29-4-2026 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కప్పనుఁ గనినంత గజము గజ్జున వడఁకెన్”
(లేదా...)
“కప్పనుఁ గాంచి కుంజరము గజ్జుమనెన్ శశకంబు నవ్వఁగన్”
చెప్పినటుల వినకుండగ తిప్పలు పెట్టుచు నశనము దినకుండుటచే రొప్పుచు వచ్చిన యా వెంకప్పనుఁ గనినంత గజము గజ్జున వడఁకెన్”
చెప్పిన యట్లు చక్కగను జేయక హెచ్చు మదంబు తోడుతన్తిప్పలు పెట్టుచున్నదని దీనికి దండన తప్పదంచునున్చెప్పులు కాళ్శకున్ తొడగి చేతను తోత్రము బట్టి వచ్చు వెంకప్పను గాంచి కుంజరము గజ్జుమనెన్ శశకంబు నవ్వగన్
కాళ్ళకున్
గొప్పగ బాంబులు కురియగచప్పున హర్మూజు మూసి జగడము కొరకైచొప్పడి కాల్దువ్విన యొకకప్పనుఁ గనినంత గజము గజ్జున వడఁకెన్
-చప్పున వేయును సంకెళ్లొప్పంగా మావటీడు ముప్పతడదిగోనప్పా ! దూరంగా వెంకప్పనుఁ గనినంత గజము గజ్జున వడఁకెన్
అప్పురమున గల గజపతి కెప్పుడు కాదనక నప్పు నిచ్చిన వాడే యప్పునడగ వచ్చిన వెం కప్పనుఁ గనినంత గజము గజ్జున వడఁకెన్.చెప్పిన నాలకింపక విచిత్రపు చేష్టలు చేయుచున్ సదా తప్పుడు దారులన్ దిరుగు దంతిని దారికి తెచ్చు వృత్తిలో తప్పదు కాదె యాంకుశము తా ధరి యింపక నంచు చెప్పు వెం కప్పనుఁ గాంచి కుంజరము గజ్జుమనెన్ శశకంబు నవ్వఁగన్.
అప్పటి విషయము గాదిదితిప్పలు పడెనా నదమున దిగి మాతంగమేఎప్పుడు గాంచనిదౌ బొంకప్పనుఁ గనినంత గజము గజ్జున వడఁకెన్అప్పటి దంతికాదు మరి యప్పటి గ్రాహము గాక పోయినన్దిప్పలు తప్పలేదు కరి తిన్నగ వాహిని లోన కాలిడన్ దప్పికతోడ నీట దిగి తానట మిక్కిలి వింత చేప బొంకప్పనుఁ గాంచి కుంజరము గజ్జుమనెన్ శశకంబు నవ్వఁగన్[బొంకప్ప = గోళాకారంగా ఉండి ముళ్లతో కప్పబడ్డ చేప]ఎప్పుడూ చూడని వింత చేపను చూసి ఏనుగు భయపడింది.
కం:గొప్ప దగు శక్తి యున్ననునెప్పటికిన్ దానె యధికమే? అంకుశమున్ ద్రిప్పుచు రా,మావటి వెంకప్పనుఁ గనినంత గజము గజ్జున వడఁకెన్”
ఉ;గొప్పగ వెంక డెంతయును కూరిమి తో శశకమ్ము బెంచె దామెప్పును బొందు మావటియె, మేలగు నంకుశమున్ ధరించి తానెప్పటి వోలె రాగ, తన కెంతటి కష్టమొ యంచు, నట్టి వెంకప్పనుఁ గాంచి కుంజరము గజ్జుమనెన్, శశకంబు నవ్వఁగన్”(మావటి వెంకప్పను చూసి ఏనుగు భయ పడింది కానీ పెంపుడు జంతు వైన కుందేలు నవ్వింది. )
ఉ॥ కప్పనుఁ గాంచి కుంజరము గుజ్జుమనెన్ శశకంబు నవ్వఁగన్జెప్పఁగఁ దల్లక్రిందులిటు చిత్ర విచిత్ర విధమ్ము లెంచుచన్గొప్పగఁ గొంత మాత్రమటు కూర్చును హాస్యము నింతియేఁ గదాతప్పుగఁ బల్క నెందులకొ తథ్యము పూరణ కష్టమై చనన్
తిప్పలు కల్గ కారడవి తేకువ తోడుత హస్తియూధముల్ చొప్పడు మార్గ మెంచి తగు చోటుకు పోవుచు నుండ నొక్కటన్ చప్పున చేర నచ్చటకు సాయకముల్ గొని, వేటగాడు వెంకప్పనుఁ, గాంచి కుంజరము గజ్జుమనెన్ శశకంబు నవ్వఁగన్
నిప్పు వలె మనస్తాపంబప్పుడు మితిమీఱ నకట మకరభ్రమతో నప్పులఁ గదలాడఁగఁ బెనుకప్పనుఁ గని నంత గజము గజ్జున వడఁకెన్ తిప్పలు తప్ప వాతనికిఁ దెల్లమె యియ్యది యెల్లవారికిన్మెప్పులఁ బొంద నేరఁ డట నిందల నందును మిక్కుటమ్ముగా నెప్పటి వోలె నిప్పు డెద నీసున మావటి వాని వెఱ్ఱి వెంకప్పనుఁ గాంచి కుంజరము గజ్జు మనెన్ శశకంబు నవ్వఁగన్
గొప్పగ మావటి వాడై చెప్పిన రీతిగ మెలిగె డి చేష్టలు గలదై యొ ప్ప గ న య్యె డ నా వె o కప్ప ను గనినంత గజము గజ్జు న వడ కెన్
కందంనిప్పునఁ గాల్చినఁ గాలకయప్పని హరిపాలుఁ జేయ నర్భకుఁ బొడ నయ్యప్పని సేనాని బెదిరె!కప్పనుఁ గనినంత గజము గజ్జున వడఁకెన్ఉత్పలమాలనిప్పున గాల్చమన్న పిత నీరమునందున ముంచఁ దేలెడున్గొప్పగు బాలభక్తునికి కూడె శశాంకము వోలు మిత్రుడే,యప్పని శౌరి పాలనిడ నర్భకుఁ డా దళవాయి భీతిలెన్గప్పనుఁ గాంచి కుంజరము గజ్జుమనెన్ శశకంబు నవ్వఁగన్
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.విప్పుకొనగ కాలి గొలుసుతప్పించుకొన వలెననెడు తలపున మదిలోనప్పుడు తన మావటి వెంకప్పను గనినంత గజము గజ్జున వడకెన్.
చెప్పినటుల వినకుండగ
రిప్లయితొలగించండితిప్పలు పెట్టుచు నశనము దినకుండుటచే
రొప్పుచు వచ్చిన యా వెం
కప్పనుఁ గనినంత గజము గజ్జున వడఁకెన్”
చెప్పిన యట్లు చక్కగను జేయక హెచ్చు మదంబు తోడుతన్
రిప్లయితొలగించండితిప్పలు పెట్టుచున్నదని దీనికి దండన తప్పదంచునున్
చెప్పులు కాళ్శకున్ తొడగి చేతను తోత్రము బట్టి వచ్చు వెం
కప్పను గాంచి కుంజరము గజ్జుమనెన్ శశకంబు నవ్వగన్
కాళ్ళకున్
తొలగించండి
రిప్లయితొలగించండిగొప్పగ బాంబులు కురియగ
చప్పున హర్మూజు మూసి జగడము కొరకై
చొప్పడి కాల్దువ్విన యొక
కప్పనుఁ గనినంత గజము గజ్జున వడఁకెన్
-
రిప్లయితొలగించండిచప్పున వేయును సంకె
ళ్లొప్పంగా మావటీడు ముప్పతడదిగో
నప్పా ! దూరంగా వెం
కప్పనుఁ గనినంత గజము గజ్జున వడఁకెన్
రిప్లయితొలగించండిఅప్పురమున గల గజపతి
కెప్పుడు కాదనక నప్పు నిచ్చిన వాడే
యప్పునడగ వచ్చిన వెం
కప్పనుఁ గనినంత గజము గజ్జున వడఁకెన్.
చెప్పిన నాలకింపక విచిత్రపు చేష్టలు చేయుచున్ సదా
తప్పుడు దారులన్ దిరుగు దంతిని దారికి తెచ్చు వృత్తిలో
తప్పదు కాదె యాంకుశము తా ధరి యింపక నంచు చెప్పు వెం
కప్పనుఁ గాంచి కుంజరము గజ్జుమనెన్ శశకంబు నవ్వఁగన్.
అప్పటి విషయము గాదిది
రిప్లయితొలగించండితిప్పలు పడెనా నదమున దిగి మాతంగమే
ఎప్పుడు గాంచనిదౌ బొం
కప్పనుఁ గనినంత గజము గజ్జున వడఁకెన్
అప్పటి దంతికాదు మరి యప్పటి గ్రాహము గాక పోయినన్
దిప్పలు తప్పలేదు కరి తిన్నగ వాహిని లోన కాలిడన్
దప్పికతోడ నీట దిగి తానట మిక్కిలి వింత చేప బొం
కప్పనుఁ గాంచి కుంజరము గజ్జుమనెన్ శశకంబు నవ్వఁగన్
[బొంకప్ప = గోళాకారంగా ఉండి ముళ్లతో కప్పబడ్డ చేప]
ఎప్పుడూ చూడని వింత చేపను చూసి ఏనుగు భయపడింది.
కం:గొప్ప దగు శక్తి యున్నను
రిప్లయితొలగించండినెప్పటికిన్ దానె యధికమే? అంకుశమున్
ద్రిప్పుచు రా,మావటి వెం
కప్పనుఁ గనినంత గజము గజ్జున వడఁకెన్”
ఉ;గొప్పగ వెంక డెంతయును కూరిమి తో శశకమ్ము బెంచె దా
రిప్లయితొలగించండిమెప్పును బొందు మావటియె, మేలగు నంకుశమున్ ధరించి తా
నెప్పటి వోలె రాగ, తన కెంతటి కష్టమొ యంచు, నట్టి వెం
కప్పనుఁ గాంచి కుంజరము గజ్జుమనెన్, శశకంబు నవ్వఁగన్”
(మావటి వెంకప్పను చూసి ఏనుగు భయ పడింది కానీ పెంపుడు జంతు వైన కుందేలు నవ్వింది. )
ఉ॥ కప్పనుఁ గాంచి కుంజరము గుజ్జుమనెన్ శశకంబు నవ్వఁగన్
రిప్లయితొలగించండిజెప్పఁగఁ దల్లక్రిందులిటు చిత్ర విచిత్ర విధమ్ము లెంచుచన్
గొప్పగఁ గొంత మాత్రమటు కూర్చును హాస్యము నింతియేఁ గదా
తప్పుగఁ బల్క నెందులకొ తథ్యము పూరణ కష్టమై చనన్
తిప్పలు కల్గ కారడవి తేకువ తోడుత హస్తియూధముల్
రిప్లయితొలగించండిచొప్పడు మార్గ మెంచి తగు చోటుకు పోవుచు నుండ నొక్కటన్
చప్పున చేర నచ్చటకు సాయకముల్ గొని, వేటగాడు వెం
కప్పనుఁ, గాంచి కుంజరము గజ్జుమనెన్ శశకంబు నవ్వఁగన్
నిప్పు వలె మనస్తాపం
రిప్లయితొలగించండిబప్పుడు మితిమీఱ నకట మకరభ్రమతో
నప్పులఁ గదలాడఁగఁ బెను
కప్పనుఁ గని నంత గజము గజ్జున వడఁకెన్
తిప్పలు తప్ప వాతనికిఁ దెల్లమె యియ్యది యెల్లవారికి
న్మెప్పులఁ బొంద నేరఁ డట నిందల నందును మిక్కుటమ్ముగా
నెప్పటి వోలె నిప్పు డెద నీసున మావటి వాని వెఱ్ఱి వెం
కప్పనుఁ గాంచి కుంజరము గజ్జు మనెన్ శశకంబు నవ్వఁగన్
గొప్పగ మావటి వాడై
రిప్లయితొలగించండిచెప్పిన రీతిగ మెలిగె డి చేష్టలు గలదై
యొ ప్ప గ న య్యె డ నా వె o
కప్ప ను గనినంత గజము గజ్జు న వడ కెన్
కందం
రిప్లయితొలగించండినిప్పునఁ గాల్చినఁ గాలక
యప్పని హరిపాలుఁ జేయ నర్భకుఁ బొడ న
య్యప్పని సేనాని బెదిరె!
కప్పనుఁ గనినంత గజము గజ్జున వడఁకెన్
ఉత్పలమాల
నిప్పున గాల్చమన్న పిత నీరమునందున ముంచఁ దేలెడున్
గొప్పగు బాలభక్తునికి కూడె శశాంకము వోలు మిత్రుడే,
యప్పని శౌరి పాలనిడ నర్భకుఁ డా దళవాయి భీతిలెన్
గప్పనుఁ గాంచి కుంజరము గజ్జుమనెన్ శశకంబు నవ్వఁగన్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
విప్పుకొనగ కాలి గొలుసు
తప్పించుకొన వలెననెడు తలపున మదిలో
నప్పుడు తన మావటి వెం
కప్పను గనినంత గజము గజ్జున వడకెన్.