19, ఏప్రిల్ 2026, ఆదివారం

సమస్య - 5444

20-4-2026 (సోమవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“కంజాతాక్షునకుఁ దొడవు గంకాళమ్మే”

(లేదా...)

“కంజాతాక్షుని భూషణమగుఁ గదా కంకాళ మెల్లప్పుడున్”

6 కామెంట్‌లు:

  1. శార్దూలవిక్రీడితము
    శింజానమ్మగు లాస్యమై హరియె తాఁ జేరంగఁ, గౌంతేయులన్
    రంజింపంగను సంధివాక్యములతో రాణింపఁగన్ జూచినన్
    భంజింపంగ ఫలించ నెత్తుగడ మా భాగ్యంబనన్ సత్యమై
    కంజాతాక్షుని భూషణమ్మగుఁ గదా కంకాళ మెల్లప్పుడున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కందం
      శింజితమున శ్రీకృష్ణుడు
      రంజింపగ పాండవులను రాగన్ సభలో
      భంజించెడు మా యెత్తున
      కంజాతాక్షునకుఁ దొడవు గంకాళమ్మే!

      తొలగించండి
  2. పింజరపు నగ నిడుటకయి
    పుంజెడు రూప్యములు గూడ పొసగక, బగితిన్
    గుంజీలు దీసి యిడెనిక
    కంజాతాక్షునకుఁ దొడవు గంకాళమ్మే

    రిప్లయితొలగించండి

  3. గంజాయి మత్తు తో కా
    లంజరిని గాంచి విష్టరశ్రవు డంచున్
    సంజీవి యనుకొని పలికె
    కంజాతాక్షునకుఁ దొడవు గంకాళమ్మే.


    సంజీవా పలుకంగనేల యిటులన్ సత్యంబు కాదందు నే
    కంజాతాక్షుడనంగ క్ష్వేళగళుడే కాదందువా శూలి యున్
    కంజాతాక్షుడె యందువా మరిగనన్ కామారి యేయైనచో
    కంజాతాక్షుని భూషణమగుఁ గదా కంకాళ మెల్లప్పుడున్.

    రిప్లయితొలగించండి
  4. సంజయ! శ్రీవత్సంబగు
    కంజాతాక్షునకుఁ దొడవు; గంకాళమ్మే
    కంజాయించిన విధమున
    భంజన నిడు వైద్య విద్యఁ భావింపంగన్

    అంజాయించక నిత్య సత్యములతో నాలోచనల్ సల్పుమా
    కంజాతమ్మన నొప్పు తామరసమే కాఁబట్టి శ్రీవత్సమే
    కంజాతాక్షుని భూషణమ్మగుఁ గదా; కంకాళ మెల్లప్పుడున్
    గంజాయించిన వైద్య విద్య కొఱకున్ గల్గించు సౌలభ్యమే

    [అంజాయించు = సందేహపడు; కంజాయించు = ఏర్పాటుచేయు]

    రిప్లయితొలగించండి
  5. గంజాయిని గొని నీవిటు
    పింజారిగ బల్కదగునె వెర్రితనమునన్
    రంజిల్లదె కౌస్తుభమణి
    కంజాతాక్షునకుఁ దొడవు గంకాళమ్మే?

    రిప్లయితొలగించండి