చం:సిరి గల యామె కెవ్వడు రుచించక పెద్దలు చెప్పకుంటచే బిర బిర కాలమే గడచి పెద్ద వయస్సుకు జేరె బాల యన్ మురిపెపు పేరు దాల్చి యిక మోమును వాడగ "నాకు జాలడా అరువది యేండ్ల పెండ్లికొడు?" కంచు వరించెను బాల ప్రేముడిన్” (ఆమె పేరు బాల కానీ ఆమెకి పెద్ద వయస్సు వచ్చే సరికి అరవై యేళ్ల వరుణ్ని ప్రేమ గా అంగీకరించింది. )
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితేటగీతి
తొలగించండివరుని తండ్రికి మొన్ననే వైభవముగ
షష్టిపూర్తి ముగిసెనన సంబరమునఁ
' గట్టుకొనెడువాడట తాళిఁ గట్టఁ' ,మ్రొక్కి
నరువదేండ్ల వరు, 'వరించె నలరి బాల'
చంపకమాల
మురిపెపు ప్రేమ సంద్రమున మున్కలువైచిన జంట పెండ్లియే
జరిగెడు ముందుగన్ వరుని సత్పితనొందఁగ షష్టిపూర్తియే
' మరుడను వాడె కట్టగనె మంగళసూత్రము' ,మ్రొక్కి మామయే
యరువది యేండ్ల పెండ్లికొడు కంచు, 'వరించెను బాల ప్రేముడిన్'
తరలి వచ్చిరి పౌత్రిలు , తాత గారి
రిప్లయితొలగించండిని వరునిగ సవరణ జేయ , నెమ్మి నొంది
అరువదేండ్ల వరు వరించె నలరి బాల
తనకు ముద్దులీ యమనుచు దనివిదీర
నిత్యనూతనమైన దాంపత్యమందు
రిప్లయితొలగించండిషష్టిపూర్తి సంబరమును జరుపునాడు
బంధువులు వేడ్కగానిట్లు పలికినారు
అరువదేండ్ల వరు వరించె నలరి బాల
పరువము మించిపోయినను భ్రాతియొకింతయు మాసిపోని యా
యిరువురు పుణ్యదంపతులు యింపుగ చేసిన కాపురంబునన్
వెరవుగ షష్టిపూర్తియను వేడుక సల్పెడువేళ నాథుఁడే
యరువది యేండ్ల పెండ్లికొడుకంచు వరించెను బాల ప్రేముడిన్
రిప్లయితొలగించండితాన మేరికాకేగగ తగిన యనుమ
తులవి లభియింప లేదని సులభ మార్గ
మైన యచటి పౌరుండగు జీను డైన
అరువదేండ్ల వరు వరించె నలరి బాల.
స్థిరముగ నుండ నెంచి పర దేశము నేగగ నెంచనేమి సం
గరము లభించ లేదనుచు కన్నియ యచ్చటి పౌర సత్వమే
జరతియె కల్గి యుండెనని సంకట ముండదటంచు నమ్మి యా
యరువది యేండ్ల పెండ్లికొడు కంచు వరించెను బాల ప్రేముడిన్.
పరువము లేతదౌ పడుచు పండుగ రోజునఁ జూచెనాతనిన్
రిప్లయితొలగించండిబరిచయ మైనతత్క్షణము ప్రశ్రయమేర్పడె షష్టిపూర్తిపై
సరియగు జోడుగాఁ దలచి సత్వర మాతనిఁ గోరుకొన్నదై
యరువది యేండ్ల పెండ్లికొడు కంచు వరించెను బాల ప్రేముడిన్
ప్రేమ గ్రుడ్డిదనిరి మన పెద్దవారు
తొలగించండివారి పలుకులకు రుజువు పడతి చూపె
చూచి నంతట మెచ్చెను సుదతి వరుని
నరువదేండ్ల వరు వరించె నలరి బాల
ముప్పదేండ్ల క్రితమ్మున ముచ్చటగను
రిప్లయితొలగించండిమూడుముళ్ళు వేసిన పతి మురిసి తాను
మరల షష్ఠిపూర్తియనుచు మనువునాడ
అరువదేండ్ల వరు వరించె నలరి బాల”*
తరుణిగపెండ్లియాడితిని తండ్రియుచూసినవానినప్పుడే
త్వరితముగానుసాగెనుగ ప్రాయముదాటెను షష్ఠిపూర్తికిన్
తరుణమువచ్చెనంచునటతానుతలంచుచుసంతసమ్ముతో
*“నరువది యేండ్ల పెండ్లికొడు కంచు వరించెను బాల ప్రేముడిన్”*
షష్టి పూర్తికి జరిగెను చక్క నైన
రిప్లయితొలగించండిగొప్ప వేడుక గృహమున కోరి నట్లు
బంధు గణముల యెదుట ను భార్య యపుడు
నరువ దే ండ్ల వరు వరించె నలరి బాల
నేటి ఉద్యోగినిలలో కొందరి మనః స్థితికి కొంత అతిశయోక్తి జోడించి
రిప్లయితొలగించండితే॥ ఇరువదేండ్ల వయసునందు నెలిమి ధనముఁ
గూర్చు నుద్యోగమున కట్లు గురి ముడివడ
వయసు పెరుఁగఁగ నేబది వర్షములకు
నరువదేండ్ల వరు వరించె నలరి బాల
చం॥ ఇరువది యేండ్ల ప్రాయమునఁ నెప్పుడు నార్జన పైన మక్కువై
పరఁగ వివాహ చింతనలఁ బ్రక్కకు నెట్టి వయస్సు హెచ్చుచున్
దరుణము మించి పోవనటు దాఁకొని యుండఁగ వృద్ధ కన్యయై
అరువది యేండ్ల పెండ్లికొడుకంచు వరించెను బాల ప్రేముడిన్
తే.గీ:అరువ దేండ్ల నటుడె కాని యతని వేష
రిప్లయితొలగించండిమిరువ దేండ్లనే చూపించు నిప్పటికిని
చిత్రమున పదునారేండ్ల చిన్నదయ్యు
నరువదేండ్ల వరు వరించె నలరి బాల”
చం:సిరి గల యామె కెవ్వడు రుచించక పెద్దలు చెప్పకుంటచే
రిప్లయితొలగించండిబిర బిర కాలమే గడచి పెద్ద వయస్సుకు జేరె బాల యన్
మురిపెపు పేరు దాల్చి యిక మోమును వాడగ "నాకు జాలడా
అరువది యేండ్ల పెండ్లికొడు?" కంచు వరించెను బాల ప్రేముడిన్”
(ఆమె పేరు బాల కానీ ఆమెకి పెద్ద వయస్సు వచ్చే సరికి అరవై యేళ్ల వరుణ్ని ప్రేమ గా అంగీకరించింది. )
తల్లి దండ్రులు బంధువు లెల్ల రకట
రిప్లయితొలగించండివిత్త మొక్కటి వీక్షించి ప్రీతిఁ జెంది
భోగ భాగ్యము లబ్బును నాఁగఁ బలుక
నరువ దేండ్ల వరు వరించె నలరి బాల
[బాల = మూర్ఖురాలు]
అరు దగు నుత్సవమ్ము మనసార నొనర్తురు భూతలమ్మునన్
నరహరి బాల దంపతులు నందను లెల్లరు నుత్సహింపఁగాఁ
బరఁగఁగ షష్ఠి పూర్తి యను పండుగ నవ్య వధూలలామయై
యరువది యేండ్ల పెండ్లి కొడు కంచు వరించెను బాల ప్రేముడిన్
ఇరువది యేండ్ల బాలమది నింపగు ప్రేమ ఘటిల్లె వేణుతో
రిప్లయితొలగించండిస్థిరమగు యాయమొంద పరదేశము జేర ప్రియుండు, వానినిన్
మరువగ లేక యామెమన మన్నన, నర్వది నిండి వాడు రాన్
యరువది యేండ్ల పెండ్లి కొడు కంచు వరించెను బాల ప్రేముడిన్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
యేబదేండ్ల వయసునందు నిరువదేండ్ల
పాత్రలో కనిపించెడు పడతి వలచి
యిరువదేండ్ల పాత్రలను పోషించునట్టి
నరువదేండ్ల వరు వరించె నలరి బాల.