తే.గీ:ప్రేమ తో గూడ తిట్టుట పెద్ద వారి నైజమే కద! మ్రొక్కగా నాన్న తిట్టె "గాడ్దె! ఉద్యోగము లభించె గా!" యటంచు అమ్మకున్ మ్రొక్క "దున్నపో" తనుచుఁ దిట్టె” (పెద్ద వాళ్లు ప్రేమ తో కూడా తిడతారు. )
తమ్ముడు చెల్లెలిర్వురును దాచిన డబ్బులు తస్కరించి నే కమ్మని నేతి లడ్డు కొని గమ్మున దానిని నంజుచుండ మా యమ్మ గ్రహించి కర్ర తన హస్తము నందున పట్ట జంకి నే నమ్మకు వందనం బిడగ నంతక వాహన మంచు దిట్టెరా
ప్రేమ తోడ నొక్కొక సారి పెద్ద వారు దీవెనల నందజేతురు తిట్ల తోడ నాన్నకున్ మ్రొక్క "సాధించి నాడు పదవి యడ్డగాడిదగ తిరిగి" యనుచు తిట్టె నమ్మకున్ మ్రొక్క "దున్నపో త"నుచుఁ దిట్టె.
పరిమితముగ తినుటగూర్చి పలుకుచుండ ,
రిప్లయితొలగించండినన్నము దినుటకు విడువుమనుచు , బంతు
లమ్మకున్ మ్రొక్క ; దున్నపోతనుచుఁ దిట్టె
నామె శిష్యుని, హెచ్చుగనాగ్రహించి
రిప్లయితొలగించండిప్రజల పాలకుడై మ్రింగి ప్రజల సొమ్ము
తిరిగి యోట్లడగగ నూర్లు తిరుగు వేళ
జనుల మధ్యన నిలుచున్న సఖుని యొక్క
యమ్మకున్ మ్రొక్క దున్నపో తనుచుఁ దిట్టె.
అమ్మలు నక్కలంచు వినయమ్మును జూపుచు నోట్ల యుద్ధమున్
గొమ్మల యోట్లతో గెలిచి కోట్ల ధనమ్ము హరించి నట్టి యా
దమ్మము తప్పినట్టి వాసుధాధిపుడచ్చట వేచి యున్న పె
ద్దమ్మకు వందనం బిడఁగ నంతకవాహనమంచుఁ దిట్టెరా.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిరమ్మనుచు పిల్చె నాభామ రాత్రివేళ
తొలగించండిచిమ్మ చీకటి మాటున నమ్మకముగ
పిమ్మట యువకుడేతించి వెలదియొక్క
యమ్మకున్ మ్రొక్క దున్నపో తనుచుఁ దిట్టె
తుమ్మెద రెక్కలై కదలు తుంటరి చూపుల గాలమేసి తా
రమ్మని బిల్చెనా రమణి రాతిరి వేళ రహస్య రీతినిన్
బిమ్మట కోడెకాడటకు వేగిరపాటునఁ జేరి భామ పె
ద్దమ్మకు వందనం బిడఁగ నంతకవాహనమంచుఁ దిట్టెరా
-
రిప్లయితొలగించండిబండ నిదురలోనన్ కన బడిన తృటిని
అమ్మకున్ మ్రొక్క దున్నపో తనుచుఁ దిట్టె
ముద్దు గాను~ గౌరవమున ముందు సాగి
ల పడి నందులకు భళిభళారె యనుచు
బద్ధకస్తుడు పనులందు శ్రద్ధ గొనడు
రిప్లయితొలగించండితెలివిమాలిన మూర్ఖుడు తిండిపోతు
చిల్లరిమ్మని కోరుచు చేయిజాపి
యమ్మకున్ మ్రొక్క దున్నపో తనుచుఁ దిట్టె
ఇమ్మహిలోన సోమరుల నెవ్వఁడు ముఖ్యుఁడనంగ నాతడే
చెమ్మట జారనీడు తన సేనమునుండి నిరంతరమ్ము ద
ద్దమ్మలగూడియుండు పెడదారిఁ జరించును, సొత్తుఁగోరి తా
నమ్మకు వందనం బిడఁగ నంతకవాహనమంచుఁ దిట్టెరా
తే.గీ:ప్రేమ తో గూడ తిట్టుట పెద్ద వారి
రిప్లయితొలగించండినైజమే కద! మ్రొక్కగా నాన్న తిట్టె
"గాడ్దె! ఉద్యోగము లభించె గా!" యటంచు
అమ్మకున్ మ్రొక్క "దున్నపో" తనుచుఁ దిట్టె”
(పెద్ద వాళ్లు ప్రేమ తో కూడా తిడతారు. )
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఉ॥ కమ్మగఁ దల్లిదండ్రులకు గారముఁ జూపక సందె వేళకున్
రిప్లయితొలగించండిగమ్మున త్రావి మద్యమును గల్లల నాడుచు దారి తప్పఁగన్
గ్రమ్మిన దుఃఖ భారమునఁ గాఁగుచు నుండఁగఁ బర్వమంచునే
అమ్మకు వందనం బిడిగ నంతకవాహన యంచుఁ దిట్టెగా
గారము ప్రేమ
నేడు సమాజములో త్రాగుడే అతి పెద్ద సమస్య అండి
(2)ఉ:అమ్మకు నంది విగ్రహము నర్పణ జేయగ బూజ నుంచె,నా
రిప్లయితొలగించండినమ్మక మెట్టిదో! యొక దినమ్మున నిచ్చుచు దున్న బొమ్మ నే
నమ్మకు వందనం బిడఁగ నంతకవాహనమంచుఁ దిట్టెరా!
యి మ్మహి లోన జంతువుల కేని సమత్వము దక్క దేలనో !
(ఎద్దు,దున్న పోతు రెండూ ఉపయోగమే కానీ వాటిని కూడా సమానం గా చూడరు. ఆవు రక్షణ, బర్రె భక్షణ అని కంచె ఐలయ్య అన్నట్టు. )
చిలిపి చేష్టలు చేసెడి చిన్న వాని
రిప్లయితొలగించండికోపగించి యు దరుముచు గొట్ట బోవ
పరుగు లంఘించ దొరుకగా బాలు డప్పు
డమ్మ కున్ మ్రొ క్క దున్న పోత నుచు ది ట్టె
తమ్ముడు చెల్లెలిర్వురును దాచిన డబ్బులు తస్కరించి నే
రిప్లయితొలగించండికమ్మని నేతి లడ్డు కొని గమ్మున దానిని నంజుచుండ మా
యమ్మ గ్రహించి కర్ర తన హస్తము నందున పట్ట జంకి నే
నమ్మకు వందనం బిడగ నంతక వాహన మంచు దిట్టెరా
చెమ్మట జింద నీయక వచించుచు నిత్యము బొంకు లెన్నొ గ్రా
రిప్లయితొలగించండిమమ్మున సంచరించుచు నమానుష కార్యము లందు మున్గు ద
ద్దమ్మ వినూత్నమైన యవతారముఁ దాలిచి యోట్ల గోరి దు
ర్గమ్మకు వందనం బిడఁగ నంతకవాహనమంచుఁ దిట్టెరా
తేటగీతి
రిప్లయితొలగించండి'మహిషుఁ' డెల్లరన్ బాధింప మదినిఁ గ్రుంగి
చేవలుడుగ శరణమంచు చేతులెత్తి
' వాని చేష్టలన్ దెల్పి' కాపాడఁగ లలి
తమ్మకున్ మ్రొక్క, 'దున్నపో తనుచుఁ' దిట్టె
ఉత్పలమాల
మమ్ముల హింసఁబెట్టుచు నమానుషుడౌ 'మహిషాసురుండ' హో!
నెమ్మది వీడగన్ 'జెలఁగి నేరము లెంచఁగ' తాలలేము మా
యమ్మరొ! దిక్కనన్ శరణమంచును రాక్షసుఁ గూర్చి చెప్పి 'దు
ర్గమ్మ' కు వందనం బిడఁగ, 'నంతకవాహనమంచుఁ దిట్టెరా! '
పరుల మాటల నక్కట యాలకించి
రిప్లయితొలగించండియనుజుఁ డెల్ల కుమారుల యందుఁ గదిసి
యాస్తి పంపక మొనరింపు మంచుఁ బల్కి
యమ్మకున్ మ్రొక్క దున్నపో తనుచుఁ దిట్టె.
అమ్మకు మించి దైవమును నారయ శక్యమె యెన్నఁ డేనియున్
నెమ్మి నొనర్చు సేవలను నిత్యము నెన్నక యెట్టి లాభమున్
సొమ్ముల కాసఁ జెంది తన చుట్టములం గని వీడి యక్కటా
యమ్మకు వందనం బిడఁగ నంతక వాహన మంచుఁ దిట్టెరా
ఉ॥
రిప్లయితొలగించండిఅమ్మయె యిమ్మహిన్ మనకు నాకలి దీర్చెడి వేల్పుకాదకో-
అమ్మ సమీహయెప్డు తనయంగజు సేమము కోరుచుండునే-
అమ్మను తిట్టినన్ సుతుల యభ్యుదయమ్మును కోరునట్టి యే
అమ్మకు వందనంబిడగ నంతక వాహనమంచుఁ దిట్టెరా?
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
ప్రేమ తోడ నొక్కొక సారి పెద్ద వారు
దీవెనల నందజేతురు తిట్ల తోడ
నాన్నకున్ మ్రొక్క "సాధించి నాడు పదవి
యడ్డగాడిదగ తిరిగి" యనుచు తిట్టె
నమ్మకున్ మ్రొక్క "దున్నపో త"నుచుఁ దిట్టె.