30-4-2025 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కూసెఁ గావు కావని యొక్క కోకిలమ్మ”
(లేదా...)
“కోకిలమ్మయె కావుకావని గొంతు విప్పె నుగాదికిన్”
(మొన్నటి పట్వర్ధన్ గారి శతావధానంలో మాచవోలు శ్రీధర రావు గారి సమస్య)
తేటగీతిసంప్రదాయము తప్పక స్వరములూదికూయబోయి కొమ్మఁ గనక గోపురమునవ్రాలి దిక్కు తోచకయె దైవమ్మునెంచికూసెఁ గావు కావని యొక్క కోకిలమ్మ!
మత్తకోకిలవీక సృష్టిని గాంచినంతట వేడ్కఁజేసెడునెన్నియో!ప్రాకటమ్మన రూపుదాల్చుట వాయసమ్ముల గూటిలోనీకు భారమ కాకమా! యని నించిగుడ్లను పల్కగన్కోకిలమ్మయె, కావుకావని గొంతు విప్పె నుగాదికిన్!
కాకి కట్టిన గూడును కదుము కొనుచు ఎవ్వరును దన పన్నిక నెరుగ లేని విధము నాలోచన సలిపి వింత రీతి గూసెఁ గావు కావని యొక్క కోకిలమ్మ
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
గూటి లోపలి కోయిల గొంతు విప్పిసాటి కోయిల మాదిరి పాటపాడుకోకిలనుదెచ్చి కాకుల గుంపు నుంచకూసెఁ గావు కావని యొక్క కోకిలమ్మచాకచక్యము చూపు కోకిల చక్కగా తనగొంతుతోమ్రాకు మీదను సాటి కోయిల మాద్రి కూయుచునుండురాకోకిలమ్మను దెచ్చికాకుల గుంపులోపల నుంచగాకోకిలమ్మయె కావుకావని గొంతు విప్పె నుగాదికిన్
తరుల ఖండనమొనరింప దయనుమాలిమావి చివురులు గనరాక మధనపడుచుచైత్ర మాసాన వనములో చిత్రముగనుకూసెఁ గావు కావని యొక్క కోకిలమ్మ
కాకి కోకిల లాది పక్షులు గానజాలక భూజముల్శోకమందున తల్లడిల్లుచు శోషిలెన్ గతికానకన్వీఁకఁ నామ్ర ద్రుమంబు గానక వేదనమ్మునుబొందుచున్కోకిలమ్మయె కావుకావని గొంతు విప్పె నుగాదికిన్
తే॥ యవ్వనమ్మిలను స్థిరమా యరయఁ గానుసంపదాదాలు స్థిరములా యింపుగానుబ్రదుకు స్థిరమగునొ యెరుగఁ బరితపించఁ గూసెఁ గావు కావని యొక్క కోకిలమ్మమత్త॥ లోకమందున మోసపూరత రోచనమ్మునఁ గాంచినన్బ్రాకటమ్ముగ సంపదాదులు భవ్యరీతిని భాగ్యమున్సేకరించిన శాశ్వితమ్ముల చెప్పవో యని కోరఁగన్గోగిలమ్మయె కావు కావని గొంతు విప్పె నుగాదికిన్జంధ్యాల పాపయ్య గారి స్థిరములు కావు కావు స్ఫూర్తితో కాకి కాక కోకిల తెలుపుట
తల్లి కాకియె లేనట్టి తరుణమందుచెట్టు కొమ్మపై తిరుగుచు జిహ్మగమదిప్రాకుచు తమవైపును జేర వచ్చుట గనికూసెఁ గావు కావని యొక్క కోకిలమ్మ.భీకరమ్మగు కానలమ్మది వృక్షమందున గూటిలో కాకియొక్కటి సాబలమ్ముల గల్గిజీవన ముండగన్ బేకబుక్కటువచ్చుచుండగ భీతిజెందుచు పెద్దగాకోకిలమ్మయె కావుకావని గొంతు విప్పె నుగాదికిన్.
కాకియేర్పరచంగ నందున కాపురంబును జేయుచున్ ,ఆకతాయులకా కులాయమునందు కోరిక నేర్వకన్ఆకళించినకూడ దగ్గరకంటకుండని రీతిగన్కోకిలమ్మయె కావుకావని గొంతు విప్పె నుగాదికిన్
తే.గీ:గాన కోకిలనే తాలి బాను మూర్ఖముష్కరుల్ పట్టి వధియింప బూని నంతదలచి యాల్లానె రక్షించు దన నటంచుకూసెఁ "గావు కా"వని యొక్క కోకిలమ్మ(తాలిబాన్ పరిపాలన వచ్చిన కాలం లో కళాకారులని కూడా చంపారు.ఒక గొప్ప గాయకుణ్ని చంపారు.)
మ.కో::కోకిలమ్మలు మాయమౌ ,మనకున్ లభించక దూరమౌకాకు"లంచు నిరాశ జెందుచు ,కష్టమే ధర కంచు దుర్వ్యాకులమ్మును జూపి యెల్లరు పద్యముల్ బఠియింపగాకోకిలమ్మయె కావుకావని గొంతు విప్పె నుగాదికిన్”(ఇక కోకిలలు మాయ మౌతాయి,కాకులు దూర మౌతాయి అని పద్యాలు చదువుతుంటే ఇలా కావు,కావు అని సూచిస్తూ ఒక కోకిల కూత వినిపించింది.)
శీత లంబున పిక ము కు చిన్న బోయి గొంతు పెగలక యత్నింప కూత రాక కూసె కావు కావని యొ క్క కోకిల మ్మ వింత యని నవ్వి రె ల్లరు విస్తు పోయి
(3)మ.కో;కోకిలమ్మన సుబ్బలక్ష్మియె కోరి త్యాగయ కీర్తనన్స్వీకరించెను "కావవే!"యని వేడి యంబను కమ్మనౌకాకలీ ధ్వని నెన్నియో గమకమ్ములన్ వెలయించుచున్కోకిలమ్మయె కావుకావని గొంతు విప్పె నుగాదికిన్”(త్యాగరాయకీర్తనలలో కావవే కమల లోచనీ అనే కీర్తన ఉన్నది.దానిని గానకోకిల సుబ్బ లక్ష్మి "కావు,కావు అని గమకాల తో పాడింది.)
మత్తకోకిల.ప్రాకులాడగఁ జెట్టుచేమల, లాభమేమియు లేక యేకాకియై తన మిత్రబృందపు కైపుఁగాంచక రొప్పుచున్,గాకులందునఁ జేరినిల్వగ గట్టి యత్నము చేయుచున్*గోకిలమ్మయె కావుకావని గొంతు విప్పె నుగాదికిన్*
గూఁటి నిచ్చితి కాకమ కూర్మి మీఱ నింత కాలము కరుణఁ జూపింప నీవుపెరిగితిఁ దఱుమకుమ కనికరము వీడి కూసెఁ గావు కా వని యొక్క కోకిలమ్మ [కా = అని; వని యొక్క కోకిలమ్మ = అడవి కోకిలమ్మ] కోకిలాభము గాత్ర మెంచఁగఁ గోకిలమ్మయె నామముం బ్రాకటమ్ముగఁ బద్మనేత్రకుఁ బాటలన్నను మక్కువే సాకుచుండి సతమ్ము మమ్ము వసంతమా యని యార్తితోఁ గోకిలమ్మయె కావు కా వని గొంతు విప్పె నుగాదికిన్ [కా = అని; వని(న్) = ఉద్యాన వనములో]
కాకి గూటి యందు నెదిగి కాన లేకకన్నతల్లిని మదిని తా కలత నొందిచేరి గుడిగోపురమ్మును చిత్త మలర*కూసెఁ గావు కావని యొక్క కోకిలమ్మ”* భీకరమ్ముగ వైరిసేనలు పేల్చగాను తుపాకులన్కాకనొందుచుకొన్నపక్షులుకాలినంతనెభీతితోకాకిగూటనుదాగియున్నను కంఠమెత్తుచు వేగమే కోకిలమ్మయె కావు కావని గొంతు విప్పి నుగాదికిన్
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.ఓగిరమ్మును గాంచిన నొక్క కాకిమిగత వాయసమ్ముల పిల్వ మిన్నగానుకూసెఁ గావు కావని; యొక్క కోకిలమ్మ కమ్మగా పాడె తరు పల్లవమ్ముల దిని.
తేటగీతి
రిప్లయితొలగించండిసంప్రదాయము తప్పక స్వరములూది
కూయబోయి కొమ్మఁ గనక గోపురమున
వ్రాలి దిక్కు తోచకయె దైవమ్మునెంచి
కూసెఁ గావు కావని యొక్క కోకిలమ్మ!
మత్తకోకిల
తొలగించండివీక సృష్టిని గాంచినంతట వేడ్కఁజేసెడునెన్నియో!
ప్రాకటమ్మన రూపుదాల్చుట వాయసమ్ముల గూటిలో
నీకు భారమ కాకమా! యని నించిగుడ్లను పల్కగన్
కోకిలమ్మయె, కావుకావని గొంతు విప్పె నుగాదికిన్!
కాకి కట్టిన గూడును కదుము కొనుచు
రిప్లయితొలగించండిఎవ్వరును దన పన్నిక నెరుగ లేని
విధము నాలోచన సలిపి వింత రీతి
గూసెఁ గావు కావని యొక్క కోకిలమ్మ
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిగూటి లోపలి కోయిల గొంతు విప్పి
తొలగించండిసాటి కోయిల మాదిరి పాటపాడు
కోకిలనుదెచ్చి కాకుల గుంపు నుంచ
కూసెఁ గావు కావని యొక్క కోకిలమ్మ
చాకచక్యము చూపు కోకిల చక్కగా తనగొంతుతో
మ్రాకు మీదను సాటి కోయిల మాద్రి కూయుచునుండురా
కోకిలమ్మను దెచ్చికాకుల గుంపులోపల నుంచగా
కోకిలమ్మయె కావుకావని గొంతు విప్పె నుగాదికిన్
తరుల ఖండనమొనరింప దయనుమాలి
రిప్లయితొలగించండిమావి చివురులు గనరాక మధనపడుచు
చైత్ర మాసాన వనములో చిత్రముగను
కూసెఁ గావు కావని యొక్క కోకిలమ్మ
కాకి కోకిల లాది పక్షులు గానజాలక భూజముల్
రిప్లయితొలగించండిశోకమందున తల్లడిల్లుచు శోషిలెన్ గతికానకన్
వీఁకఁ నామ్ర ద్రుమంబు గానక వేదనమ్మునుబొందుచున్
కోకిలమ్మయె కావుకావని గొంతు విప్పె నుగాదికిన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితే॥ యవ్వనమ్మిలను స్థిరమా యరయఁ గాను
తొలగించండిసంపదాదాలు స్థిరములా యింపుగాను
బ్రదుకు స్థిరమగునొ యెరుగఁ బరితపించఁ
గూసెఁ గావు కావని యొక్క కోకిలమ్మ
మత్త॥ లోకమందున మోసపూరత రోచనమ్మునఁ గాంచినన్
బ్రాకటమ్ముగ సంపదాదులు భవ్యరీతిని భాగ్యమున్
సేకరించిన శాశ్వితమ్ముల చెప్పవో యని కోరఁగన్
గోగిలమ్మయె కావు కావని గొంతు విప్పె నుగాదికిన్
జంధ్యాల పాపయ్య గారి స్థిరములు కావు కావు స్ఫూర్తితో కాకి కాక కోకిల తెలుపుట
రిప్లయితొలగించండితల్లి కాకియె లేనట్టి తరుణమందు
చెట్టు కొమ్మపై తిరుగుచు జిహ్మగమది
ప్రాకుచు తమవైపును జేర వచ్చుట గని
కూసెఁ గావు కావని యొక్క కోకిలమ్మ.
భీకరమ్మగు కానలమ్మది వృక్షమందున గూటిలో
కాకియొక్కటి సాబలమ్ముల గల్గిజీవన ముండగన్
బేకబుక్కటువచ్చుచుండగ భీతిజెందుచు పెద్దగా
కోకిలమ్మయె కావుకావని గొంతు విప్పె నుగాదికిన్.
కాకియేర్పరచంగ నందున కాపురంబును జేయుచున్ ,
రిప్లయితొలగించండిఆకతాయులకా కులాయమునందు కోరిక నేర్వకన్
ఆకళించినకూడ దగ్గరకంటకుండని రీతిగన్
కోకిలమ్మయె కావుకావని గొంతు విప్పె నుగాదికిన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితే.గీ:గాన కోకిలనే తాలి బాను మూర్ఖ
రిప్లయితొలగించండిముష్కరుల్ పట్టి వధియింప బూని నంత
దలచి యాల్లానె రక్షించు దన నటంచు
కూసెఁ "గావు కా"వని యొక్క కోకిలమ్మ
(తాలిబాన్ పరిపాలన వచ్చిన కాలం లో కళాకారులని కూడా చంపారు.ఒక గొప్ప గాయకుణ్ని చంపారు.)
మ.కో::కోకిలమ్మలు మాయమౌ ,మనకున్ లభించక దూరమౌ
రిప్లయితొలగించండికాకు"లంచు నిరాశ జెందుచు ,కష్టమే ధర కంచు దు
ర్వ్యాకులమ్మును జూపి యెల్లరు పద్యముల్ బఠియింపగా
కోకిలమ్మయె కావుకావని గొంతు విప్పె నుగాదికిన్”
(ఇక కోకిలలు మాయ మౌతాయి,కాకులు దూర మౌతాయి అని పద్యాలు చదువుతుంటే ఇలా కావు,కావు అని సూచిస్తూ ఒక కోకిల కూత వినిపించింది.)
శీత లంబున పిక ము కు చిన్న బోయి
రిప్లయితొలగించండిగొంతు పెగలక యత్నింప కూత రాక
కూసె కావు కావని యొ క్క కోకిల మ్మ
వింత యని నవ్వి రె ల్లరు విస్తు పోయి
(3)మ.కో;
రిప్లయితొలగించండికోకిలమ్మన సుబ్బలక్ష్మియె కోరి త్యాగయ కీర్తనన్
స్వీకరించెను "కావవే!"యని వేడి యంబను కమ్మనౌ
కాకలీ ధ్వని నెన్నియో గమకమ్ములన్ వెలయించుచున్
కోకిలమ్మయె కావుకావని గొంతు విప్పె నుగాదికిన్”
(త్యాగరాయకీర్తనలలో కావవే కమల లోచనీ అనే కీర్తన ఉన్నది.దానిని గానకోకిల సుబ్బ లక్ష్మి "కావు,కావు అని గమకాల తో పాడింది.)
మత్తకోకిల.
రిప్లయితొలగించండిప్రాకులాడగఁ జెట్టుచేమల, లాభమేమియు లేక యే
కాకియై తన మిత్రబృందపు కైపుఁగాంచక రొప్పుచున్,
గాకులందునఁ జేరినిల్వగ గట్టి యత్నము చేయుచున్
*గోకిలమ్మయె కావుకావని గొంతు విప్పె నుగాదికిన్*
గూఁటి నిచ్చితి కాకమ కూర్మి మీఱ
రిప్లయితొలగించండినింత కాలము కరుణఁ జూపింప నీవు
పెరిగితిఁ దఱుమకుమ కనికరము వీడి
కూసెఁ గావు కా వని యొక్క కోకిలమ్మ
[కా = అని; వని యొక్క కోకిలమ్మ = అడవి కోకిలమ్మ]
కోకిలాభము గాత్ర మెంచఁగఁ గోకిలమ్మయె నామముం
బ్రాకటమ్ముగఁ బద్మనేత్రకుఁ బాటలన్నను మక్కువే
సాకుచుండి సతమ్ము మమ్ము వసంతమా యని యార్తితోఁ
గోకిలమ్మయె కావు కా వని గొంతు విప్పె నుగాదికిన్
[కా = అని; వని(న్) = ఉద్యాన వనములో]
కాకి గూటి యందు నెదిగి కాన లేక
రిప్లయితొలగించండికన్నతల్లిని మదిని తా కలత నొంది
చేరి గుడిగోపురమ్మును చిత్త మలర
*కూసెఁ గావు కావని యొక్క కోకిలమ్మ”*
భీకరమ్ముగ వైరిసేనలు పేల్చగాను తుపాకులన్
కాకనొందుచుకొన్నపక్షులుకాలినంతనెభీతితో
కాకిగూటనుదాగియున్నను కంఠమెత్తుచు వేగమే
కోకిలమ్మయె కావు కావని గొంతు విప్పి నుగాదికిన్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
ఓగిరమ్మును గాంచిన నొక్క కాకి
మిగత వాయసమ్ముల పిల్వ మిన్నగాను
కూసెఁ గావు కావని; యొక్క కోకిలమ్మ
కమ్మగా పాడె తరు పల్లవమ్ముల దిని.