తే.గీ:కలిపురుషు డిట్లు పల్కెను కలియు గమను కాల మొక టుండు,నపుడు నా పాలన మగు ధర్మపరులకు గష్టముల్ తప్ప వపుడు పుట్టెదను దుష్కృతుల నెల్లఁ బ్రోవఁ దలఁచి” (ఒక పురాణం లో కలి పురుషుడు తన లక్షణాలని తానే చెపుతాడు.ఆ పురాణం ఏదో గుర్తు రావటం లేదు.)
ఉ:గిట్టదు నాకు నిగ్రహము,గిట్టదు ధర్మము,కామ మన్న నా చుట్టమె,నే కలీశ్వరుడ చోద్యవిభిన్నపు సృష్టి లోన నే బుట్టితి నిట్లు, తిట్ట నను బోవునె నా దగు లక్షణమ్ము ? నే బుట్టుచునుందు దుష్కృతులఁ బ్రోవఁగ శిష్టుల సంహరింపఁగన్” ("నా లక్షణాలు ఇవి.సృష్టిలో వైరుధ్యాలు సహజం.నేను పుట్టటం ఇలా పుట్టాను.నన్ను తిడితే మాత్రం నా లక్షణాలు పోతాయా? సృష్టి విభిన్నత లో నే నొకణ్ని" అన్నాడు కలిపురుషుడు.)
పుణ్య మొనరించు వారిని బ్రోచుటకయి
రిప్లయితొలగించండిపుట్టెదను ; దుష్కృతుల నెల్లఁ బ్రోవఁ దలఁచి
పుట్టి నట్టి వారలనెల్ల పుడమి పయిన
మట్టు జేసెద , జనులిక మదము నొంద
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిద్వారపాలకుడైన విజయుడు విష్ణుమూర్తితో...
రిప్లయితొలగించండితేటగీతి
ఏడు జన్మలు మిమ్మెటు వీడగలము?
శాప పరిహారమన శౌరి! జయునితోడ
మూడుజన్మల వైరులై పొందమిమ్ము
పుట్టెదను దుష్కృతుల నెల్లఁ బ్రోవఁ దలఁచి!
ఉత్పలమాల
పెట్టిరి శాపమున్ మునులు వీడగ లేమయ! యేడుజన్మలన్
గిట్టుచు మూడుజన్మముల ఖేదమునైనను మిమ్ము జేరెడున్
గట్టియుపాయమై జయుడు నావెను వెంటను సాగ వైరినై
పుట్టుచునుందు దుష్కృతులఁ బ్రోవఁగ శిష్టుల సంహరింపఁగన్!
పుట్టినదాది సాధువుల బోరన హింసలుపెట్ట దుర్మతుల్
రిప్లయితొలగించండితట్టములెల్ల బాపుటకు తద్దయు సాధు జనావ నార్థమై
నెట్టన నెన్నిమార్లయిన నిశ్చయ చిత్తముతోడ భూమిపై
పుట్టుచునుందు దుష్కృతులఁ, బ్రోవఁగ శిష్టుల, సంహరింపఁగన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసత్యపథమున పయనించు సాధువైన
రిప్లయితొలగించండిదుష్కృతమ్ముల సలిపెడు దుష్టుడైన
నిర్వురొక్కటిగా జూతు నెన్నడైన
పుట్టెదను దుష్కృతుల నెల్లఁ బ్రోవఁ దలఁచి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండికలియుగ మదియేతెంచెడి కాలమదియె
నాటకమొకటి వేయగా నట్టువాడు
కలి పురుష వేష ధారియె పలికె నిటుల
పుట్టెదను దుష్కృతుల నెల్లఁ బ్రోవఁ దలఁచి.
నట్టువలెందరో కలిసి నాటక మొక్కటి వేయనందులో
తొట్టరి వానిమాటలుగ దుష్టుడొకండు వచించె నిట్టులన్
జట్టము నాకు చుట్టమని సత్యమసత్యమటంచు నెంచకన్
పుట్టుచునుందు దుష్కృతులఁ బ్రోవఁగ శిష్టుల సంహరింపఁగన్.
భగవంతుడు తెల్పుట
రిప్లయితొలగించండికట్టుబాట్లను మీరుచుఁ గాని పనుల
దురిత కార్యములను జేయ దునుమ నెంచి
పుట్టెదను దుష్కృతుల నెల్లఁ, బ్రోవఁ దలచి
సత్యసంధుల సన్మార్గ సత్వ గుణుల
ఉ॥ చుట్టము గాదు నేను నిజ సూక్ష్మముఁ దెల్పఁగ సత్యసంధులన్
గట్టుకు చేర్చి కాచెదను గాదిలి మీరఁగ భక్తి డంబమై
గుట్టుగఁ జేయఁ బాపములఁ గూరిమిఁ బొందకఁ బల్కిరీవిధిన్
బుట్టుచునుందు దుష్కృతులఁ బ్రోవఁగ శిష్టుల సంహరించఁగన్
ఎట్టుల భరింప గలను మరెట్టుల సమ
రిప్లయితొలగించండియమ్ము గడుప సాధ్యంబగు మిమ్మువీడి
శాపవశమున రాక్షస జన్మమొంది
పుట్టెదను దుష్కృతుల నెల్లఁ బ్రోవఁ దలఁచి
ఎట్టులతిక్రమింతునొ మరెట్టుల శాపము సైపకుందునో
రట్టడితో మహా భయకరమ్మగు రీతిన బ్రహ్మ పుత్రులే
వెట్టిన శాపమే మిగుల వేదన కూర్చగ రాక్షసుండనై
పుట్టుచునుందు దుష్కృతులఁ బ్రోవఁగ శిష్టుల సంహరింపఁగన్
మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిదాల్తు నవ తార ముల నేను ధ రణి యందు
రిప్లయితొలగించండిధర్మ మడుగo ట దునుమగా దానవు లను
బుట్టె దను దుష్కృ తుల నెల్ల :: బ్రోవ దలచి
సజ్జ నాళి కి యండగా సత్వ రముగ
నాలుగవ పాదంలో యండయై సహకరింతు అని సవరణ చేయడమైనది
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితే.గీ:కలిపురుషు డిట్లు పల్కెను కలియు గమను
రిప్లయితొలగించండికాల మొక టుండు,నపుడు నా పాలన మగు
ధర్మపరులకు గష్టముల్ తప్ప వపుడు
పుట్టెదను దుష్కృతుల నెల్లఁ బ్రోవఁ దలఁచి”
(ఒక పురాణం లో కలి పురుషుడు తన లక్షణాలని తానే చెపుతాడు.ఆ పురాణం ఏదో గుర్తు రావటం లేదు.)
ఉ:గిట్టదు నాకు నిగ్రహము,గిట్టదు ధర్మము,కామ మన్న నా
రిప్లయితొలగించండిచుట్టమె,నే కలీశ్వరుడ చోద్యవిభిన్నపు సృష్టి లోన నే
బుట్టితి నిట్లు, తిట్ట నను బోవునె నా దగు లక్షణమ్ము ? నే
బుట్టుచునుందు దుష్కృతులఁ బ్రోవఁగ శిష్టుల సంహరింపఁగన్”
("నా లక్షణాలు ఇవి.సృష్టిలో వైరుధ్యాలు సహజం.నేను పుట్టటం ఇలా పుట్టాను.నన్ను తిడితే మాత్రం నా లక్షణాలు పోతాయా? సృష్టి విభిన్నత లో నే నొకణ్ని" అన్నాడు కలిపురుషుడు.)
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
మాధవుడు వచించె నిటుల మట్టుపెట్ట
పుట్టెదను దుష్కృతుల నెల్లఁ; బ్రోవ దలచి
మంచి మార్గమందు నడచు మానవులను
ప్రతి యుగాన వివిధ నవతారముల నెత్తి.
హాని కలుగ ధర్మమునకు నవని లోన
రిప్లయితొలగించండియుగ యుగమ్ముల ధర్మము నునుచుటకును
గాక శిష్టావనమునకుఁ గాక యేల
పుట్టెదను దుష్కృతుల నెల్లఁ బ్రోవఁ దలఁచి
దిట్టతనంపుఁ బొంగున నతిక్రమణంబొనరింప సంయముల్
వెట్టిన శాప మెవ్వరిని వీడదు తాఁకక యుగ్ర భంగి ము
ప్పుట్టువులన్ జయా! విజయుఁ బోలెను విష్ణు నిబద్ధ వైరివై
పుట్టుచు నుందు దుష్కృతులఁ బ్రోవఁగ శిష్టుల సంహరింపఁగన్
[పుట్టుచు నుందు = పుట్టుచు నుందువు]