2, ఆగస్టు 2016, మంగళవారం

పద్మావతీ శ్రీనివాసము - 18




పద్మావతీ శ్రీనివాసము (ద్విపద కావ్యము)
రచన : పోచిరాజు కామేశ్వర రావు
చతుర్థాశ్వాసము (101-107)

వృక్ష మూలమ్మునఁ దృటి గన్పడె ఘన
వక్షుండు నాజాను బాహు దర్పుండు                  101

నీలి మేఘశ్యామ నిరుప మానుండు
మాల ధరుండును మాననీయుండు                    102

మకర కుండల మణి మయ విభూషితుడు
నకళంక రూపుని నరవింద నయను                    103

కాంచి పద్మావతి కమల దళాక్షి
కాంచన నిభ దేహి కనుడు గనుడని                     104

మాకుఁ జూపఁ దృటిని మా యెదుటనె
దాకారు డంత నంతర్ధాను డయ్యె                         105  

అంతమా సఖిమూర్ఛ నందంగ వెరసి
యింతిని ననిపితి మింపుగ గృహము                   106

సంకట కల్మష సంచయ హరణ           
వేంకట గిరివాస వేంకట రమణ                             107

ఇది విబుధజన వినత కౌశిక సగోత్రోద్భవ పోచిరాజాన్వయ సత్యసుందరీపేర్రాజదంపతీ సుత
వేంకట రామ లక్ష్మీ సతీ సేవిత కామేశ్వర రావు నామధేయ ప్రణీతంబైన
                                               పద్మావతీ శ్రీనివాసమున  చతుర్థాశ్వాసము

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి