18-4-2026 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అన్ననుఁ బతిగఁ గొని యతివ మురిసె”
(లేదా...)
“అన్నను భర్తగాఁ గొనియె నన్నులమిన్న గడున్ ముదంబునన్”
ఆటవెలదివెన్నుని కడకంపి విప్రవర్యుఁ దనదుమానసమ్ము దెలిపి మనువుఁ గోరిపంకజాక్షునంది వైదర్భి, యన్న కాదన్ననుఁ బతిగఁ గొని యతివ మురిసెఉత్పలమాలవెన్నుని భక్తితోఁ గొలిచి విప్రునినంపియు దెల్పగన్ మదిన్మన్నన తోడ కాన్కలిడి మానినినందగ వత్తునంచనెన్దిన్నఁగఁ దేరునన్ గొనఁగఁ దీరగ రుక్మిణి సాగె, యన్న కాదన్నను భర్తగాఁ గొనియె నన్నులమిన్న గడున్ ముదంబునన్!
పరిపరి విధములుగ భావించి చూడగ ,దండ్రి మాట వినక దప్ప దనుచు ,గడన రహితుడయ్యు కామనుడనుచు సాయన్ననుఁ బతిగఁ గొని యతివ మురిసె
శివుని ధనువు విరిచి సీతను వరియింప సభయు మె చ్చె నతని సాహసమును సీత ముదము నంది జీవి తే శుని గ రా మన్న ను పతిగగొని యతివ మురిసె
*(సుభద్ర తో అర్జునుడు పలికిన మాటలు గా...)*అధముడు శిశు పాలు డంచు దలచి తాను మురళి ధరుని బిలువ, ముదిత పిలుపు నాలకించి వచ్చె నహిరిపువైన మీ యన్ననుఁ బతిగఁ గొని యతివ మురిసె.అన్నయె నిర్ణయించిన దురాత్ముని కాదని పెండ్లి యాడగా వెన్నుని రమ్మటంచు నొక విప్రుని కృష్ణుని చెంత కంపి యా చెన్నుని పింఛధారి యదు శ్రేష్ఠడు దేవకి నందనుండు మీ యన్నను భర్తగాఁ గొనియె నన్నులమిన్న గడున్ ముదంబునన్.
శివ ధనుస్సు విరిచె శ్రీరామ చంద్రుడేపరవశాన జనులు ప్రస్తుతింపవరుని కంఠ సీమఁ వరమాల వైచి రామన్ననుఁ బతిగఁ గొని యతివ మురిసెకన్నుల ముందునిల్చి కరకంఠుని ధర్మము నెక్కుపెట్టగామిన్నుల ముట్టె కేకిసలు మేలగు రీతిని రామచంద్రుడేమన్నన లందినంత వరమాలను వైచినదై మహీజ రామన్నను భర్తగాఁ గొనియె నన్నులమిన్న గడున్ ముదంబునన్
కన్నులందు విరిసె వెన్నెల సీతకువిరువ రామమూర్తి హరుని విల్లుజానకి మదిలోన సమ్మోదమొందె రామన్ననుఁ బతిగఁ గొని యతివ మురిసెక్రన్నన మౌని యాజ్ఞఁగొని రాఘవుఁ డెక్కిడ శైవచాపమున్వెన్నడి వ్రయ్యలయ్యెనది వేడ్కగ నెల్లరు జూచుచుండగాకన్నులలోన వెన్నెలలు కల్కి మహీజకు చెంగలించ రామన్నను భర్తగాఁ గొనియె నన్నులమిన్న గడున్ ముదంబునన్
ఉ॥ మిన్నగఁ బంట భూములును మిక్కిలి హెచ్చుగ సంపదాదులున్గొన్ని పరిశ్రమల్ గలిగి కోరిన రూపున నొప్పుచుండఁగన్మన్నన సేసి ప్రేమఁ గని మాన్యుఁడటంచు వరించి తాను సుబ్బన్నను భర్తగాఁ గొనియె నన్నుల మిన్న గడున్ ముదంబుగన్సుబ్బన్న సుబ్రహ్మణ్యంకు ముద్దుపేరండి. నేటి అమ్మాయిల ఆశలు ప్రతిబింబించేందుకు ప్రయత్నించానండి
కన్నుకు రెప్పయుంబలెను కాచుచు నుండెడు వాడు మిక్కిలిన్సున్నిత మైన మానసము సుందర రూపము కల్గి నట్టి వెంకన్నను భర్తగాగొనియె నన్నుల మిన్న కడున్ ముదంబునన్పిన్నతనంబునుండి తన ప్రేమను జూపుచు వానిపైననున్
-రాధ స్నేహితి తన రారంగ నద్దానిఅన్ననుఁ బతిగఁ గొని యతివ మురిసె
పన్నుగ నాసభాస్థలిని భవ్య పరాక్రమయోద్ధలందరున్క్రన్నన చూచుండగను గార్ముకమెత్తెను రామచంద్రడున్చెన్నగు సీత తోషమున చెల్వముగా జని హారమేసి రామన్నను భర్తగా గొనియె యన్నులమిన్న గడున్ ముదంబునన్.
కన్నది శౌర్య వంతు నొక కానన మందు హిడింబ యిచ్చతోక్రన్నన చిక్క మానసము కాంతునిగా గ్రహియించు కోర్కెతోచెన్నగు రూపు కుంతికడ చేరి, వరమ్ము లభింప బ్రీతి భీమన్నను భర్తగాఁ గొనియె నన్నులమిన్న గడున్ ముదంబునన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
చూచు వార లెల్లఁ జూడ ముచ్చ టయిన జంట యంచుఁ బొగడఁ జంద్ర వదన మన మలరఁగఁ దనదు చిననాఁటి చెలికత్తె యన్ననుఁ బతిగఁ గొని యతివ మురిసె మిన్నగఁ దన్ను జూచు నను మేటి తలంపు సెలంగ నాత్మలోఁ గ్రన్నన నుద్యమించి చెలికాని వరించి వరింపఁ జేసి తా మన్ననఁ జిన్న నాఁటి యభిమానినిఁ జింతిల కుండ నెవ్వ రే మన్నను భర్తగాఁ గొనియె నన్నులమిన్న గడున్ ముదంబునన్
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.చదువు గలిగి,చూడ చక్కని వాడునుమానవత్వమున్న మనుజు డతడువదల లేక నతని వలపును హితురాలియన్నను బతిగఁ గొని యతివ మురిసె.
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.కన్నుల ముందె శంకరుని కార్ముక మెత్తగ రామచంద్రుడున్మిన్నగ సంతసించితిరి మేటి సభాసదులెల్ల రున్ భళా!కన్నుల కాంతులున్ మెరయ కల్కి మహీజయు దండ వైచి రా మన్నను భర్తగాఁ గొనియె నన్నులమిన్న గడున్ ముదంబునన్.
ఆటవెలది
రిప్లయితొలగించండివెన్నుని కడకంపి విప్రవర్యుఁ దనదు
మానసమ్ము దెలిపి మనువుఁ గోరి
పంకజాక్షునంది వైదర్భి, యన్న కా
దన్ననుఁ బతిగఁ గొని యతివ మురిసె
ఉత్పలమాల
వెన్నుని భక్తితోఁ గొలిచి విప్రునినంపియు దెల్పగన్ మదిన్
మన్నన తోడ కాన్కలిడి మానినినందగ వత్తునంచనెన్
దిన్నఁగఁ దేరునన్ గొనఁగఁ దీరగ రుక్మిణి సాగె, యన్న కా
దన్నను భర్తగాఁ గొనియె నన్నులమిన్న గడున్ ముదంబునన్!
పరిపరి విధములుగ భావించి చూడగ ,
రిప్లయితొలగించండిదండ్రి మాట వినక దప్ప దనుచు ,
గడన రహితుడయ్యు కామనుడనుచు సా
యన్ననుఁ బతిగఁ గొని యతివ మురిసె
శివుని ధనువు విరిచి సీతను వరియింప
రిప్లయితొలగించండిసభయు మె చ్చె నతని సాహసమును
సీత ముదము నంది జీవి తే శుని గ రా
మన్న ను పతిగగొని యతివ మురిసె
రిప్లయితొలగించండి*(సుభద్ర తో అర్జునుడు పలికిన మాటలు గా...)*
అధముడు శిశు పాలు డంచు దలచి తాను
మురళి ధరుని బిలువ, ముదిత పిలుపు
నాలకించి వచ్చె నహిరిపువైన మీ
యన్ననుఁ బతిగఁ గొని యతివ మురిసె.
అన్నయె నిర్ణయించిన దురాత్ముని కాదని పెండ్లి యాడగా
వెన్నుని రమ్మటంచు నొక విప్రుని కృష్ణుని చెంత కంపి యా
చెన్నుని పింఛధారి యదు శ్రేష్ఠడు దేవకి నందనుండు మీ
యన్నను భర్తగాఁ గొనియె నన్నులమిన్న గడున్ ముదంబునన్.
శివ ధనుస్సు విరిచె శ్రీరామ చంద్రుడే
రిప్లయితొలగించండిపరవశాన జనులు ప్రస్తుతింప
వరుని కంఠ సీమఁ వరమాల వైచి రా
మన్ననుఁ బతిగఁ గొని యతివ మురిసె
కన్నుల ముందునిల్చి కరకంఠుని ధర్మము నెక్కుపెట్టగా
మిన్నుల ముట్టె కేకిసలు మేలగు రీతిని రామచంద్రుడే
మన్నన లందినంత వరమాలను వైచినదై మహీజ రా
మన్నను భర్తగాఁ గొనియె నన్నులమిన్న గడున్ ముదంబునన్
కన్నులందు విరిసె వెన్నెల సీతకు
రిప్లయితొలగించండివిరువ రామమూర్తి హరుని విల్లు
జానకి మదిలోన సమ్మోదమొందె రా
మన్ననుఁ బతిగఁ గొని యతివ మురిసె
క్రన్నన మౌని యాజ్ఞఁగొని రాఘవుఁ డెక్కిడ శైవచాపమున్
వెన్నడి వ్రయ్యలయ్యెనది వేడ్కగ నెల్లరు జూచుచుండగా
కన్నులలోన వెన్నెలలు కల్కి మహీజకు చెంగలించ రా
మన్నను భర్తగాఁ గొనియె నన్నులమిన్న గడున్ ముదంబునన్
ఉ॥ మిన్నగఁ బంట భూములును మిక్కిలి హెచ్చుగ సంపదాదులున్
రిప్లయితొలగించండిగొన్ని పరిశ్రమల్ గలిగి కోరిన రూపున నొప్పుచుండఁగన్
మన్నన సేసి ప్రేమఁ గని మాన్యుఁడటంచు వరించి తాను సు
బ్బన్నను భర్తగాఁ గొనియె నన్నుల మిన్న గడున్ ముదంబుగన్
సుబ్బన్న సుబ్రహ్మణ్యంకు ముద్దుపేరండి. నేటి అమ్మాయిల ఆశలు ప్రతిబింబించేందుకు ప్రయత్నించానండి
కన్నుకు రెప్పయుంబలెను కాచుచు నుండెడు వాడు మిక్కిలిన్
రిప్లయితొలగించండిసున్నిత మైన మానసము సుందర రూపము కల్గి నట్టి వెం
కన్నను భర్తగాగొనియె నన్నుల మిన్న కడున్ ముదంబునన్
పిన్నతనంబునుండి తన ప్రేమను జూపుచు వానిపైననున్
-
రిప్లయితొలగించండిరాధ స్నేహితి తన రారంగ నద్దాని
అన్ననుఁ బతిగఁ గొని యతివ మురిసె
పన్నుగ నాసభాస్థలిని భవ్య పరాక్రమ
రిప్లయితొలగించండియోద్ధలందరున్
క్రన్నన చూచుండగను గార్ముక
మెత్తెను రామచంద్రడున్
చెన్నగు సీత తోషమున చెల్వము
గా జని హారమేసి రా
మన్నను భర్తగా గొనియె యన్నుల
మిన్న గడున్ ముదంబునన్.
కన్నది శౌర్య వంతు నొక కానన మందు హిడింబ యిచ్చతో
రిప్లయితొలగించండిక్రన్నన చిక్క మానసము కాంతునిగా గ్రహియించు కోర్కెతో
చెన్నగు రూపు కుంతికడ చేరి, వరమ్ము లభింప బ్రీతి భీ
మన్నను భర్తగాఁ గొనియె నన్నులమిన్న గడున్ ముదంబునన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచూచు వార లెల్లఁ జూడ ముచ్చ టయిన
రిప్లయితొలగించండిజంట యంచుఁ బొగడఁ జంద్ర వదన
మన మలరఁగఁ దనదు చిననాఁటి చెలికత్తె
యన్ననుఁ బతిగఁ గొని యతివ మురిసె
మిన్నగఁ దన్ను జూచు నను మేటి తలంపు సెలంగ నాత్మలోఁ
గ్రన్నన నుద్యమించి చెలికాని వరించి వరింపఁ జేసి తా
మన్ననఁ జిన్న నాఁటి యభిమానినిఁ జింతిల కుండ నెవ్వ రే
మన్నను భర్తగాఁ గొనియె నన్నులమిన్న గడున్ ముదంబునన్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
చదువు గలిగి,చూడ చక్కని వాడును
మానవత్వమున్న మనుజు డతడు
వదల లేక నతని వలపును హితురాలి
యన్నను బతిగఁ గొని యతివ మురిసె.
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
కన్నుల ముందె శంకరుని కార్ముక మెత్తగ
రామచంద్రుడున్
మిన్నగ సంతసించితిరి మేటి సభాసదులెల్ల
రున్ భళా!
కన్నుల కాంతులున్ మెరయ కల్కి
మహీజయు దండ వైచి రా
మన్నను భర్తగాఁ గొనియె నన్నులమిన్న గడున్
ముదంబునన్.