26, ఏప్రిల్ 2025, శనివారం

సమస్య - 5105

27-4-2025 (ఆదివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“జగణమది రాయలకు సమస్యలను దెచ్చె”

(లేదా...)

“జగణము కృష్ణరాయలకుఁ జాల సమస్యలు దెచ్చె సత్కవీ”

(మొన్నటి పట్వర్ధన్ గారి శతావధానంలో ధనికొండ రవిప్రసాద్ గారి సమస్య)

17 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. తే॥ పంటలెండగ పర్యాప్త వర్షపాత
      మచట పడక సతమతమై యలసి పోయి
      నీటి నిలువఁ గోరి యడుగ నిరతము మను
      జ గణమది రాయలకు సయస్యలను దెచ్చె

      చం॥ భగభగ మండు నెండలట పంటలుఁ పండక పోవు వర్షముల్
      మొగమును జాటు చేయు కడు పోరును జేసిన నీటి యెద్దడే
      వగపులఁ గూర్చు కాటకమె బాధలఁ దీర్చఁగఁ గోరి రైతు రా
      జ గణము కృష్ణరాయలకుఁ జాల సమస్యలు దెచ్చె సత్కవీ

      హంపి వద్ద తుంగభద్ర నది యున్నా core విజయనగర సామ్రాజ్యములో భయంకరమైన నీటి యెద్దడి అండి. విజయనగర రాజులు ఈసమస్యకు కొంతవరకు పరిహారంగా అంతంత మాత్రంగా పడే వాన నీరు వృథాకాకుండా ప్రతి నీటి బొట్టు ఇంకకుంటే ఏదో ఒక చెరువుకు చేరేట్టుగా ఒక చెరువు నిండితే నీరు మరొక చెరువుకు చేరేట్టుగా చెరువులు నిర్మించారండి

      తొలగించండి
  2. భువన విజయ మందెప్పుడు భూరిగాను
    సాహితీ చర్చలు విరివి జరుపు చుండ
    అద్భుత మగు రీతిని యట యష్ట దిగ్గ
    జ గణమది రాయలకు సమస్యలను దెచ్చె.


    జగతియె మెచ్చునట్టి కవి సాహితి కారుడు పోషకుండు తా
    మగటిమ జూపి దూర్జనుల మాఱు దుసానుడతండు కావునన్
    నెగులును పెంచుకొంచు నవనీపతి నాశము గోరు శత్రు రా
    జ గణము కృష్ణ రాయలకు జాల సమస్యలు దెచ్చె సత్కవీ.

    రిప్లయితొలగించండి
  3. భువన విజయమ నెడి పేరు పొంది నదగు
    చదురున ' తెనాలి ' కవి తన చదురు తోడ
    పెరిమెగ‌ కలతనిడగ నా పేరునగల
    జగణమది రాయలకు సమస్యలను దెచ్చె

    "తెనాలి" జగణము

    రిప్లయితొలగించండి
  4. శౌర్యుడు సుగుణుడు సుకవి చక్రవర్తి
    చరిత నాంధ్ర భోజుడనుచు సన్నుతింత్రు
    పలు రకంబుల సైన్యము నెలకొనన్ గ
    జ గణమది రాయలకు సమస్యలను దెచ్చె

    అగణిత శక్తిమంతుడగు నద్భుత పండితుడాంధ్ర భోజుడే
    పొగడుచు నుంద్రు సత్కవులు పోడిమికల్గిన చక్రవర్తిగా
    ద్విగుణిత మైన శత్రువులు తిప్పలువెట్టగ పొంచిచూచు రా
    జ గణము కృష్ణరాయలకుఁ జాల సమస్యలు దెచ్చె సత్కవీ

    రిప్లయితొలగించండి
  5. తెలుగు భాషను బ్రేమించె దివ్య తముడు
    కవిగ కవులను బోషించె కాంక్ష దీ ర
    నతని యాస్థాన మందున నష్ట దిగ్గ
    జ గణ మది రాయలకు సమస్య లను దె చ్చె

    రిప్లయితొలగించండి
  6. నా సమస్యకు నా పూరణలు
    (1)తే.గీ:కదన కవనమ్ములను రెంట కదనుద్రొక్కు
    రాయలకు సమస్యల శత్రు రాజు లిడగ
    కవనమున సేద దీర్చగ కవన దిగ్గ
    జగణమది రాయలకు సమస్యలను దెచ్చె”
    (శత్రుత్వం తో శత్రురాజులు సమస్య లిస్తే అభిమానం తో అష్టదిగ్గజ కవులు సమస్య లిచ్చారు.)
    (2)చం;నగవుల జిందు చుండు క్షితి నాథుడు వాజ్ఞ్మయసృష్టి జేసెడిన్
    పగ గొని బహ్మనీ నృపులు పల్మరు యుద్ధము దేగ వారి వం
    తుగ నని గోరుచున్ గజపతుల్ పడి వత్తురు కాదె!శత్రు రా
    జగణము కృష్ణరాయలకుఁ జాల సమస్యలు దెచ్చె సత్కవీ”
    (శ్రీ కృష్ణ దేవ రాయలకు బహ్మనీ సుల్తానులు, గజపతులు శత్రువులు.)

    రిప్లయితొలగించండి
  7. రెండు లఘువుల నడుమన నుండగురువు
    వీలు గాకుండె నటుగాక వెరవు గాదు
    పద్యమును వ్రాయు సమయాన సాధ్యపడక
    జగణమది రాయలకు సమస్యలను దెచ్చె

    రిప్లయితొలగించండి
  8. అగణిత ధీయుతుండుగను యద్భుతమౌ కవిసత్తముండగా
    జగమున వాసికెక్కితన చల్లని పాలనలో జనాళి సౌ
    భగమును గూర్చి యెల్లరకు భద్రతనేర్పడజేయ శత్రురా
    జగణము కృష్ణరాయలకుఁ జాల సమస్యలు దెచ్చె సత్కవీ

    రిప్లయితొలగించండి


  9. సభయు జరుగుచు నుండగ సభ్యు లెల్ల
    కవులు వాసిగా ప్రతిభను కనపరచుచు
    నందరిమనములలరించ నష్టదిగ్గ
    జ గణమది రాయలకు సమస్యలను దెచ్చె


    తగినవిధమ్ముగానచటధారుణినేలుచునాక్షితీంద్రుడున్
    నగణితశౌర్యశాలిగనునద్భుతపాటవమెల్లవారికిన్
    మగటిమితోడచూపుచునుమన్నన నందుచునుండ,శత్రురా
    జగణముకృష్ణరాయలకుజాలసమస్యలు దెచ్చెసత్కవీ


    రిప్లయితొలగించండి
  10. సంతత మహింసఁ దమ మానసమ్ము లందు
    నుంచు జను లున్న యట్టి సముచిత భార
    తావని నకట దూర దేశాంత సింధు
    జ గణ మది రాయలకు సమస్యలను దెచ్చె


    అగణిత ధైర్య విక్రముఁ డహర్నిశ ముండును జాగరూకతన్
    సగణము రామకృష్ణ కవి సత్తమ వింటివె కృష్ణ దేవ రా
    డ్జగ దపహార కార్య రత చండ తురుష్క సమేత వైరి రా
    జ గణము కృష్ణరాయలకుఁ జాల సమస్యలు దెచ్చె సత్కవీ

    రిప్లయితొలగించండి
  11. సమస్య:
    జగణము కృష్ణ రాయలకుఁ జాల సమస్యలు దెచ్చె సత్కవీ!

    చంపకమాల:

    తెగువున చెప్పె దేశమున తేట తెలుంగుయె లెస్స భాషయన్
    మిగులుగ ప్రీతియంచు దను మిక్కిలి వ్రాసెను తెల్గు కావ్యముల్
    సగటున సాహితీ పటిమ సంపద యష్టపు కూట సత్కవుల్
    మగటిమి జూచి సాటిజన మాతృక కన్నడ నెయ్యమౌ సమా
    జగణము కృష్ణ రాయలకుఁ జాల సమస్యలు దెచ్చె సత్కవీ!

    రిప్లయితొలగించండి
  12. తేటగీతి
    ధర్మపత్నులిద్దరు లోకతతులు దెలియ
    వారలు విలాస పురుషులన్ వాసిగలదు
    సంజవేళకు వేచెడు సాని పంక
    జ గణమది రాయలకు సమస్యలను దెచ్చె!

    చంపకమాల
    అగణితశౌర్య తేజముల నందరుమెచ్చఁగ, భార్యలిద్దరై
    సొగసుల పంచువారలని సూటిగ దెల్ప, విలాసవంతులై
    వగలను దోచనెంచగ, విభావరులుండగ వేచి చూచి సం
    జ, గణము కృష్ణరాయలకుఁ జాల సమస్యలు దెచ్చె సత్కవీ!

    రిప్లయితొలగించండి
  13. రాయలను వాడు, పద్యము రాయ బూని,
    యాది లో తేటగీతి యు , యాట వెలది
    రాయు నపుడు ,జగణ మొచ్చె, రచన యందు
    జగణ మది రాయలకు సమస్యలను దెచ్చె”


    సురేష్ కుమార్ రామోజు

    రిప్లయితొలగించండి

  14. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    వర్షపాతము తక్కువై పంటలకును
    పైరు లెండగ తగు నీటి వసతి కలుగ
    జేయమనుచు రాజ సభకు చేరిన మను
    జ గణమది రాయలకు సమస్యలను దెచ్చె.

    రిప్లయితొలగించండి