18, ఆగస్టు 2016, గురువారం

సమస్య - 2119 (ధాన్యము వద్దురా మనకు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"ధాన్యము వద్దురా మనకు ధాన్యము గావలె ధన్యతం గనన్"
లేదా...
"ధాన్య మేల మనకు ధాన్యముండ"

114 వ్యాఖ్యలు:

 1. అన్న మనగ నార్య యానంద భైరవి
  మిన్న గాదె వినగ యెన్న గాను
  అన్న రసము లేక యలమటిం చగతృణ
  ధాన్య మేల మనకు ధాన్య ముండ

  ప్రత్యుత్తరంతొలగించు
 2. మాన్యులు మీరలంచు నుతి మార్గముఁ బట్టగ బంధువర్గముల్
  ధన్యత నొందె జన్మమని దానము సేయగ లేని గొప్పకున్
  మాన్యములన్ని పోయి యవమానముఁ బొందరె వారు కాన ప్రా
  ధాన్యము వద్దురా మనకు ధాన్యము గావలె ధన్యతం గనన్!!

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. జిగురు సత్యనారాయణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు

 3. ధాన్య మేళ !


  ధాన్య మేళ యందు ధారాళముగరండు
  యితర దేశ ధాన్య మిచట గొనుడు
  మేళ యేల నోయి మేల్నాటి వారల
  ధాన్య మేల మనకు ధాన్యముండ

  జిలేబి

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. జిలేబీ గారూ,
   'ధాన్యమేళ'...? మీ ఉద్దేశంలో 'ధాన్య మేలా' యా? ఋణమేలా, ఉద్యోగమేలా వంటిదా?

   తొలగించు
  2. బాగుంది మీ పూరణ. అభినందనలు.

   తొలగించు
 4. మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి


  శూన్య కరమ్ములున్ మరియు శుష్కములౌ వచనమ్ములేలరా ?
  మాన్యుడు కర్షకుండు నవమానములన్ భరియింపనేలరా ?
  ధన్యపు నేలరా ! ధరణి ధర్మమునేలర ! లేనిపోని ప్రా..
  ధాన్యము వద్దురా ! మనకు ధాన్యము కావలె ధన్యతన్ గనన్ !!

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. మైలవరపు మురళీకృష్ణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 5. పట్నమందు దొరికె పసిడికి సరితూగు
  మేలు వంగడములు మితము గాను
  చేరి జల్ల వలయు చెలిమిగలిగి; చిరు
  ధాన్య మేల? మనకు ధాన్య ముండ

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. టేకుమళ్ళ వెంకటప్ప గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 6. ప్రత్యుత్తరాలు
  1. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. “అభ” కాదు “ఆభ” అని సదృశమను భావములో వాడితిని. “అహర్బాంధవ+ఆభ” = అహర్బాంధవాభ - తత్సమము. “ఆభా” సంస్కృత పదము. సూర్యునితో సమానమని ('న’ గణము సూర్య గణమేకద) నా భావము. సాధువేనా తెలుప గోర్తాను.

   తొలగించు

  2. పోచిరాజు వారు

   నిన్నటి మీ కంద పద్యం లో మూడు పదాలు ఏక సమాసం గా వ్రాసేరు ; ఆ సమస్యా పాదమే లెకున్న మొత్తం నాలుగు పాదాల ఏక సమాసం గా అది వ్రాయ వీలవుతుందా ? అయితే దయచేసి ప్రచురించ గలరు ఇక్కడ (తెలుసుకోడానికి )


   జిలేబి

   తొలగించు
  3. జిలేబీగారు గొప్పచిక్కు సమస్యనే యిచ్చారు. అయినా ప్రయత్నించాను తిలకించండి.

   గగనాంతర సీమ వర శు
   భగగ్రహామర గురుప్రభాకాయ విలా
   స గమన వికాస మానస
   జగన్నుతజ్ఞాన విభవ సన్నుత వాగ్మీ

   తొలగించు
  4. కామేశ్వర రావు గారూ,
   నిన్న అలసటలో ఉండి కేవల `అభ' గురించే ఆలోచించాను. `ఆభ' శబ్దం నాకు గుర్తుకు రాలేదు. మన్నించండి. మీ ప్రయోగం సాధువే.
   జిలేబీ గారి కోరికపై వ్రాసిన పద్యంతో మీరు 'వాగ్మి' అని నిరూపించుకున్నారు.

   తొలగించు


  5. పోచిరాజు వారు

   నమో నమహ్ !

   దీని తాత్పర్యం కూడా తెలుసు కోవచ్చా ?

   తొలగించు
  6. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

   జిలేబీ గారు నమస్సులు. ఆకాశములో గొప్ప యదృష్టవంతమైన గ్రహము, దేవతలగురువు, కాంతివంతమైన శరీరము కలవాడు,విలాసముగా సంచరించు వాడు, వికసించిన మనస్సు కలవాడు, జగత్తు చే నుతింప బడిన జ్ఞాన సంపద కలవాడు , చక్కగా కీర్తింప బడు వాడునగు బృహస్పతీ ! అని దీని భావమండి.

   తొలగించు

  7. పోచిరాజు వారు

   నమస్సులు నెనరులు ! అద్భుతః !

   నా వరకు యిదే మొదటి మారు యిట్లాంటి ప్రయత్నము చూడడము !

   ధన్యవాదములు


   జిలేబి

   తొలగించు
  8. అద్భుతం కామేశ్వరరావు గారూ

   తొలగించు
  9. ధన్యవాదములండి మిస్సన్న గారు

   తొలగించు
 7. ధాన్యమనగ వరినె తలచు చుందుమెపుడు!
  ధాన్యమే కనకము, ధనము లనిడు!
  కడుపు నింపు పంట కడు తీపి! వేరు ప్రా
  ధాన్య మేల? మనకు ధాన్య ముండ!

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. శ్రీధర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 8. ధాన్య మేల మనకు ధాన్య ముండగమరి
  ధాన్య మాడ, మారు దండు లముగ
  దండు లములు దెఛ్చి వండిన నగు గద
  భోజ్య వస్తు వుగను భోక్త లకిల

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 9. ధాన్యము వద్దురా మనకు ధాన్యము గావలెధన్యత న్గనన్
  ధాన్యము మంచి రంగు గలదా ,పరికించుచు ముందుగా నటన్
  మాన్యుల యొద్దనే గొలిచి మాపటి వేళకు రమ్ముమా మరిన్
  మాన్యత యైన యట్టి బహుమానము నిత్తును నప్పుడే సుమా

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. సుబ్బారావు గారూ,
   కొంత అన్వయదోషం ఉన్నా మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 10. అన్యుల ప్రాభవమ్ముగని యట్టుల గొప్పగ నుండ నెంచియున్
  మాన్యములమ్మివేసి ఘనమా​న్య​​​​త​​ నొందగ జూచువానితో
  మాన్యత వృత్తియందుననె మానకు దానిని కీర్తి నంద ప్రా
  ధాన్యము వద్దురా మనకు ధాన్యము గావలె ధన్యతం గనన్!

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. బొడ్డు శంకరయ్య గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 11. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. అన్యము లెన్నియున్న సరి యౌనె తలంపగ బువ్వ కిద్ధరన్
   మాన్యులె యన్న దాతలును మానవ జాతికి ప్రాణ దాతలున్
   శూన్యపు పల్కు లేల నిరఁ జోద్యమె యమ్మగఁ జూడఁ ,గాదె మే
   ధాన్యము, వద్దురా మనకు ధాన్యము గావలె ధన్యతం గనన్

   [మేధా+అన్యము=మేధాన్యము: బుద్ధిలేమి]

   దేవుడు ప్రత్యక్షమైన నేమి కోరుకోవాలాయని తర్కిస్తున్న మిత్రుల భాషణములు:

   ముక్తి కాముల కిల మోక్ష మిచ్చునతడు
   భక్త జనులఁ బ్రోచు బాంధవుండు
   మేను నిల్ప జాలు మేలైన వసువు,సు
   ధాన్య మేల, మనకు ధాన్యముండ
   [సుధా+అన్యము=సుధాన్యము: అమృతేతరము]

   తొలగించు
  2. కామేశ్వర రావు గారూ,
   వైవిధ్యమైన మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించు
  3. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

   తొలగించు
 12. శిష్ట్లా శర్మ గారి పూరణ.....

  మాన్యుడు రైతు, భూముల గ్రమమ్మున సేద్యముజేసి పంట నై
  పుణ్యము తోడ జీవన ప్రపూత మొనర్చి కృషిందరించుచున్
  ధన్యత నొందువాడు హృదయంబున వీడ
  డనంత ప్రేమ, భూ
  ధాన్యము వద్దురా మనకు! ధాన్యము గావలె ధన్యతంగనన్!

  ధాన్యము=కొలుచు

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. శర్మ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
  2. శర్మ గారు "భూధాన్యము వద్దురా" అన్నప్పుడు మీ యభిప్రాయ మేమిటో కొంచెము వివరిస్తారా?

   తొలగించు
  3. 'భూదాన్యము' విషయంలో నాకూ సందేహం ఉంది. వారు ధాన్యము = కొలుచు అన్నారు. సందేహనివృత్తికి ఆంధ్రభారతిని సంప్రదించాను. అక్కడ 'కొలుచు' అని అర్థాన్నిచ్చి నవధాన్యాల పేర్లనిచ్చారు.

   తొలగించు
  4. కామేశ్వర రావు‌గారూ నమస్సులు....భూమికొలతలు వద్దు....అంటే విస్తీర్ణముతో పనిలేదు...రైతు శ్రమపడి పండించే ధాన్యము మనకు చాలు....అని నా అభిప్రాయం..... అన్వయం బాగా కుదిరినట్లులేదు

   తొలగించు
  5. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. అవునండి. నేనూ చూశాను కొలుచు యని అర్థమున్నది. ఆ యనుమానముతోనే వారిని యడిగాను వారి ఉద్దేశ్యము.
   శర్మ గారు యిక్కడ గమనించ వలసిన విషయ మొకటి యున్నది. కొలుచు పదమునకు మూడర్థము లున్నవి.క్రియగా యుపయోగించిన కొలత వేయు, సేవించు లేక పూజించు (దేవుని) : రెండర్థములు.
   విశేష్యము (నామ వాచకము)గా నుపయోగించిన ధాన్యమని యొక యర్థము.
   ధాన్యము విశేష్యమైన కొలుచు పదమునకు సమానార్థము. క్రియా పదమునకు కాదు.
   అందుచేత మీ పూరణలో ధాన్యమన్న కొలత వేయు గా భావించరాదు.

   తొలగించు
  6. ధన్యవాదములు...బాగా పూరించలేకపోయాను.

   తొలగించు
  7. శర్మ గారు పరవా లేదు సవరించండి. తప్పక చేయగలరు మీరు.

   తొలగించు
  8. మన ధాన్యము మనకుంది వేరేవారి ధాన్యమెందుకు

   తొలగించు
 13. పరుల తోడ పోటి వలదింక బాల,ప్రా
  ధాన్యమేల మనకు ధాన్య ముండ?

  తిండి దొరక నపుడు తిప్పలు దప్పవు
  దైనకరుణ యున్న ధరణి యందు
  వర్షకాలమందు వాన కురియ తృణ
  ధాన్య మేల మనకు ధాన్య ముండ.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
   ముందుగా వ్రాసిన రెండు పాదాలు?
   తరువాత వ్రాసిన పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 14. ధన్యత నొందు డన్నమును దానము జేయుచు పుష్కరమ్ములన్
  మాన్యులు చెప్ప వేడగను మామ విరాళము నిచ్చె ధాన్యమున్
  దైన్యత నిండె చూడ నవి తప్పలు చాలిక పొల్లుకాయలౌ
  ధాన్యము వద్దురా మనకు ధాన్యము గావలె ధన్యతం గనన్.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. మిస్సన్న గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 15. సైన్యమునందు వీరుడట|సైగలు జేయగనాడ వారితో
  శూన్యుడుగానుమారు|పరిశోధన జేయగ?”పంట తాలుగా
  ధాన్యము వద్దురా,మనకు ధాన్యము గావలె ధన్యతంగనన్
  మాన్యులు వాడు మాటలివి మార్చిన నష్టమె కల్తిగింజలౌ| {చూడటానికి బాగున్నసైనికుడికిఆడవారిపొందునాశించేబలహీనతలాగా తాలుధాన్యమేల మంచిధాన్యముండ}
  2.కం* సమతుల్యపు నాహారము
  అమరిక నవధాన్య మనెడి అన్నయె|చిరుధా
  న్యము వద్దురా మనకు ధా
  న్యము గావలె ధన్యతంగనన్ యనుటేలా?
  3.ఆలి యుండగ వెలయాలితో సరసమ?
  పొలముపంట యింటనిలువ లుండ?
  అమ్మబోక సరుకు లాశగ గొనుటేల?
  ధాన్యమేల మనకు ధాన్య ముండ?
  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ఈశ్వరప్ప గారూ,
   మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   మొదటి పూరణలో కొంత అన్వయలోపం ఉన్నట్టుంది.
   ఉత్పలమాల పాదాన్ని కందంలో పొదిగిన మీ నైపుణ్యం ప్రశంసనీయం. '..గనన్+అనుతేలా' అన్నపుడు యడాగమం రాదు. '..గనన్ పలుకేలా' అందామా?

   తొలగించు
 16. మాన్యులు దెల్పగా నిలను మానవ జాతికి జీవశ క్తికిన్
  ధన్యత నొందగా తనరి ధార్మిక కార్యము లందుపు ష్టియౌ
  వన్యమృ గంబువో లెమది బంధన ముల్విడి తాలుగిం జలౌ
  ధాన్యము వద్దురా మనకు ధాన్యము గావలె ధన్యతం గనన్

  ప్రత్యుత్తరంతొలగించు
 17. జొన్నకూడుగుడిచి సన్నన్నముకొరకు
  పరితపించె కవి వరుడు నాడు
  పండుచుండ వడ్లు దండిగానిట, చిరు
  ధాన్యమేల మనకు ధాన్యముండ

  ప్రత్యుత్తరంతొలగించు
 18. సంకర జాతి గింజలు, విష పూరితములు. మేధావులు, రాజకీయ నాయకులు సంకరజాతులను మనదేశములోనికి రానీయకుండా ఆపిన, తరతరాలుగా సామాన్య రైతులు తయారు చేసిన ధాన్యములే
  శాశ్వతముగా నిలచి, ఆరోగ్యము నిస్తాయి.
  అన్య విధానముల్ కథన నత్యధికమ్ముగ పండు నంజుకుఁ ప్రా
  ధాన్యము వద్దురా, మనకు ధాన్యము గావలె ధన్యతంగనన్
  మాన్యులు వేరుపద్ధతులు మార్కొని యాపిన సంకరమ్ము, సా
  మాన్యులు వృద్ధిచేసిన ప్రమాణము లన్నియు శాశ్వతమ్ములౌ
  నంజుః విషము

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ మొదటి పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవపూరణ మొదటి పాదంలో గణదోషం. కతన.. కథన అని టైపయింది.

   తొలగించు
 19. వరుణుడు కరుణించె వానలు కురిసేను
  పంటలన్ని పండు బాధతీరు
  పరుల తోడ పోటి వలదింక బాల,ప్రా
  ధాన్యమేల మనకు ధాన్య ముండ?

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
   ఇంతకు ముందు అసంపూర్తిగా వదలి వేసిన పూరణను ఇక్కడ పూర్తిగా ప్రకటించారు. బాగుంది. అభినందనలు.

   తొలగించు
 20. మహిని విందులన్న మాంసముఁ దినగ ప్రా
  ధాన్య మేల? మనకు ధాన్యముండ
  వండి, కాయగూర, పరమాన్నములతోడ
  పుష్టి నొసఁగు తిండి ముదము గాదె?

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 21. .ఉత్సాహవృత్తం మగువగొన్న మగనియాలిమమతలుంచి పెంచునా?
  తెగువ జేసిచదువు గొనుట దేనికయ్యలాభమా?
  తగనిధాన్య మేల?మనకు ధాన్యముండ దండుగే
  తగినభార్యచెంత నుండ తలచుటేల వేశ్యనే?

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ఈశ్వరప్ప గారూ,
   ఉత్సాహంతో మీరు చేసిన పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 22. కానల నుంటిమా కడుపుకై సరి పత్రఫలాదులుండెనా
  బానల వంటి పొట్టలకు వార్చిన యన్నమె ప్రాణహేతువౌ
  గానములాకటన్ దగునె కాయము గాదన మోక్షమబ్బునే
  ధ్యానము వద్దురా మనకు ధాన్యము గావలె భవ్యతన్ గనన్

  ప్రత్యుత్తరంతొలగించు
 23. ఇల్లు గట్టనేల. నిదుగొ ప్రభుత యిచ్చె
  ఒల్లు దాచుకొనగ నొనరె భృతియు
  కల్లు సారలకైపుఘనముగాఘటియింప
  ధ్యానమేల మనకు ధాన్యముండ

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. పిట్టా సత్యనారాయణ గారూ,
   రెండు పూరణలలో సమస్యలోని ధాన్యమును ధ్యానముగా మార్చారు. మార్చిన సమస్య వరకు పూరణలు బాగున్నవి. కాని సమస్యను మార్చరాదు కదా!

   తొలగించు
 24. తగునద్దానిని కానిదానిని బలే తర్కాళినిన్ బోధనన్
  తగునమ్మాయని జెప్పి ఉల్లి తనకున్ దప్పెట్లనే ధోరణిన్
  వగలన్నే యుపదేశమైనసరెనీ వాంఛాదిగానున్న లో
  భగణంబందున నా‌స్తిరా గురువు విద్వాంసుల్ వినం జెప్పితిన్

  .

  ప్రత్యుత్తరంతొలగించు
 25. జతలకుజతలైవిడ్వడు
  కతనన్నొక చెక్క పీట గట్టించితిమా
  సుతరాము వినరె.విను .సు
  వ్రత.పీఠము పైన పాదరక్షల నిడుమా

  ప్రత్యుత్తరంతొలగించు
 26. గతయే డింటికి శ్రీనివాసు చరణాల్గన్గొంటి మీసారి స
  ద్గతికై శ్రీవరలక్ష్మి పాదములనే గైకొంటి మా యాత్ర నా
  జతలన్రెంటినియింట పాల గడుగన్ జాలంచునే మ్రొక్కితిన్
  వ్రతపీఠమ్మున పాదరక్షలిడుమా భక్తిన్ బ్రపూజింపగా

  ప్రత్యుత్తరంతొలగించు
 27. వీరనారు లుద్ధతిగన్న విబుధ సతులు
  ఉత్తమోత్తమ గుణ రాశులుంట దుష్ట
  పురుష పరుష ప్రభావమున్ బూడ్చ గలము
  మారె కాలము మెలగ సమానగతిని
  వనిత మీసమ్మునంటి తా బలికె నిట్లు

  ప్రత్యుత్తరంతొలగించు
 28. జనసామాన్యునివోటుసూటీ బలమున్ జాజ్జ్వల్యత్రింశత్ ధృతిన్
  మన జాలందగు రాజకీయ నెపమున్ మౌనంబుగా దాల్చి తా
  ననవద్యంపు పరాభవాల గడిచెన్ అత్తూరి ద గెల్వ నో
  వనితా రత్నము మీసమంటి పలికెన్ వాల్లభ్యముప్పొంగగన్

  ప్రత్యుత్తరంతొలగించు
 29. అన్నలున్ సీత అంతఃపురంబువాయ
  ప్రాత శోకపు ననుభూతి బడయనేమొ
  దండకారణ్య జిగిబిగి దరచిగనగ
  పరమ విశ్వాస పాత్రుల బ్రాణ ‌సముల
  భరతుడంపెరా మునివనవా‌సమునకు

  ప్రత్యుత్తరంతొలగించు
 30. పనిబూని స్పర్శసౌఖ్యం
  బన గోరెడు శూర్ఫణఖల బరికింపగ ద
  న్గన యితర యువతులను దా
  ననుమానించెడి పతిగల అతివ సుఖించున్
  .

  ప్రత్యుత్తరంతొలగించు
 31. క్రీస్తు పూజనీయుడు కాడు క్రైస్తవులకు
  అల్లనల్లన నొకయాత్మ యాడు హృదిని
  రాముడును రహీములుకర్మ రాజ్యమునకు
  ఆది పురుషులు వారిని అనుసరించ
  జాలు వారలే భువి మన జాలు వారు

  ప్రత్యుత్తరంతొలగించు
 32. మాన్యము లిచ్చినారు గద మానిసి సేద్యము జేయ నీకు నా
  మాన్యము లెల్ల డబ్బు కయి మానవ యమ్మియు నేడు చూడ సా
  మాన్యని రీతి మారితివి మట్టిని నమ్మక పైసకేల ప్రా
  ధాన్యము వద్దురా! మనకు ధాన్యము గావలె ధన్యతం గనన్

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 33. భక్తునికి పారు నీటికి బరగు సమత
  మలినమును జార్చు నైర్మల్యఖలుల సుకృతుల నొక రీతి గనెడు వారు
  పరమ భాగవతులు సాని వాడ నుంద్రు

  ప్రత్యుత్తరంతొలగించు
 34. భక్తునికి బారు నీటికి బరగు సమత
  మలినమును జార్చు నైర్మల్య మల దనర్చు
  ఖలుల సుకృతుల నొకరీతి గనెడు వారు
  పరమ భాగవతులు సాని వాడ నుంద్రు

  ప్రత్యుత్తరంతొలగించు
 35. కాలుని మాయలు యువతుల
  పాలిటి శాపములు గావె పరికింపగ ద
  న్నేలుకొను పతియె మడిసిన
  పూలను సిగలోన తురుము పొలతులు గలరే

  ప్రత్యుత్తరంతొలగించు
 36. గురువులకు నమస్కారములు. ఇది నా మొదటి ప్రయత్నము.
  పదో తరగతి తరువాత తెలుగు చదవలేదు ;-(
  తప్పులున్నచో మన్నించగలరు.
  పాకులాటలాడె పాడు పిజ్జా,బర్గ
  రుల్ కొరకు, తెనుఁగు సురుచులు మరిచె!
  హాటు డాగు,చిప్పు,హాంబర్గరులకు ప్రా
  ధాన్య మేల, మనకు ధాన్యముండ

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. తోలేటి రాజేశ్ గారూ,
   శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
   మీ ప్రయత్నం ప్రోత్సహించదగినది. ఛందోదోషాలు లేవు. మీ పద్యానికి నా సవరణ....

   పాకులాడుచుంద్రు పాడు పిజ్జా బర్గ
   రులఁ దినంగ తెనుఁగు రుచుల మరచి;
   హాటు డాగు చిప్సు హాంబర్గరులకు ప్రా
   ధాన్యమేల మనకు ధాన్యముండ.

   తొలగించు
 37. జన మనముల స్త్రీవాదపు
  దినమే యిది కాదటన్న దిక్కెవరు సుమీ
  మన చెల్లికి దగదప్పటి
  ..కనికరమున్ జూపదగదు కాంతల పైనన్..

  ప్రత్యుత్తరంతొలగించు
 38. యుద్ధమన నాగరికతకు నో యొజ్జ యౌనె
  శాంతి పఠనమాచరణ సు శ్రమలు మేలు
  పరుల బలమును శంకించ బనియె లేదు
  ఉత్తరుండర్జునుని కంటె ఉత్తముండు

  ప్రత్యుత్తరంతొలగించు
 39. కామన యున్న చాలదు న కారము ఋత్వము సంధి మైత్రినిన్
  క్షేమము సేయకుండనతి శీ ఘ్రపు బూరణ జేయ బోవుచు
  న్నీమమ దప్పితిన్.బరచె. యే .జెరచె.న్నయె నిప్డు రామ.యీ
  రాముడు ధర్మమున్ .జెరచె. రాజులు యోగులు సంతసింపగన్

  ప్రత్యుత్తరంతొలగించు
 40. కూరిమి గల నరునకు సం
  సారము నడుపంగ గలుగు శౌర్యమదున్నన్
  భారము కోడలికని వర
  నారికి దన పుట్టినిల్లు నరకమ్ముగదా.

  ప్రత్యుత్తరంతొలగించు
 41. అవిరళ భావ దరిద్రత
  చవి జూచిన శ్రోతలెల్ల సై సై యన ద
  ద్భవితనునెంచియె ఖరమొగి
  కవినే నే నౌదుననుచు గాండ్రించెనటన్

  ప్రత్యుత్తరంతొలగించు
 42. మే నరసి చూడ పై పైని మెరుగు లేమి
  వికసిత స్తన భారము వేణి పెంపు
  పీన కటియును సిగపూల పిరుదుల సిరు
  లసిత కనుదోయ పడుచుల కమరె పల్లె
  రసి..అసి..కసి..నుసి తో పద్యము 31/7/2౦16 నాటిదండీ Thanks

  ప్రత్యుత్తరంతొలగించు
 43. కానల నుంటిమా కడుపుకైనగు పత్ర ఫలాదులుండెనా
  బానల వంటి పొట్టలకు వార్చిన యన్నమె బ్రాణ హేతువౌ
  గానము లాకటన్ దగునె కాయము గాదన మోక్షమబ్బునే
  ధ్యానము వద్దురా మనకు ధాన్యము గావలె భవ్యతన్ గనన్

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. పిట్టా సత్యనారాయణ గారూ,
   మీ ఉత్సాహం చూస్తుంటే ముచ్చటేస్తున్నది. సంతోషం. పాత సమస్యలకు ఇన్ని పూరణలను ఒక్కసారిగా వదిలితే నేను తట్టుకోగలనా? ఇంకా జ్వరంనుండి పూర్తిగా కోలుకోలేదు. కొద్దిగా స్వస్థత లభించగానే మీ పూరణలను నిశితంగా పరిశీలిస్తాను. నిరుత్సాహపడకండి, మన్నించండి.

   తొలగించు
 44. కొత్త వంగడమును గొప్పగా కనిపెట్టి
  జూప నదియె పంటకాపులకును
  శాస్త్రవేత్తతోడ సైరికులనె నవ
  ధాన్యమేల మనకు ధాన్యముండ!!!

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. శైలజ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'కనిపెట్టి చూప' అనండి.

   తొలగించు
 45. ఇల్లు గట్ట నేల యిదుగొ ప్రభుత యిచ్చె
  ఒల్లు దాచు కొనగ నొనరె భృతియు
  కల్లుసార కైపు ఘనముగా ఘటియింప
  ధ్యానమేల మనకు ధాన్యముండ

  ప్రత్యుత్తరంతొలగించు
 46. మౌనబ్రవృత్తినిన్ భరతమాతమాతకు నాశ్రమవాసులుండి వా
  రౌనన యోగమార్గమునప్రాణమునిల్పుకొనంగ లేదొకో
  ధ్యాన వదాన్యతల్ వరలె దవ్వుల నున్న మహాతపస్వి కీ
  ధాన్యము వద్దురా.మనకు ధాన్యము గావలె భవ్యతన్ గనన్

  ప్రత్యుత్తరంతొలగించు
 47. తిని త్రాగు ధ్యేయమే తృప్తినిజెందంగ
  బ్రతుకుకొరకు వాయు భక్షణంబు
  దేల్చినట్టి రంతిదేవుని సాక్షి భూ
  ధాన్యమేల మనకు ధాన్యముండ

  ప్రత్యుత్తరంతొలగించు
 48. బియ్యమే దొరకని వెనుకటి రోజులన్

  జొన్న , రాగి, సజ్జ యన్నము తిని

  నారు; నేటి స్థితియె వేరు కదా, చిరు

  ధాన్య మేల మనకు ధాన్యముండ?

  ప్రత్యుత్తరంతొలగించు
 49. అన్యములైన కార్యముల నందగ నేల కుమార! నీవు రా
  జన్యునిఠీవి కోసమయి సత్తువ కోల్పడ నేలనోయి యీ
  మాన్యము దున్నుకున్న మన మానము ప్రాణము దక్కుగాదె ప్రా
  ధాన్యము వద్దురా మనకు ధాన్యము గావలె ధన్యతం గనన్.
  (హ.వేం.స.నా.మూర్తి)

  ప్రత్యుత్తరంతొలగించు
 50. మాన్యములిచ్చి బ్రోచి రల మాన్యులు బ్రాహ్మణ పుంగవాళి సామాన్యపు జీవికన్నపర మౌనుల రీతిగడంగ నేడు యీ
  శూన్యపు చేతి వాటమున చుక్కల జూప నకారమౌ భృతిన్ ధాన్యము వద్దురా మనకుధాన్యము గావలె ధన్యతన్ గనన్

  ప్రత్యుత్తరంతొలగించు
 51. పాడి బ్రవృత్తి వర్ణముల బంచెను గృష్ణుడు కర్మలెల్ల రా
  పాడి తెగల్తెగల్గనగ బంచ కులాలవి బ్రాహ్మణోద్ధతుల్
  గాడినిదప్ప .కర్ణము.నుగాంచితిమే మరిలెక్కరాని యో
  గాడిదవచ్చిచొచ్చెనట కర్ణ పుటంబున చోద్యమయ్యెడిన్

  ప్రత్యుత్తరంతొలగించు
 52. పాడగ వేణుస్వనమున
  ఆడినదీ గోచయంబ దర్థాంతరమై
  గాడిని దప్పిన హేల న
  గాడిద చోద్యముగ జొచ్చె గర్ణ పుటమునన్

  ప్రత్యుత్తరంతొలగించు
 53. అవమానమ్మున చెల్లి యేడ్వ సభ నల్లాడెన్ దశగ్రీవు డీ
  స్తవనీయమ్మగు బ్రేమ సంస్కృతి సరే తానెన్నకన్ దోషమున్
  భవముల్ మారగ బుద్ధి మారును విభావంబులున్ బాపురే
  నవనీతమ్మట రావణాసురు సుకన్యాసక్త చిత్తంబిలన్

  ప్రత్యుత్తరంతొలగించు
 54. వట్టిదె బహు గట్టిది కళ
  బట్టిన ధ్వన్యనుకరణము భవ్యము సుమ్మీ
  లొట్టల్ వేయన్నేర్వగ
  పట్టాలే లేక రైలు పరుగిడ సాగెన్

  ప్రత్యుత్తరంతొలగించు
 55. ఏక్రమమో జన్మలకును
  విక్రమమును జూపగలుగు విబుధులు వలయున్
  సక్రమతను భారత కథ
  నక్రమ సంతానులును మహాత్ములు గారే

  ప్రత్యుత్తరంతొలగించు
 56. భజభజ పరిశోధన ఘన
  సుజనుల్ .క్లోను.లను నెరప చూడగ లేదే
  సృజనల నాపద వచ్చెను
  గజమునకు ఖరమ్ము బుట్టి గంతులు వేసెన్

  ప్రత్యుత్తరంతొలగించు
 57. చూతామందరు రండి పెండిలి ప్రభన్ చోద్యంబటంచన్న నో
  గోతాల్ ద్రవ్వియు దివ్య భవ్య కథనున్ గూర్చేవు .ముప్పాళ. నీ
  రాతన్నా యమృతంపు బూరుజమదే రాపాడె పాషాణమై
  సీతారాముని కోగు జేయదగునే చింతింప నిల్లాలువై

  ప్రత్యుత్తరంతొలగించు
 58. తీరా జూడ యహింస దుష్టజన పందేరాల సామాన్యులే
  బారుల్ దీరిరి వోటుతో నణచిరా బైరాగి వేశాల ఫూ
  త్కారాల్ వమ్మొనరించ నొక్కటయి వేల్గానున్న యభ్యర్థులన్
  ధీరత్వమ్మున దోమ తుమ్మెగదరా దిగ్దంతులల్లాడగన్

  ప్రత్యుత్తరంతొలగించు
 59. తీరా జూడ యహింస దుష్టజన పందేరాల సామాన్యులే
  బారుల్ దీరిరి వోటుతో నణచిరా బైరాగి వేశాల ఫూ
  త్కారాల్ వమ్మొనరించ నొక్కటయి వేల్గానున్న యభ్యర్థులన్
  ధీరత్వమ్మున దోమ తుమ్మెగదరా దిగ్దంతులల్లాడగన్

  ప్రత్యుత్తరంతొలగించు
 60. భామన్ జూచిన పొంగిపోవుమనముల్భావించునెన్నెన్నొ యీ
  కామంబెంతటి భాగ్యమో యువతనే కవ్వించు వేర్పోకడల్
  క్షేమంబే తన గట్టుకొన్నసతి సత్ సీమన్ వగల్ ప్రేమలై
  దోమల్ గుట్టిన రాత్రి జీవనము నిర్దోషంబు నారోగ్యమున్

  ప్రత్యుత్తరంతొలగించు
 61. కామితమును మధ్యాహ్న వి
  రామంబది లేకశ్రమపరాకున జేయన్
  దేవుడు యిచ్చిన వరమది
  దోమలుగుట్టినను రేయి దోషరహితమే

  ప్రత్యుత్తరంతొలగించు
 62. రూపము యౌవనంబు గనిరో తను వీరుడటంచు జెప్పి నన్కూకూపముగూల్చినట్టుల సగోత్రునికిచ్చిరి పెండ్లదంట ఏ
  శాపమొ యుగ్ర మూకల వశంబయి విడ్వడె నైన నొక్క సే నాపతి యేగుదెంచగని నాపతి భీతిన ననక్కె నొక్కెడన్

  ప్రత్యుత్తరంతొలగించు
 63. నా పతి గోపతి యనమీ
  రాపతి యుగ్రతను గరళమంపినచో దా
  నాపదను దేలి అనుకొనె
  నా పతి చనుదేరనెంచి నాపతి నక్కెన్

  ప్రత్యుత్తరంతొలగించు
 64. అరరరె ప్రేమ గ్రుడ్డిదన ఆదరణంబున లోపమేది యో
  పురుషుడుపూరుషుండగుట పూనిక గంటిమి గాని నేడు ఓ
  పరపురుషుంగనన్ జతగ పారిన సంఘములెన్నొ లేచె స
  త్పురుషుని పెండ్లి యాడెనొక పూరుషుడందరు మెచ్చి యౌనన్

  ప్రత్యుత్తరంతొలగించు
 65. పిట్టా సత్యనారాయణ గారూ,
  నేనింకా పూర్తిగా కోలుకోలేదు. రెండు రోజుల తరువాత మీ పూరణలన్ని ఒకేసారి సమీక్షిస్తాను. ఆలస్యానికి మన్నించండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 66. భామన్ జూచిన పొంగిపోవు మనముల్ భావించునెన్నెన్నొ యీ
  కామంబెంతటి భాగ్యమో యువతనే కవ్వించు వేర్పోకడల్
  క్షేమంబే దను గట్టుకొన్న సతి సత్ సీమన్ వగల్ ప్రేమలై
  దోమల్ గుట్టిన రాత్రి జీవనము నిర్దోశంబు నారోగ్యమున్

  ప్రత్యుత్తరంతొలగించు