ఆ.వె:బీరు లోన గూడ నీరు కలుపు మంచు గోరుకొందు వేమి క్రొత్త వాడ? రమ్ము నైన నేది రవ్వంత గలిపిన త్రాగ లేని వాడె త్రాగు బోతు (ఒక సీనియర్ తాగు బోతు జూనియర్ ని ఎక్కిరిస్తున్నాడు.బీరు లో ఎవరూ నీరు కలపరు.అలాగే ఏమీ కలపకుండా "రా"గా రమ్ము తీసుకోవా లంటే చాలా స్టామినా ఉండాలి.)
ఉ:త్రాగిన త్రాగుమయ్య యిక దారిన బోవుచు వాగుడేల నా! రాగము లేలరా మగడ!రాత్రుల కొంపకు జేరి త్రాగ నా త్రాగుడు నెవ్వ రే మనరు,దాని గ్రహించక కొంత గుట్టుగా త్రాగనివానినే జనులు తప్పక కాంతురు త్రాగుబోతుగన్” ,(ఓరి మగడా!తాగితే తాగావు కానీ అలా రోడ్ల మీద తాగి,వాగి,రాగాలు పాడే వాణ్ని గుట్టు గా తాగని వాణ్ని తాగుబోతు అంటారు కాబట్టి కొంప లో తాగు అని ఒక భార్య సలహా!)
ఆటవెలది
రిప్లయితొలగించండిభోగమునను వెతల మున్గిననైనను
సతిని సంతుమఱచి కుతుకమెగయ
తప్పకుండ సఖుల ముప్పొద్దుల విడిచి
త్రాగలేనివాఁడె త్రాగుబోతు!
ఉత్పలమాల
భోగమునందునన్ వెతల మున్గిన వేళల మందుకొట్టుచున్
సాగుటనేర్చియున్ సతికి సంతుకు కూటికి లేకపోయినన్
తూగుట మానకే సఖులు తోడుగ లేకయె మూడుపొద్దులన్
త్రాగనివానినే జనులు తప్పక కాంతురు త్రాగుబోతుగన్
✍️ *గుండా వేంకట సుబ్బ సహదేవుడు*
ఆ॥ త్రాగు జనుల నడుమఁ ద్రావని వానికి
రిప్లయితొలగించండినెంత కష్ట ముండు నెవరికెరుక
ద్రాగి వాగు వారు మూగి నిందించఁగన్
ద్రాగ లేని వాఁడె త్రాగుబోతు
ఉ॥ వేగగ లేమయా జనులు వేడుక మీరఁగ మద్యపానమున్
మూగుచు చేయుచుండఁగను ముప్పుయు తప్పున త్రాగకున్నచో
వాగుచు రేఁగి యాతనిని వారలు హీనుఁడటంచు దూఱుచున్
ద్రాగని వానినే జనులు తప్పక కాంతురు త్రాగుబోతుగన్
స్వానుభవండి (ముఖ్యంగా అగర్తలలో)
రిప్లయితొలగించండిలొట్టి ముచ్చటంచు నెట్టుల గుర్తింతు
వనుచు నడిగి నంత నతడు చెప్పె
నమృత మున్న నేమి హల కాక దేనినిన్
త్రాగలేనివాఁడె త్రాగుబోతు.
భోగపు వాడలన్ దిరుగు మూర్ఖుడు దుర్వ్యసనమ్ము లెన్నియో
భాగరి వానికంచు తెలుపన్ వినవేలనె పాలనిచ్చినన్
ద్రాగ తిరస్కరించెగద ద్రాపుడు, మద్యము తప్ప దేనినిన్
ద్రాగనివానినే జనులు తప్పక కాంతురు త్రాగుబోతుగన్.
వలయు దానినైన త్వరితమునొందుచు
రిప్లయితొలగించండిత్రాగలేనివాఁడె త్రాగుబోతు
యనుట నొప్పుచుండు నెటులన , శిశువులు
తల్లి పాలు జోగి త్రాగునుగద
పవలు రేయి త్రాగి పడిదొర్లు నపుడైన
రిప్లయితొలగించండిమనసు లోన మరల మధువు కోరు
కైపులోనమునిగి కదలనశక్తుడై
త్రాగలేనివాఁడె త్రాగుబోతు
త్రాగుచు తీక్ష్ణతైలమును తన్మయులౌదురు త్రాగుబోతులే
త్రాగుటచే శరీర సమతౌల్యత తప్పిన వేళ మాత్రమే
త్రాగనివానినే జనులు తప్పక కాంతురు త్రాగుబోతుగన్
దాగనిదా యవస్థ స్పృహ తప్పగ నేలను పొర్లుచుండుగా
ఆ.వె:బీరు లోన గూడ నీరు కలుపు మంచు
రిప్లయితొలగించండిగోరుకొందు వేమి క్రొత్త వాడ?
రమ్ము నైన నేది రవ్వంత గలిపిన
త్రాగ లేని వాడె త్రాగు బోతు
(ఒక సీనియర్ తాగు బోతు జూనియర్ ని ఎక్కిరిస్తున్నాడు.బీరు లో ఎవరూ నీరు కలపరు.అలాగే ఏమీ కలపకుండా "రా"గా రమ్ము తీసుకోవా లంటే చాలా స్టామినా ఉండాలి.)
ఉ:త్రాగిన త్రాగుమయ్య యిక దారిన బోవుచు వాగుడేల నా!
రిప్లయితొలగించండిరాగము లేలరా మగడ!రాత్రుల కొంపకు జేరి త్రాగ నా
త్రాగుడు నెవ్వ రే మనరు,దాని గ్రహించక కొంత గుట్టుగా
త్రాగనివానినే జనులు తప్పక కాంతురు త్రాగుబోతుగన్”
,(ఓరి మగడా!తాగితే తాగావు కానీ అలా రోడ్ల మీద తాగి,వాగి,రాగాలు పాడే వాణ్ని గుట్టు గా తాగని వాణ్ని తాగుబోతు అంటారు కాబట్టి కొంప లో తాగు అని ఒక భార్య సలహా!)
బ్రతుకు బండి లాగ బాధ్యత లెరుగక
రిప్లయితొలగించండినాక తాయి వోలె నవని త్రాగు
వాని మాన్ఫ నొసగు పసరు మందు నెపుడు
త్రాగ లేని వాడు త్రాగు బోతు
త్యాగమొనర్చితిన్ ప్రణయమంచు పరాజయమంచు నూడె ను
రిప్లయితొలగించండిద్యోగమటంచు హా నిరుపయోగము జీవనమంచు మించెడు
ద్వేగపు సాకులెంచి మధువే మధురంబని క్షీర నీరముల్
త్రాగనివానినే జనులు తప్పక కాంతురు త్రాగుబోతుగన్
రోగములెన్ని వచ్చినను రొష్టుగ భాగములెన్ని మారినన్
రిప్లయితొలగించండిత్రాగుట వీడబోవక విరామమునివ్వక మద్యపానమే
యాగక జేయ మూర్ఖవరుడై ప్రవహించగ నోటి వెంట నె
త్రాగనివానినే జనులు తప్పక కాంతురు త్రాగుబోతుగన్!!
నెత్రు = నెత్తురు
నెత్రు + ఆగని = నెత్రాగని
ఆ.వె//
రిప్లయితొలగించండిభాగ్యవంతుడితడు బ్రాందివిస్కీలను
నిత్య మితడె త్రాగు, నిన్నరాత్రి
మత్తునందు నుండి చిత్తుగా త్రాగెనో
త్రాగలేనివాఁడె త్రాగుబోతు
✍️ Malli Siripuram Srisailam
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
కుతుక వరకు త్రాగి కూలబడుచు లేచి
తడబడగ నడుగులు తాను చేర
నిల్లు, భార్య జూచి యివ్వగా తేనీరు
త్రాగలేని వాడె త్రాగుబోతు.
సాగుచు నుండగా వడిగ సంతకు తాకగవాడిబల్లెమున్
రిప్లయితొలగించండివేగముగాపడన్నచట భీతియుహెచ్చగపర్గుదీయగా
రాగముతీయుచున్నుడుగురాకయు తూలుచు పోవుచుండగా
త్రాగని వానినే జనులు తప్పక కాంతురు త్రాగుబోతుగన్