20, ఏప్రిల్ 2025, ఆదివారం

సమస్య - 5099

21-4-2025 (సోమవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“అప్పములు గనంగఁ గప్పలయ్యె”

(లేదా...)

“అప్పములెల్లఁ గప్పలుగ నన్నము సున్నము నయ్యె వింతగన్”

(వేములవాడ భీమకవి చాటువును కొద్దిగా మార్చాను)

13 కామెంట్‌లు:

  1. కందం
    తప్పుగ నిందించిరనుచుఁ
    జప్పున భీమకవి రగిలి శాపమొసంగన్
    జెప్పఁగఁ దరమే విందున
    ' నప్పములు గనంగఁ గప్పలయ్య' ను తినగన్

    ఉత్పలమాల
    తప్పుగ మాటలాడి తనదౌ జననమ్మును తూలనాడఁగన్
    విప్పుచు రక్త నేత్రములు వేములవాడ కవీశ్వరుండటన్
    జప్పున శాప వాక్యముల శంకరునెంచుచు బల్క విందు నం
    దప్పములెల్లఁ గప్పలుగ నన్నము సున్నము నయ్యె వింతగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. (అలవాటు గా కందము వ్రాసి చివరి సమస్యపాదమునతికించిన తరువాత ఆటవెలది పాదమునకు అదనపు గణము చేర్చగ సరిపోయింది)

      తొలగించండి
  2. ప్రాస యతి యనంగ బాలునికి దెలుప ,
    వేగ దాన్ని వాడ , వింత రీతి
    యతి సలుపుగ నెంచి యందుకొనె నిటుల ,
    అప్పములు గనంగఁ గప్పలయ్యె

    రిప్లయితొలగించండి
  3. గొప్పలు సెప్పుచున్ బ్రతుకు కుశ్చిత
    మానవు నింటికేగియున్
    గొప్పక వీశ్వరుండు కడు కుందుచు
    నాకలితోడనాతనిన్
    గుప్పెడు కూడు బెట్టుమన కోపప
    డెన్, కవి శాపమివ్వగా
    నప్పములెల్ల గప్పలుగ నన్నము
    సున్నము నయ్యె వింతగన్.

    రిప్లయితొలగించండి
  4. ఆ.వె:ఒక బఫే కు బోయి,యుండె నంచు దలచ
    నప్పములు ,గనంగఁ గప్పలయ్యె”
    మిర్చి బజ్జి యుండె మేలను కొని పట్ట
    చేప లవ్వి యనుచు జెప్పి రకట.

    రిప్లయితొలగించండి

  5. ముఖజులకొరకంచు భోజనములవేళ
    పిలవకూడ దనుచు భీమకవిని
    పిన్నజేయనతడు పెట్టగ శాపంబు
    నప్పములు గనంగఁ గప్పలయ్యె.


    అప్పనెఱుంగనట్టి వెలయాలిసుతుండని సర్వతో ముఖుం
    డ్రెప్పుడ సూయ జూపుచును హేళన జేయుచు సత్కవీశ్వరున్
    దెప్పిన యంత నాద్విజుల తిట్టుచు శాప మొసంగినంతనే
    యప్పములెల్లఁ గప్పలుగ నన్నము సున్నము నయ్యె వింతగన్.

    రిప్లయితొలగించండి
  6. అప్పరమేశు దప్ప మరి యన్యుల నొప్పని నెమ్మనంబదే
    గొప్పని చెప్పు పండితుని కుత్సితులత్తరి గేలి సేయగా
    తప్పదు మీకు శాస్తి యన తక్షణమా కవి వాక్ప్రభావమం
    దప్పములెల్లఁ గప్పలుగ నన్నము సున్నము నయ్యె వింతగన్

    రిప్లయితొలగించండి
  7. విందు భోజనముకు వేములవాడయే
    వలదటంచు పలికి భంగపఱుచ
    శాపమొసగె నచట సత్కవి వెన్వెంట
    నప్పములు గనంగఁ గప్పలయ్యె

    తప్పుగ బ్రాహ్మణుల్ తనకు తల్పులు మూసిరి విందుకేగగా
    చప్పునఁ దా శపించెనట సత్కవి వేములవాడ వెంటనే
    యప్పములెల్లఁ గప్పలుగ నన్నము సున్నము నయ్యె వింతగన్
    జెప్పెదరివ్విధిన్ మనకు చిత్రవిచిత్రపు సన్నివేశమున్

    రిప్లయితొలగించండి
  8. వంట జేయ దలచి వనిత ప్రయోగించె
    క్రొత్త దనము జూప కోర్కె తోడ
    చేసి చూడ వింత చిత్రంబు జరిగియు
    నప్పములు గనంగ కప్ప ల య్యె

    రిప్లయితొలగించండి
  9. ఆ॥ ఇంద్రజాల విద్య నెరఁగి దండమొకటి
    చేతఁబూని త్రిప్పి చెప్పె మంత్ర
    మొకటి చూచుచుండ నొక్క క్షణము మటు
    లప్పములు గనంగఁ గప్పలయ్యె

    ఉ॥ గొప్పగ నింద్రజాలమును గోరుచు విద్యను నేర్చి యొప్పఁగన్
    మెప్పును బొంద సర్వులును మెచ్చెడి రీతిగ చేయనెంచుచున్
    ద్రిప్పుచు నొక్క దండమును తీరుగఁ బల్కఁగ మంత్రమేదియో
    యప్పములెల్లఁ గప్పలుగ నన్నము సున్నము నయ్యె

    రిప్లయితొలగించండి

  10. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    పడతి నొక్క దాని పావురముగ మార్చె
    నింద్రజాల విద్య నెఱిగి నతడు
    చెప్పి మంత్రములను చేతి కఱ్ఱను త్రిప్పి
    అప్పములు గనంగఁ గప్పలయ్యె.

    రిప్లయితొలగించండి
  11. చెప్పినమాటలేవియును చేర్చక చిత్తము గేలిసేయగన్
    తప్పకచూపగావలెనుధాటినటంచునునాగ్రహమ్ముతో
    చప్పుననొక్కపద్యమునుసత్వరమాకవి చెప్పినంతనే
    *“అప్పములెల్లఁ గప్పలుగ అన్నము సున్నము నయ్యె వింతగన్”*


    ఇంద్రజాలవిద్యలెల్లయునేర్చిన
    మాంత్రికుండు తాను మాను గాను
    చేతికఱ్ఱ తిప్పి చెప్పగా మంత్రమున్
    అప్పములుగనంగ గప్పలయ్యె.


    రిప్లయితొలగించండి

  12. ఇంద్రజాల విద్య నెరిగిన రాముడు
    కంచ మందు నున్న పంచ భక్ష్య
    ములను మార్చె మంత్ర బలము చే, చూడగ
    యప్పములు గనంగఁ గప్పలయ్యె

    సురేష్ కుమార్ రామోజు

    రిప్లయితొలగించండి