14, ఆగస్టు 2016, ఆదివారం

సమస్య - 2115 (కుంజరయూధ ముద్ధతిని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"కుంజరయూధ ముద్ధతినిఁ గోల్పడి చొచ్చెను దోమ కుత్తుకన్"
లేదా...
"కుంజరయూధమ్ము దోమ కుత్తుకఁ జొచ్చెన్"

73 కామెంట్‌లు:

  1. రంజుగ పిల్లల కేళి స
    రంజామాలోన మిగుల రాకసి దోమల్
    కుంజర చిరు ప్రతిముండిన
    కుంజర యూధమ్ము దోమకుత్తుక జొచ్చెన్!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిగురు సత్యనారాయణ గారూ,
      రాకాసి దోమ బొమ్మల నోట చిన్న ఏనుగుల ప్రతిమలు దూరాయన్న మీ పూరణ బాగుంది.
      'రంజు' శబ్దం మాండలికమే కాని గ్రాంధికం కాదు. 'రాకసి' అనే పదం లేదు. 'రక్కసి దోమలు' అనండి. 'కుంజర చిరుప్రతిమలు' అనడమూ దోషమే. మీ పద్యాన్ని ఇలా చెప్తే అన్వయం కుదురుతుందనుకుంటాను...
      రంజిలఁగఁ బిల్ల లాడు స
      రంజామాలోనఁ గలవు రక్కసి దోమల్
      కుంజరముల చిరుప్రతిమలు;
      కుంజర యూధమ్ము దోమకుత్తుకఁ జొచ్చెన్

      తొలగించండి

  2. డ్రగ్ అడిక్షన్ లోకి జారి పోతున్న యువత


    పంజాబు నందున యువత
    గంజాయి పొగల జిలేబి గానమ్ములనన్
    పింజారీలయ్యిరకట,
    కుంజరయూధమ్ము దోమ కుత్తుకఁ జొచ్చెన్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మాదకద్రవ్యాల దోమ గొంతులో యువకుంజరాల ప్రవేశం... మంచి భావన. బాగుంది.
      రెండవపాదం చివర గణదోషం. 'గానమ్ములలో' అందామా? 'అయ్యిరి' సాధువు కాదు. 'పింజారీ లైరకటా' అనండి.

      తొలగించండి
  3. రంజను డనువా డొక్కరు
    డంజనపురి నావముక్క లానందముగా
    నంజుచు జూడగ వచ్చిన
    కుంజరయూధమ్ము, దోమ కుత్తుక జొచ్చెన్.
    హ.వేం.స.నా.మూర్తి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
      ఆవముక్కలతో పాటు దోమలు గొంతు దిగడం బాగుంది. కుంజరయూధం వంటి దోమలు అనియా మీ భావం? కాని దోమ ఏకవచనమై అన్వయబాధ ఏర్పడుతుంది కదా! 'నంజుకొన నీఁగ లనియెడి। కుంజరయూధమ్ము...' అందామా?

      తొలగించండి
    2. మీ పూరణ నా చిన్నప్పటి ఆక్షన్ హీరో 'రంజన్'ను గుర్తుకు తెచ్చింది.

      తొలగించండి
    3. ఆర్యా!
      నమస్కారం. మీ ఆరోగ్యం కుదుట పడిందని తలుస్తాను. మీ సూచన బాగున్నది. ధన్యవాదాలు, అయితే నేను "కుంజర యూధాన్ని చూడటానికి వచ్చినప్పుడు-దోమ కుత్తుకలో దూరిందనే భావన చేసి పూరించాను.

      తొలగించండి
    4. మూర్తి గారూ,
      మీ భావమే సరియైనది. నేనే సరిగా అవగాహన చేసికొనలేకపోయాను.
      ఆరోగ్యం ఇంకా పూర్తిగా కుదుటపడలేదు. నిన్నటికంటే మెరుగు.

      తొలగించండి
  4. పంజరమున జంట చిలుకలు
    రంజిల్లుచు పలికె నంట లౌల్యము తోడన్
    మంజులమిది చోద్యము వినగ
    కుంజర యూధమ్ము దోమ కుత్తుకఁ జొచ్చెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      చిలుక పలుకుల మీ పూరణ బాగున్నది. మొదటి, మూడవ పాదాల్లో గణదోషం. 'పంజరపు జంట చిలుకలు... మంజులము చోద్యము వినఁగ...' అనండి.

      తొలగించండి
  5. అంజని!వింటివెయీయది
    కుంజరయూధమ్ముదోమకుత్తుకజొచ్చెన్
    వింజామరలనుబట్టుకు
    రంజింపగజేయరమ్మురయముగనిపుడున్

    రిప్లయితొలగించండి
  6. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అంజనిసూతునిన్గొలిచెనార్తినివిష్ణునిరూపమౌటయౌ
      కుంజరయూధముధ్ధతినిగోల్పడిచొచ్చెనుదోమకుత్తుక
      న్గంజదళాయతాక్షుడనికానకనేరుగనాక్షణంబున
      న్రంజనజేయగానతనిరావముతోడననయ్యెడన్సుమీ

      తొలగించండి
    2. సుబ్బారావు గారూ,
      పద్యం లక్షణంగా ఉంది. కాని సమస్యాపరిష్కారం? భావంలో సమగ్రత లేదు. అన్వయదోషం కూడా ఉంది.

      తొలగించండి
  7. [8/13, 9:04 AM] Chepuri Sreeramarao: పౌరుడెపార్ధునిగ నిలిచి
    భారతదేశమున నీతి భారత పెంచన్
    వీరునిగపోరు చేసియు
    భారతయుద్దమున నోడి పార్ధుడు సచ్చెన్
    [8/14, 10:32 AM] Chepuri Sreeramarao: నేటి సమస్యాపూరణం

    రంజుగ పలికెను మూగయు,
    కుంజరయూధమ్ము దోమ కుత్తుక జొచ్చెన్,
    పంజరముననగమిరికెను
    రంజిలగ మూర్ఖమనముధర నసాధ్యమయెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చేపూరి శ్రీరామ్ గారూ,
      మీ 'భారత యుద్ధమున..' సమస్యాపూరణలో కొంత అన్వయలోపం ఉంది. భావం సుబోధకంగా లేదు. 'నీతి భారత'...? 'నీతి భారము పెంచన్' అందామా?
      నేటి సమస్యకు 'తివిరి యిసుమున..' పద్యాన్ని బోలిన భావంతో పూరణ చెప్పారు. బాగుంది.

      తొలగించండి
  8. పంజరము నందు వ్యాధులు
    సంజాతం బవగ నరుని చైతన్యంబున్
    భంజిల్ల జేయ నెనయగ
    కుంజర యూధమ్ము దోమ కుత్తుక జొచ్చెన్!

    పంజరము=శరీరము
    ఎనయు=సరిపోల్చుకొను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శర్మ గారూ,
      దోమ వంటి శరీరంలో ఏనుగుల వంటి వ్యాధుల ప్రవేశం... బాగుంది మీ పూరణ. అభినందనలు.
      'అవగ' అనడం సాధువు కాదు. 'సంజాతంబైన' ఆనండి.

      తొలగించండి
  9. మంజర కంపుయూటరట మాయలుబన్నె బ్రసారరంగమే
    అంజలిజేయుబృందములకార్తిమగిల్చెనుమీటనొక్కప్రా
    భంజనమన్న దృష్యశ్రవణాద్భజనల్ పరిపాటిజూడగా.కుంజర..

    రిప్లయితొలగించండి
  10. అంజనమయ్యెగంటికిప్ర
    భందనమయ్యెను యెల్ల భాషలన్జనజెడె నా సంస్కృత
    కుంజరయూధంబు దోమ కుత్తుక జొచ్చెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిట్టా సత్యనారాయణ గారూ,
      మీ రెండు పూరణలలో ముందుగా ప్రస్తావించవలసింది టైప్ దోషాలు. జాగ్రత్త వహించండి.
      మీడియా వారి మాయాజాలాన్ని గురించిన మీ మొదటి పూరణలో భావం బాగుంది. కాని కొంత అన్వయలోపం ఉన్నట్టుంది. 'మంజర కంపుయూటరట'.. అర్థం కాలేదు.
      రెండవ పూరణలో సంస్కృత పదాల కుంజరయూధం ప్రాంతీయభాష అనే దోమ కుత్తుకలో ప్రవేశించాయన్న మీ భావం బాగుంది. కాని అన్ని పాదాల్లోను గణభంగం జరిగింది. సవరించి మళ్ళీ పంపండి.

      తొలగించండి
  11. కంజదళాక్ష సఖుడు నరి
    భంజను డర్జునుని దక్క పాండవుల నటన్
    భంజించె సైంధవు డకట
    కుంజరయూధమ్ము దోమ కుత్తుకఁ జొచ్చెన్


    అంజన మద్ది జూచిన మహాద్భుత మియ్యది కాన నేర్తుమే
    పుంజు కొనంగ బాహు బలమున్ మశకమ్మున కెట్లు శక్యమౌ
    గుంజది లేక యుండినఁ బ్రకోపపు మాటలు గాక యెక్కడా
    కుంజరయూధ ముద్ధతినిఁ గోల్పడి చొచ్చెను దోమ కుత్తుకన్?


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కంజదళాక్షునకత్యను
      గుంజెలువుడు సకల శస్త్ర కోవిద ఘనుడు ధ
      నంజయుడోడె పథికులకు
      కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. "భా" "భః" లకు యతి చెల్లుతుంది కదా. చందములో దోషము చూపు చున్నది. వివరించ గోర్తాను.

      తొలగించండి
    3. కామేశ్వర రావు గారూ,
      మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మూడవపూరణ రెండవపాదం చివర గురువు ఉండాలి కదా!
      ఛందం సాఫ్టువేరు సమగ్రం కాదనీ, లోపాలున్నవనీ దాని నిర్మాతలే చెప్పారు. దానిపై ఆధారపడవద్దు.

      తొలగించండి
    4. పూజులు శంకరయ్య గారికి వందనములు . ఆపూరణ పూర్వమెప్పుడో చేసినది. చూసుకోలేదు. ధన్యవాదములు. సవరించిన పూరణ తిలకించ గోర్తాను.

      కంజదళాక్షున కత్యను
      గుం జెలువుం డోడెను గలఁకున బోయలకు
      న్నంజని సుతధ్వజుండును
      గుంజరయూధమ్ము దోమ కుత్తుకఁ జొచ్చెన్


      అవునండి. యతి మైత్రి గురించి అనుమాననివృత్తి కొరకడిగితిని. ధన్యవాదములు.

      తొలగించండి
    5. కామేశ్వర రావు గారూ,
      సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  12. కంజదళాక్షుడు తనదగు
    రంజితులైనట్టిసఖుల రసమయస్ఫూర్తిన్
    సంజయునింటన్నిలచిన
    కుంజరయూధమ్ము దోమ కుత్తుక జొచ్చెన్.

    అంజయ నామముం బరగు నంకిత భావపు సేవకోత్తమున్
    "రంజన గూర్చిమాకుపలు రమ్యరసాంచిత ఖాద్యరాసులన్
    నంజుకొనంగజేయుమ"ని నవ్యవిలాసపు మంత్రులే యనన్
    కుంజరయూధముద్ధతిని గోల్పడి చొచ్చెను దోమకుత్తుకన్.

    రిప్లయితొలగించండి
  13. మాన్యులు శంకరయ్య గారికి.. మీ ఆరోగ్యం కదుటబడినట్లు భావించుచున్నాను.మరల మీ సాహితీరంగ ప్రవేశం చూచి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పొన్నెకంటి సూర్యనారాయణ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      జ్వరం పూర్తిగా తగ్గలేదు. బ్లాగును చూడకుండా ఉండలేకపోతున్నాను.

      తొలగించండి
  14. మంజుల యోధముల తిరుగు
    కుంజర యోధమ్ము , దోమకుత్తుక జొచ్చెన్
    రంజిలుచు పగలు రేతిరి
    గుంజుకు త్రాగిన రక్తము కూటము లందున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'యోధము' ఏ అర్థంలో ప్రయోగించారు. యుద్ధమునకు పర్యాయపదంగా నిఘంటువు చెప్తున్నది. యుద్ధము మంజులమంటారా?

      తొలగించండి
    2. యూధము - సమూహము అ నే అర్థంతో వాడాను . యోధము అని పొరపాటున టైపు అయి నది.

      తొలగించండి
    3. నేనూ అది టైపాటేమో అని మొదట అనుమానించాను.

      తొలగించండి
  15. రంజింప జేసిన కవన
    కంజరముల పొగడు ఘోణిగా నీ గళమున్
    నంజలిడగ నా విదులకు
    కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్!
    (గురువు గారికి నమస్కారములు. “కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్!”- ఇలాంటి గొప్ప కవన చమత్కార వైభవాలతో రంజింప జేసిన కవి దిగ్గజాలకు, కవిత్వ పరంగా నొక దోమ లాంటి నేను నా గళముతో వారిని కీర్తించగా - కుంజర యూధము వంటి వారంతా దోమ వంటి నా గళమున ప్రవెశించారు కదా అన్నాది నా భావం. ఈ పద్య రూపంలో తెనాలి రామకృష్ణాది కవులకు వారిని ప్రోత్సహించిన కృష్ణ దేవ రాయలు ఆదిగా గల మహానుభావులందరికి అంజలై ఘటించే ప్రయత్నమిది. తప్పులేమైనా వుంటె సవరణలను తెలుప గోరుతాను.మీ ఆరోగ్యము మెరుగు పడినందుకు చాలా సంతోషంగా వుంది.
    ధన్యవాదములు).

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీధర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      దోషాలేమీ నా దృష్టికి రాలేదు. 'కంజరము' దగ్గర కొంత సందేహించాను.

      తొలగించండి
  16. మంజరి కంపియూటరట మాయలు బన్నె బ్రసార రంగమే
    అంజలి జేయ బృందములకార్తి మిగిల్చెనుమీటనొక్క ప్రా
    భంజనమన్న దృశ్యశ్రవణాద్భజనల్పరిపాటి జూడగా.....
    అంజనమయ్యెగంటికి ప్ర.భంజనమయ్యెను

    రిప్లయితొలగించండి
  17. .అంజనమయ్యె నాంగ్లము ప్ర
    భంజభంజనమయ్యెనుయెల్ల భాషలన్
    రంజనజెడి నాసంస్కృత
    కుంజరయూధంబు దోమ కుత్తుకజొచ్చెన్

    రిప్లయితొలగించండి
  18. నాలుగరువది కళలన నాదరముగ
    జూడగలవాడు జీవిత శోభగనడు
    వితరణముసేయ నడుగని వేల్పు వెన్న
    దొంగ పదసేవ జేయ నిధుల్ లభించు

    రిప్లయితొలగించండి
  19. యమనియమ సత్త్వ శోధన
    గమి నాచరణమున నుంచి గాంచుము కరుణన్
    శ్రమ విలువ దెలియ కుండిన
    యమునెక్కి లులాయము విహారము సేయున్

    రిప్లయితొలగించండి
  20. జన మనముల స్త్రీ వాదపు
    దినమే యిది కాదటన్న దిక్కెవరు సుమీ
    మన చెల్లికి దగ దప్పటి
    .కనికరమున్ జూప దగదు కాంతల పైన న్.

    రిప్లయితొలగించండి
  21. యుద్ధమన నాగరికతకునో యొజ్జయౌనె
    శాంతి పఠనమాచరణ సుశ్రమలు మేలు
    పరుల బలమును శంకించ బనియె లేని
    ఉత్తరుండర్జునుని కంటె నుత్తముండు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిట్టా సత్యనారాయణ గారూ,
      సవరించిన మీ పూరణలు బాగున్నవి.
      మొదటి పూరణలో కంప్యూటరును కంపియూటరు అన్నారు. ముందుగా అర్థం కాలేదు.
      రెండవ పూరణలో 'భంజభంజన' అన్నచోట గణదోషం. 'అయ్యెను+ఎల్ల' అన్నపుడు సంధి నిత్యం. అక్కడ యడాగమం రాదు. 'చెడి+ఆ=చెడి యా' అని యడాగమం వస్తుంది.
      *****
      'దొంగ పదసేవ...' సమస్యాపూరణం బాగున్నది.
      'యము నెక్కి...' సమస్యాపూరణం బాగున్నది.
      'కనికరమున్...' సమస్యాపూరణం బాగున్నది.
      'ఉత్తరుం డర్జునుని...'సమస్యాపూరణం బాగున్నది.

      తొలగించండి
  22. రంజిలు స్వర్గసీమను పురందరుడంత శతార ఘాతమున్
    భంజనజేసె త్వష్ట సుతు, బ్రాహ్మణ హత్యపు దోష భీతిచే
    కంజపు నాళమున్ బరగి కర్మ ఫలంబున నుండెనక్కటా
    కుంజరయూధ ముద్ధతినిఁ గోల్పడి చొచ్చెను దోమ కుత్తుకన్

    రిప్లయితొలగించండి
  23. సంజుడు, చంద్రమౌళి, హరి సంయమి అత్రికి నాతిథేయమై
    నంజుడు సేయవచ్చి సతి నగ్నగ వడ్డన సేయమంచనన్
    కంజదళాక్షి మార్చె ననుకంపను వారిని పాపలై చనన్
    కుంజర యూధ ముధ్ధతిని గోల్పడి చొచ్చెను దొమ కుత్తుకన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      అనసూయా ప్రస్తావనతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  24. అంజలి సేసి సూర్యసుతుఁ డాదటఁ బట్టెద నంచుఁ జెప్పఁ గా
    లాంజరుఁ డేగి యేగి యొక యంఘ్రిపకోటరమందు దాఁగె నా
    మంజులమూర్తి వెంటఁ జనె మర్కుఁడు నందియు కంఠసర్పమున్
    గుంజరయూధ ముద్ధతినిఁ గోల్పడి చొచ్చెను దోమకుత్తుకన్.
    (సూర్యసుతుఁడు = శని; కాలాంజరుఁడు = శివుఁడు; మర్కుఁడు = చంద్రుఁడు)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. సాక్షాత్తు పరమేశ్వరునకే శని బాధలు తప్పలేదని వివరిస్తున్న మీ పూరణ మహాద్భుతముగానున్నది.

      తొలగించండి
  25. కుంజరయూధ ముద్ధతినిఁ గోల్పడి చొచ్చెను దోమ కుత్తుకన్
    అంజయ! తప్పదేఱికిని యాపదలందున లొంగి పోవఁకన్
    రంజన హీనుడై సుతు సురక్షణకై విధిలేని దుస్థితిన్
    అంజలి బట్టి వేడుకొనె నా వసుదేవుడు గాడిదన్ సుమా

    రిప్లయితొలగించండి
  26. రంజిలె'దమరావతి'పురి
    బంజరు విలువగు ననుకొను బడుగుల యాశల్
    భంజనమొనర్చ ధనికుల్
    కుంజరయూధమ్ము దోమ కుత్తుక జొచ్చెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రంజిలు వేళవచ్చె నమరావతి రాష్ట్రఁపు రాజధానిగన్
      బంజరు భూములెల్ల విలువందెడు నాశల భీదలుండగన్
      భంజనమై దురాక్రమణ పర్వము జేయ దిగ్గజమ్ములున్
      కుంజరయూధ ముద్ధతినిఁ గోల్పడి చొచ్చెను దోమ కుత్తుకన్

      తొలగించండి
    2. సహదేవుడు గారూ,
      భావైక్యంతో మీ రెండు పూరణలు బాగున్నవి.
      మూడవపాదం చివర గణదోషం. దిగ్గజమ్ములున్, కుంజరయూధము అనడం పునర్తుక్తి అవుతున్నది. 'పర్వము జేయుచు జేర నాయకుల్.../పర్వము జేసిరి భూబకాసురుల్' అంటే బాగుంటుందేమో?

      తొలగించండి
    3. రంజిలు వేళవచ్చె నమరావతి రాష్ట్రఁపు రాజధానిగన్
      బంజరు భూములెల్ల విలువందెడు నాశల భీదలుండగన్
      భంజనమై దురాక్రమణ పర్వము జేసిరి భూబకాసురుల్
      కుంజరయూధ ముద్ధతినిఁ గోల్పడి చొచ్చెను దోమ కుత్తుకన్

      తొలగించండి
    4. గురుదేవులకు ధన్యవాదములు. మీ సూచిత సవరణ జేసితిని.

      తొలగించండి
  27. రంజిలు చిత్రసీమ గన”రాక్షసమాయల మంత్రతంత్రముల్
    పుంజుకొనంగ నొక్కడటపూర్తిగమారియు సింగమవ్వగా|
    అంజికచేత వేరొకడె ఆపరకాయ ప్రవేశవిద్యచే
    కుంజర యూధముద్ధతినిగోల్పడి చొచ్చెనుదోమకుత్తుకన్
    2.పుంజును దినగా పిచ్చుక
    భంజించును కుక్కలున్న పట్టుచు బల్లే
    ముంజేతికి మీసముగని?
    కుంజర యూధమ్ము దోమ కుత్తుక జొచ్చెన్|


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ మొదటి పూరణ బాగున్నది. రెండవ పూరణలో అన్వయం లోపించినట్టుంది.

      తొలగించండి
  28. కుంజర ముఖమును బోలిన
    జింజర్ బిస్కట్లు కొన్ని చేతను బెట్టన్
    మంజీర నోట కుక్కెను
    కుంజర యూధమ్ము దోమ కుత్తుక జొచ్చెన్.

    రిప్లయితొలగించండి
  29. రంజిల జేసె నాశ్రయుల నాశము జేసెను కానివారలన్
    భంజన మొందజేసె ప్రతిపక్షపు వ్యూహములన్ నియంతయై
    మంజుల!యిందిరమ్మ తుది మాసెను రక్షకు గుండు దెబ్బకే
    కుంజర......

    రిప్లయితొలగించండి
  30. మిత్రులందఱకు నమస్సులు! అనారోగ్యముచే నశక్తుఁడనై యిప్పటికి నీ పూరణ మొనర్పఁగలిగితిని.

    [కాశీపట్టణమును నివాస స్థానముగా నొనర్చుకొనుటకై తగు పరిస్థితులఁ గల్పించుటకు రవి నలినజ ప్రమథజన విఘ్నేశాదులఁ బంపఁగా, నట వారలకు నవకాశము లభింపమి, శివుఁడు విష్ణువును సపరివారముగఁ బంపఁగా, హరి బౌద్ధధర్మము ప్రవర్తిల్లఁజేసిన వృత్తాంతము నిట ననుసంధానించుకొనునది]

    కంజభవున్ రవిన్ బ్రమథగణ్యుల విఘ్నవినాయకాదులన్
    భంజన సేయఁ గాశి కనుపంగను వారలు మిన్నకుంటచే,
    రంజనతోడఁ బంపె హరి లక్ష్మి ఖగేంద్రులఁ; బోల్చి చూడఁగాఁ
    గుంజరయూధ ముద్ధతినిఁ గోల్పడి చొచ్చెను దోమకుత్తుకన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మధుసూదన్ గారూ,
      వైవిధ్యమైన భావంతో ప్రశస్తంగా పూరించారు. అభినందనలు.

      తొలగించండి
  31. కాలుని మాయలు యువతుల
    పాలిటి శాపములు గావె పరికింపగ త
    న్నేలెడు బతిగొంపోయి
    పూలను సిగలోన తురుము పొలతులు గలరే .ప్రశ్నార్థకము.

    రిప్లయితొలగించండి