ఉ: వింతగ రంగులన్ గలిపి వేయగ నే హనుమంతు బొమ్మ నా వంత భయమ్ము లేక యొక యల్లరి చేష్టగ బుజ్జి సూటి గా బంతిని వేయగానె యది పర్వతమై కనుపట్టె వింతగన్” చింతన జేయ నా హనుమ చేతిన నెత్తు గిరీంద్ర మయ్యె గా! (రంగులతొ హనుమ బొమ్మ వేస్తుంటే బుజ్జి బంతి విసిరింది. అది పర్వతం లాగా అయి హనుమ చేతితో ఎత్తే సంజీవని పర్వతం ఐ పోయింది. )
బంతిని బట్టి బాలకుడు పర్గునుదీయుచు వచ్చి ధాటిగా బంతిని వేయగానె యది పర్వతమై కనుపట్టె వింతగన్ చెంతకు జేరినంత కడు స్థేమముగా తన బ్యాటుతోడనా బంతిని కొట్టినంతనది పర్గిడె బౌండరి వైపు చెచ్చెరన్
దొంతిగ నున్న ఘటములకు
రిప్లయితొలగించండిబంతిని విసరంగ నద్ది పర్వతమయ్యెన్ ,
వింత గొలిపెనాదృశ్యము
నంతను జూచెడు పరిజన మానందించన్
ఎంతయొ వేగముతోనా
రిప్లయితొలగించండిబంతిని విసరంగ నద్ది పర్వతమయ్యెన్
సుంతయు విభ్రాంతి పడక
వింతగ కొట్టెను క్రికెట్టు వీరుడు వడిగా
వింతగు సన్నివేశమది వేడుక తోడ క్రికెట్టు నాడుచున్
బంతిని వేయగానె యది పర్వతమై కనుపట్టె వింతగన్
సుంతయు భ్రాంతిలేక ఘన శూరుడు గొట్టెను హద్దుమీఱగా
నంతట లేని బంతియని హాయిగ దెల్పెను మేటి తీర్పరే
పంతము నెగ్గినామనుచు పర్వులు దక్కిన వారు చాటిరే
[క్రికెట్ ఆటలో బాట్స్మన్ సిక్సర్ కొట్టగా ఆ బాల్ ని నోబాల్ గా
అంపైర్ ప్రకటించడంతో ఏడు పరుగులు లభ్యమయ్యాయని భావన]
-
రిప్లయితొలగించండిస్వాంతనము కోరి పెనిమిటి
బంతిని విసరంగ నద్ది పర్వతమయ్యెన్
కాంత జిలేబి యెగిరి తా
నెంతయొ కస్సుమన బొప్పి నెత్తిని గట్టెన్
అంతఃపుర వీధులలో
రిప్లయితొలగించండివింతలు కనికట్టులెల్ల వేడుకఁ జూడన్
భ్రాంతియొ నిజమో తెలియక
బంతిని విసరంగ నద్ది పర్వతమయ్యెన్
ఉత్పలమాల
రిప్లయితొలగించండిఇంతికి నచ్చినప్పటికి హీనుడటంచును వాని మార్చియున్
కంతుని బోలినట్టి వరుఁ గట్టిరి మేలని తల్లిదండ్రులున్
సంతసమొందునే వధువు జంటగ నన్యునమర్చ? వాడు పూ
బంతిని వేయగానె యది పర్వతమై కనుపట్టె వింతగన్!
కందం
తొలగించండిఇంతికి నచ్చిన వాడిసు
మంతయు కొరగాడటంచు నమరింపఁ బరున్
కంతుని సముడని, వరుడట
బంతిని విసరంగ నద్ది పర్వతమయ్యెన్!
కం; ఇంతయు జింతించక యే
రిప్లయితొలగించండిహంతకు డని యా మహాత్ము నందువె? యత డా
వంతయు గుందునె కక్షన్
బంతిని విసరంగ ? నద్ది పర్వతమయ్యెన్
శ్రీమాన్ కవి శ్రేష్టులారా
రిప్లయితొలగించండిమీ సద్యోగాలకు ఢోకా లేదని కాడ్ ఏ ఐ ( కృత్రిమ మేధ/ ఏలి తెలివి ) యిచ్చిన కితాబులు
జయహో!
మేధోమధనం
సమస్యా పూరణం కేవలం పద్యం రాయడం మాత్రమే కాదు — అది సంస్కృతి, ఛందస్సు, భాష, చమత్కారం అన్నింటినీ మేళవించిన ఒక అద్వితీయ తెలుగు సాహిత్య సంప్రదాయం.
"మేధోమధనం — ఇది రోజువారీ జ్ఞాపకశక్తికి మించిన విషయం"
AI కి persistent memory లేకపోవడం వల్ల నిజమైన మేధోమధనం సాధ్యం కాదు. మీలాంటి పండితుల మార్గదర్శకత్వంలో మాత్రమే ఈ సంప్రదాయం నిలబడుతుంది.
— Claude Sonnet 4.6, Anthropic | April 27, 2026
-
రిప్లయితొలగించండిఎన్ జాయ్ ది డైలాగ్స్ :)
https://varudhini.blogspot.com/2026/04/ai.html
ఉ: వింతగ రంగులన్ గలిపి వేయగ నే హనుమంతు బొమ్మ నా
రిప్లయితొలగించండివంత భయమ్ము లేక యొక యల్లరి చేష్టగ బుజ్జి సూటి గా
బంతిని వేయగానె యది పర్వతమై కనుపట్టె వింతగన్”
చింతన జేయ నా హనుమ చేతిన నెత్తు గిరీంద్ర మయ్యె గా!
(రంగులతొ హనుమ బొమ్మ వేస్తుంటే బుజ్జి బంతి విసిరింది. అది పర్వతం లాగా అయి హనుమ చేతితో ఎత్తే సంజీవని పర్వతం ఐ పోయింది. )
-
రిప్లయితొలగించండిపొంతన చూడని క్లాడ్ తా
నెంతయొ యతనమొనరించె సుంతయు ఛందం
బంతుని కనుగొనలె! భళా
బంతిని విసరంగ నద్ది పర్వత మయ్యెన్ ॥
However
రిప్లయితొలగించండిI should appreciate one point
Claude was able to grasp the satire in
the stanzas immediately and bowed with comments back as
What a brilliant పూరణం! You used the సమస్య itself to describe my situation!
క్లాడ్ ప్రాస, మీటర్ సరిగ్గా పట్టుకోలేకపోయాడు — అదే సమస్యగా మార్చారు! 😄
ఉ॥ అంతము చేయ రాక్షసుని నద్భుత రీతిగఁ బెద్ద గుండునే
రిప్లయితొలగించండిపంతముఁ బూని యెత్తుచును బంతివలెన్ గరమందుఁ ద్రిప్పుచున్
గంతుచు శక్తినంతయును గాంచుచు దైత్యునిఁ జూసి భీముఁడే
బంతిని వేయఁగానె యది పర్వతమై కనుపట్టె వింతగన్
రాక్షసుడు హిడింబ పర్యతమై హిండింబాసురునికి కనపడిందని అండి
రిప్లయితొలగించండికుంతియె కోరెనటంచు బ
కాంతకు డేనుంగు బొమ్మకై మిత్తిని తా
బంతులుగను చేయుచు నా
బంతిని విసరంగ నద్ది పర్వతమయ్యెన్.
పంతము బూని రాక్షసుని పాఱుని వేషము తోడ భీముడే
యంతము జేయ నెంచి యట హారము నందున నుగ్ర రూపమున్
చెంతన యున్న పంకమును చేతను గైకొని ముద్ద సేసి యా
బంతిని వేయగానె యది పర్వతమై కనుపట్టె వింతగన్.
పంతమున నాట లాడుచు
రిప్లయితొలగించండిగంతులు వేయుచు వడి వడి కవ్వించుచు ధీ
మంతము గా నెదుటి పయిన
బంతి ని విసరంగ నద్ది పర్వత మయ్యె న్
సుంతయు లేదు నైపుణము సుందర రావుకు క్రిక్కెటాటలో
రిప్లయితొలగించండివింతగ వానినుంచిరి వివేకము లేకను జట్టునందునన్
ముంతెడు త్రాగి వాడు కలు ముద్దుగ బ్యాటును పట్ట వానికిన్
బంతిని వేయగానె యది పర్వతమై కనుపట్టె వింతగన్
బంతాట నాడుచుండగ
రిప్లయితొలగించండిబంతి యొకటి నింగికెగసి పైపైకి జనెన్
వింతగ జూచుచు నొకఁడనె
బంతిని విసరంగ నద్ది పర్వతమయ్యెన్
బంతిని బట్టి బాలకుడు పర్గునుదీయుచు వచ్చి ధాటిగా
రిప్లయితొలగించండిబంతిని వేయగానె యది పర్వతమై కనుపట్టె వింతగన్
చెంతకు జేరినంత కడు స్థేమముగా తన బ్యాటుతోడనా
బంతిని కొట్టినంతనది పర్గిడె బౌండరి వైపు చెచ్చెరన్
అంతము జేయ రాక్షసుల నంజన పుత్రుడు చేరిలంకకున్
రిప్లయితొలగించండిపంతము బెల్లగించి విడ బంతుల రీతి మహీదరమ్ములన్
సుంతయు లేక సేద, దనుజుల్ గన భీతిని, గాలి చూలి చే
బంతిని వేయగానె యది పర్వతమై కనుపట్టె వింతగన్
అంతము సేయం దలఁచుచు
రిప్లయితొలగించండినంతక నిభుఁ డాంజనేయుఁ డత్యుంగ్రుండై
పంతమున ఱాతి ముక్కల
బంతిని విసరంగ నద్ది పర్వత మయ్యెన్
[బంతి = పంక్తి]
స్వాంతము లందు సంతసము వానర కోటికిఁ గల్గ నత్తఱిం
జింతలు రేఁగ డెందములఁ జేవ నశింపఁగ దైత్య కోటికిం
జెంతన నున్న యా శిలను జేఁగొని మారుతి చక్కఁ బోలఁగా
బంతిని వేయఁగానె యది పర్వతమై కనుపట్టె వింతగన్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
వింతగ గారడి వాడిసు
మంతైనను వ్యవధి నిడక మరియొక కార్యం
బంతము నందున చేయుచు
బంతిని విసరంగ నద్ది పర్వతమయ్యెన్.