12, ఏప్రిల్ 2026, ఆదివారం

సమస్య - 5437

13-4-2026 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ధర్మముఁ దప్పిన వనితకు దండము లిడిరే”
(లేదా...)
“ధర్మముఁ దప్పినట్టి వనితామణికిన్ నతులైరి విజ్ఞులే”

13 కామెంట్‌లు:

  1. మర్మము లను పాటింపక
    నిర్మల హృదయ o బు గలిగి నీ మ పు వ్రత యై
    ధర్మము వీడని దగుచు న
    ధర్మము దప్పి నవనితకు దండము లిడి రే

    రిప్లయితొలగించండి
  2. కర్మ ఫలిత తెవులిది దిగు
    మర్మము దెలిపెద వినుమని మాంత్రికుడనగన్
    చర్మముపై వాతలిడుచు
    ధర్మముఁ దప్పిన వనితకు దండము లిడిరే

    రిప్లయితొలగించండి
  3. నిర్మల మానసమనుకొని
    ధర్మముఁ దప్పిన వనితకు దండము లిడిరే
    మర్మము నెఱిగింపుమనగ
    కర్మము వెంటాడునపుడు కాగలదిటులన్

    ధర్మముఁ దప్పినట్టి వనితామణికిన్ నతులైరి విజ్ఞులే
    మర్మమెఱుంగ జేయమని మమ్మడుగంగ వచింతునిట్టులన్
    నిర్మలమైన మానసము నిండగు రూపము పూర్వజన్మదౌ
    కర్మము వెంబడించెగద కప్పురగంధిని సంభ్రమమ్ముగా

    రిప్లయితొలగించండి

  4. నిర్మల చిత్తులు తెలిపిరి
    యూర్మిళ యంతః పురమున నుండుట సతిగా
    ధర్మము కాదన బోకుడు
    ధర్మముఁ దప్పిన వనితకు దండము లిడిరే.


    ధర్మము ధర్మమంచు సతతమ్ము వచించెడి పండితుండ్ర కా
    మర్మము తెల్యకుండునె? సుమధ్య సుమిత్ర వధూటి యైన యా
    యూర్మిళ రాణివాసమున నుండుట లక్ష్మణు వెంట నేగకన్
    ధర్మముఁ దప్పినట్టి వనితామణికిన్ నతులైరి విజ్ఞులే.

    రిప్లయితొలగించండి
  5. -
    ధర్మము కాదిది పలికిరి
    ధర్మముఁ దప్పిన వనితకు, దండము లిడిరే
    ధర్మము దప్పిన మనిషికి
    ధర్మంబు విచక్షణ మను ధర్మంబగునౌ



    రిప్లయితొలగించండి
  6. ఉ॥ కర్మ ఫలమ్ము రూపునను గాంచఁగఁ బుత్రుని కుంతి కన్యఁగన్
    మర్మముఁ దెల్ప తప్పనఁగ మాన్యులు కొందరు నుత్సుకత్వమే
    నిర్మలమే కదా మనము నిత్యము కన్యయె యంచు నొప్పుచున్
    ధర్మముఁ దప్పినట్టి వనితామణికిన్ నుతులైరి విజ్ఞులే

    పంచకన్యలో కొన్నిచోట్ల కుంతి పేరుంటుందండి.

    రిప్లయితొలగించండి
  7. శర్మకరంబు ధర్మమని శాస్త్రము చెప్పగ పండితాళి యా
    మర్మమెరుంగకుందురె సమంచతరీతిని శోభనాంగి యా
    యూర్మిల రాణివాసమున నుండుట లక్ష్మణు తోడ నేగకన్
    ధర్మము దప్పినట్టి వనితామణికిన్ నతులైరి విజ్ఞులే

    రిప్లయితొలగించండి
  8. ధర్మమె దండనము దురిత
    కర్మములకు రాజ నీతిఁ గమనీయముగా
    మర్మ మెఱిఁగి పాటించిరి
    ధర్మముఁ దప్పిన వనితకు దండము లిడిరే

    [దండము = రాజశిక్ష]


    ఓర్మి వహించుటే సతుల కుర్విని నుత్తమ మైన ధర్మ మా
    ధర్మము తప్ప నట్టి వనితా నిచయమ్మున కింక నింపుగా
    భర్మము పైన మక్కువ నపారము చూపుట స్త్రీల ధర్మ మా
    ధర్మముఁ దప్పి నట్టి వనితామణికిన్ నతులైరి విజ్ఞులే

    రిప్లయితొలగించండి
  9. కందం
    నిర్మలమూర్తిని రాముని
    దుర్మతిఁ గానలకుఁ బంప, దుష్టులఁ జంపన్!
    మర్మమెఱిఁగి కైకకన స్వ
    ధర్మముఁ దప్పిన వనితకు దండము లిడిరే!


    ఉత్పలమాల
    దుర్మతిఁ గూర్చ మంధరయె తూలుచు కైకయె కానకంపఁగన్
    నిర్మల రామచంద్రుడట నేరుగ రక్కసి మూకఁ గూల్చఁగన్
    మర్మమిదాయనన్ మిగుల మాన్యతతో, తన పెంపకంబుదౌ
    ధర్మముఁ దప్పినట్టి వనితామణికిన్ నతులైరి విజ్ఞులే!

    రిప్లయితొలగించండి
  10. నిర్మల మైన మానసము నిల్వక సత్యపు మార్గమందునన్
    శర్మము నిచ్చు వంశమని సాగుచు నెప్డు కులంపు నేతతో
    భర్మపు మందిరమ్ముల నివాసము కోరుచు, రాజకీయమున్
    ధర్మముఁ దప్పినట్టి వనితామణికిన్ నతులైరి విజ్ఞులే

    రిప్లయితొలగించండి
  11. ధర్మముఁ దప్పక నెన్నఁడు
    కర్మాచరణమును సల్ప కలుగును శుభముల్
    మర్మమెరిగి యక్కఱలో
    ధర్మముఁ దప్పిన వనితకు దండము లిడిరే

    రిప్లయితొలగించండి
  12. ధర్మము నెన్నడేనియును దప్పని యేవురు పాండుపుత్రులన్
    వర్మమువోలె గూడి వనవాసము జేసిన ద్రౌపదీ సతిన్
    మర్మమెరింగి క్రొత్తడిగ మాన్యతఁ బిల్వ నిసర్గజమ్ముగా
    ధర్మముఁ దప్పినట్టి వనితామణికిన్ నతులైరి విజ్ఞులే

    రిప్లయితొలగించండి

  13. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    మర్మము నెఱిగి తన పతిని
    కర్మకు వదలకయె తిరిగి కాలుని వెంటన్
    కర్మను మార్చెను తుదకున్
    ధర్మము తప్పిన వనితకు దండము లిడిరే!

    రిప్లయితొలగించండి