22-4-2026 (బుధవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“కనులు గలవు గాని కాంచలేఁడు”(లేదా...)“ఇంతలు గన్నులుండి కనఁ డెయ్యది వాఁడు వివేకదూరుఁడై”
వరూధినీ విలాపము:ఆటవెలదివగలు జూపి చేర ప్రవరాఖ్యుఁడేలనోకట్టుబాటులనుచు నెట్టె తుదకునప్సరసల పొందు యరుదైన నింతలుకనులు గలవు గాని కాంచలేఁడు!ఉత్పలమాలకంతు జయంతులన్ గెలుచు కమ్మని రూపము సూచినంత నేనింతిగఁ జేరినన్ ప్రవరుఁడేలనొ మోజున కౌగిలించడే?సుంతయు నప్సరామణిగఁ సోయగమొల్క చలించడేలనో?యింతలు గన్నులుండి కనఁ డెయ్యది వాఁడు వివేకదూరుఁడై!
*(దుర్యోధనుని తో శకుని మాటలు గా ఊహించి.)*ధర్మ మార్గ మంచు ధర్మజు డెప్పుడు నిలువ రించు సోదరులను తాను దుష్టులమగు మనదు దుశ్చర్యలనతండు కనులు గలవు గాని కాంచలేఁడు.సుంతయు నైన యాగ్రహము చూపడు ధర్మము సత్యమంచు తా శాంతిని కోరు వాడతడు శత్రువు లెంతగ కించ పర్చినన్ పంతము బూనబోడుకద పాండుసుతాగ్రజుడెంచి చూడగా నింతలు గన్నులుండి కనఁ డెయ్యది వాఁడు వివేకదూరుఁడై.
పుట్టుగుడ్డి యగుచు పుట్టినందున రెండుకనులు గలవు గాని కాంచలేఁడు ,జీవితమున సతము జేదోడు గావలె , పాపమతని జూడ బాధ కలుగు
పట్టకుండునెపుడు ప్రజల సమస్యలు స్వప్రయోజనమ్మె వానికెపుడుమంచి చూడలేని మాయావి నేతకు కనులు గలవు గాని కాంచలేఁడుచింతలు లేనివాఁడు కడు చిత్రముగా చెలరేఁగు చుండురాపంతము బూని దుష్ట పరిపాలన సల్పిన మూర్ఖ నేతరాసుంతయు లెక్కలేదు మరి చూచుట కేల మనస్కరించురాయింతలు గన్నులుండి కనఁ డెయ్యది వాఁడు వివేకదూరుఁడై
విపినమందు పులిని వేటాడగా బోయిదారి గానరాక తల్లడిల్లెఅంధకారమలమె యగుపించదు తెరువుకనులు గలవు గాని కాంచలేఁడుఎంతయొ గాళకుండనని యెల్లరితోడ నహంకరించి తాపంతము బూని యొక్కరుఁడు ప్రాంతరమందున జొచ్చె నొంటిగానంతట దారితప్పె నతఁడా విపినంబున, గ్రమ్మె చీకటుల్యింతలు గన్నులుండి కనఁ డెయ్యది వాఁడు వివేకదూరుఁడై
ఆ.వె:బాహ్య జగతి నెల్ల బరికించగా రెండుకనులు గలవు గాని కాంచలేఁడుకనుల తోడ నరుడు కనులకు వెలు గిచ్చు నాత్మ తత్త్వ మదియె అద్భుతమ్ము
ఉ॥ కొంతయు జ్ఞాన సంపదలు గూడక విజ్ఞత శూన్యమై చనన్బొంతన లేని చింతనల భూరిగ ద్రవ్యము వ్యర్థమయ్యెడిన్వింత మనస్స్థితిన్ బడసె వీఁడెవఁడందునొ చూడగా నహోఇంతలు గన్నలుండి కనఁ డెయ్యది వాఁడు వివేకదూరుఁడై(సమాజంలో ఉన్న మరొక రుగ్మత ఇది అండి ధనము వ్యర్థము చేయడం జూదమాడడం)
ముంజకాయ కుండు ముచ్చట కొల్పఁగ మూడు కన్నులంట పాడిగాను జూచు వారి కెల్లఁ జోద్యము మఱి వాఁడు కనులు గలవు గాని కాంచ లేఁడు ఎంతటి వారికైన వరియించిన నక్కట పోవు కాలమే వింత నెడంద మంచి చెడు వీక్షణ మబ్బదు సుంత యేనియుం బంతము లుబ్బు సంతతము పండితుఁ డైనను మూర్ఖు భంగిఁ దా నింతలు గన్ను లుండి కనఁ డెయ్యది వాఁడు వివేకదూరుఁడై
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కాంతల జూసినంత వడి కామము హెచ్చు మనస్సు నంధమౌసుంతయు యింగితమ్ము పొడచూపదు మత్తున మున్గు వానికిన్పంతముతోడ సాగుచును ప్రల్లడుడై చరియించు మొప్పె తానింతలు గన్నులుండి కనఁ డెయ్యది వాఁడు వివేకదూరుఁడై
ప్రజల రాజ్య మందు పరిణామ ములు గాంచి తగిన చర్య గొనెడు దక్షడగుచు మెలగ లేని వాడు మేదిని యందున కనులు గలవు గాని కాంచ లేడు
ఓ దశాబ్దం ముందటి బుజ్జిపండు - శంకరాభరణంకొలువులో చదువు ఇప్పుడు వీడియో గా క్రింది లింకులో https://youtu.be/XAUPTrJoGfg?si=ZEbcRLRWQkVBqp74చీర్స్జిలేబి
https://kandishankaraiah.blogspot.com/2012/01/blog-post_4505.html?
వరూధినీ విలాపము:
రిప్లయితొలగించండిఆటవెలది
వగలు జూపి చేర ప్రవరాఖ్యుఁడేలనో
కట్టుబాటులనుచు నెట్టె తుదకు
నప్సరసల పొందు యరుదైన నింతలు
కనులు గలవు గాని కాంచలేఁడు!
ఉత్పలమాల
కంతు జయంతులన్ గెలుచు కమ్మని రూపము సూచినంత నే
నింతిగఁ జేరినన్ ప్రవరుఁడేలనొ మోజున కౌగిలించడే?
సుంతయు నప్సరామణిగఁ సోయగమొల్క చలించడేలనో?
యింతలు గన్నులుండి కనఁ డెయ్యది వాఁడు వివేకదూరుఁడై!
రిప్లయితొలగించండి*(దుర్యోధనుని తో శకుని మాటలు గా ఊహించి.)*
ధర్మ మార్గ మంచు ధర్మజు డెప్పుడు
నిలువ రించు సోదరులను తాను
దుష్టులమగు మనదు దుశ్చర్యలనతండు
కనులు గలవు గాని కాంచలేఁడు.
సుంతయు నైన యాగ్రహము చూపడు ధర్మము సత్యమంచు తా
శాంతిని కోరు వాడతడు శత్రువు లెంతగ కించ పర్చినన్
పంతము బూనబోడుకద పాండుసుతాగ్రజుడెంచి చూడగా
నింతలు గన్నులుండి కనఁ డెయ్యది వాఁడు వివేకదూరుఁడై.
పుట్టుగుడ్డి యగుచు పుట్టినందున రెండు
రిప్లయితొలగించండికనులు గలవు గాని కాంచలేఁడు ,
జీవితమున సతము జేదోడు గావలె ,
పాపమతని జూడ బాధ కలుగు
పట్టకుండునెపుడు ప్రజల సమస్యలు
రిప్లయితొలగించండిస్వప్రయోజనమ్మె వానికెపుడు
మంచి చూడలేని మాయావి నేతకు
కనులు గలవు గాని కాంచలేఁడు
చింతలు లేనివాఁడు కడు చిత్రముగా చెలరేఁగు చుండురా
పంతము బూని దుష్ట పరిపాలన సల్పిన మూర్ఖ నేతరా
సుంతయు లెక్కలేదు మరి చూచుట కేల మనస్కరించురా
యింతలు గన్నులుండి కనఁ డెయ్యది వాఁడు వివేకదూరుఁడై
విపినమందు పులిని వేటాడగా బోయి
రిప్లయితొలగించండిదారి గానరాక తల్లడిల్లె
అంధకారమలమె యగుపించదు తెరువు
కనులు గలవు గాని కాంచలేఁడు
ఎంతయొ గాళకుండనని యెల్లరితోడ నహంకరించి తా
పంతము బూని యొక్కరుఁడు ప్రాంతరమందున జొచ్చె నొంటిగా
నంతట దారితప్పె నతఁడా విపినంబున, గ్రమ్మె చీకటుల్
యింతలు గన్నులుండి కనఁ డెయ్యది వాఁడు వివేకదూరుఁడై
ఆ.వె:బాహ్య జగతి నెల్ల బరికించగా రెండు
రిప్లయితొలగించండికనులు గలవు గాని కాంచలేఁడు
కనుల తోడ నరుడు కనులకు వెలు గిచ్చు
నాత్మ తత్త్వ మదియె అద్భుతమ్ము
ఉ॥ కొంతయు జ్ఞాన సంపదలు గూడక విజ్ఞత శూన్యమై చనన్
రిప్లయితొలగించండిబొంతన లేని చింతనల భూరిగ ద్రవ్యము వ్యర్థమయ్యెడిన్
వింత మనస్స్థితిన్ బడసె వీఁడెవఁడందునొ చూడగా నహో
ఇంతలు గన్నలుండి కనఁ డెయ్యది వాఁడు వివేకదూరుఁడై
(సమాజంలో ఉన్న మరొక రుగ్మత ఇది అండి ధనము వ్యర్థము చేయడం జూదమాడడం)
ముంజకాయ కుండు ముచ్చట కొల్పఁగ
రిప్లయితొలగించండిమూడు కన్నులంట పాడిగాను
జూచు వారి కెల్లఁ జోద్యము మఱి వాఁడు
కనులు గలవు గాని కాంచ లేఁడు
ఎంతటి వారికైన వరియించిన నక్కట పోవు కాలమే
వింత నెడంద మంచి చెడు వీక్షణ మబ్బదు సుంత యేనియుం
బంతము లుబ్బు సంతతము పండితుఁ డైనను మూర్ఖు భంగిఁ దా
నింతలు గన్ను లుండి కనఁ డెయ్యది వాఁడు వివేకదూరుఁడై
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికాంతల జూసినంత వడి కామము హెచ్చు మనస్సు నంధమౌ
రిప్లయితొలగించండిసుంతయు యింగితమ్ము పొడచూపదు మత్తున మున్గు వానికిన్
పంతముతోడ సాగుచును ప్రల్లడుడై చరియించు మొప్పె తా
నింతలు గన్నులుండి కనఁ డెయ్యది వాఁడు వివేకదూరుఁడై
ప్రజల రాజ్య మందు పరిణామ ములు గాంచి
రిప్లయితొలగించండితగిన చర్య గొనెడు దక్షడగుచు
మెలగ లేని వాడు మేదిని యందున
కనులు గలవు గాని కాంచ లేడు
ఓ దశాబ్దం ముందటి బుజ్జిపండు - శంకరాభరణం
రిప్లయితొలగించండికొలువులో చదువు
ఇప్పుడు వీడియో గా క్రింది లింకులో
https://youtu.be/XAUPTrJoGfg?si=ZEbcRLRWQkVBqp74
చీర్స్
జిలేబి
https://kandishankaraiah.blogspot.com/2012/01/blog-post_4505.html?
రిప్లయితొలగించండి