తే.గీ:మిథున రాశిని వీడుచు మెరుపు లొలుకు నుల్క లెన్నియొ రాలుచు నొక్క రాత్రి ఆకసంబునఁ దేలె, హర్మ్యంబులెన్నొ క్రిక్కిరిసె చూడ జనులు పై కెక్కి నంత (మిథున రాశి నుంచి ఒక మారు భారీ స్థాయి ఉల్కాపాతాలు జరిగాయి.అవి చూడటానికి జనం మేడల పైకి ఎక్కారు.మిథున రాశి నుంచి పడే ఉల్కలని జెమినిడ్స్ అంటారు. )
గగన మందున మబ్బులు గాను పించి
రిప్లయితొలగించండివివిధ రూ పాలతో నవి వేడ్క సేయ
నాక సంబున దేలె హర్మ ంబు లె న్నొ యనుచు నబ్బు ర ముగ గాంచి రందర పుడు
తేటగీతి
రిప్లయితొలగించండిబీడుభూములనుచు రైతు వేదనఁబడ
ధరలు పలుకు దినమదె దగ్గరపడంగ
సహజవాయు నిక్షేపాల ఛాయఁదెలిసి
ఆకసంబునఁ దేలె హర్మ్యంబులెన్నొ!
శార్దూలవిక్రీడితము
మాకే రీతిని మేలు చేయునని కంపమ్మెత్త రైతన్నలన్
శోకమ్మందున బీడు భూములవియే శుష్కింపఁ జేయంగనే
సాకారమ్మయి వాయువే సహజమై సంపన్నతన్ లభ్యమై
యాకాశంబునఁ దేలి యాడినవి హర్మ్యంబుల్ మనోజ్ఞంబుగన్
కృత్రిమమగు బుద్ధిని వాడ , కృతము నొందె
రిప్లయితొలగించండిచలన చిత్రమొకటి యొక జాణ చేత ,
చెన్నుగ ఫరిశీలించగ చిత్రమందు
నాకసంబునఁ దేలె హర్మ్యంబులెన్నొ
భూమి నిచ్చిన కర్షక క్షేమమలర
రిప్లయితొలగించండిరాజ ధానిని నిర్మింతురన్న పలుకు
విన్న హలజీవి హృదయము విన్నుగాగ
నాక సంబునఁ దేలె హ ర్మ్యంబులెన్నొ
మీకేదక్కును రాజధాని ఫలముల్ మీరేకమై భూమినే
జేకూర్చంగ దలంచినన్ నగరమే శీఘ్రంబనన్ రైతులం
గీకారమ్ము నొసంగ చింతనలు రేగెన్ గాలిలో మేడలై!
ఆకాశంబునఁ దేలి యాడినవి హర్మ్యంబుల్ మనోజ్ఞంబుగన్
-
రిప్లయితొలగించండికృత్రిమపు మేధ సాయము కృషియనంత
మైన తీరుల చేయగ మాయ నిక్క
మాయె కనులముంగటనె ప్రమాణమాయె
నదిగొ చీనీయుల ప్రతిభ నలతి కాల
మాకసంబున దేలె హర్మ్యంబులెన్నొ
మబ్బు దొంతరల్ నింగిలో మసలుచుండ
రిప్లయితొలగించండిబాలునకుఁ దోచె వివిధ రూపాల వలెను
మనమునందున నూహించె ఘనముఁ గాంచి
యాకసంబునఁ దేలె హర్మ్యంబులెన్నొ
ఆకాశంబున మేఘ సంచయము హేరాళమ్ముగా పర్వగా
రిప్లయితొలగించండిఆకారమ్ములు గ్రాలు చందమున నేత్రానందముంగూర్చెనా
రాకాచంద్రుని దీప్తులందు ఘనముల్ రాజిల్ల రూపాలుగా
నాకాశంబునఁ దేలి యాడినవి హర్మ్యంబుల్ మనోజ్ఞంబుగన్
రాకాసికోన లో రత్నాల ద్వీపములో
రిప్లయితొలగించండిఅల్లావుద్దీను అద్భుత దీపంలో :)
ప్రాకారమ్మును దాటి గంటి తరువుల్ రాకాసి రూపమ్ము, మ
త్స్యాకారమ్మున దొర్వులెన్నొ గలవద్దమ్మై జగచ్చక్షుడిన్
ప్రాకాశ్యమ్ముగ జూపె, బింబముగ స్థూపాకారతేజమ్ముగా
నాకాశంబునఁ దేలి యాడినవి హర్మ్యంబుల్ మనోజ్ఞంబుగన్
:
రిప్లయితొలగించండిశార్దూలమ్మున కైపదమ్ము చనుమా చట్టంచు పూరించుమా
శా॥ సాకారంబుగ నంతరిక్ష యుగమే సంజాతమై యొప్పఁగన్
రిప్లయితొలగించండిస్వీకారంబుగ దేశ దేశములు సంప్రీతమ్ముతోఁ బంపఁగా
నాకాంక్షించి యుపగ్రహమ్ము లవియే యంతస్తులేపారఁగా
నాకాశంబునఁ దేలి యాడినవి హర్మ్యంబుల్ మనోజ్ఞంబుగన్
(ఇప్పుడు ఉపగ్రహలనే హర్మ్యాలు అంతరిక్షములో చాలానే ఉన్నాయండి)
బాకీ లన్నియు దీర్చె వర్తకుడు వ్యాపారంబు తాజేయుచున్
రిప్లయితొలగించండిపైకంబెంతయె కూడబెట్టి పురిలో వర్ధిల్లుచున్ గొప్పగన్
శ్రీకారంబును చుట్టి కట్ట గృహముల్ చిందిల్లుచున్ వెల్గులన్
ఆకాశంబున తేలియాడినవి హర్మ్యంబుల్ మనోజ్ఞంబుగన్
ఊహల విహరించుట యంద నుంద్రు భాగ్య
రిప్లయితొలగించండిహీను లెల్లరు నిల లోన నెపుడు దీన
మానవుల కొసఁగ ముదము మానసంపు
టాకసంబునఁ దేలె హర్మ్యంబు లెన్నొ
కీకారణ్యము నందు జంతువుల రక్షింపంగ సూర్యాంశువుల్
ప్రాకారమ్ములు నాఁగ నిల్చినవి సంరంభించి చోద్యమ్ముగా
సాకారమ్ములు మేఘ రాజములె యత్యాశ్చర్య మేపారఁగా
నాకాశంబునఁ దేలి యాడినవి హర్మ్యంబుల్ మనోజ్ఞంబుగన్
తే.గీ:మిథున రాశిని వీడుచు మెరుపు లొలుకు
రిప్లయితొలగించండినుల్క లెన్నియొ రాలుచు నొక్క రాత్రి
ఆకసంబునఁ దేలె, హర్మ్యంబులెన్నొ
క్రిక్కిరిసె చూడ జనులు పై కెక్కి నంత
(మిథున రాశి నుంచి ఒక మారు భారీ స్థాయి ఉల్కాపాతాలు జరిగాయి.అవి చూడటానికి జనం మేడల పైకి ఎక్కారు.మిథున రాశి నుంచి పడే ఉల్కలని జెమినిడ్స్ అంటారు. )
శా :నాక మ్మందున జేర జాలక త్రిశంకాఖ్యుండు" మౌనీంద్ర! రా
రిప్లయితొలగించండివే! కాపాడు" మటన్న కౌశికుడు "నేనే స్వర్గమున్ జేర్చెదన్
నాకమ్మున్ సృజియించినా" ననగ నా నందమ్ములన్ గూర్చ గా
ఆకాశంబునఁ దేలి యాడినవి హర్మ్యంబుల్ మనోజ్ఞంబుగన్”
(త్రిశంకుని కోసం విశ్వామిత్రుడు కృత్రిమం గా స్వర్గాన్ని సృష్టించాడు. అప్పుడు ఆకాశం లోనే భవనాలు తేలి యాడుతాయి కదా!)
రిప్లయితొలగించండికుంతి వ్రతము కొరకని చౌదంతి గ్రీడి
భువికి దింపంగ నెంచుచు పుష్కరముల
వేసెనె పటిమ జూపి న వ్వేళ గాంచ
ఆకసంబునఁ దేలె హర్మ్యంబులెన్నొ.
నీకై యభ్రము ధాత్రి దింపెదనికన్ నీ నోము కై యంచు తా
నాకోదండము చేత బూని విజయుండత్యంత నైపుణ్యమున్
సూకమ్ముల్ గగనమ్ము తాకు నటులన్జోడించు పాళములో
నాకాశంబునఁ దేలి యాడినవి హర్మ్యంబుల్ మనోజ్ఞంబుగన్.
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
రోజు రోజుకు పెరుగు మార్పులను జూచి
పెక్కు నంతస్తు భవనాలు వెలయుచుండ
విస్తుపోవుచు నుంటిరి వింతగ ప్రజ
ఆకసంబునఁ దేలె హర్మ్యంబు లెన్నొ.