27, ఏప్రిల్ 2025, ఆదివారం

సమస్య - 5106

28-4-2025 (సోమవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“పుంజుకొనఁ గోడి వోయెను పోరు మాని”

(లేదా...)

“పుంజుకొనంగఁ జూచిరని పోరక వారల కోడి పోయెనే”

(మొన్నటి పట్వర్ధన్ గారి శతావధానంలో నలవోలు నరసింహ రెడ్డి గారి సమస్య)

16 కామెంట్‌లు:

  1. తేటగీతి
    జూదమాడు శకుని ధర్మజుండు గాంచి
    పందెమొడ్డుచు నోడుచు పంతమూని
    పాచికల మాయ నెఱుగక వైరి యాటఁ
    బుంజుకొనఁ గోడి వోయెను పోరు మాని!

    ఉత్పలమాల
    కుంజరమట్లు ధర్మజుఁడు గోరిన తక్షణమొప్పిజూదమున్
    రంజిల కౌతుకమ్మునను రాశుల విత్తము నొడ్డియోడుచున్
    భంజనవీడి సోదరుల, పత్నిని సైతము నొడ్డి వైరి తా
    పుంజుకొనంగఁ జూచిరని పోరక వారల కోడి పోయెనే!

    రిప్లయితొలగించండి
  2. భారతీయుల నణచగ బలుపు పలికి
    పాకుసేన మన పొనుపు పరిగణించి 
    సమర మందు డిల్లపడగ , శక్తినింక
    పుంజుకొనఁ గోడి వోయెను పోరు మాని

    రిప్లయితొలగించండి

  3. జీడి పప్పులు మేపిన కోడి యదియె
    నిలిచి పోరాడి తప్పక గెలుచు ననుచు
    వాచియించిన నేమిరా పరుల పుంజు
    పుంజుకొనఁ, గోడి వోయెను పోరు మాని.


    బంజరు చేరిరెల్లలును పర్వదినమ్మని సంబరమ్ము తో
    పుంజును వెంటబెట్టుకుని, పూర్వము నందున జీడి పప్పుతో
    ముంజల పేర్మి పెట్టుకుని బొద్దుగ పెంచిన లావు పుంజటన్
    పుంజుకొనంగఁ జూచి, రని పోరక వారల కోడి పోయెనే.

    రిప్లయితొలగించండి
  4. తే॥పుంజుకొనఁ గోడి వోయను పోరు మాని
    మీకు సాటినిఁ గనమయ మేటి శక్తి
    ముందు నిలువఁగలమ వేడి కొందుము మిము
    మమ్ము గావుమని యడుగ సమ్మతించి

    ఉ॥ రంజిత మొంది నేర్వఁగను రమ్యతఁ గాంచుచు రాగమాలికల్
    పుంజుకొనంగ జూచిరని పోరక వారల కోడి పోయెనే
    సంజయ శక్తి మీది గద సాధ్యమ మాకును మిమ్ము గెల్వఁగన్
    రంజిల మేము మీరిపుడు రక్షణఁ జేసిన నంచు వేడఁగన్

    ఈసమస్య కొంత తికమకగా ఉందండి పుంజుకొన్న వారు పోరు మానాలి! అర్థించినందుకు అని వ్రాసాను నాకు తోచినంతకు.

    సంజయ బాగా జయించువాడు (నిఘంటువు సహాయమండి)

    రిప్లయితొలగించండి
  5. చక్కనిదగు కుక్కుటమును టక్కునగొని
    కోడి పందాల కేతెంచినాడు నల్ల
    రంగు నలరెడు వైరి వర్గంపు కోడి
    పుంజుకొనఁ గోడి వోయెను పోరు మాని

    రంజనతోడ గాంచి కడు రమ్యత గూర్చెడు కోళ్ళమందలో
    పుంజును దెచ్చిపెంచిరట పోరుకు సిద్ధము సేయనెంచుచున్
    గుంజకుఁ గట్టియున్నఁ బెను కూతలువెట్టెడు కుక్కుటంబటన్
    బుంజుకొనంగఁ జూచిరని పోరక వారల కోడి పోయెనే

    రిప్లయితొలగించండి
  6. పంజరమందు చిక్కినటు ప్రాణములన్నియు చేతబట్టరే
    మంజుల వృత్తులై సురలు, మత్సరమొంది తపంబుజేయగా
    కంజుడు మెచ్చి యిచ్చు వర గర్వముతో బలమొంది రాక్షసుల్
    పుంజుకొనంగఁ జూచిరని పోరక వారల కోడి పోయెనే!!

    రిప్లయితొలగించండి
  7. రంజుగ కోడిపందెములు రక్తిగ సాగుచునుండె పల్లెలో
    పుంజును పుంజు ఢీకొనుచు పోరునుసల్పుచు రెచ్చిలంగనా
    రంజన భంజకమ్మవగ రట్టొనరించుచు వైరి వర్గమే
    పుంజుకొనంగఁ జూచిరని పోరక వారల కోడి పోయెనే

    రిప్లయితొలగించండి
  8. ఉత్పలమాల:

    పంజరమందు పక్షులన పాండవ సూనుల జాడ తెల్లమన్
    రంజన చెడ్డ కౌరవులు రండని గోగ్రహణంబు రక్షణన్
    శింజిని గట్టు నర్జునుడు శీఘ్రము నుత్తర సారథై జనే
    సంజ సమాప్తినిన్ తమకు సాధ్యము కాదని వారలే యనిన్
    పుంజుకొనంగఁ జూచి,రని పోరక, వారల, కోడి పోయెనే.‌
    (మంజుల రూపి యుత్తరకు మంచివి యెంచిరి బొమ్మపుత్తముల్)

    రిప్లయితొలగించండి
  9. తే.గీ:పెట్ట మాయింట నుండగా వేలు పోసి
    పుంజు గొంటిని సంక్రాంతి పోరు కొరకు
    పుంజుకొనఁ గోడి వోయెను, పోరు మాని”
    పుంజు పెట్ట పై దిగులుతో పోయె నెటకొ
    ( పెట్ట ఉండగా వేలు ఖర్చు పెట్టి పుంజుని కొన్నాడు.పెట్ట చచ్చింది.పెట్ట కోసం దిగులు తో పుంజు పందెపు పోరు మానేసి ఎటో పోయింది.)

    రిప్లయితొలగించండి
  10. ఉ:పుంజుకొనంగ మా దళము పుట్టె నధైర్యము వైరి పక్షమం
    దన్ జప మేదొ పట్టి విజయమ్మిక దక్కిన యట్లె తల్చి ముం
    దంజకు నేమి సేయకయె హాయిగ గూర్చొని యుంట తెల్వియే?
    పుంజుకొనంగఁ జూచిరని పోరక వారల కోడి పోయెనే”
    (ఎన్నికల లో మా పార్టీ పుంజుకొన్న దని అవతలి వాళ్లకి అధైర్యం వచ్చేసిందని జపం చేస్తూ మా పార్టీ వాళ్లు విశ్రాంతి తీసుకున్నారు.అందుకే ఓడిపోయారు.)

    రిప్లయితొలగించండి
  11. పోరు కొ ఱ కని కొంటిని పుంజు నొకటి
    తస్క రించిరి కోడిని ధైర్య ముగను
    పుంజు కొన ( గోడి వొ్యెను ' పోరు మాని
    దిక్కు తోచక నుంటిని డిన ముగను

    రిప్లయితొలగించండి
  12. తనదు యజమాని యత్తఱిఁ దల్లడిల్లఁ
    బోరి పోరి పంతమ్మున దారి లేక
    బలము సన్నగిల్లినఁ దిర్గి పరుల కోడి
    పుంజుకొనఁ గోడి వోయెను పోరు మాని


    సంజల యాతుధానులకు సంగర శక్తి పెరుంగు చుండు నం
    చుం జల మూన కింతయును శూరవరేణ్యుఁడు భండనమ్మునన్
    మంజుల రీతి యుద్ధమున మత్సర మూనక వారి యోధులం
    బుంజుకొనంగఁ జూచి రని పోరక వారల కోడి పోయెనే

    [వారలకు+ఓడి= వారల కోడి]

    రిప్లయితొలగించండి

  13. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    పందెమునకని కోడిని బాగ మేపి
    దించె బరిలోకి గెలుచునటంచు నెంచి
    బలము నెక్కువ కలిగిన పరుల కోడి
    పుంజుకొనఁ, గోడి వోయెను పోరు మాని.

    రిప్లయితొలగించండి
  14. నల్ల, తెల్ల కోళ్లు రణము నలరుచుండ
    తెల్ల కోడి కదనమున తెగువ జూపి
    వొళ్ళు గుల్ల చేసి పొడిచె,,, నల్ల కోడి
    పుంజుకొనఁ గోడి వోయెను పోరు మాని

    రిప్లయితొలగించండి