గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మంచి భావంతో పద్యం చెప్పారు. అభినందనలు. ‘నూ... పడెదవ్’...? * లక్ష్మీదేవి గారూ, బాగుంది పద్యం. అభినందనలు.. ఇప్పటికైనా అది పిడిగుపాటు వంటి వార్తే.. నేను కళ్ళారా చూసాను అటువంటి సంఘటనలు. * పండిత నేమాని వారూ, వివేకవంతుల లక్షణాలను చక్కగా వివరించారు. మంచి పద్యం. అభినందనలు. * సుబ్బారావు గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు.
ఓరీ పిడుగా నూ ప్రతి
రిప్లయితొలగించండిసారీ కూలీల మీద సరిగా పడెదవ్
ఘోరంబులు జేసెడి ఘన
చారిత్రుల మీద పడిన చరితార్ధుడవే !
పిడుగు పాటగు వార్తగ పెద్దవారి
రిప్లయితొలగించండిమనము కలచెడిదట నాడు మతము మారు
పెండ్లి; నేడు సామాన్యము; పెద్ద వింత
కాదు, జరుపు చుండిరి వారె ఘనము గాను.
పిడుగు పడిననైన నెదను భీతి చెందరెంతయున్
రిప్లయితొలగించండిపిడుగు వంటి వార్తకేని విధిగ వచ్చెనంచహో
విడువరు మది ధైర్యమున్ వివేకవంతు లొప్పుగా
కడిదినేని కలిమినేని క్షమను వీడ రెన్నడున్
పిడుగు పాటు వార్త పెద్దన్న వినగను
రిప్లయితొలగించండిగుండె కొట్టు కొనెను గుప్పు గుప్పు
అనుచు వేగ ముగను నతని జూడ భయము
కలిగి మాకు మేను గగురు పొడిచె
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమంచి భావంతో పద్యం చెప్పారు. అభినందనలు.
‘నూ... పడెదవ్’...?
*
లక్ష్మీదేవి గారూ,
బాగుంది పద్యం. అభినందనలు..
ఇప్పటికైనా అది పిడిగుపాటు వంటి వార్తే.. నేను కళ్ళారా చూసాను అటువంటి సంఘటనలు.
*
పండిత నేమాని వారూ,
వివేకవంతుల లక్షణాలను చక్కగా వివరించారు. మంచి పద్యం. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
బడి నుంచి నింటి కేగెడు
రిప్లయితొలగించండిగుడి కేగిన తల్లి దండ్రి గూటికి చేరన్
నడి రోడ్డు పిడుగు పాటుకు
కడు భీతిని మనుజు లంత కలకల మొందన్ !
పదవి యూడి పోవ నెదపైన మంత్రికి
రిప్లయితొలగించండిపడును పిడుగుపాటు! పదవి నున్న
ముఖ్య మంత్రి కేమొ ముప్పగు నిత్యము
పడుట జేసి మీద పిడుగుపాట్లు!
ఆర్యా ! ధన్యవాదములు. నువు .. నూ గా మారింది. సవరణతో...
రిప్లయితొలగించండిఓరీ పిడుగా!నువు ప్రతి
సారీ కూలీల పైనె సరిగా పడెదవ్
ఘోరంబులు జేసెడి ఘన
చారిత్రుల మీద పడిన చరితార్ధుడవే !
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
*
మిస్సన్న గారూ,
బాగుంది మీ పద్యం. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
నీవును నువు అనడమూ దోషమే.. తిలధాన్యమైన ‘నువ్వు’కు నువు రూపాంతరం.
అలాగే ‘పడెదవ్’ అనేదీ దోషమే... అక్కడ ‘సరిగ పడెదవే’ అందాం..
మాస్టరు గారూ ! ధన్యవాదములు...దోష సవరణ చేయుచున్నాను...
రిప్లయితొలగించండిఓరీ పిడుగా!పడెదవె
ఈరీతిగ కూలివార లెటునిలబడినా
ఘోరంబులు జేసెడి ఘన
చారిత్రుల మీద పడిన చరితార్ధుడవే !