కం;కార్తికమున కాకి రమణ మూర్తికి కోకిల యనబడు పుత్రిక గల్గెన్ మూర్తి గని బావ యిట్లనె "కార్తికమునఁ గోకిల యొక కాకికిఁ బుట్టెన్” (రమణ మూర్తి ఇంటి పేరు కాకి. వాడి కూతురు పేరు కోకిల. కాకికి కోకిల పుట్టిందని అతని బావ సరస మాడాడు. )
ఉ:కార్తిక మాస మందు కనకప్రభకున్ మరి కాకి దక్షిణా మూర్తికి బిడ్డ కల్గె నతి ముద్దుగ కోకిల యంచు బే రిడన్ మూర్తిని మేన బావ గని ముచ్చటగా సరసోక్తి నిట్లనెన్ కార్తికమాసమందు నొక కాకికిఁ గోకిల పుట్టె వింతగన్” (వాడి పేరు కాకి దక్షిణా మూర్తి. భార్య పేరు కనక ప్రభ. పిల్ల పేరు కోకిల. బావ సరస మాడాడు. అంతే. కాకి అనే ఇంటి పేరు ఉంది. )
కాకిగూడును+అదిగో కాకి గూడునదిగో కలికాలము అంటే కోకిల మేటింగ్ సీజన్ మే జూన్ అండి కాబట్టి పిల్లలు జూన్ జులైలో రావాలి (జ్యేష్ఠ మాసము చివరలో లేక ఆషాఢంలో) కార్తీక మంటే కలి ప్రభావమే కదండి.
పూర్తిగ గతపాఠము నా
రిప్లయితొలగించండివర్తనము సలుపుమనగనె వటువీరీతిన్
గుర్తుకు తెచ్చుకొని నుడివె
కార్తికమునఁ గోకిల యొక కాకికిఁ బుట్టెన్
కార్తీకమ్మునఁ బుట్టెను
రిప్లయితొలగించండికీర్తన లెన్నియొ రచించి కీర్తిని బడసెన్
స్ఫూర్తినిడు కనక దాసే!
కార్తికమునఁ గోకిల యొక కాకికిఁ బుట్టెన్
కార్తిక మందుఁ బుట్టినను గానవిశారద తానెగాదె? భ
క్తార్తి హరుండిటన్ గనకదాసుని జన్మకు హేతువందురే
కీర్తిని మూటగట్టెగద కీర్తనలన్ రచియించి పాడుచున్
గార్తికమాసమందు నొక కాకికిఁ గోకిల పుట్టె వింతగన్
-
రిప్లయితొలగించండిమన టీవీ వాళ్ల పోకడ సెన్ సేషన లిజమ్ :)
వార్తా విశ్లేషణలో
"కార్తికమునఁ గోకిల యొక కాకికిఁ బుట్టెన్”
పూర్తిగ ప్రేక్షకుల మదిని
నర్తన మాడించె బూయ నవ్వుల పువ్వుల్
ఎల్లెమ్మ జిలేబి
ధూర్తుడు జనకుడు పావన
రిప్లయితొలగించండిమూర్తియె వానికి జనించె ముద్దుల సుతుఁడై
యార్తుల పాలిటి వరముగ
కార్తికమునఁ గోకిల యొక కాకికిఁ బుట్టెన్
ఆర్తులపాలి దైవముగ నందరి మేలును గోరు నేస్తమై
రిప్లయితొలగించండివర్తిలి ఖ్యాతిఁ గాంచె నొక బాలిశుఁ బుత్రుడు సద్గుణుండుగా
వర్తన గాంచి యాతనిని బందుగులెల్లరు మెచ్చి రివ్విధిన్
కార్తికమాసమందు నొక కాకికిఁ గోకిల పుట్టె వింతగన్
కం;కార్తికమున కాకి రమణ
రిప్లయితొలగించండిమూర్తికి కోకిల యనబడు పుత్రిక గల్గెన్
మూర్తి గని బావ యిట్లనె
"కార్తికమునఁ గోకిల యొక కాకికిఁ బుట్టెన్”
(రమణ మూర్తి ఇంటి పేరు కాకి. వాడి కూతురు పేరు కోకిల. కాకికి కోకిల పుట్టిందని అతని బావ సరస మాడాడు. )
ఉ:కార్తిక మాస మందు కనకప్రభకున్ మరి కాకి దక్షిణా
రిప్లయితొలగించండిమూర్తికి బిడ్డ కల్గె నతి ముద్దుగ కోకిల యంచు బే రిడన్
మూర్తిని మేన బావ గని ముచ్చటగా సరసోక్తి నిట్లనెన్
కార్తికమాసమందు నొక కాకికిఁ గోకిల పుట్టె వింతగన్”
(వాడి పేరు కాకి దక్షిణా మూర్తి. భార్య పేరు కనక ప్రభ. పిల్ల పేరు కోకిల. బావ సరస మాడాడు. అంతే. కాకి అనే ఇంటి పేరు ఉంది. )
ఉ॥ స్ఫూర్తినిఁ గాకి కష్టపడుఁ జూడఁగఁ గోకిల కట్లు నచ్చునే
రిప్లయితొలగించండిపూర్తిగ బద్ధకమ్ము గద పొందుగఁ గోయిల గ్రుడ్డు పెట్టఁగన్
గుర్తుగఁ గాకి గూడునదిగో కలి కాలము రీతి యిద్దియే
కార్తిక మాసమందు నొక కాకికిఁ గోకిల పుట్టె వింతఁగన్
కాకిగూడును+అదిగో కాకి గూడునదిగో
కలికాలము అంటే కోకిల మేటింగ్ సీజన్ మే జూన్ అండి కాబట్టి పిల్లలు జూన్ జులైలో రావాలి (జ్యేష్ఠ మాసము చివరలో లేక ఆషాఢంలో) కార్తీక మంటే కలి ప్రభావమే కదండి.
రిప్లయితొలగించండికార్తిక యద్భుత గాయని
మూర్తి యనెడి మూగ వాని పుత్రిక, గుడిలో
నార్తిగ పాడ జను లనిరి
కార్తికమునఁ, గోకిల యొక కాకికిఁ బుట్టెన్.
మూర్తికి మూగ వానికొక పుత్రిక, యచ్చట దేవళమ్ము లో
కార్తిక మాసమందు విష కంఠుని గూర్చినుతించి పాడెడిన్
కార్తిక గాంచి పల్కిరట గాయకు లెల్లరు ముక్త కంఠమున్
కార్తికమాసమందు నొక కాకికిఁ గోకిల పుట్టె వింతగన్.
కర్తగ నండము లిడి పరి
రిప్లయితొలగించండివర్తన కై కాకి గూట వదలిన పిదప న్
పూర్తిగ పిట్ట గ మారియు
కార్థిక మున కోకిల యొ క కాకికి బు ట్టె న్
ఆర్తినిఁ గంచర గాడిద
రిప్లయితొలగించండిసర్తృ జఠరమున జనింప సంధాన మహా
కర్తలు మర్త్యు లవనిలోఁ
గార్తికమునఁ గోకిల యొక గాకికిఁ బుట్టెన్
[సర్తృ జఠరము = గుఱ్ఱపుఁ గుక్షి; కార్తికము = కృత్రిమమునకు సంబంధించినది]
కీర్తి పలాశి కేల పరికింపఁగ నిల్చును, విష్ణు వైరికిన్
ధూర్త సురారి కర్భకుఁడు తోరపు టచ్యుతు వీర భక్తుఁడే
యార్తి నొసంగ దైత్య పతి కత్యధి కమ్ముగ నుద్భవించె, నో
కార్తిక! మాస మందు, నొక కాకికిఁ గోకిల పుట్టె వింతగన్
[మాసము = మాష పరిమాణము/ అల్పము; అందు =అనెదను]
కృతకమునకు సంబంధించినది కార్తికము.
తొలగించండికందం
రిప్లయితొలగించండికీర్తించి శ్రీహరిని స
ద్వర్తన గలుగు సుతుఁడు హరివైరికి గలిగెన్
మూర్తి ప్రవచించి పలికెన్
గార్తికమునఁ, గోకిల యొక కాకికిఁ బుట్టెన్
ఉత్పలమాల
కీర్తనతోడ శ్రీహరిని గెల్చిన పుత్రుడు పుట్టె వైరిగన్
వర్తిలనెంచు దైత్యునకు! పండితపామరరంజకంబునై
స్ఫూర్తిని నింపు గాథయని మూర్తి వచించియు సారమిట్లనెన్
కార్తికమాసమందు, "నొక కాకికిఁ గోకిల పుట్టె వింతగన్!"
వార్తలు వ్రాయు పుత్రుడును పాటలు కూడను పాడు కమ్మగన్
రిప్లయితొలగించండివర్తకమందునన్ ఘనుడు వప్రుడు వానిది కాకికంఠమే
గుర్తును చేసుకొంచు నిది కొందరు మిత్రులు యిట్టు లంద్రుగా
కార్తికమాసమందు నొక కాకికి కోకిల పుట్టె వింతగన్