10, ఏప్రిల్ 2026, శుక్రవారం

సమస్య - 5435

11-4-2026 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కాంచఁ దగిన దెద్దియు లేదు కాశిలోన”
(లేదా...)
“అరయఁగఁ గాశికాపురినిఁ గాంచఁగ నేమియు లేదు లేదు పో”

15 కామెంట్‌లు:

  1. తేటగీతి
    సిగను గంగమ్మ మేనిలో సగము గౌరి
    విశ్వనాథుని రూపాన వేడ్కఁ జేయ
    భక్తవత్సలునర్చించి ముక్తిఁ గొనఁక
    కాంచఁ దగిన దెద్దియు లేదు కాశిలోన

    చంపకమాల
    తనువున గౌరియున్ సిగను ధారగ గంగయు నిండి మంగళం
    బొనరఁగ జేయుఁ రూపమున పుణ్యమొసంగెడు విశ్వనాథునిన్
    గనులను నింపి ముక్తిఁగొను నమ్మకముండగ నన్యమేదియున్
    కనుగొనఁ గాశికాపురినిఁ గాంచఁగ నేమియు లేదు లేదు పో!

    రిప్లయితొలగించండి
  2. విశ్వ నాథుని దర్శింప వెడలి కాశి
    యర్చన లు సల్పి మొ క్కె ద రంద రపుడు
    కాంచ దగిన దెద్ది యును. కాశి లోన
    లే దని యు పల్కు దురు గద లీల గాను

    రిప్లయితొలగించండి
  3. శివుని దరిసించి , యతనిని చేత దడవి ,
    కాంచనపు పుతయున్న శిఖరమునుగని ,
    ధన్యజీవుల మగుటయె తప్ప , లాతి
    కాంచఁ దగిన దెద్దియు లేదు కాశిలోన

    రిప్లయితొలగించండి

  4. మునులు మోక్షార్థులు చరించు పుణ్య భూమి
    భవుడు వెలసిన క్షేత్రమీ వారణాసి
    పట్టణమున కాముక ప్రేమ పక్షులకట
    కాంచఁ దగిన దెద్దియు లేదు కాశిలోన.


    మనమున శూలి నామమును మంత్రము గా జపి యించుచున్ విమో
    చనమును గోరు వారికిట సాధనమే సుళువైన క్షేత్రమై
    న నిట రసజ్ఞులౌ జన మనస్సును దోచేడి వింత ప్రాంతముల్
    కనుగొన గాశికాపురినిఁ గాంచఁగ నేమియు లేదు లేదు పో.

    రిప్లయితొలగించండి
  5. పాత నగరమే పరికింప వారణాశి
    విశ్వనాథుని దర్శించు వీలుతప్ప
    కాంచఁ దగిన దెద్దియు లేదు కాశిలోన
    జీవితంబును విడవలె శివునిజేర

    పరమ పురాతనమ్మనెడి వర్ణన మొప్పును వారణాసికిన్
    దరిసెనమే గదా మనకు దక్కెడి భాగ్యము లింగరూపమున్
    అరయఁగఁ గాశికాపురినిఁ గాంచఁగ నేమియు లేదు లేదు పో
    మరియిక దేహమున్ విడుము మాయల చెంచుని జేరముక్తికై

    రిప్లయితొలగించండి
  6. వినుమొక మాట చెప్పెదను వీనుల విందుగ చంద్రచూడునిన్
    కనుగవ మూసి శాంతముగ కన్గొన వచ్చును భక్తులెల్లరున్
    మునుగుచు మోదమందునను మోక్షము నొందను భిన్నమేదియున్
    కనుగొన కాశికాపురిని గాంచగ నేమియు లేదు లేదు పో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వినుమొక మాట చెప్పెదను వీనుల విందుగ చంద్రచూడునిన్
      కనుగవ మూసి శాంతముగ కన్గొన వచ్చును భక్తులెల్లరున్
      మునిగి విరాళియందు విముక్తిని పొందను భిన్నమేదియున్
      కనుగొన కాశికాపురిని గాంచగ నేమియు లేదు లేదు పో

      తొలగించండి
  7. రిప్లయిలు
    1. *శంకరాభరణం సమస్యాపూరణం*
      చంపకమాల.
      వినబడు నామకీర్తనము వీనులవిందులు చేయుచుండగన్,
      గనబడు భక్తిభావము ఘనంబగు తత్వముఁ జాటి,నింపగా
      మనమున నీశురూపమును, మాటలు చాలవు చెప్పఁ,గ్రొత్తగాఁ
      *గనుగొన గాశికాపురినిఁ గాంచఁగ నేమియు లేదు లేదు పో.*

      తొలగించండి
  8. చం॥ వినుమ విహార యాత్రయన విచ్చిన యందపు దృశ్యమెల్లెడన్
    దనరఁగ నొప్పు భక్తిఁ గని ధన్యతఁ బొందెడు పట్టణమ్మునన్
    దనువుకు సౌఖ్యమబ్బునొకొ తల్పుమ తీరుగ నిట్టి యాత్రకై
    కనుఁగొనఁ గాశికాపురినిఁ గాంచఁగ నేమియు లేదు లేదుపో

    (విహార యాత్రకు తీర్థయాత్రకు ఉన్న తేడా అండి)

    రిప్లయితొలగించండి
  9. భక్తు లైన వా రెల్లరు పరమ శాంతి
    వొంద నేర్తురు తప్ప కెడంద లందు
    నన్న నిజ మన్న నాస్తికు లైన వారు
    కాంచఁ దగిన దెద్దియు లేదు కాశి లోన


    హరుఁడు వసించు పట్టణ మి దన్నఁ గడింది నిజమ్ము సుమ్ము పో
    దురు శివ భక్తు లెల్లరును దోరపు భక్తినిఁ బూజ సేయఁగా
    ధర నిది పావ నాంగణము తర్కమ దేలయ దోష మించు కే
    నరయఁగఁ గాశికాపురినిఁ గాంచఁగ నేమియు లేదు లేదు పో

    రిప్లయితొలగించండి
  10. నిరతము భర్గు పూజలును నిర్మల
    భక్తుల కోలహాలమున్
    పరమ పవిత్ర జాహ్నవికి భ్రాహ్మణు
    లిచ్చెడు భవ్య హారతుల్
    వరలచునుండు నిత్యమిట వాటిని
    మించి మరేమి వింతయున్
    అరయగ కాశికా పురిని గాంచగ నేమియు
    లేదు లేదు పో

    రిప్లయితొలగించండి

  11. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    కాశి యందున మరణించ కలుగు ముక్తి
    యనుచు నచ్చోటనే యుండి యనవరతము
    చేయుచున్ విశ్వనాథుని సేవ తప్ప
    కాంచఁ దగిన దెద్దియు లేదు కాశిలోన.

    రిప్లయితొలగించండి
  12. -
    పాప పుణ్యములను తన పరుగులిడెడు
    గంగలోన కలుపుకొని కనికరించె
    డతి పురాతన నగరము దాని మించి
    కాంచఁ దగిన దెద్దియు లేదు కాశిలోన



    రిప్లయితొలగించండి
  13. అనుదినమున్ దహించు మనుజాళి శవమ్ములు, నస్థికల్ స్రవం
    తిని దరి చేరి మగ్నమును తీరు నొనర్చు సగోత్రు, లార్యులున్
    కొనదగు స్వర్గమచ్చటను కోరి వసించుచు నుండు వారలే
    కనుగొన గాశికాపురినిఁ గాంచఁగ నేమియు లేదు లేదు పో

    రిప్లయితొలగించండి