కం:నగుచున్ గర్షకు డిట్లనె పొగ త్రాగెడు కొడుకు దున్న పొలమును బుట్టున్ మగువగ మరు జన్మమ్మున పొగ ద్రాగనివాఁడు దున్న పోతై పుట్టున్” (పొలాన్ని పొగాకు తాగే వాడు దున్నితే వచ్చే జన్మ లో ఆడపుటక పుడతాడు.పొగ తాగని కొడుకైతే వచ్చే జన్మ లో మగవాడిగానే పుడతాడని నవ్వుతూ అన్నాడు.కొడుకు తో ధూమపానం మానిపించటానికి.పోతు=మగ.)
పొగ ద్రాగుట యొక వెసనము
రిప్లయితొలగించండితగనూపిరి తిత్తులనది దహియించునుగా
పొగరుగ పలుకఁగ దగునా
పొగ ద్రాగనివాఁడు దున్నపోతై పుట్టున్?
కందం
రిప్లయితొలగించండిపొగ త్రాగనన్న మెచ్చియు
యుగయుగముల కోరుదనిన యువిదా! దిగులే?
మగడా! కవులన వింటే!
"పొగ ద్రాగనివాఁడు దున్నపోతై పుట్టున్!"
ఉత్పలమాల
"మెప్పున దోచి మానసము మిన్నగు జంటగ. ,జన్మజన్మలం
దొప్పులకుప్ప కోర, దిగులొందితె?" భార్య వచించె భర్తతో,
"నొప్పితినేను మిమ్ముఁ బొగ నూదరటంచును, గాని వింటిరే!
తప్పక పుట్టుచుంద్రు పొగ ద్రాగని వారలు దున్నపోతులై!"
తగదని పెద్దలు చెప్పిన
రిప్లయితొలగించండితెగ త్రాగుట వలన వచ్చు తెగులది కదరా!
పొగరుగ నన రా దెక్కడ
పొగ ద్రాగని వాడు దున్న పో తై పుట్టు న్?
చెప్పెదనాప్త వాక్యమును చేతమునందున నిల్పుకొమ్మికన్
రిప్లయితొలగించండితప్పవు తిప్పలింక పొగ ద్రాగిన స్వాస్థ్యము వ్యస్తమౌనయా
గొప్పగనేల బల్కెదవు కొంటెతనంబును మేళవించుచున్
తప్పక పుట్టుచుంద్రు పొగ ద్రాగని వారలు దున్నపోతులై
కం॥ సొగసుగఁ బొగ ద్రాగుచునటు
రిప్లయితొలగించండిద్విగుణీకృత ముదమున మగ ధీరులమనుచున్
దెగడిరి త్రాగని మనుజునిఁ
బొగ ద్రాగనివాఁడు దున్నపోతై పుట్టున్
ఉ॥ చెప్పఁగ శక్యమే జనులు చెప్పిన నర్థము చేసి కొందురే
తెప్పలుగాను ద్రాగఁ బొగ దేకువ మోదముఁ బొందు రీతులన్
గొప్పగ యోచనల్ పొసఁగు గుప్పున వీడుచు నుండ ధూమమున్
దప్పక పుట్టుచుంద్రు పొగ ద్రాగని వారలు దున్నపోతులై
రాముడు-భీముడు సినిమా పాట ననుసరించి యండి
రిప్లయితొలగించండిపొగ ద్రాగకుమని చెప్పగ
మగవాడే కదర త్రాగు మగటిమ జూపన్
బొగనని మూర్ఖుండిటులనె
పొగ ద్రాగనివాఁడు దున్నపోతై పుట్టున్.
ఎప్పుడు త్రాగబోకు పొగ హెచ్చుగ రోగము లిచ్చు నంచు తా
జెప్పగ మూర్ఖుడొక్కడు వచించెను చావుకు భీతి యేలరా
గుప్పున పీల్చుటయ్యదియె గొప్పదనమ్మది పూరు షాళికిన్
తప్పక పుట్టుచుంద్రు పొగ ద్రాగని వారలు దున్నపోతులై.
మగుడు జనియించు నప్పుడు
రిప్లయితొలగించండిపొగాకు నీజన్మలోన పొలమునమనుచున్
పొగ చుట్టను ముట్టించుచు
పొగ ద్రాగనివాఁడు దున్నపోతై పుట్టున్
తెగ త్రాగిన పెరగాయలు
రిప్లయితొలగించండివగచుచు పొగ త్రాగనట్టి వారల గతికై
తెగనాడెదరున్మదమున
"పొగ ద్రాగనివాఁడు దున్నపోతై పుట్టున్"
18, ఏప్రిల్ 2025, శుక్రవారం
రిప్లయితొలగించండిసమస్య - 5097
19-4-2025 (శనివారం)
1). కం//
పగబట్టిన ముక్కుజలుబు
పొగాకు వాడిన సరగున బోవుచు నేడ్చున్ !
జగమున పండిత వచనము
పొగ ద్రాగనివాఁడు దున్నపోతై పుట్టున్ !!
2). కం//
మగసిరి గలవాడెపుడును
తగువిధి నశ్యమును బీల్చి దరహాసముతో !
రగిలెడి బీడీ, సిగిరెట్
పొగ ద్రాగనివాఁడు దున్నపోతై పుట్టున్ !!
3). కం//
సొగసరి యత్తా కోడలు
భుగభుగమని పొగను బీల్చి పుణ్యము గనిరే !
వగచకు మగడా యెపుడున్
పొగ ద్రాగనివాఁడు దున్నపోతై పుట్టున్ !!
4). కం//
జగమేమౌనని జిష్ణువె
పొగాకు నిక్కపుజగముకు పొమ్మని జెపుచున్ !
తగిన ప్రసాదమిదే యన
పొగ ద్రాగనివాఁడు దున్నపోతై పుట్టున్ !!
5). కం//
నిగమము నందుండెనురా
పగతుని గెలిచెద మనినను బ్రహ్మలిఖితమోయ్ !
సొగసగు దంతాలయమున
పొగ ద్రాగనివాఁడు దున్నపోతై పుట్టున్ !!
✍️ Malli Siripuram Srisailam
తగదనుచు వచించె గురువు
రిప్లయితొలగించండి'పొగ ద్రాగినవాఁడు దున్నపోతై పుట్టున్'
తగువిధి పలుకని శిశువనె
'పొగ ద్రాగనివాఁడు దున్నపోతై పుట్టున్'
తప్పులఁ దెల్ప బోధకుడు తానట వ్రాసెను నల్లబల్లపై
'తప్పక పుట్టుచుంద్రు పొగ ద్రాగిన వారలు దున్నపోతులై'
తప్పుగ నుచ్చరించెనట దానిని సువ్రతుడివ్విధంబునన్
'తప్పక పుట్టుచుంద్రు పొగ ద్రాగని వారలు దున్నపోతులై'
కం:నగుచున్ గర్షకు డిట్లనె
రిప్లయితొలగించండిపొగ త్రాగెడు కొడుకు దున్న పొలమును బుట్టున్
మగువగ మరు జన్మమ్మున
పొగ ద్రాగనివాఁడు దున్న పోతై పుట్టున్”
(పొలాన్ని పొగాకు తాగే వాడు దున్నితే వచ్చే జన్మ లో ఆడపుటక పుడతాడు.పొగ తాగని కొడుకైతే వచ్చే జన్మ లో మగవాడిగానే పుడతాడని నవ్వుతూ అన్నాడు.కొడుకు తో ధూమపానం మానిపించటానికి.పోతు=మగ.)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఉ:చెప్పెను రైతు బిడ్డలకు సేమము జక్కని హాస్యభాషలో
రిప్లయితొలగించండి"గొప్పయె ధూమపాన? మది గొన్న సుతుండు పొలమ్ము దున్నినన్
తప్పక యాడు దేహమునె దాల్చును రా ! మరు జన్మ మందునన్,
దప్పక పుట్టుచుంద్రు పొగ ద్రాగని వారలు దున్న, పోతులై”
(పొగాకు త్రాగే వాడు దున్నితే ఆడ పుటక పుడతాడు.పొగ త్రాగని వాడు దున్నితే మగవాడిగానే పుడతాడు.)
కప్పురమొప్పుగా గలిపి గప్పున గుప్పుచు ధూపసేవతో
రిప్లయితొలగించండినప్పని గొల్చు వార లలరారెద రైహిక బంధ ముక్తులై
"తప్పది ధూపమా పొగ గదా" యని గేలిని సేయు మూర్ఖులే
తప్పక పుట్టుచుంద్రు పొగ ద్రాగని వారలు దున్నపోతులై
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
పొగ ద్రాగు వారలందురు
పొగ ద్రాగనివాడు దున్నపోతై పుట్టున్
పొగ సేవించెడు వారికి
పొగ నిండి శరీరమంత పొందుదురు రుజల్.
ఖగవాహనునేతలచుచు
రిప్లయితొలగించండిజగతిని చేసిన క్రతువుల జనములు చేయన్
తగురీతిగకమ్మనియా
*“పొగ ద్రాగనివాఁడు దున్నపోతై పుట్టున్”*