువై, ఆ కళాకారులు దీనావస్థలో ఉన్నారు.
    మంచి భానంతో చక్కని పద్యాన్ని అందించారు. అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  12. అయ్యా శంకరయ్య గరూ
    మీ ప్రశంసలకు సంతోషము. సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.

    రిప్లయితొలగించండి