19, ఆగస్టు 2016, శుక్రవారం

సమస్య - 2120 (గాడిద వచ్చి చొచ్చెనట...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"గాడిద వచ్చి చొచ్చెనట కర్ణపుటంబునఁ జోద్య మయ్యెడిన్"
లేదా...
"గాడిద చోద్యముగఁ జొచ్చెఁ గర్ణపుటమునన్"

55 వ్యాఖ్యలు:

 1. బాడుగకు దెచ్చె ఖరమును
  జోడుగ మురియంగ వచ్చె జోలలు పాడన్
  వేడుక జేయగ విందున
  గాడిద చోద్యముగఁ జొచ్చెఁ గర్ణపుటమునన్

  ప్రత్యుత్తరంతొలగించు
 2. పాట కచేరి మధ్య లో కి వచ్చిన ఖరము!

  తాడన జేసి కచేరిని
  గాడిద చోద్యముగఁ జొచ్చెఁ, గర్ణపుటమునన్
  వేడిగ జిలేబి గానము
  తోడుగ నోండ్రయు తధిగిన థోమయ్యెనయా !

  జిలేబి

  ప్రత్యుత్తరంతొలగించు
 3. మాడిన వంటలన్ దినుచు మానస మందున దిట్టుకొం చుయా
  వేడుక గాంచగా తరలి వేకువ జామున సంతసం బుగా
  పాడిన జాలునంచు పర భాషల రీతిని పెండ్లి విందునన్
  గాడిద వచ్చి చొచ్చెనట కర్ణ పుటంబునఁ జోద్య మయ్యెడిన్

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   '...దిట్టుకొంచు నా వేడుక..' అనండి.

   తొలగించు
 4. క్రొవ్విడి వెంకట రాజారావు గారి పూరణ.....

  " ఆడుచు వచ్చిన మనుమడు
  గాడిద బొమ్మను గలిగిన కాగిత మొకటిన్
  వేడుక నా చెవి దూర్చన్
  గాడిద చోద్యముగ జొచ్చె గర్ణ పుటమునన్ "

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 5. మాడుగుల రామచంద్రుడు
  గాడిదగా బొమ్మజేసి కాగితమునుతోన్
  పాడుచు నూద గ దానా
  గాడిద చోద్యముగజొచ్చె గర్ణ పుటమునన్

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. పోచిరాజు సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'కాగితములతోన్' అనండి.

   తొలగించు
 6. మైలవరపు మురళీకృష్ణ.. వెంకటగిరి

  గాడిద 'యోండ్ర' శబ్దమును , కర్ణ సుపేయములైన వాద్యముల్
  వేడుక పెండ్లియందు వినిపింపగ నొక్కడు ప్రక్కవాని మా..
  ట్లాడుచు "హేతువేమి" యన నాతడు నిట్లనె
  ''ఓరి గాడిదా !
  గాడిద వచ్చి చొచ్చెనిట కర్ణపుటంబుల చోద్యమయ్యెడిన్ " !!

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. మైలవరపు మురళీకృష్ణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 7. గాడిద వఛ్చి జొచ్చెనట కర్ణ పుటంబున జోద్య మయ్యెడిన్
  గాడిద యేమి ఖర్మ మఱి కాకులు మేకలు సర్వము న్సదా
  పాడుచు దా ముగాను దమ పాటల నెన్నియొ యూక దంపు గాన్
  వేడుక జేసె గా నవియ వీనుల విందుగ నత్తఱిన్గదా

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. సుబ్బారావు గారూ,
   సమస్యకు పరిష్కారం చూపినట్లు లేదు. 'దాము గాను'...?

   తొలగించు
  2. పద్యం వరకైతే ఛందోబద్ధంగా చక్కగా ఉంది.

   తొలగించు
 8. వేడుక జేయగ నతిధుల
  వాడిగ నొక్కండు పాట బాడగ నకటా!
  గోడలు బీటలు వారెను
  గాడిద చోద్యముగ జొచ్చె గర్ణపుటమునన్!!!

  ప్రత్యుత్తరంతొలగించు
 9. గురువుగారూ నిన్నటి పూరణను సవరించాను... అన్వయం సరిపోయిందేమో చూడగలరు:

  మాన్యుడు రైతు, భూముల గ్రమమ్మున సేద్యముజేసి కొంచు నై
  పుణ్యము తోడ జీవన ప్రపూత మొనర్చి కృషిందరించుచున్
  ధన్యత నిట్టులం దలచు తాదరి నన్య విదేశ శాస్త్ర ప్రా
  ధాన్యము వద్దురా! మనకు ధాన్యము గావలె ధన్యతంగనన్!


  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. శిష్ట్లా శర్మ గారూ,
   సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
  2. చక్కగ సవరించితిరి శర్మ గారు.

   తొలగించు
 10. వేడెద నిను బాడవలదు
  గాడిద చోద్యముగ జొచ్చె, గర్ణపుటమునన్
  వేడుక నొసగుచు తాకెడు
  చేడియ గీతమ్ము వినుము సేవము గలుగున్!!!

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. శైలజ గారూ,
   మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
   'సేవము'..? అది సేమమునకు టైపాటా?

   తొలగించు
 11. ఆడితి నాటకములనని
  వేడి యనుమతమునుపొంది, వేదికపైనన్
  పాడగ నపస్వరమ్మున
  గాడిద చోద్యముగ జొచ్చెఁగర్ణ పుటమునన్

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 12. పాడగల నతడెటులగును
  గాడిద? చోద్యముగ జొచ్చె కర్ణ పుటమునన్
  వేడుక లలరగ పాటలు
  పాడుచు యుల్లముల మీటె! వన్నియ నందెన్!

  ప్రత్యుత్తరంతొలగించు
 13. ప్రత్యుత్తరాలు
  1. శ్రీధర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'పాడగల యతడెటు...' అనండి.

   తొలగించు
 14. మూడిన దేశ భాగ్యమును మూరిన దుర్విధి నేమి చెప్పుదుం
  బాడుచు నాడుచుం బరమ పావన లోకము! కల్లు పాకలోన్
  వేడుక సేయ నెంచి చన వీరినిఁ గూడఁ ప్రబుద్ధుఁ డొక్కడున్
  గాడిద! వచ్చి చొచ్చెనట కర్ణపుటంబునఁ జోద్య మయ్యెడిన్
  [కర్ణపుటము = చిల్లుదొప్ప; కల్లుపాక చిల్లు దొప్ప వంటిదే. చిల్లుదొప్ప లో పోసిన నీరు కల్లుపాకలో పెట్టిన డబ్బు(ఆరోగ్యము కూడ) మాయమే:]


  ఆడవు బాలుర తోడను
  వీడవు రోదనము నిట్టి వెఱ్ఱులు గలరే
  చూడ వదేమిర యీగను
  గాడిద! చోద్యముగఁ జొచ్చెఁ గర్ణపుటమునన్

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   పూరణలో వైవిధ్యాన్ని చూపడంలో ప్రావీణ్యాన్ని సాధించారు. రెండు పూరణలు బాగున్నవి. ఔత్సాహికులకు మార్గదర్శకాలు! అభినందనలు.

   తొలగించు
  2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

   తొలగించు
 15. వాడన జరుగు కచేరికి

  గాడిద చోద్యముగ జొచ్చె ; గర్ణ పుటమునన్

  వేడుక జేయు తలంపున

  పాడగ దన స్వరము తోడ పాఱెను శ్రోతల్.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. పిన్నక నాగేశ్వర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'పాఱిరి శ్రోతల్' అంటే బాగుంటుందేమో?

   తొలగించు
  2. ధన్యవాదాలు శశంకరయ్య గారూ!

   తొలగించు
 16. నేడు మహా యుగాదియని నిర్మల మంజుల తెల్గు భాష గా
  పాడగ సాహితీ ప్రియలు భవ్యముగా సభ చేయుచుండగా
  పాడొనరించగా నటకు పాడుచు కర్కశ మైన పాటతో
  గాడిద వచ్చి చొచ్చెనట, కర్ణపుటంబునఁ జోద్య మయ్యెడిన్

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 17. కూడక యుక్తమౌ ధనము, కూర్చగ నేర్పరులైన వారలన్
  వేడిరి వీధిగాయకుల వేదికపైనను పాడుసాకుతో
  వేడుక లందు పాడఁదగు విజ్ఞత లేమిడి, వారిపాటలన్
  గాడిద వచ్చి చొచ్చెనట కర్ణపుటంబున చోద్యమయ్యెడిన్

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 18. . గాడిద వలెనరచిన?ఓ
  గాడిదచోద్యముగజొచ్చె|”గర్ణపుటమునన్
  దాడికి దిగె శబ్దమ్మే
  జోడిగ మీయరుపు వింత|జూలోనిడుమా|”
  2.గాడిద వోండ్ర బెట్టుచునుగర్వము నందున విర్రవీగగా?
  గాడిద కంటె పెద్దరుపుగా నొకడాడుచుపాడె వింతగా|
  గాడిదవచ్చిచొచ్చెనట “కర్ణపుటమ్మున చోద్య మయ్యెడిన్
  దాడియు జేయగా నరుపు కత్తుల చేతను గుచ్చినట్లుగన్|”.


  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ఈశ్వరప్ప గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినదనలు.
   'ఒక'ను 'ఓ' అనరాదు.

   తొలగించు
 19. చూడగ ప్రియతమ మిత్రుల
  గాడిద చోద్యముగ జొచ్చె, గర్ణపుటమునన్
  బాడగ సంగీతమ్మును
  వేడుక వేరొండుఖరము వేగమె వచ్చెన్.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. పొన్నెకంటి సూర్యనారాయణ రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 20. వేడుక పెండిలి పందిరి
  నాడుచు పాడుచునె యతివ లానందించన్
  తోడుగ నేనుంటి ననుచు
  గాడిద చోద్యముగఁ జొచ్చెఁ గర్ణపుటమునన్

  నిన్నటి సమస్యకు నా పూరణ

  ఎన్నియున్న తినగ నేమి ? కుక్షిని నింప
  నన్నమునకు సాటి యవని లేదు ;
  వరిని మించి మ్రింగ , వసుధను గల నవ
  ధాన్య మేల మనకు ధాన్యముండ

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. భాగవతుల కృష్ణారావు గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించు
 21. తోడుగ నందరుం గలసి తోషణమందగ కీర్తనాదులన్
  పాడుచు గానలోలురయి భక్తిసు ధామయ తన్మయత్వము
  న్నాడుచునుండవేడుకగ హంత!యదేమి సరాగమో సఖా!
  గాడిద వచ్చిచొచ్చెనట, గర్ణపుటమ్మున జోద్యమయ్యెడిన్.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. పొన్నెకంటి సూర్యనారాయణ రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 22. వేడుకతోడ నీ విభుడు విన్నపమున్ వినిపించుకోడు తా
  జూడడు నాయవస్థ యనుచున్ మది నాగ్రహ మందనేలరా!
  గోడకు నున్న మక్షికము కోరి హఠాత్తుగ లేచి యప్పు డో
  గాడిద! వచ్చి చొచ్చె నట కర్ణపుటంబున జోద్యమయ్యెడిన్.
  (హ.వేం.స.నా.మూర్తి)

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 23. కూడలి యంగడుల నడుమ
  గాడిద చొచ్చుకొని వచ్చె ,కర్ణపుటమునం..
  దాడినదోండ్ర ధ్వనియును
  పాడిన వేలముల పాట పలురీతులలో !!

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. మైలవరపు మురళీకృష్ణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 24. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారి పూరణ.....

  శ్రీరామునితో యుద్ధమునకు కుంభకర్ణుని లేపు బృందములో ఓ గాడిద నిర్వాకం:

  వీడేమి కుంభకర్ణుడు
  గోడింతయు బెట్టుచున్న గురకే బెట్టున్
  దాడియె తగునని యరచుచు
  గాడిద చోద్యముగఁ జొచ్చెఁ గర్ణపుటమునన్!

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 25. వేడుకతోడ పండుగల వేదికలందున సంతసంబుతో
  పాడగ సుస్వరాన గల పాటలు ప్రేక్షక మానసంబు నన్
  పాడుచు నున్న వారికి ని పాటలు పారవశాన యుండగా
  గాడిద వచ్చి చొచ్చెనట కర్ణపుటంబునఁ జోద్య మయ్యెడిన్

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. రామకృష్ణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'పారవశ'మన్న పదం లేదు. 'వశాన నుండగా' అనాలి. అక్కడ యడాగమం రాదు. 'పాటలు తన్మయ మందజేయగా' అనండి.

   తొలగించు
  2. సవరణకు ధన్య వాదములు గురువు గారూ
   వేడుకతోడ పండుగల వేదికలందున సంతసంబుతో
   పాడగ సుస్వరాన గల పాటలు ప్రేక్షక మానసంబు నన్
   పాడుచు నున్న వారికి ని పాటలు తన్మయ మందజేయగా
   గాడిద వచ్చి చొచ్చెనట కర్ణపుటంబునఁ జోద్య మయ్యెడిన్

   తొలగించు
  3. రామకృష్ణ గారూ,
   నా సూచనను మన్నించి సవరించినందుకు సంతోషం!

   తొలగించు