21, ఏప్రిల్ 2025, సోమవారం

సమస్య - 5100

22-4-2025 (మంగళవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“సున్నకుం బుట్టి యరసున్న శూన్యమయ్యె”

(లేదా...)

“సున్నకుఁ బుట్టినట్టి యరసున్న గనంబడ దేమి చోద్యమో”

(బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలతో...)

22 కామెంట్‌లు:

  1. తేటగీతి
    భాషలో పలు వర్ణముల్ పాతబడుచు
    ప్రస్తుతము గానలేమవి వాడమనఁగ
    చేరి యుచ్ఛారణమ్మున మారుగాను
    సున్నకుం బుట్టి యరసున్న శూన్యమయ్యె!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉత్పలమాల
      వెన్నను బోలు సున్నితము విశ్వము మెచ్చెడు తెన్గు భాషయే
      వన్నెలు సిందు వర్ణములు వాసిని బొందక జారెఁ గొన్నియే
      చెన్నుగ నుచ్ఛరించుటకు చిన్నెల గూర్చఁగ మారు రూపమై
      సున్నకుఁ బుట్టినట్టి యరసున్న గనంబడ దేమి చోద్యమో!

      తొలగించండి
  2. రాజకీయపు పక్షముల విధముగన
    దల్లిదళము నందున బుట్టి పిల్లదళము
    మెల్ల మెల్లగా నదియు జెల్లు చుండు 
    సున్నకుం బుట్టి యరసున్న శూన్యమయ్యె

    రిప్లయితొలగించండి
  3. తే॥ ఆదికవి నన్నయ సమయమందు నమరి
    జనుల యామోదముఁ బడిసి మనిన తెలుఁగు
    ప్రాఁత పడిన కతన నేఁటి భాషఁ గనఁగ
    సున్నకుంబుట్టి యరసున్న శూన్యమయ్యె

    ఉ॥ నిన్నటి భాష యేలయని నెమ్మదిఁ బొందఁగఁ గొంత మార్పుతో
    మన్నన యంచు సూచనలు మాన్యులు చేసిరె కుంటిమద్దివా
    రెన్నిరి కొన్ని యక్షరములెంచుచుఁ జూడఁగ వీరి ప్రభావమో
    సున్నకుఁ బుట్టినట్టి యరసున్న గనంబడ దేమి చోద్యమో

    కుంటిమద్ది శేషశర్మ గారు అనంతపురం జిల్లాలో కొంత పేరున్న కవులు. ధర్మవరం (పట్టుచీరలకు ప్రసిద్ధి) ZP Higher Secondary School లో (తరువాత జూనియర్ కాలేజ్ అయ్యింది) తెలుగు భాషా బోధకులుగా పనిచేసేవారు. వీరు ఁ ఱ లాంటివి నేడు కూడ అవసరమా అనేవారు నాకుతెలిసి. నేను చదివిన ఊరు ఇదికాదండి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉ॥ నిన్నటి భాష యేలయని నెమ్మదిఁ బొందఁగఁ గొంత మార్పుతో
      మన్నన యంచు సూచనలు మాన్యులు చేసిరె కుంటిమద్దివా
      రెన్నిరి కొన్ని యక్షరములెంచుచుఁ జూడఁగ నా ప్రభావమో
      సున్నకుఁ బుట్టినట్టి యరసున్న గనంబడ దేమి చోద్యమో

      శ్రీ కంది శంకరయ్య గారు సూచించిన సవరణల తరువాత

      తొలగించండి

  4. పూర్వమున్నట్టి యక్షరములను గాంచ
    నేడు కొన్ని మృగ్యమగుట నిజము గాదె
    యందులో నొకటి యదియె యబ్బురమ్ము
    సున్నకుం బుట్టి యరసున్న శూన్యమయ్యె.


    మున్ను తెనుంగులోనగల పూర్వులు వ్రాసిన యక్షరాలలో
    యెన్నియొ మాయమయ్యెగద నిప్పుడు నాధు నికమ్ము పేరుతో
    చెన్నగు మార్పులంచు పరిశీలన జేసిన సార్థకమ్ము తో
    సున్నకుఁ బుట్టినట్టి యరసున్న గనంబడ దేమి చోద్యమో.

    రిప్లయితొలగించండి
  5. ఎన్నఁగ సంధికార్యముల నెన్నఁగఁ జూడఁ బదస్వభావముల్
    సున్నలుఁ జేరవచ్చు నరసున్నలుఁ జేరఁగవచ్చు నెల్లెడన్
    బన్నుగ వ్రాతలందుఁ గనుపట్టును మేటిగ నుచ్చరింపఁగా
    *“సున్నకుఁ బుట్టినట్టి యరసున్న గనంబడ దేమి చోద్యమో”*

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మార్పు:
      సున్నలుఁ జేరవచ్చు నరసున్నగ మారఁగవచ్చు నచ్చుచోన్

      తొలగించండి
  6. వన్నె మారక యలరెడు భాషగలదె
    కొన్ని మార్పులు సహజము లెన్నదగును
    నిన్న నుపయుక్త మైయున్న నేడుకాదు
    సున్నకుం బుట్టి యరసున్న శూన్యమయ్యె

    ఎన్నగనెన్నియో విశదమివ్విధి మార్పులు తెల్గుభాషలో
    కన్నుల ముందు పద్ధతికి కాలము నిల్చును గాదె సాక్షిగా
    నిన్నటితీరు మారుగద నేడిట వాడుక శూన్య మైనచో
    సున్నకుఁ బుట్టినట్టి యరసున్న గనంబడ దేమి చోద్యమో

    రిప్లయితొలగించండి
  7. తే.గీ:తాత పండితు డౌట విఖ్యాతి గాంచె
    అయ్య జ్ఞానశూన్యుం డను ఖ్యాతి నొందె
    అరకొరగ నేర్చి మనుమడే ఖ్యాతి నందు?
    సున్నకుం బుట్టి యరసున్న శూన్యమయ్యె”
    (తాతకి పండితుడనే ఖ్యాతి,తండ్రికి జ్ఞానశూన్యు డనే ఖ్యాతి ఉన్నాయి కాని.ఈ మనమడు తెలిసి తెలియని వాడు కనుక ఏ పేరూ లేక శూన్య మయ్యాడు.)

    రిప్లయితొలగించండి
  8. ఉ:సున్నలు వ్రాతలో గలవు చూడగ నిండుగ దోచు గాని యా
    సున్నకుఁ బుట్టినట్టి యరసున్న గనంబడ దేమి చోద్యమో”
    సున్నకు కంఠ మున్న దది ఝుమ్మని మ్రోగుట చేత నిల్చెలే
    సన్నని పీక దౌట మన జాలక యే యరసున్న మాయమౌ.
    (నోరున్న వాడు బతుకుతాడు.సున్నా ఝుం అనో భం అనో మోగుతుంది కాబట్టి బతికింది.అరసున్నకి పీక లేదు కాబట్టి కనబడకుండా తప్పుకుంటుంది.)

    రిప్లయితొలగించండి
  9. కాల గమనాన మార్పులు గాన బడును
    సులభ మార్గాలు వెదుకంగ జూచు వారు
    వ్రాత యందున ముద్రణ న్ వాడ బోరు
    సున్న కుం బుట్టి యర సున్న శూన్య మ య్యె

    రిప్లయితొలగించండి
  10. సున్న సమస్త లోకములు సున్న చరాచర సృష్టి యంతయున్
    సున్నయె బంధముల్ దలప సున్నయె భౌతిక వాంఛలెల్లయున్
    సున్నయె శాశ్వతత్వమని సుంత యెరుంగని శుంఠ శంకయౌ
    సున్నకుఁ బుట్టినట్టి యరసున్న గనంబడ దేమి చోద్యమో

    రిప్లయితొలగించండి
  11. 'సున్న' పూర్ణంబు, శూన్యంబు, సోకులాడి!
    తనుజులకు గుణాలన్నియుఁ దగులఁ జేసె..
    సంక్రమించిన యాస్తులఁ జాల నొప్ప
    "సున్నకుం బుట్టి యరసున్న శూన్యమయ్యె”

    రిప్లయితొలగించండి
  12. నేఁడు ద్రుత సంధు లొనరింప నెమ్మిఁ గాంచ
    రర్థ భేద మున్నను వాడ రకట పండి
    తు లరసున్నను దలఁపరు దోష మెదల
    సున్నకుం బుట్టి యరసున్న శూన్య మయ్యె


    వన్నె నశింపఁ గావ్యముల వ్యాకరణమ్మున కీక సుంతయేన్
    మన్నన నుండఁ బండితులు న్యాయమె కోరని చోట మెత్తగాఁ
    దన్నిన మాయ మయ్యెడు ద్రుతమ్మున కొక్కొక వేళ మారుగా
    సున్నకుఁ బుట్టినట్టి యరసున్న గనంబడ దేమి చోద్యమో

    రిప్లయితొలగించండి

  13. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    వర్ణమాల యందలి కొన్ని వర్ణములు క్ర
    మముగ పరిహరింప బడుచు మాయమయ్యె
    వాటితో పాటు నరసున్న వచ్చి చేరె
    సున్నకుం బుట్టి యరసున్న శూన్యమయ్యె.

    రిప్లయితొలగించండి
  14. డా బల్లూరి ఉమాదేవి
    సున్నతోబుట్టెగన నరసున్న కూడ
    తెలుగులోతేజరిల్లెనుతీరుగాను
    కాని నేడుకలిసెకాలగర్భమందు
    సున్నకుం బుట్టి యరసున్న శూన్య మయ్యె

    రిప్లయితొలగించండి