16, ఏప్రిల్ 2026, గురువారం

సమస్య - 5441

17-4-2026 (శుక్రవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“కపిసైన్యమ్మెల్లఁ గొల్చెఁ గద లంకేశున్”

(లేదా...)

“కపిసైన్యంబులు గూడబల్కుకొని లంకానాథునిన్ గొల్చిరే”

(తిరుక్కోవళ్ళూర్ శ్రీహర్ష గారి ద్విగుణిత అష్టావధానంలో సమస్య) 

23 కామెంట్‌లు:

  1. విపినమున నున్న సీతను
    కపిసైన్యమ్మెల్లఁ గొల్చెఁ గద ; లంకేశున్
    నెపమొనరించిన కతమున
    సపరిజనము నాశమొనర శాపంబిడిరే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాగుంది. విపినంలో ఉన్న సీతను వానరసైన్యం ఎప్పుడు కొలిచింది?

      తొలగించండి
    2. 🙏కొలవడానికి తలచుకుంటే చాలదా గురువుగారూ

      తొలగించండి

  2. ఎపుడో యభయమొసగి ఛ
    త్రపతి విభీషణుని చేయ దాశరథియె, నా
    నృపతి కి దనుజులు మరియును
    కపిసైన్యమ్మెల్లఁ గొల్చెఁ గద లంకేశున్.


    విపరీతమ్మని యెంచబోకుమిట పృథ్వీభృత్తెవండన్న నా
    అపరాధమ్మొనరించి రావణుడటన్ హారమ్ములో మ్రగ్గ ఛ
    త్రపతిన్ జేసెను రావణానుజుని సీతావల్ల భుండప్పుడా
    కపిసైన్యంబులు గూడబల్కుకొని లంకానాథునిన్ గొల్చిరే.

    రిప్లయితొలగించండి
  3. -
    తపమొనరిచె రామ యనన్
    కపిసైన్యమ్మెల్లఁ , గొల్చెఁ గద లంకేశున్
    కపటస్థులు రాక్షసులు సు
    రపతియు వరుణాది తదితర మహాశక్తుల్



    రిప్లయితొలగించండి
  4. కపటుండౌ దశకంఠుని
    విపరీతంబగు భయమున వీక్షించిన దా
    కపిసైన్యము చపలతతో
    కపిసైన్యమ్మెల్లఁ గొల్చెఁ గద లంకేశున్

    కపటాత్ముండగు దుష్టునిన్ గనుగొనన్ కంపిల్లెనా సైన్యమే
    చపలత్వమ్మున కోతి మూకలకటా సాగించిరే కృత్యముల్
    విపరీతమ్ముగ భీతినొంది కడకున్ విస్పష్టమౌ కొల్తతో
    కపిసైన్యంబులు గూడబల్కుకొని లంకానాథునిన్ గొల్చిరే

    [కొల్చు = కొలతవేయు]

    రిప్లయితొలగించండి
  5. కృపఁగనుమని శ్రీరాముని
    కపిసైన్యమ్మెల్లఁ గొల్చెఁ గద, లంకేశున్
    కుపితులగుచు దూషించిరి
    నెపమెన్నుచు నేలచూలిఁ నిర్బంధమ్మున్

    కృపతో జూడుమటంచు రాఘవుని భక్తింగొల్చి ప్రార్థించిరా
    కపిసైన్యంబులు గూడబల్కుకొని, లంకానాథునిన్ గొల్చిరే
    కపిసైన్యంబులు కోల్మసంగ నసురుల్ కాపాడఁగా వేడుచున్
    విపరీతమ్ముగ సాగె నిర్గడల సంస్ఫేటమ్ము లంకాపురిన్

    రిప్లయితొలగించండి
  6. మ॥ అపహాస్యంబొనరించ రామకథ నేహ్యంబొందరే సర్వులున్
    రిపులై భారత దేశ సచ్చరిత వక్రీభూతమున్ జేయఁగా
    దపనన్ గాంచెడు దుర్మదాంధులుఁ గనన్ దౌర్భాగ్యులే పల్కిరో
    ”కపిసైన్యంబులు గూడబల్కుకొని లంకానాథునిన్ గొల్చిరే”

    రిప్లయితొలగించండి
  7. కపట ము నెరు గని రాముని
    కపి సైన్య మ్మె ల్ల గొల్చె గద ::లంకేశున్
    విపరీత పు వర్త ను డౌ
    కపటు ని సేవించి రసుర గణ ములు గదరా

    రిప్లయితొలగించండి
  8. కం:కృప తో రాముడు లంకా
    ధిపు జేయ విభీషణున్ స్తుతించుచు, రాముం
    డిపుడే గెల్చె ననుచు నా
    కపిసైన్యమ్మెల్లఁ గొల్చెఁ గద లంకేశున్”
    (రాముడు యుద్ధానికి ముందే విభీషణుణ్ని లంకా రాజ్యానికి రాజుగా పట్టాభిషేకం చేసేసాడు.కనుక విభీషణుడు లంకేశు డై పోయాడు.వానర సైన్యం క్రొత్త లంకేశునికి నమస్కరించింది గౌరవించింది. )

    రిప్లయితొలగించండి
  9. మ:కపిసైన్యమ్ముల జూచి నవ్వుకలుగంగా నింద్రజి త్తిట్లనెన్
    విపరీతమ్మగు కోతి బుద్ధి కద యీ వింతైన భల్లూకముల్ ,
    కపిసైన్యంబులు గూడబల్కుకొని లంకానాథునిన్ గొల్చిరే
    చపలత్వమ్మున రాము విక్రమము తో సామ్యమ్ము
    జేకూర్చుచున్!
    (కోతి సైన్యాన్ని,భల్లూకాలని చూసి ఇంద్రజిత్తు నవ్వుకున్నాడు. వీళ్లు రావణాసురుణ్ని ఆ రాముడి విక్రమం తో కొలుస్తారా? రాము డెంత? అని. ఇక్కడ కొలవటం అంటే కొలత అనే అర్థం లో వాడాను. )

    రిప్లయితొలగించండి
  10. కం॥
    రపణపు వరగర్వితుడై
    తపసుల కమరుల కిడగను దావంతములన్
    విపుల బలోపేత వృషా
    కపిసైన్యమ్మెల్ల గొల్చెగద లంకేశున్!!

    రిప్లయితొలగించండి
  11. విపినంబందున రాముపై బగితి యావేశించ పూజించిరా
    కపిసైన్యంబులు గూడ బల్కుకొని, లంకానాథునిన్ గొల్చిరే
    విపరీతంబుగ పోరుసల్పిరి గదా వీరత్వమున్ జూపుచున్
    కపటత్వంబును జూపి రావణుడు నాకయ్యంబునన్ జచ్చెగా

    రిప్లయితొలగించండి
  12. నృపవర! కిష్కింధాపతిఁ
    గపి సైన్యమ్మెల్లఁ గొల్వఁ గమనీయముగా
    విపరీ తాచా రాసుర
    కపి సైన్యమ్మెల్లఁ గొల్చెఁ గద లంకేశున్

    [కపి = 1. కోఁతి, 2. పంది]


    విపులాధీశుఁడు రామ చంద్రుఁ డనిలో విద్వేషణుం జంపఁగా
    నపరాహ్నమ్మున నా విభీషణుని రాజ్యార్థాభిషేకమ్మనన్
    నృప రాట్సూను వరేణ్యు రాఘవుని సందేశమ్ము పాటించుచుం
    గపి సైన్యంబులు గూడఁ బల్కుకొని లంకా నాథునిన్గొల్చిరే

    రిప్లయితొలగించండి
  13. కందం
    తపనన్ రామునిఁ జేరియుఁ
    గృపఁగోరి విభీషణుండు కేల్మోడ్చంగన్
    నృపునిగ నిల్పంగ వృషా
    కపి, సైన్యమ్మెల్లఁ గొల్చెఁ గద లంకేశున్

    మత్తేభవిక్రీడితము
    తపనన్ జేరియు రామునిన్ శరణనన్ దాక్షిణ్యుఁడై రాముడున్
    గృపతోఁ జూచి విభీషణున్, దశగళున్ గెల్పొంది యుద్ధంబునన్
    నృపునిన్ జేయుచు గద్దెపై నియతితో నిల్పంగ లంకన్ వృషా
    కపి, సైన్యంబులు గూడబల్కుకొని లంకానాథునిన్ గొల్చిరే

    రిప్లయితొలగించండి
  14. విపినంబందున జానకీ సుధతినిన్
    వీక్షించి లంకేశుడున్
    కపటత్వంబున వెంటచేకొని వడిన్
    గర్వాంధు డేగెన్, మహా
    సఫలత్వంబును గూర్చె స్నేహితము
    నిస్సందేముగా రాముడా
    కపి సైన్యంబును కూడ బల్కుకొని
    లంకాపురిన్ గెల్చిరే.

    రిప్లయితొలగించండి
  15. కపి రాజేంద్రుని యానతోడుతను సంకల్పమ్ముతో సేతువున్
    విపులమ్మైన బలమ్ముతో నిలిప యబ్ధిన్ కోతి మూకల్ వృషా
    కపి పౌలస్త్యుని జంప, నూతనమునౌ క్ష్మాభృత్తు పాలింపగా
    కపిసైన్యంబులు గూడబల్కుకొని లంకానాథునిన్ గొల్చి రే

    రిప్లయితొలగించండి

  16. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    కపుల సహాయముఁ లంకా
    ధిపతిని దశరథ సుతుడు వధించగ రణమున్
    నృపతిగ విభీషణుండయె
    కపి సైన్యమ్మెల్లఁ గొల్చెఁ గద లంకేశున్.

    రిప్లయితొలగించండి