17, జూన్ 2013, సోమవారం

పద్య రచన - 375 (తేలు)

కవిమిత్రులారా,
 

పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

17 కామెంట్‌లు:

  1. అది మండ్రగబ్బ, గన భయ
    మొదవించుచునుండె, రాజ వృశ్చికమగు న
    య్యది రాశులలో కుజునికి
    సదనంబై జాతకులకు సత్ఫలములిడున్

    రిప్లయితొలగించండి
  2. తేలును జూడగ భయమున
    తేలునుగా మనసు మనకు తెలియుము నిజమున్
    తేలును విషమున తేడా
    తేలును మరి ఖలుని బుద్ధి తేటగ గనినన్.

    రిప్లయితొలగించండి
  3. పండిత నేమాని వారూ,
    కీడు, మేలు చేసే వౄశ్చికాలను గురించి ఒకే పద్యంలో చక్కగా వివరించారు. బాగుంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    లేలును గురించి తేలికగా పద్యం చెప్పారు. చక్కగా ఉంది. అభినదనలు.

    రిప్లయితొలగించండి
  4. తేలు జూడగ భయమును గొలుపు చుండె
    తోక యొద్దన నున్నట్టి తొడిమ వంటి
    సూది తోడన గ్రుచ్చిన చుర చుర మని
    విషము నిండుచు నొడ లంత విగతు డగును

    రిప్లయితొలగించండి
  5. శ్రీ సుబ్బా రావు గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యము 1వ పాదములో ప్రాస యతి వేయుటకు ప్రయత్నించేరు. కానీ ప్రాస యతి నియమము పాటింపబడ లేదు. సరిజేయండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  6. సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    యతిదోష నివారణకు మొదటి పాదాన్ని "తేలు జూడగ భయము నెంతేని గొలుపు" అందామా?

    రిప్లయితొలగించండి
  7. తేలు విష జీవులకునానవాలు, కేలు
    కాలు పడినంత కాలుని కడకు పంపు
    మనమున విషము నిండిన మనిషి కంటె
    తేలు విషమె తరచి జూడ మేలు మేలు!!

    రిప్లయితొలగించండి
  8. పూర్వ జన్మమందున తాను పుణ్య ములను
    చేయకను పాపపు ధనము చెట్టు కింద
    దాచు వారలు తేలయ్యె దరట చెట్టు
    చేమలందున తిరుగదే చెడ్డ పురుగు

    రిప్లయితొలగించండి
  9. శ్రీ శంకరయ్య గురువర్యులకు, శ్రీ నేమాని గురువర్యులకు పాదాభివందనములతో,
    గురువు గారికి ధన్యవాదములు
    శ్రీ గోలి హనుమచ్ఛాస్త్రి గారి బాటలో
    ===========*========
    తేలును జూచిన మనుజులు
    తేలును భయమున,కరచిన తేలును బొబ్బల్
    తేలుల సఖ్యము జేయుచు
    తేలును కొందరు మనుజులు తేజ మలరగన్

    రిప్లయితొలగించండి
  10. జిగురు సత్యనారాయణ గారూ,
    చక్కని నీతి పద్యంలా భాసిస్తున్నది మీ రచన. బాగుంది. అభినందనలు.
    *
    శ్రీనివాస్ గారూ,
    క్రొత్త విషయం తెలిసింది మీ పద్యం వలన. బాగుంది. అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. శ్రీపండితనేమాని గురువులకు నమస్సులతో

    గుట్క పొట్లాల పైనుండి గుర్తు చేయు
    హానికరమని జనుల సహాయ పడుచు
    విషము కొండెనుం డెడియొక వింత పురుగు
    తేట తెల్లమగుచు నుండు తేలు యనగ.

    రిప్లయితొలగించండి
  12. తేలు మీద పద్యం వ్రాయాలంటే ఏం వ్రాయాలో తోచలేదు.
    మిత్రులందరూ చక్కటి పద్యాలు వ్రాశారు.

    నాకు చిన్నప్పుడు మొదటి తరగతి పుస్తకంలోనో రెండవ తరగతి పుస్తకంలోనో అనుకుంటాను తేలు బొమ్మకు క్రింది పొడుపుకథ ఉండేది, అది గుర్తుకు వచ్చింది :

    గోడ మీద బొమ్మ గొలుసుల బొమ్మ
    వచ్చే పోయే వారికి వడ్డించు బొమ్మ

    ****************************************************

    గోడ మీద నుండు, కొంటె (కొండె) బొమ్మను బోలు,
    గొలుసు వోలె చూచు కొలది తోచు,
    వచ్చి పోవు వారి వాటముగా బట్టి
    చేయు వడ్డనమును చిలిపి తేలు.

    రిప్లయితొలగించండి
  13. తోపెల్ల వారు తేలు వలని ఉపయోగాన్ని వాటంగా పట్టేశారు. చాలా బాగుంది.

    రిప్లయితొలగించండి
  14. సాహసముగ చీకటిలో
    నూహలలో తేలు చుండి నొవ్వక నెపుడున్
    దేహళిని దాటు చుండగ
    నాహాయని యఱచి కూలె మండ్ర గప్పే కఱవన్ !

    దేహళి = ఇంటి గడప

    రిప్లయితొలగించండి
  15. పలుకుటకు సమానమైన అన్యదేశపదాలు వేరే అర్థాన్ని ఇచ్చినా ఒక్కొక్కప్పుడు హాస్యాన్ని/అశ్లీలాన్ని ఇస్తాయి. సరదాకు హిందీ లోని తేల్ పదంపై చదువుకునే రోజుల్లో హాస్యంగా చెప్పుకున్నదాన్ని

    తెలికి ఇంటికి తైలంబు తెచ్చుకొనగ
    తురక యొక్కడు, తైలమున్ తుండు గుడ్డ
    తడియ, పలికెను తేలని, తత్తర పడుచు
    తన్నె డబ్బాను చూడక, తనకు తురక
    భాష రాక నూనె యొలుక బాధ పడెను.

    రిప్లయితొలగించండి
  16. శ్రీ తోపెల్ల శర్మ గారు చెప్పిన హాస్య కథ బాగుగనే యున్నది. స్వస్తి.

    రిప్లయితొలగించండి