కం:ఎంచుచు భారత రుచిని బ ఠించుచు "నది రుచియు, గారెలే రుచి" యని భా షించుచు నీ కవి వర్యుడు కంచములో గారెలున్నఁ గాని తినండే” (కవి గారు భారత పట్టుకుని "వింటే భారత వినాలి, తింటే గారెలే తినాలి" అంటూ ఎదురుగా ఉన్న గారెలని తినటం లేదు.భారత రుచి లో మునిగి పోయాడు. )
ఇంచుకయేని లేదు తనకేలనొ యాకలి నేడు యవ్వలన్ మించెను కాలమీ దినము మిక్కిలిగా వికటించె స్వాస్థ్యమే కొంచెము కూడ బువ్వతిను కోరిక పుట్టక మానసంబునన్ కంచము నిండుగాఁ గలవు గారెలు గాని తినంగ నొప్పఁడే
కందం
రిప్లయితొలగించండిపొంచిన దిగులదిమనమున
మంచమునుండంగ నిద్రమాటయె కరవౌ!
కొంచెము నాకలి లేదన
కంచములో గారెలున్నఁ గాని తినండే!
ఉత్పలమాల
నించిన కుండలన్ గలుగ నీరము దాహములేక త్రాగమే!
మంచమునుండియున్ దిగులుమానసమెంచగ నిద్రవచ్చునే?
కొంచెమునైన నాకలియె కుక్షిని లేదన నిచ్ఛగింపకే
గంచము నిండుగాఁ గలవు గారెలు గాని తినంగ నొప్పఁడే!
సంచిలొ దెచ్చిన వడలను
రిప్లయితొలగించండిపంచన గూర్చుండబెట్టి భక్షించుమనన్
కొంచెము నలత కలదనుచు
కంచములో గారెలున్నఁ గాని తినండే
రిప్లయితొలగించండిపంచగ, మారుతికి నివే
దించి ప్రసాదముగ నచట దేవళ మందున్
కాంచన వర్ణ మ్మున గల
కంచములో గారెలున్నఁ గాని తినండే.
పంచగ భక్త కోటికిని, వాయుసుతుండకు భక్తితో నివే
దించగ నెంచి భూరిగను దేవళ మందున నర్చకుండు వే
యించిన గారె లాతనికి యిష్టమటంచును తెచ్చి నట్టి యా
కంచము నిండుగాఁ గలవు గారెలు గాని తినంగ నొప్పఁడే.
చంచలమౌ వ్యక్తిత్వము
రిప్లయితొలగించండివంచన యని నమ్ముచుండు వలదను నతడే
త్రుంచగ నెంచక నుండును
కంచములో గారెలున్నఁ గాని తినండే
చంచలమైన మానసము సత్వరమున్ మదినమ్మకుండుగా
వంచన లేకపోయినను భద్రము కాదని నిబ్బరించుచున్
ద్రుంచడు తాను చిన్నదగు తుండెము నైనను నోటబెట్టడే
కంచము నిండుగాఁ గలవు గారెలు గాని తినంగ నొప్పఁడే
-
రిప్లయితొలగించండిపంచాపకేశ అయ్యరు
కంచెము లో గారెలున్న గాని తినండే
టంచను గాను జిలేబియె
ముంచెత్తక పిండిని ఘృతమున వేడిగనే
కం:ఎంచుచు భారత రుచిని బ
రిప్లయితొలగించండిఠించుచు "నది రుచియు, గారెలే రుచి" యని భా
షించుచు నీ కవి వర్యుడు
కంచములో గారెలున్నఁ గాని తినండే”
(కవి గారు భారత పట్టుకుని "వింటే భారత వినాలి, తింటే గారెలే తినాలి" అంటూ ఎదురుగా ఉన్న గారెలని తినటం లేదు.భారత రుచి లో మునిగి పోయాడు. )
ఉ:ఎంచుచు గారె లల్లునకు నిష్ట మటంచొక కొన్ని చేయ వే
రిప్లయితొలగించండియించియు నేతి యందు , నొక యింతయు నల్లపు పచ్చ డైన జే
యించరె? కారపుం బొడియు నింత లభించదె? యంచు బల్కె గా
కంచము నిండుగాఁ గలవు గారెలు గాని తినంగ నొప్పఁడే”
(గారె లెంత రుచి ఐనా అల్లపు పచ్చడో,కారపు పొడో ఏవైనా ఉండాలి. )
అంచుల పంచె కట్టుకొని హాయిగ తిర్గెడు వాడు పూటకున్
రిప్లయితొలగించండికుంచెడు బియ్యపన్నమును గుడ్చెడు వాడొక నాడు జారగన్
మంచము నుండి పళ్ళొదిలె మంటయు మిక్కిలి పుట్టె వానికిన్
కంచము నిండుగా గలవు గారెలు గాని తినంగ నొప్పడే
కొంచక రుచిగా వండియు
రిప్లయితొలగించండిమంచిగ తిన మనియు వేడ మరి యల్లు o డే
కొంచము తడ బడు చుండియు
కంచము లో గారె లున్న గాని తి నండే
ఎంచుచు నచ్చినట్టి కడి నింపుగ గ్రోలును సంతతమ్ము బం
రిప్లయితొలగించండిపించ సధర్మచారిణి నివేశము నందు గరమ్ము బ్రీతితో
మంచము పట్టి, చక్కర యమాంతము హెచ్చగ రక్తమందు, తాన్
కంచము నిండుగా గలవు గారెలు గాని తినంగనొప్పడే
మంచిగఁ బంచఁ దలంచి స
రిప్లయితొలగించండిమంచిత రీతిఁ గొని కుంచె డాడిన వడ్లన్
మించి సమకూర్ప నన్నము
కంచములో గారె లున్నఁ గాని తినండే
ముంచిన నీతిబాధలె యమోఘములై ఘన దుఃఖ వార్థిలో
ముంచిన బంధు మిత్ర తతి మూరి సమస్యల యూబిలోపలం
గంచికి పోక నిల్చినఁ బ్రగాఢపు బాధల గాధ లెన్నఁడుం
గంచము నిండుగాఁ గలవు గారెలు గాని తినంగ నొప్పఁడే
ఇంచుకయిన లేదాఁకలి
రిప్లయితొలగించండికొంచెమయిన తినవలెనను కోర్కె నశించెన్
మించెను సమయమ్మయినను
కంచములో గారెలున్నఁ గాని తినండే
ఇంచుకయేని లేదు తనకేలనొ యాకలి నేడు యవ్వలన్
రిప్లయితొలగించండిమించెను కాలమీ దినము మిక్కిలిగా వికటించె స్వాస్థ్యమే
కొంచెము కూడ బువ్వతిను కోరిక పుట్టక మానసంబునన్
కంచము నిండుగాఁ గలవు గారెలు గాని తినంగ నొప్పఁడే