6, ఏప్రిల్ 2026, సోమవారం

సమస్య - 5431

7-4-2026 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“గజ మొక్కటి పుట్టె నీఁగ గర్భమునందున్”
(లేదా...)
“మత్తగజంబు పుట్టె నొక మక్షిక గర్భమునందు వింతగా”

14 కామెంట్‌లు:

  1. ద్విజులందు బుట్టి గాంధీ ,
    యజేయులుగ ప్రథ బడసిన యాంగ్ల యరసులన్
    గజగజ లాడించుట గన
    గజ మొక్కటి పుట్టె నీఁగ గర్భమునందున్

    రిప్లయితొలగించండి
  2. ఒత్తిడి తాళ లేక పనిలో పలవించుచు నుండు నెల్లెడన్
    బొత్తిగ నొక్క వాక్యమును పోడిగ వ్రాయగలేదు, యామెకో
    యుత్తము రాలు పుత్రికగ నుద్గతి గాన్ వచియించి రెల్లరున్
    ’మత్తగజంబు పుట్టె నొక మక్షిక గర్భమునందు వింతగా”.

    రిప్లయితొలగించండి
  3. కందం
    గజగజ వణికించి జనుల
    రుజలొందగ చేసెనౌర రూఢిగ కలుగన్
    గజహస్తము కొండి యనఁగ
    గజ మొక్కటి పుట్టె నీఁగ గర్భమునందున్!


    ఉత్పలమాల
    అత్తరి కొండికిన్ బదులునందెనొ తొండము గుట్టినంతటన్
    బిత్తర పోవ రక్తమును బీల్చునె యూపిరులాగునట్లుగన్
    తత్తర రేపుచుండెఁగద తాలుటనెట్లనఁ బల్కిరెల్లరున్,
    "మత్తగజంబు పుట్టె నొక మక్షిక గర్భమునందు వింతగా! "

    రిప్లయితొలగించండి
  4. విజయుడు జానపదమునే
    సృజించె నబ్బురపు చలన చిత్రంబనుచున్
    నిజముగ చూపిన దృశ్యము
    గజ మొక్కటి పుట్టె నీఁగ గర్భమునందున్

    క్రొత్తగ గండరించె తన కోరిక మేరకు చిత్ర రాజమున్
    జిత్త ప్రవృత్తితో చలన చిత్రము నిర్మిత మయ్యెఁ జూడగా
    తెత్తులు భూతముల్ మరియు దృశ్యములందున మంత్రతంత్రముల్
    మత్తగజంబు పుట్టె నొక మక్షిక గర్భమునందు వింతగా

    రిప్లయితొలగించండి

  5. సుజను డొకడు చెలి మరితో
    వ్రజ నాథుని గాథ తెలిపి ప్రవచించె నిటుల్
    కుజనుల శిక్షించుటకై
    గజ మొక్కటి పుట్టె నీఁగ గర్భమునందున్.


    తత్తర పాటు లేక సతతమ్ము జపమ్ముగ నెంచి తాను భూ
    భృత్తును తల్చుచుండు నరవిష్వను పుత్రుని గాంచి విజ్ణులే
    బిత్తర పోయి పల్కిరట పృథ్విని దుష్టుల మచ్చ మాపగా
    మత్తగజంబు పుట్టె నొక మక్షిక గర్భమునందు వింతగా.

    రిప్లయితొలగించండి
  6. రుజువులు లేనట్టి వి ధ ము న ను
    ప్రజలన మా యకులు జేసి పలుకుట మేలా,?
    నిజమది కాదది యెక్కడ
    గజ మొ క్క టి పు ట్టె నీ గ గ ర్బము నం దున్?

    రిప్లయితొలగించండి
  7. -
    రుజువెచ్చటనోయీ మ
    ధ్విజమ్ము గ్రోలన్ చెడనొ మతి కవీ ?సమ్మూ
    ర్ఛజమున్ తిని వ్రాసితివో
    గజ మొక్కటి పుట్టె నీఁగ గర్భమునందున్?


    రిప్లయితొలగించండి
  8. ఉ॥ తత్తరపాటుఁ దండ్రి కని తన్నటులంకము నుండి త్రోయఁగన్
    జిత్తము నందునన్ ధ్రువుఁడు శ్రీశుని నిత్యము నిల్పి కొల్వఁగన్
    మొత్తము ధ్యాసనుంచి చని పుష్కరనాభుఁడు మెచ్చెనే యహో
    మత్తగజంబు పుట్టెనొక మక్షిక గర్భమునందు వింతగా

    రిప్లయితొలగించండి
  9. కం:గజపతి నరేంద్రు మ్రొక్కుచు
    గజవర్తకు డిట్లు పలికె కాన్ క గొనుడు నా
    గజముల జక్కని దానికి
    గజ మొక్కటి పుట్టె నీఁగ గర్భమునందున్”
    (ఈగ = ఇచ్చుటకు. గజపతుల వద్దకి ఏనుగుల వ్యాపారి వచ్చి మా ఏనుగు గర్భం లో ఏనుగు పిల్ల పుట్టింది. కానుక గా గ్రహించండి అన్నాడు. )

    రిప్లయితొలగించండి
  10. ఉ;సత్తువ లేని నిమ్నకుల జాతుని త్రొక్కుచు నుండ నెల్లరున్
    చిత్తము నందు విప్లవము జింతన జేసిన వాని పుత్రుడే
    మత్తగజంపు గుర్తు గొని మందిని మార్చగ నొక్క డిట్లనెన్
    "మత్తగజంబు పుట్టె నొక మక్షిక గర్భమునందు వింతగా"
    (బలహీనవర్గం వాణ్ని గ్రామ మంతా తొక్కేస్తుంటే అతని కొడుకు ఏనుగు గుర్తు పార్టీలో చేరి అనగా బహుజన సమాజ్ పార్టీలో చేరి జనాన్ని మార్చాడు.అది చూసి ఈగకి ఏనుగు పుట్టిందే అని ఒక డన్నాడు. )

    రిప్లయితొలగించండి
  11. కుజనుల పీచమడంచఁగ
    సుజనుల సంరక్షచేయ శూరాగ్రణియై
    భుజబల దర్పమ్మడరగ
    గజ మొక్కటి పుట్టె నీఁగ గర్భమునందున్

    రిప్లయితొలగించండి
  12. తత్తరపాటుతోడ పరితాపము నొందుచు శత్రుసైన్యముల్
    బిత్తరపోయి దిక్కులకు పిక్కబలమ్మును జూపి పాఱగన్
    కత్తిని బూని శాత్రవుల కంఠములన్ దునుమాడు జోదుగా
    మత్తగజంబు పుట్టె నొక మక్షిక గర్భమునందు వింతగా

    రిప్లయితొలగించండి