24, ఏప్రిల్ 2025, గురువారం

సమస్య - 5103

25-4-2025 (శుక్రవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“మానము లేనట్టివాఁడె మాన్యతనందెన్”

(లేదా...)

“మానము లేనివాఁడె కద మాన్యతనందును ధాత్రిలోపలన్”

(మొన్నటి పట్వర్ధన్ గారి శతావధానంలో బోచ్కర్ ఓంప్రకాశ్ గారి సమస్య)

17 కామెంట్‌లు:

  1. కందం
    కానలకంపెడు తండ్రికి
    మానక గౌరవమొసంగి మారాడకయే
    పూనిన రాముండు దురభి
    మానము లేనట్టివాఁడె మాన్యతనందెన్

    ఉత్పలమాల
    జ్ఞానము భారతీ జనని సద్వరమంచన పద్యవిద్యలోఁ
    దానొక పండితుండనగ ధన్యతనొందుచు మెచ్చి పల్వురున్
    బూనుచు గౌరవింపఁదగు ముచ్చట తీరగ కొన్న యట్టి స
    న్మానము లేనివాఁడె కద మాన్యతనందును ధాత్రిలోపలన్!

    రిప్లయితొలగించండి
  2. భానువుదయించు మొదలుగ
    కాని పని సలిపి ప్రదోష కాలము నందున్ 
    పానము జేయుటపై యభి 
    మానము లేనట్టివాఁడె మాన్యతనందెన్

    రిప్లయితొలగించండి

  3. జ్ఞానను కలిగిన వాడై
    దానగుణముతో చరించు ధర్మాత్ముండై
    తానకమున్ గలిగి దురభి
    మానము లేనట్టివాఁడె మాన్యతనందెన్.


    జ్ఞానమదెంతయో కలిగి సద్గుణ మూర్తిగ పేరు పొందుచున్
    దానగుణాత్ముడై చెలగి దక్షత గల్గిన పండితాళినే
    తానకమందు కొల్చుటె ముదమ్మని తల్చెడి వారలైన దు
    ర్మానము లేనివాఁడె కద మాన్యతనందును ధాత్రిలోపలన్.

    రిప్లయితొలగించండి
  4. దానవ సముఁడంచు నెఱిగి
    పూనికతోనోట్లనిడగ పూర్తిగ దోచే
    వైనము చూపిన నేతయె
    మానము లేనట్టివాఁడె మాన్యతనందెన్

    తానొక విశ్వకద్రువని దానవసామ్యమటంచు నెర్గియున్
    మానవ వర్గభేదముల మాటున మూగిన దేశ పౌరులే
    పూనికతోడ నోట్లనిడఁ బొందిన గెల్పుకు గొప్పనేతయై
    మానము లేనివాఁడె కద మాన్యతనందును ధాత్రిలోపలన్

    రిప్లయితొలగించండి
  5. కం॥ మానకఁ జేయును సాయముఁ
    దానుగ నార్తుల కనిశము తత్పరుఁడగుచున్
    ధ్యానము సేయునెపుడు దు
    ర్మానము లేనట్టివాఁడె మాన్యతనందెన్

    ఉ॥ మానక నార్తులన్ గనఁగ మన్నన సేయుచు బాధ తీర్చఁగన్
    దానుగ చేయు సాయమును దత్పరుఁడై తగు రీతి భక్తితో
    ధ్యానము సేయు సద్గుణముఁ దాల్చఁగ శక్తినిఁ బొంద మ్రొక్కు దు
    ర్మానము లేని వాఁడె కద మాన్యత నందును ధాత్రిలోపలన్

    దుర్మానము గర్వము నిఘంటువు సహాయమండి

    రిప్లయితొలగించండి
  6. గానకళాసరస్వతికి గాదిలిపుత్రుఁడు పండితాళి స
    మ్మానమునందుకొన్న ఘనమౌ బయకాడత డెల్లవేళలన్
    ధ్యానమునిల్పు గానకళయందునఁ గోరడు కీర్తి యట్టి దు
    ర్మానము లేనివాఁడె కద మాన్యతనందును ధాత్రిలోపలన్

    రిప్లయితొలగించండి
  7. ధ్యానము నిల్పును నిరతము
    గానమునందున, నెరుఁగడు గర్వము లేశం
    బైనను, సౌమ్యుండు, దురభి
    మానము లేనట్టివాఁడె మాన్యతనందెన్

    రిప్లయితొలగించండి
  8. జ్ఞానము గలిగిన వాడై
    దానము ధర్మములు జేయు ధర్మాత్ము o డై
    దీనుల బాంధవు డై యవ
    మానము లేనట్టి వాడె మాన్యత నందు న్

    రిప్లయితొలగించండి
  9. శ్రీమాత్రేనమః
    శ్రీ గురుభ్యోనమః

    గ్లానియు దుఃఖము బోవన్
    ధ్యానములను చేయు ఘనుడు ధన్యుడు అంతర్
    యానము చేయంగ దురభి
    మానము లేనట్టివాడు మాన్యత నందున్.

    కొన్ని సంవత్సరముల తరువాత ఈ బ్లాగ్ లో తిరిగి పోస్ట్ చేస్తున్నాను. నన్ను పరీక్షించుకోవడానికి, గురు ఆశీస్సులు తీసుకోవడానికి
    శ్రీమాత్రేనమః

    రిప్లయితొలగించండి
  10. కం:వీనికి నల్లుం డ్లిద్దరు,
    పూనెడు ననుమాన మొకడు పుణ్యసతి యెడన్
    పూనుచు విశ్వాసము,నను
    మానము లేనట్టివాఁడె మాన్యతనందెన్”
    (అతని ఇద్దరు అల్లుళ్లలో ఒకరికి భార్య పై అనుమానం.అనుమానం లేని వాడే గౌరవించ బడ్డాడు.)

    రిప్లయితొలగించండి
  11. ఉ:మానధనమ్ము గల్గ, ముఖమాటము తో నెవరో యొసంగు స
    న్మానములన్ గ్రహించుటయె మానిత మౌనె! బుధుండు కాక స
    న్మామము నొందుటే ఘనమె, నవ్వులు చాటుగ వచ్చు నట్టి స
    న్మానము లేనివాఁడె కద మాన్యతనందును ధాత్రిలోపలన్”

    రిప్లయితొలగించండి
  12. మానవ సేవయే మహిని మాధవ సేవగ నెంచునెన్నడున్
    మానినులన్న మన్నన సమాన సమాదర భావమెన్నికన్
    మానసమందునీశ్వరుని మానక గొల్చు మనీషి యెట్టి దు
    ర్మానము లేనివాఁడె కద మాన్యతనందును ధాత్రిలోపలన్

    రిప్లయితొలగించండి
  13. సమస్య:
    ర్మానము లేనివాఁడె కద మాన్యతనందును ధాత్రిలోపలన్


    మీనము మేషమెంచకను మీరెడు ప్రేమల జారనీయకన్
    దానము గుప్తమే మరియు దాటడు పెద్దల చద్ది మూటలన్
    పేనము నిచ్చి సాయపడ పేదయు గొప్పను జాతి రీతి తీ
    ర్మానము లేనివాఁడె కద మాన్యతనందును ధాత్రిలోపలన్

    రిప్లయితొలగించండి
  14. దైనందిన కర్మమ్ముల
    దానం బొకటిగఁ దలంచు దయ గల వాఁడున్
    మానస మందుఁ గన దురభి
    మానము లేనట్టి వాఁడె మాన్యత నందెన్


    మానవ జాతి పైన నభిమానము సూపుచు సుంత యేని స
    న్మాన రతుండు గాక నయ మార్గ మనోరథుఁడై చరించుచున్
    మానిన నాత్మలో దురభిమానము లో ననుమాన మాఱ దు
    ర్మానము లేని వాఁడె కద మాన్యత నందును ధాత్రి లోపలన్

    రిప్లయితొలగించండి
  15. పానము యాపద నుండగ
    దానము జేయుట మరువక దన సిరి నంతన్
    మానక ప్రజకిచ్చి దురభి
    “మానము లేనట్టివాఁడె మాన్యతనందెన్”

    సురేష్ కుమార్ రామోజు.

    రిప్లయితొలగించండి

  16. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    మానినుల గౌరవించుచు
    దానములను జేయుచుండి దాక్షిణ్యముతో
    ధ్యానము చేయుచును దురభి
    మానము లేనట్టి వాడె మాన్యత నందెన్.

    రిప్లయితొలగించండి