13-4-2025 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అటుకుల మూటకుఁ దన కృతి నంకితమిచ్చెన్”
(లేదా...)
“అటుకుల మూటఁ బొంది కృతి నంకితమిచ్చెఁ గవీశ్వరుం డహో”
కటకట! యేమని చెప్పుదుపటుతర పద్యంబులల్లు పండితుడతడేకటిక దరిద్రము తనదైఅటుకుల మూటకుఁ దన కృతి నంకితమిచ్చెన్పటుతర శక్తితో నెపుడు పద్యములల్లెడు పండితుండహోకటకట! సేద్యపుం బనుల కష్టములే తననావరించగాకటిక దరిద్రుడైన కవి కావ్యము లల్లుచు తిండి లేకనే అటుకుల మూటఁ బొంది కృతి నంకితమిచ్చెఁ గవీశ్వరుం డహో
పటుతర నీతి సూక్తులను బాగొనరించగ మానవాళినిన్కుటిల విహీన పండితుడు గొప్పగవ్రాసిన 'సూక్తి మంజరిన్'తటపటలేక సన్మతిని తానిడెమానవ మార్పుకోసమైఅటుకుల మూటవొంది కృతి యంకిత మిచ్చె కవీశ్వరుండహో.
కందంపటిమను గల్గినదైననుపటుమని సిరులిచ్చి కొనెడు భర్తలు లేకేకిటుకన కుచేలుఁ గథ వినియటుకుల మూటకుఁ దన కృతి నంకితమిచ్చెన్చంపకమాలపటిమను గల్గియున్ గృతుల వాసిగ నల్లియు వాణి దీవనన్ఘటికులు సైతమున్ బొగడి గారము జూపిన. ,గూర్చ విత్తమున్కటకటమన్నరాకెవరుఁ. ,గాంచి కుచేలుని గాథ. ,శౌరికైయటుకుల మూటఁ బొంది కృతి నంకితమిచ్చెఁ గవీశ్వరుం డహో!
కటకట యేమని జెప్పుదుపటుతర కావ్యముల వ్రాయు పండితుఁడతఁడేకటికదరిద్రము నోపకనటుకుల మూటకుఁ దన కృతి నంకితమిచ్చెన్
పటిమ యెలర్చు కావ్యముల పన్నుగ వ్రాసిన సత్కవీంద్రుఁడేకటిక దరిద్రమాతనిని కక్కసమొందగ జేయ క్షుత్తుతోనటమటమొందు పుత్రునకు నాలికి నాకలి దీర్చు నిచ్చతోనటుకుల మూటఁ బొంది కృతి నంకితమిచ్చెఁ గవీశ్వరుం డహో!
కటిక దరిద్రము తోడనుకటకటలాడెడి తరుణము కడుపుల నింపన్ పటిమయె లేనట్టి కవియెయటుకుల మూటకుఁ దన కృతి నంకితమిచ్చెన్.పటిమను జూపి మేటిగను పద్య కవిత్వము చెప్పనేమిరాకటిక దరిద్రమందు పలు కక్కసమందుచు నాలు బిడ్డలున్ కటకట లాడుచుండ కని కడ్పులు నింపుట కోసమంచు తానటుకుల మూటఁ బొంది కృతి నంకితమిచ్చెఁ గవీశ్వరుం డహో.
కటకట బడలేనికపై నెటులనయిన గూడ బూతి నెనయదగుననన్తటపటలాడుచు దేల్చగనటుకుల మూటకుఁ దన కృతి నంకితమిచ్చెన్
కం॥ కటకటపడు పేదరికముఁ జిటపట లాడెడు సతియును జెదరిన మనమున్దటపట లాడకఁ జాలనియటుకుల మూటకుఁ దన కృతి నంకిత మిచ్చెన్చం॥పటిమకు నేఁడు పద్ధతిగఁ బట్టముఁ గట్టెడి వారు మృగ్యమైకటకట పెట్టు దీనతయుఁ గాంచక తిండిని సంతు కోసమైచిటపటలాడ భార్యయటు చేవను జూపుమటంచు సర్వదాయటుకుల మూటఁ బొంది కృతి నంకిత మిచ్చెఁ గవీశ్వరుండహో
నటరాజు మహిమ వర్ణనపటుతర ముగ రచన జేసి పలువుర గోరన్ దిట వు గ తిరస్కరించిగనటుకుల మూటకు దన కృతి నంకిత మిచ్చె న్
"చిటపట" కవికిని వైద్యుడునటుకులు తినమని వచించె నారోగ్యముకున్అటులిచ్చిన భూ మాతా అటుకుల మూటకుఁ దన కృతి నంకితమిచ్చెన్
జటి లార్థ కథా చయ సంపుట మడిగిన యంతఁ బ్రీతి భూనాథునకుం బటుతర పండితుఁ డరయుమ యటు కుల మూటకుఁ దన కృతి నంకిత మిచ్చెన్ [కులము+ ఊటకు =కుల మూటకు; కులము యొక్క బలమునకు] త్రుటి లభియించె నివ్విధము తోష మిడం గృతి భర్త యంచుఁ దాఁబటుతరమౌ కుచేల కథఁ బార్థివ పుంగవుఁ డడ్గఁ బ్రీతిమైఁ దటపటలాడ నేల యని తల్చి యెడందఁ బసిండి పోఁత నా యటుకుల మూటఁ బొంది కృతి నంకిత మిచ్చెఁ గవీశ్వరుం డహో
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.అట హరియె మెచ్చె మిత్రునిఅటుకుల మూటకుఁ;దనకృతి నంకితమిచ్చెన్కటిక దరిద్రుడు పోతనదిటవుగ రాజులు వలదని తిరు రామునికిన్.
చిటికెలొ లేమిని బాపెనుఅటుకుల మూటలు,తనకృతి నంకిత మిచ్చెన్తటుకున శ్రీరఘువరునకుకటకటయున్ననునడుగకకాసులనేరిన్
కటకట! యేమని చెప్పుదు
రిప్లయితొలగించండిపటుతర పద్యంబులల్లు పండితుడతడే
కటిక దరిద్రము తనదై
అటుకుల మూటకుఁ దన కృతి నంకితమిచ్చెన్
పటుతర శక్తితో నెపుడు పద్యములల్లెడు పండితుండహో
కటకట! సేద్యపుం బనుల కష్టములే తననావరించగా
కటిక దరిద్రుడైన కవి కావ్యము లల్లుచు తిండి లేకనే
అటుకుల మూటఁ బొంది కృతి నంకితమిచ్చెఁ గవీశ్వరుం డహో
పటుతర నీతి సూక్తులను బాగొన
రిప్లయితొలగించండిరించగ మానవాళినిన్
కుటిల విహీన పండితుడు గొప్పగ
వ్రాసిన 'సూక్తి మంజరిన్'
తటపటలేక సన్మతిని తానిడె
మానవ మార్పుకోసమై
అటుకుల మూటవొంది కృతి
యంకిత మిచ్చె కవీశ్వరుండహో.
కందం
రిప్లయితొలగించండిపటిమను గల్గినదైనను
పటుమని సిరులిచ్చి కొనెడు భర్తలు లేకే
కిటుకన కుచేలుఁ గథ విని
యటుకుల మూటకుఁ దన కృతి నంకితమిచ్చెన్
చంపకమాల
పటిమను గల్గియున్ గృతుల వాసిగ నల్లియు వాణి దీవనన్
ఘటికులు సైతమున్ బొగడి గారము జూపిన. ,గూర్చ విత్తమున్
కటకటమన్నరాకెవరుఁ. ,గాంచి కుచేలుని గాథ. ,శౌరికై
యటుకుల మూటఁ బొంది కృతి నంకితమిచ్చెఁ గవీశ్వరుం డహో!
కటకట యేమని జెప్పుదు
రిప్లయితొలగించండిపటుతర కావ్యముల వ్రాయు పండితుఁడతఁడే
కటికదరిద్రము నోపక
నటుకుల మూటకుఁ దన కృతి నంకితమిచ్చెన్
పటిమ యెలర్చు కావ్యముల పన్నుగ వ్రాసిన సత్కవీంద్రుఁడే
రిప్లయితొలగించండికటిక దరిద్రమాతనిని కక్కసమొందగ జేయ క్షుత్తుతో
నటమటమొందు పుత్రునకు నాలికి నాకలి దీర్చు నిచ్చతో
నటుకుల మూటఁ బొంది కృతి నంకితమిచ్చెఁ గవీశ్వరుం డహో!
రిప్లయితొలగించండికటిక దరిద్రము తోడను
కటకటలాడెడి తరుణము కడుపుల నింపన్
పటిమయె లేనట్టి కవియె
యటుకుల మూటకుఁ దన కృతి నంకితమిచ్చెన్.
పటిమను జూపి మేటిగను పద్య కవిత్వము చెప్పనేమిరా
కటిక దరిద్రమందు పలు కక్కసమందుచు నాలు బిడ్డలున్
కటకట లాడుచుండ కని కడ్పులు నింపుట కోసమంచు తా
నటుకుల మూటఁ బొంది కృతి నంకితమిచ్చెఁ గవీశ్వరుం డహో.
కటకట బడలేనికపై
రిప్లయితొలగించండినెటులనయిన గూడ బూతి నెనయదగుననన్
తటపటలాడుచు దేల్చగ
నటుకుల మూటకుఁ దన కృతి నంకితమిచ్చెన్
కం॥ కటకటపడు పేదరికముఁ
రిప్లయితొలగించండిజిటపట లాడెడు సతియును జెదరిన మనమున్
దటపట లాడకఁ జాలని
యటుకుల మూటకుఁ దన కృతి నంకిత మిచ్చెన్
చం॥పటిమకు నేఁడు పద్ధతిగఁ బట్టముఁ గట్టెడి వారు మృగ్యమై
కటకట పెట్టు దీనతయుఁ గాంచక తిండిని సంతు కోసమై
చిటపటలాడ భార్యయటు చేవను జూపుమటంచు సర్వదా
యటుకుల మూటఁ బొంది కృతి నంకిత మిచ్చెఁ గవీశ్వరుండహో
నటరాజు మహిమ వర్ణన
రిప్లయితొలగించండిపటుతర ముగ రచన జేసి పలువుర గోరన్
దిట వు గ తిరస్కరించిగ
నటుకుల మూటకు దన కృతి నంకిత మిచ్చె న్
"చిటపట" కవికిని వైద్యుడు
రిప్లయితొలగించండినటుకులు తినమని వచించె నారోగ్యముకున్
అటులిచ్చిన భూ మాతా
అటుకుల మూటకుఁ దన కృతి నంకితమిచ్చెన్
జటి లార్థ కథా చయ సం
రిప్లయితొలగించండిపుట మడిగిన యంతఁ బ్రీతి భూనాథునకుం
బటుతర పండితుఁ డరయుమ
యటు కుల మూటకుఁ దన కృతి నంకిత మిచ్చెన్
[కులము+ ఊటకు =కుల మూటకు; కులము యొక్క బలమునకు]
త్రుటి లభియించె నివ్విధము తోష మిడం గృతి భర్త యంచుఁ దాఁ
బటుతరమౌ కుచేల కథఁ బార్థివ పుంగవుఁ డడ్గఁ బ్రీతిమైఁ
దటపటలాడ నేల యని తల్చి యెడందఁ బసిండి పోఁత నా
యటుకుల మూటఁ బొంది కృతి నంకిత మిచ్చెఁ గవీశ్వరుం డహో
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
అట హరియె మెచ్చె మిత్రుని
అటుకుల మూటకుఁ;దనకృతి నంకితమిచ్చెన్
కటిక దరిద్రుడు పోతన
దిటవుగ రాజులు వలదని తిరు రామునికిన్.
చిటికెలొ లేమిని బాపెను
రిప్లయితొలగించండిఅటుకుల మూటలు,తనకృతి నంకిత మిచ్చెన్
తటుకున శ్రీరఘువరునకు
కటకటయున్ననునడుగకకాసులనేరిన్