పండిత నేమాని వారూ, దినపత్రికల గురించి సవివరంగా చక్కని సీసపద్యాన్ని చెప్పారు. అభినందనలు. * లక్ష్మీదేవి గారూ, పెరిగిన సంఖ్య, తరిగిన విలువ.... చాలా బాగుంది మీ పద్యం.. అభినందనలు. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, సవరణానంతరం మీ పద్యం బాగుంది. అభినందనలు. * సుబ్బారావు గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. ‘పత్రికలను + అరయ’ అన్నప్పుడు సంధి నిత్యం. అక్కడ ‘పత్రికలనె యరయ’ అందాం.
దిన పత్రికలు గుమ్మమున దర్శనమునిచ్చి
రిప్లయితొలగించండి....పల్కు శుభోదయ వాక్యములను
స్థూలాక్షరములతో తొలిపుటలోననే
....ప్రకటించును ప్రధాన వార్తలెల్ల
ప్రాంతాలు, నగరాలు, రాష్ట్రాలు, దేశాలు
....బట్టి కూర్చి లిఖించు వార్తలెన్నొ
సామాజికాంశాలు, సాహిత్య రీతులు
....కళలు, క్రీడల వార్త లలరజేయు
రమ్యముగ గూర్చును వివిధ ప్రకటనలను
తక్కువగు వెల, విషయమ్ము లెక్కువగను
గలుగు దినపత్రికలు ప్రజావళికి మిగుల
శ్రేయములనిడి యభివృద్ధి జెందు గాక!
దినము వచ్చు ప్రతుల దేశదేశములందు
రిప్లయితొలగించండిదినము జరుగు సంగతి తెలుపు మన
కెల్లరకును నేటి కేడు పెరుగుచుండు
వీటి సంఖ్య- తరిగె విలువ నేడు.
దిన చర్య మొదలు వీనితొ
రిప్లయితొలగించండిదిన మంతయు జనుల చేత తిరుగుచు నండున్
దినమది గడిచిన పిమ్మట
తినుబండారముల గట్టు తీరుకు మారున్.
శ్రీ గోలి వారి పద్యము చిన్న సవరణలతో:
రిప్లయితొలగించండిదినచర్యకు మొదలగు నివి
దినమంతయు జనుల చేత తిరుగుచునుండున్
దినమది గడచిన పిమ్మట
తినుబండారముల గట్టు తీరును బొందున్
నా పూరణకు చక్కని సవరణచేసిన శ్రీ పండిత నేమాని వారికి ధన్యవాదములు.
రిప్లయితొలగించండిప్రతి దినంబును వచ్చు నీ పత్రికలను
రిప్లయితొలగించండిఅరయ దిన పత్రిక లనుచు నండ్రు జనులు
ప్రతి దినంబును నుదయాన పఠ న మిడిన
పూర్తి వార్తలు దెలియును భువిని జరుగు
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండిదినపత్రికల గురించి సవివరంగా చక్కని సీసపద్యాన్ని చెప్పారు. అభినందనలు.
*
లక్ష్మీదేవి గారూ,
పెరిగిన సంఖ్య, తరిగిన విలువ.... చాలా బాగుంది మీ పద్యం.. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
సవరణానంతరం మీ పద్యం బాగుంది. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘పత్రికలను + అరయ’ అన్నప్పుడు సంధి నిత్యం. అక్కడ ‘పత్రికలనె యరయ’ అందాం.
పుట్టు చుండును దినమొక్క పుట్ట గొడుగు
రిప్లయితొలగించండిమంచి చెడ్డల నెన్నెన్నొ మలిన మనక
కచ్చె దీరగ పగబూని రచ్చ కెక్కి
వింత విడ్డూరముల నెన్నొ వెక్క సముగ