9, ఏప్రిల్ 2026, గురువారం

సమస్య - 5434

10-4-2026 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఆకసంబునఁ దేలె హర్మ్యంబులెన్నొ”
(లేదా...)
“ఆకాశంబునఁ దేలి యాడినవి హర్మ్యంబుల్ మనోజ్ఞంబుగన్”

16 కామెంట్‌లు:

  1. గగన మందున మబ్బులు గాను పించి
    వివిధ రూ పాలతో నవి వేడ్క సేయ
    నాక సంబున దేలె హర్మ ంబు లె న్నొ యనుచు నబ్బు ర ముగ గాంచి రందర పుడు

    రిప్లయితొలగించండి
  2. తేటగీతి
    బీడుభూములనుచు రైతు వేదనఁబడ
    ధరలు పలుకు దినమదె దగ్గరపడంగ
    సహజవాయు నిక్షేపాల ఛాయఁదెలిసి
    ఆకసంబునఁ దేలె హర్మ్యంబులెన్నొ!


    శార్దూలవిక్రీడితము
    మాకే రీతిని మేలు చేయునని కంపమ్మెత్త రైతన్నలన్
    శోకమ్మందున బీడు భూములవియే శుష్కింపఁ జేయంగనే
    సాకారమ్మయి వాయువే సహజమై సంపన్నతన్ లభ్యమై
    యాకాశంబునఁ దేలి యాడినవి హర్మ్యంబుల్ మనోజ్ఞంబుగన్

    రిప్లయితొలగించండి
  3. కృత్రిమమగు బుద్ధిని వాడ , కృతము నొందె
    చలన చిత్రమొకటి యొక జాణ చేత ,
    చెన్నుగ ఫరిశీలించగ చిత్రమందు
    నాకసంబునఁ దేలె హర్మ్యంబులెన్నొ

    రిప్లయితొలగించండి
  4. భూమి నిచ్చిన కర్షక క్షేమమలర
    రాజ ధానిని నిర్మింతురన్న పలుకు
    విన్న హలజీవి హృదయము విన్నుగాగ
    నాక సంబునఁ దేలె హ ర్మ్యంబులెన్నొ

    మీకేదక్కును రాజధాని ఫలముల్ మీరేకమై భూమినే
    జేకూర్చంగ దలంచినన్ నగరమే శీఘ్రంబనన్ రైతులం
    గీకారమ్ము నొసంగ చింతనలు రేగెన్ గాలిలో మేడలై!
    ఆకాశంబునఁ దేలి యాడినవి హర్మ్యంబుల్ మనోజ్ఞంబుగన్

    రిప్లయితొలగించండి
  5. -
    కృత్రిమపు మేధ సాయము కృషియనంత
    మైన తీరుల చేయగ మాయ నిక్క
    మాయె కనులముంగటనె ప్రమాణమాయె
    నదిగొ చీనీయుల ప్రతిభ నలతి కాల
    మాకసంబున దేలె హర్మ్యంబులెన్నొ


    రిప్లయితొలగించండి
  6. మబ్బు దొంతరల్ నింగిలో మసలుచుండ
    బాలునకుఁ దోచె వివిధ రూపాల వలెను
    మనమునందున నూహించె ఘనముఁ గాంచి
    యాకసంబునఁ దేలె హర్మ్యంబులెన్నొ

    రిప్లయితొలగించండి
  7. ఆకాశంబున మేఘ సంచయము హేరాళమ్ముగా పర్వగా
    ఆకారమ్ములు గ్రాలు చందమున నేత్రానందముంగూర్చెనా
    రాకాచంద్రుని దీప్తులందు ఘనముల్ రాజిల్ల రూపాలుగా
    నాకాశంబునఁ దేలి యాడినవి హర్మ్యంబుల్ మనోజ్ఞంబుగన్

    రిప్లయితొలగించండి
  8. రాకాసికోన లో రత్నాల ద్వీపములో
    అల్లావుద్దీను అద్భుత దీపంలో :)


    ప్రాకారమ్మును దాటి గంటి తరువుల్ రాకాసి రూపమ్ము, మ
    త్స్యాకారమ్మున దొర్వులెన్నొ గలవద్దమ్మై జగచ్చక్షుడిన్
    ప్రాకాశ్యమ్ముగ జూపె, బింబముగ స్థూపాకారతేజమ్ముగా
    నాకాశంబునఁ దేలి యాడినవి హర్మ్యంబుల్ మనోజ్ఞంబుగన్




    రిప్లయితొలగించండి
  9. :

    శార్దూలమ్మున కైపదమ్ము చనుమా చట్టంచు పూరించుమా


    రిప్లయితొలగించండి
  10. శా॥ సాకారంబుగ నంతరిక్ష యుగమే సంజాతమై యొప్పఁగన్
    స్వీకారంబుగ దేశ దేశములు సంప్రీతమ్ముతోఁ బంపఁగా
    నాకాంక్షించి యుపగ్రహమ్ము లవియే యంతస్తులేపారఁగా
    నాకాశంబునఁ దేలి యాడినవి హర్మ్యంబుల్ మనోజ్ఞంబుగన్

    (ఇప్పుడు ఉపగ్రహలనే హర్మ్యాలు అంతరిక్షములో చాలానే ఉన్నాయండి)

    రిప్లయితొలగించండి
  11. బాకీ లన్నియు దీర్చె వర్తకుడు వ్యాపారంబు తాజేయుచున్
    పైకంబెంతయె కూడబెట్టి పురిలో వర్ధిల్లుచున్ గొప్పగన్
    శ్రీకారంబును చుట్టి కట్ట గృహముల్ చిందిల్లుచున్ వెల్గులన్
    ఆకాశంబున తేలియాడినవి హర్మ్యంబుల్ మనోజ్ఞంబుగన్

    రిప్లయితొలగించండి
  12. ఊహల విహరించుట యంద నుంద్రు భాగ్య
    హీను లెల్లరు నిల లోన నెపుడు దీన
    మానవుల కొసఁగ ముదము మానసంపు
    టాకసంబునఁ దేలె హర్మ్యంబు లెన్నొ


    కీకారణ్యము నందు జంతువుల రక్షింపంగ సూర్యాంశువుల్
    ప్రాకారమ్ములు నాఁగ నిల్చినవి సంరంభించి చోద్యమ్ముగా
    సాకారమ్ములు మేఘ రాజములె యత్యాశ్చర్య మేపారఁగా
    నాకాశంబునఁ దేలి యాడినవి హర్మ్యంబుల్ మనోజ్ఞంబుగన్

    రిప్లయితొలగించండి
  13. తే.గీ:మిథున రాశిని వీడుచు మెరుపు లొలుకు
    నుల్క లెన్నియొ రాలుచు నొక్క రాత్రి
    ఆకసంబునఁ దేలె, హర్మ్యంబులెన్నొ
    క్రిక్కిరిసె చూడ జనులు పై కెక్కి నంత
    (మిథున రాశి నుంచి ఒక మారు భారీ స్థాయి ఉల్కాపాతాలు జరిగాయి.అవి చూడటానికి జనం మేడల పైకి ఎక్కారు.మిథున రాశి నుంచి పడే ఉల్కలని జెమినిడ్స్ అంటారు. )

    రిప్లయితొలగించండి
  14. శా :నాక మ్మందున జేర జాలక త్రిశంకాఖ్యుండు" మౌనీంద్ర! రా
    వే! కాపాడు" మటన్న కౌశికుడు "నేనే స్వర్గమున్ జేర్చెదన్
    నాకమ్మున్ సృజియించినా" ననగ నా నందమ్ములన్ గూర్చ గా
    ఆకాశంబునఁ దేలి యాడినవి హర్మ్యంబుల్ మనోజ్ఞంబుగన్”
    (త్రిశంకుని కోసం విశ్వామిత్రుడు కృత్రిమం గా స్వర్గాన్ని సృష్టించాడు. అప్పుడు ఆకాశం లోనే భవనాలు తేలి యాడుతాయి కదా!)

    రిప్లయితొలగించండి

  15. కుంతి వ్రతము కొరకని చౌదంతి గ్రీడి
    భువికి దింపంగ నెంచుచు పుష్కరముల
    వేసెనె పటిమ జూపి న వ్వేళ గాంచ
    ఆకసంబునఁ దేలె హర్మ్యంబులెన్నొ.


    నీకై యభ్రము ధాత్రి దింపెదనికన్ నీ నోము కై యంచు తా
    నాకోదండము చేత బూని విజయుండత్యంత నైపుణ్యమున్
    సూకమ్ముల్ గగనమ్ము తాకు నటులన్జోడించు పాళములో
    నాకాశంబునఁ దేలి యాడినవి హర్మ్యంబుల్ మనోజ్ఞంబుగన్.

    రిప్లయితొలగించండి

  16. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    రోజు రోజుకు పెరుగు మార్పులను జూచి
    పెక్కు నంతస్తు భవనాలు వెలయుచుండ
    విస్తుపోవుచు నుంటిరి వింతగ ప్రజ
    ఆకసంబునఁ దేలె హర్మ్యంబు లెన్నొ.

    రిప్లయితొలగించండి