2, ఏప్రిల్ 2026, గురువారం

సమస్య - 5427

3-4-2026 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“దూలం బిభరాజ మగుచుఁ దోఁచెన్ సుకవీ”
(లేదా...)
“దూలంబే యిభరాజమయ్యెఁ గవిశార్దూలా ప్రపంచంబునన్”

(బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలు) 

19 కామెంట్‌లు:

  1. కందం
    ఏలాగు? సాధ్యమంచును
    గూలఁబడకుమయ్య! మొదటి గురువు లఘువులై
    చాలిన పద్యమయిన శా
    ర్దూలం బిభరాజమగుచుఁ దోఁచెన్ సుకవీ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శార్దూలవిక్రీడితము
      ఏలాగున్ బులి సింహమౌననుచు చింతింపంగ ఛందంబునం
      దీలాగున్ దొలి దీర్ఘమే లఘువులై హెచ్చంగ తొండంబునౌ
      మూలంబందున దీవనల్ గురిసెడున్ బోతన్న కావ్యాల శా
      ర్దూలంబే యిభరాజమయ్యెఁ గవిశార్దూలా! ప్రపంచంబునన్

      తొలగించండి
  2. పాలన గురించి దెలుపుచు ,
    నాలుక తిరగని విధముగ నడపించినదౌ
    మేలగు పదముల ఘి శా
    ర్దూలం బిభరాజ మగుచుఁ దోఁచెన్ సుకవీ

    రిప్లయితొలగించండి
  3. మేలుగ 'మసజసతతగ' ను
    వీలుగ 'సభరనమయవ' గ విభజించినచో
    చాలును గతిమారిన శా
    ర్దూలం బిభరాజ మగుచుఁ దోఁచెన్ సుకవీ

    రిప్లయితొలగించండి
  4. ఏలా తర్జనభర్జనల్ సుకవి నీకేలా విచారమ్ము శా
    ర్దూలంబందలి యాది గుర్వుఁగొని యస్తోకంబుగా దానినిన్
    మేలౌజేయ లఘుద్వయమ్ముగ వెసన్ మీమాంస చేయంగ శా
    ర్దూలంబే యిభరాజమయ్యెఁ గవిశార్దూలా ప్రపంచంబునన్

    రిప్లయితొలగించండి
  5. చాలిక తొలిగురువు బదులు
    నాలుగు పాదాల మొదట నయముగ లఘువుల్
    లీలగ నిగుడించిన శా
    ర్దూలం బిభరాజ మగుచుఁ దోఁచెన్ సుకవీ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సౌలభ్యంబని బల్కి చూపితిరహో శార్ధూలమత్తేభముల్
      మూలంబందున నక్షరాల బదులే పొంకించి హ్రస్వంబులన్
      వాలాయించి యొనర్చిరా విబుధులే వాగ్వాదమేలేక శా
      ర్దూలంబే యిభరాజమయ్యెఁ గవిశార్దూలా ప్రపంచంబునన్

      తొలగించండి

  6. మూలంబున గల యా దీ
    ర్ఘాలను మార్చి ఖలునివలె హస్వమ్ములుగా
    నేల పలుక నది గన శా
    ర్దూలం బిభరాజ మగుచుఁ దోఁచెన్ సుకవీ.

    బాలుండైనను చేయబోవడు కదా పాండిత్యమున్ గల్గియున్
    మూలంబున్ గనకుండ చెప్పితివిటన్ మూఢుండవై నీవు దీ
    ర్ఘాలే హ్రస్వము లైన పద్యమదియే కాంచంగ ఛందమ్ము శా
    ర్దూలంబే యిభరాజమయ్యెఁ గవిశార్దూలా ప్రపంచంబునన్”

    రిప్లయితొలగించండి
  7. ఆలమున o దు న యోధులు
    మేలుగ పోరును సలు పుచు మించె డి వేళన్
    కాలుని కరణి గ నర శా
    ర్దూ ల o బి భ రాజ మగుచు దొచె న్ సుకవీ!

    రిప్లయితొలగించండి
  8. శా॥ ఆలోచించఁగ దుర్భరమ్ము మహిలో నంధత్వమే యందురే
    జాలిన్ గాంచుమ స్పర్శతోఁ గనుచు దుస్సాధ్యమ్ము గుర్తించఁగన్
    స్థూలాకారముఁ దాఁకఁగన్ గరి యనన్ జోద్యంబహో వారికిన్
    దూలంబే యిభ రాజమయ్యెఁ గవిశార్దూలా ప్రపంచంబునన్

    రిప్లయితొలగించండి
  9. చాల దినమ్ములు వర్షా
    కాలమ్మునఁ దడసి నట్టి కారణ మేమో
    గాలికి నేలం గూలఁగ
    దూలం బిభరాజ మగుచుఁ దోఁచెన్ సుకవీ


    జ్వాలాజిహ్వ సమాన వీర వర సంస్థానమ్ము పల్నాడునన్
    కేళీ లీలలు ఘోర యుద్ధములు వీక్షింపంగ నచ్చోట మా
    ర్జాలంబే మృగరాజ శేఖరము నౌరా మూషికోత్తుంగ శా
    ర్దూలంబే యిభ రాజ మయ్యెఁ గవి శార్దూలా ప్రపంచంబునన్

    రిప్లయితొలగించండి
  10. లీలన్ జూపుచు నుంటి నాపతులు దోర్లీలన్ నినున్ బట్టి నీ
    హేలన్ వే నశియింప జేసి దురమున్ హించించి తూటాడరే
    కాలున్ జేరెడ వీవటంచు కసిఁ బల్కంగానటన్ కృష్ణ శా
    ర్దూలంబే యిభ రాజమయ్యెఁ గవిశార్దూలా ప్రపంచంబునన్

    రిప్లయితొలగించండి

  11. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    ఆలోచింపగ సాధ్యమె
    కూలంకషముగను మొదటి గురువు
    లఘువులై
    చీలగ రెండుగ నా శా
    ర్దూలం బిభరాజమగుచుఁ దోచెన్ సుకవీ!

    రిప్లయితొలగించండి