8, ఏప్రిల్ 2026, బుధవారం

సమస్య - 5433

9-4-2026 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తెలుఁగులోనఁ బలుకఁ దిట్టఁ దగును”
(లేదా...)
“తెలుఁగున నేమి పల్కినను దిట్టఁ దగున్ బరిహాసమాడుచున్”

30 కామెంట్‌లు:

  1. ఆంగ్ల భాష నే ర్చి యమెరికా కు వెడలి
    భాష మరచి పో వ భావ్యమగున
    తెలుగు వాడు తెలుగు దివ్య మ్ము నేర్చి
    తెలుగు లోన బలుక దిట్ట యగును

    రిప్లయితొలగించండి
  2. ఆటవెలది
    లలితమైన తెనుగు రంజిల్లఁ బలుకక,
    నిన్నమొన్న నేర్చి నిగిడి మిగుల
    సదరు భాషతోడ సంకరమొందించి
    తెలుఁగులోనఁ బలుకఁ దిట్టఁ దగును

    చంపకమాల
    వెలుగులఁ జిమ్ము భాష విన వెన్నను బోలెడు సున్నితంబుగన్
    బలికిన జున్నుఁ జిందుచును బంచును మాధురి తెన్గు భాషయే!
    పలుచనఁ జేసి, యన్యముల పట్టియు సంకరమొంద వంకరన్
    దెలుఁగున నేమి పల్కినను దిట్టఁ దగున్ బరిహాసమాడుచున్

    రిప్లయితొలగించండి
  3. ఆ.వె.
    తెలుగు భాషలోని తియ్యందనమ్మును
    తెలుసుకొనగలేక తెలివిమాలి
    వచ్చిరాని మాట లిచ్చవచ్చిన యట్లు
    తెలుఁగులోనఁ బలుకఁ దిట్టఁ దగును

    రిప్లయితొలగించండి
  4. చంపకమాల:
    గలగలపాఱు యేరువలె గజ్జెల సవ్వడివోలె తేనియల్
    చిలికిన రీతిగా మనసు జివ్వను తెల్గున మాటలాడినన్
    తెలివి యొకింతలేక గణుతింపక మాటలలోని భావమున్
    తెలుఁగున నేమి పల్కినను దిట్టఁ దగున్ బరిహాసమాడుచున్

    రిప్లయితొలగించండి
  5. రిప్లయిలు
    1. తెలుగు నేలఁ బుట్టి తెలుగు భాషనునేర్చి
      తెలుగు నుచ్చరింప దిగులు పడుచు
      తెలుగు మాధ్యమమును దొలగింతు నేనని
      తెలుఁగులోనఁ బలుకఁ దిట్టఁ దగును

      తెలుగుల నేలపై వెలసి తెన్గు పదంబుల నుచ్చరింపగా
      దలపక తెల్గదేలయని తాను తెలుంగున పాఠశాలలన్
      దొలఁగగ జేయనెంచి మరి తొందరపాటున వక్కణించుచున్
      దెలుఁగున నేమి పల్కినను దిట్టఁ దగున్ బరిహాసమాడుచున్

      తొలగించండి
  6. ప్రభుత నిర్ణయించె పదవి నిడగ నాడు
    దెలుఁగులోనఁ బలుకఁ దిట్టఁ దగును
    ననుచు, పాఠ శాల యందునాంగ్లమె యన
    దెలుగు భాష బతుకు తెల్ల వారె

    రిప్లయితొలగించండి
  7. ఆ.వె:ఆంగ్లమాధ్యమమున నది చదివె తెలుగు
    రాదటంచు నేల రంధి నీకు?
    తెలుగు పంతు లొకడు తెలియు నాతడు నేర్ప
    తెలుఁగులోనఁ బలుకఁ దిట్టఁ దగును”
    (దిట్టది +అగును. )

    రిప్లయితొలగించండి
  8. (2)ఆ.వె:"అచ్చ తెనుగు పదము" లంచు మర్మస్థాన
    ములను వ్రాయ కెపుడు తెలుగు లోన
    అట్టి వన్ని బూతు లందు రెల్లరు,వాని
    తెలుఁగులోనఁ బలుకఁ దిట్టఁ దగును”
    (శరీరం లోని కొన్ని రహస్య భాగాలకి సంస్కృత పదాలు కాక తెలుగు పదాలు వాడితే బూతులు అంటారు.నేను అచ్చ తెలుగు రాసా అంటే అచ్చ తెలుగు లో తిడతారు. )

    రిప్లయితొలగించండి
  9. చం॥ చెలఁగుచు
    బెంగుళూరునను శ్రేయము నొందుచు నాంధ్ర భాషయే
    వెలుఁగఁగ నేమి తెల్పఁదగు వీలును గాంచుచుఁ గన్నడమ్మునున్
    దలఁచక నేర్వ నెంచమనఁ దప్పని వాదిడు వారి భావనన్
    దెలుఁగున నేమి పల్కినను దిట్టఁ దగున్ బరిహాసమాడుచున్

    (ఇది ఇక్కడి స్థితి అండి. మునుపు 4 దక్షిణ ప్రాంత భాషలే అధికంగా ఉండేవి. ఇప్పుడు హిందీ కూడా జతకలిసింది.)

    రిప్లయితొలగించండి
  10. -
    తెలుగు వీర లేచి తెలతెల్ల వారిలో
    తెలుఁగులోనఁ బలుకఁ దిట్టఁ దగును
    నులికి పడి జనాళి నొచ్చుకొని మరల
    నిన్ను తిట్ట వచ్చి నీరుగార



    రిప్లయితొలగించండి
  11. తెలివిని పెంచు భాష విరితేనియలొల్కెడు భాష యెల్లరున్
    సులువుగ పల్కుభాష యతి సుందరమై విలసిల్లు భాష వే
    వెలుగులు పంచుభాష భువి విస్తృతమవ్వగ వేరురీతిగన్
    తెలుగున నేమి పల్కినను దిట్టదగున్ బరిహాసమాడుచున్

    రిప్లయితొలగించండి
  12. పండితోత్తములు సభా ప్రాంగణమ్ములఁ
    బలుక నేర్తురంచుఁ దలఁచి దేవ
    భాష లోని కొన్ని పదములఁ దెనిఁగించి
    తెలుఁగు లోనఁ బలుకఁ దిట్టఁ దగును


    పొలమున నుండఁగాఁ గలుపు మొక్కలు హాలికు లౌర సైతురే
    చెలువము మీఱ శబ్దము లశేషము లుండఁగ నాంధ్ర భాషలోఁ
    గులుకుచు నన్య దేశములఁ గొన్నిటి నుద్ధతి సత్కవీంద్రులే
    తెలుఁగున నేమి పల్కినను దిట్టఁ దగుం బరిహాస మాడుచున్

    రిప్లయితొలగించండి

  13. ఆంగ్ల మాధ్య మమున నద్భుత రీతిని
    పాఠము లను చెప్పు పటిమ గలుగు
    గురువు లున్న బడియె పొరపాటు నైనను
    తెలుఁగులోనఁ బలుకఁ దిట్టఁ దగును.


    తెలుగును పల్క నేల యది తేనియ యంచు వచింప నేలరా
    యిలనది పేద వారులును హీన గుణాత్ముల భాషగా సదా
    పలికెడి వాడె పూర్ణ పరభాష పటుత్వము లేక మధ్యలో
    తెలుఁగున నేమి పల్కినను దిట్టఁ దగున్ బరిహాసమాడుచున్.

    రిప్లయితొలగించండి

  14. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    ఆంగ్ల మందు మాటలాడ కాన్వెంటున
    మిగిలిన సమయాన, మెచ్చవలయు
    తెలుగులోనఁ బలుకఁ; దిట్టఁ దగును
    మాతృభాష మరచి మమ్మి డాడి యనగ.

    రిప్లయితొలగించండి
  15. తెలుగొక యందమైన కడు తీయని
    భాషని ఖ్యాతిబొందె నీ
    జిలుగుల భాషలోపలను చేర్చియు
    నన్యుల భాష వాక్కులన్
    "తెలుగున నేమి పల్కినను తదిట్ట దగున్
    పరిహాస మాడుచున్"
    వెలుగుల తెల్గు భాషను వివేకము
    తో నిలబెట్టుకోసమై

    రిప్లయితొలగించండి
  16. విలువగు మాతృభాషను వివేక విహీనులు నేర్వకుండగా
    తలచుచు నాంగ్లమున్ జదువ దక్కును నౌకరి యంచు నెంచుచున్
    ఫలితము పొందలేక, యల బాసట కోరుచు పట్టులేని యా
    తెలుఁగున నేమి పల్కినను దిట్టఁ దగున్ బరిహాసమాడుచున్

    రిప్లయితొలగించండి