కం: అ ప్పండితు డవధానము తప్పుల తో జేసె గాని, తగునే సభలో జెప్పుట, నూర్వురు వినగా తప్పునుఁ దప్పే యనంగఁ దప్పగును గదా! (అవధాని ఏవో కొన్ని తప్పులు చేసాడయ్యా!మీరు మాత్రం సభలో చెప్పేస్తారా?చాటున చెప్పాలి కానీ!అలా చెప్పేస్తే ఆయన తో అవధానం ఎలా చేయించారు? అని మననే అంటారు. )
ఉ:తప్పులు నాయకాళియె స్వతంత్రపు నాళ్ల నొనర్చినారు లే !, యొప్పక వారె గొప్ప యని, యొక్కటి దోషము జూప నీ సభన్ జెప్పుల తోడ గొట్టెదరు, చేరిరి మూర్ళపు భక్తు లీ సభన్ తప్పునుఁ దప్పుగా నెఱిఁగి తప్పని పల్కుట తప్పెయౌఁ గదా!” (పూర్వం నాయకులు కొన్ని తప్పులు చేసారు కానీ వాటిలో ఒకటి చెప్పినా ఈ భక్తులు చెప్పుల తో కొట్టేటట్టున్నారు. ఇక్కడ చెప్పటం తప్పే. )
ఇప్పటి కాలము నందున
రిప్లయితొలగించండిదప్పగ నేర్వదగుదైన దారిని యెంచన్
గొప్ప పదవి గల జనుల
తప్పునుఁ దప్పే యనంగఁ దప్పగును గదా
కందం
రిప్లయితొలగించండిముప్పు ఘటిల్లు పదవినిన్
గొప్పగ కూర్చున్న వారి కుటిలమునెంచన్
దిప్పలు పరోక్ష దాడులఁ
దప్పునుఁ దప్పే యనంగఁ దప్పగును గదా
ఉత్పలమాల
ముప్పు ఘటిల్లెడున్ పదవి పోందిన నేతల తప్పులెంచినన్
గొప్ప వ్యవస్థలున్ దరుమ కూలబడంగను దప్పదెప్పుడున్
దిప్పల జిక్కుచున్ నడత తీరును మార్చక కార దిక్కగున్
దప్పునుఁ దప్పుగా నెఱిఁగి తప్పని పల్కుట తప్పెయౌఁ గదా!
రిప్లయితొలగించండిఎప్పుడు మౌనము వీడకు
ముప్పది చెప్పెదను వినుము, మూర్ఖుండిలలో
చెప్పినదె యొప్పు వారికి
తప్పునుఁ దప్పే యనంగఁ దప్పగును గదా.
చెప్పెద నాలకింపుమది క్షేమము గోరి వచింతు నియ్యదిన్
ముప్పును దెచ్చు నంటి కడు మూర్ఖుల తో వ్యవ హారమందు, నీ
కెప్పుడు వాగ్వివాదమది యింపును గూర్చగలేదు వారితో
తప్పునుఁ దప్పుగా నెఱిఁగి తప్పని పల్కుట తప్పెయౌఁ గదా.
ముప్పు ఘటిల్లు తప్పకను మూర్ఖులు దుష్టులు గద్దె నెక్కినన్
రిప్లయితొలగించండిఎప్పటి కప్పుడున్ ధనము నెంతయొ వారలు దోచి దాచినన్
చిప్పయు చేతికిచ్చినను చెప్పగ వద్దుగ వారిచేష్టలన్
తప్పును దప్పుగా నెఱిగి తప్పని పల్కుట తప్పెయౌ గదా
తప్పగు సీతను దెచ్చుట
రిప్లయితొలగించండితప్పక విడనాడకున్నఁ దప్పౌననుచున్
జెప్పెను విభీషణుండే
తప్పునుఁ దప్పే యనంగఁ దప్పగును గదా
తప్పగు సీతనిచ్చటకు ధర్మము నెంచక తెచ్చియుంచుటే
తప్పగు శత్రు శక్తిని వితర్కము సేయక సాగిపోవుటే
విప్పితి డెందమున్ గుజను వీడమటంచు విభీషణుండనెన్
దప్పునుఁ దప్పుగా నెఱిఁగి తప్పని పల్కుట తప్పెయౌఁ గదా
డిజిటల్ భువన విజయం -
రిప్లయితొలగించండిపాప్ కార్న్ పొయెట్రీ
( పేలాల లవంగ శతకం )
https://youtu.be/IS1PTEx3B6s?si=t-mQwDUBuN30pFho
-
రిప్లయితొలగించండిశ్యామలీయం గారి జిలేబి శతకం
ఆడియో పాడ్కాస్ట్
https://varudhini.blogspot.com/2026/04/blog-post_29.html
కుప్పలుగా ధనముండిన
రిప్లయితొలగించండినొప్పులగును తప్పులైన నుర్వీస్థలిలో
చెప్పెదనొక సూక్తి వినుము
తప్పునుఁ దప్పే యనంగఁ దప్పగును గదా
ఎప్పుడు సంపదల్ గలుగు నెప్పుడు విశ్రుతమొందు సంఘమం
రిప్లయితొలగించండిదప్పుడు వాని చేయుపనులన్నియు గొప్పగ జూతురెల్లరున్
తప్పులు కానరావు ప్రథితమ్మగు నే పనియైన నెన్నఁడున్
తప్పునుఁ దప్పుగా నెఱిఁగి తప్పని పల్కుట తప్పెయౌఁ గదా
కం: అ ప్పండితు డవధానము
రిప్లయితొలగించండితప్పుల తో జేసె గాని, తగునే సభలో
జెప్పుట, నూర్వురు వినగా
తప్పునుఁ దప్పే యనంగఁ దప్పగును గదా!
(అవధాని ఏవో కొన్ని తప్పులు చేసాడయ్యా!మీరు మాత్రం సభలో చెప్పేస్తారా?చాటున చెప్పాలి కానీ!అలా చెప్పేస్తే ఆయన తో అవధానం ఎలా చేయించారు? అని మననే అంటారు. )
ఉ:తప్పులు నాయకాళియె స్వతంత్రపు నాళ్ల నొనర్చినారు లే !,
రిప్లయితొలగించండియొప్పక వారె గొప్ప యని, యొక్కటి దోషము జూప నీ సభన్
జెప్పుల తోడ గొట్టెదరు, చేరిరి మూర్ళపు భక్తు లీ సభన్
తప్పునుఁ దప్పుగా నెఱిఁగి తప్పని పల్కుట తప్పెయౌఁ గదా!”
(పూర్వం నాయకులు కొన్ని తప్పులు చేసారు కానీ వాటిలో ఒకటి చెప్పినా ఈ భక్తులు చెప్పుల తో కొట్టేటట్టున్నారు. ఇక్కడ చెప్పటం తప్పే. )
గొప్పలు జెప్పుక దిరిగుచు
రిప్లయితొలగించండిమెప్పులు పొందంగ జూచి మేటిగ మసలే
తప్పుడు వారల కెప్పుడు
తప్పును తప్పనంగ దప్పగును గదా!
సమస్య : "తప్పునుఁ దప్పే యనంగఁ దప్పగును గదా"
రిప్లయితొలగించండిఒప్పుల కుప్పవు నీవని
యెప్పుడు భామల పొగడఁగనిల భద్రమ్మౌ
చప్పున నోర్మూసుకొనక
తప్పునుఁ దప్పే యనంగఁ దప్పగును గదా
ఎప్పుడు నెవ్వ రయినఁ దన
రిప్లయితొలగించండితప్పు నెఱుంగక యెడందఁ దలపోయక తా
నొప్పుగఁ దలంచి వింతగఁ
దప్పునుఁ దప్పే యనంగఁ దప్పగును గదా
[తప్పే = తప్పా, కాదని]
మెప్పు వహింతు రెల్లరును మిన్నగ మౌనము నూని సుంతయుం
జప్పుడు సేయకుండ నృప సత్తము నింపుగ నాలకించినన్
గొప్ప సదస్సు నందు నృప కుంజరుఁ డాడిన మాట లందు నే
తప్పునుఁ దప్పుగా నెఱిఁగి తప్పని పల్కుట తప్పెయౌఁ గదా
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
ఒప్పుకొనెద రెవరైనను
తప్పునుఁ దప్పే యనంగఁ; దప్పగును గదా
తప్పును చెప్పిన నొప్పని,
తప్పని చెప్పకు మెపుడు నితరులకు నొప్పున్.
కం॥ చెప్పుదు వేదము వినఁదగు
రిప్లయితొలగించండిదెప్పకు దోషములఁ గనఁగ దేవేరి యటుల్
గొప్పలు పలికినఁ దెలిసినఁ
దప్పునుఁ దప్పే యనంగఁ దప్పగును గదా
ఉ॥ చెప్పుదు నేర్చుకో సఖుఁడ శ్రేయము నొందఁగఁ బత్ని పల్కఁగన్
దెప్పుచు దోషమెంచకుమ తెల్సిన, జీవిత మందునెప్పుడున్
ముప్పును గాంచఁ బోవు తగు మోదము దక్కును వేద మిద్దియే
తప్పనుఁ దప్పుగా నెఱుఁగి తప్పని పల్కుట తప్పెయౌ గదా!
గొప్పమనస్సటంచునొక కోమలి హస్తము నందుకొంటివే
రిప్లయితొలగించండిచెప్పుచు నుంటి విప్పుడతి చేయుచు నుండె నటంచు, మిత్రమా!
యొప్పుగ నెంచు భార్యనుడి నొద్దికతో, లలిఁ గోరుకున్నచో
తప్పును దప్పుగా నెఱిగి తప్పని పల్కుట తప్పెయౌఁగదా