21, ఆగస్టు 2016, ఆదివారం

సమస్య - 2122 (రామా రమ్మని కేలు సాచి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"రామా రమ్మని కేలు సాచి పిలిచెన్ రమ్యంబుగా రాధయే"
లేదా...
"రామ రమ్మటంచు రాధ పిలిచె"

77 వ్యాఖ్యలు:

 1. ఏ మంత్రమ్మును వేసినాడవొ గదా! యీరీతి నీ వెంట నే
  నేమాత్రమ్మును జంకులేక తిరుగన్ హే! దేవకీ పుత్ర ! నీ
  వేమో చీటికి మాటికిన్ పిలువ నాకిబ్బందిరా యింత మా
  రామా? రమ్మని కేలు సాచి పిలిచెన్ రమ్యంబుగా రాధయే

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 2. గోపికాలలాము, గోవర్ద నోద్దారు,

  వలచి నట్టి''రాధ''వలపు మీర

  వేణు గానలోల!వేగ రమ్ముమనోభి

  రామ!రమ్మ టంచు రాధ పిలిచె.

  విద్వాన్,డాక్టర్,మూలె.రామమునిరెడ్డి,విశ్రాంత తెలుగు పండితులు,ప్రొద్దుటూరు. కడప జిల్లా. 7396564549

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. డా. మూలె రామముని రెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు


 3. తండ్రి దశరథుండు తనువుతీర బిలిచె
  రామ రమ్మటంచు, రాధ పిలిచె
  తనను మరిచి తనువు తానైన కృష్ణుని,
  రసమయము జిలేబి రమ్య కేళి !

  జిలేబి

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'తనివి తీర' అని ఉండాలి కదా!

   తొలగించు
 4. రాస లీల లందు రమణీ లలామ
  చేరి వలచె నంచు కోరి నిలచె
  ఎదను దోచి నట్టి యాధవ మోహన
  రామ రమ్మటంచు రాధ పిలిచె

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది.
   మొదటిపాదంలో లలామ అన్నచోట గణదోషం. 'లలామలఁ। జేరి...' అందామా?

   తొలగించు
 5. నీదు రాక కొరకు నిలువెల్ల కనులతో
  యమున వేచెనయ్య యదుకులమణి
  జాగు సేయకుండ సకలజనమనోభి
  రామ రమ్మటంచు రాధ బిలిచె!!!

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. శైలజ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మీ పూరణ 'శారద' సినిమాలోని "వ్రేపల్లె వేచెను వేణువు వేచెను వనమంత వేచేనురా, నీ రాకకోసం నిలువెల్ల కనులై ఈ రాధ వేచేనురా" పాటను గుర్తుకు తెచ్చింది.

   తొలగించు
 6. ఏమందున్మరి యెట్లు బిల్తునిను యే
  మీవింత గోపాలుడా!
  స్వామీ నిన్నిట గొల్తు నామదిని భా
  వంబందు నీవేగదా!
  ప్రేమన్బంచగ రా గదయ్య మహిమో
  పేతంబుగా కృష్ణ! మా
  రామా! రమ్మని కేలుసాచి పిలిచెన్ రమ్యంబుగా రాధయే!  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. శిష్ట్లా శర్మ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మారామా తరువాత ప్రశ్నార్థక చిహ్నం ఉంటే బాగుండేదేమో?

   తొలగించు
 7. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. నిన్నటిపూరణలో
  “తల్పశ్రేష్టముల్ రాగ మో / దోమల్ గుట్టిన” అన్న- ఉమలు తల్పశ్రేష్టములు కుట్టిన యన్న భావస్ఫురణ క్లిష్టతరముగా నున్నదనుకుంటాను.
  తల్పశ్రేణులన్ రాగ మో / దోమల్ గుట్టిన” యని యన్న భావ స్ఫుటమగునను కుంటాను. తెలుప గోర్తాను.


  సామాన్యంబె తలంప సుప్తసుఖ విశ్రాంత్యాది సౌఖ్యంబులున్
  వామాక్షద్వయ నేనెరుంగుదును నిర్ద్వంద్వమ్ము ప్రావీణ్యులన్
  భామల్ కన్యలుమాభిధానులను తల్పశ్రేణులన్ రాగ మో
  దోమల్ గుట్టిన రాత్రి జీవితము నిర్దోషంబు నారోగ్యమున్

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. కామేశ్వర రావు గారూ,
   మీ వివరణను నిన్ననే చూశాను. కాని వెంటనే స్పందించలేకపోయను. 'కుట్టిన' శబ్దానికి ఉన్న అర్థ వైవిధ్యాన్ని గమనించలేకపోయాను. మన్నించండి.
   వివరణ చూసి మీ పూరణ వైశిష్ట్యాన్ని గుర్తించాను. ధన్యవాదాలు.

   తొలగించు
  2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
   నిన్న ఆలస్యమైనందువలన మీరు తిలకించలేదేమోనని యీ రోజు మళ్ళీ ప్రచురించితిని. మన్నించండి.

   తొలగించు
 8. కృష్ణ మూర్తి రావ! బృందావనము జేర!
  రాధ మదిని మీటు రాగమీవె
  తనివి తీర వలచెద సకల సుగుణాభి
  రామ రమ్మటంచు రాధ పిలిచె!

  నిన్నటి నా పూరణను కూడా చూడ గోరుతాను. ధన్యవాదములు.
  ఈ మనుజుల విష పూరిత
  పాముల వలె కాటు వేయు ప్రాణాంతకమౌ
  దోమలు కాకుండిన యే
  దోమల్ కుట్టినను రేయి దోష రహితమే!

  ప్రత్యుత్తరంతొలగించు
 9. చిన్న మార్పుతో మరొక పద్యం
  కృష్ణ మూర్తి రావె, కృప తోడ నేల! నీ
  రాధ మదిని మీటు రాగమీవె
  తనివి తీర వలచెద సకల సుగుణాభి
  రామ రమ్మటంచు రాధ పిలిచె!

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. శ్రీధర రావు గారూ,
   మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
   నిన్నటి పూరణలో 'విషపూరిత పాములు' అంటే దుష్టసమాసం. 'విషము గలుగు। పాముల..' అందామా?

   తొలగించు
 10. ఏమాత్రంబు భరింపఁజాల విరహంబీవేళ నీరాకచే
  ప్రేమావేశహతాశులైన మముఁ దీపింపంగ భవ్యత్కృపా
  వ్యామోహంబున నుంచినావుకద రావా వేగ భావాంబుజా
  రామా! రమ్మని కేలు సాచి పిలిచెన్ రమ్యంబుగా రాధయే

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
   మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.

   తొలగించు
 11. శ్రీమన్మాధవ! మోహనాంగ! సుదతీచేతోహరా! కేశవా!
  నీమంబొప్పగ నిన్ను దల్తు సతమున్ నీవేల రావైతి వో
  స్వామీ! పద్మ దళేక్షణా! ప్రియసఖా!భక్తాళి హృత్పీఠికా
  రామా! రమ్మని కేలుసాచి బిలిచెన్ రమ్యంబుగా రాధయే
  హ.వేం.స.నా.మూర్తి

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. మూర్తి గారు "హృత్పీఠికారామా!" యని సత్కవిహృత్పీఠికలను గెలుచుకున్నారు. చాలా ఆనందము కల్గినది మీ పూరణతో.

   తొలగించు
  2. ఆర్యా!
   ధన్యవాదములు.

   తొలగించు
  3. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
   మనోహరంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

   తొలగించు
 12. ప్రియసఖుండ మనసు వేగిర పడుచుండె
  నిదురలేదు రాదు నిన్ను కనక
  మధురిపుండ! శౌరి! మాధవ! తాప వి
  రామ! రమ్మటంచు రాధపిలిచె

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   తాప విరాముని గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 13. ప్రత్యుత్తరాలు
  1. భామామానస చోరు డిద్ధరను గోపాలుండు గోవర్ధనుం
   డా మాహాత్మ్యము నెంచ నెల్లరకు నూహాతీతమే వేగమున్
   దామార్థంబునఁ బోయి వత్తుమని యుత్సాహంబు మీరన్ సఖీ
   రామా! రమ్మని కేలు సాచి పిలిచెన్ రమ్యంబుగా రాధయే

   [రామ = అందమైన అమ్మాయి, వనిత]


   భామ లెల్ల కలసి పన్నుగ జంతుప్ర
   దర్శనస్థలమ్ముఁ దరచి చూడ
   ప్రేమ మీర చేరి వేగ సంతసమున
   రామ! రమ్మటంచు రాధ పిలిచె

   [రామ = దుప్పి]

   తొలగించు
  2. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు వైవిధ్యంగా ఉండి అలరింపజేసాయి. అభినందనలు.

   తొలగించు
  3. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్య వాదములు.

   తొలగించు
 14. రామ కావు పెండ్లి రాధతో జరిగెను

  మూడు నిద్రలైన మూడవ దిన

  మందు," వెళ్ల వలయు మాయింటికీ రోజు

  రామ! రమ్మ"టంచు రాధ పిలిచె.

  ప్రత్యుత్తరంతొలగించు
 15. మొదటి పాదం...రామ రావు పెండ్లి రాధతో జరిగెను
  అని సవరణ చేయడమైనది.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. పిన్నక నాగేశ్వర రావు గారూ,
   మీ పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు.

   తొలగించు
 16. మొదటి పాదం...రామ రావు పెండ్లి రాధతో జరిగెను
  అని సవరణ చేయడమైనది.

  ప్రత్యుత్తరంతొలగించు
 17. రామ రమ్మటంచు రమణి యా సీతమ్మ
  పిలిచె ననుచు వ్రాయ దలచి వ్రాసె
  రామ రమ్మ టంచు రాధ పిలిచె నని
  మతిమ రఫున నిచట మామగారు

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. పోచిరాజు సుబ్బారావు గారూ,
   మతిమరుపు మామగారి పూరణ చాలా బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 18. నేటి సమస్యకు నా పూరణ
  సి పి బ్రౌన్ అకాడమీ హైదరాబాద్ వారి ప్రచురణ '' సాహితీ స్రవంతి '' సాహిత్య
  పత్రిక నిర్వహించిన సమస్యాపూరణం కార్యక్రమములలో నేను బహుమతులుపొందిన
  పన్నెండుపూరణలలో నాలుగవదిగా 1)రామాయణార్ధం లోనూ2) సామాన్యార్ధం లోను రచించిన
  పద్యములు క్రిందనుదహరించితిని ( సాహితీ స్రవంతి పత్రిక జనవరి - ఫిబ్రవరి 2011)
  1) సామాన్యుండని దల్చె శూర్పణఖ నిష్కాముండు శ్రీరామునిన్
  ఏ మాత్రంబను మానమున్గొనక వానిం బెండ్లియాడంగ తా
  కామ ద్వేషములుప్పతిల్ల పలికెన్ కామాతు రారాధ యై
  రామా! రమ్మని కేలు సాచి పిలిచెన్ రమ్యంబుగా రాధయే
  2) ఏ మద్యంబది, బ్రాంది విస్కి మరుయున్ ఏదైన రమ్ జిన్ లనే
  నీమంబన్నది లేక సంతతము పానీయంబుగా ద్రావుచున్
  భామన్ గూడి రమించు రాముని గనెన్ ప్రక్కింటి దౌ రాధ , ఓ
  రామా ''ర''మ్మని కేలు సాచి పిలిచెన్ రమ్యంబుగా రాధయే
  నేటి రెండవ సమస్యకు నా పూరణ
  నీతు లెన్నొజెప్పెనిత్య సత్యములని
  వేమన బలికెనట వింతగతిని
  వింటి వేమొ లేదొ విను విపు డని ''యభి
  రామ !'' రమ్మటంచు రాధ పిలిచె

  ప్రత్యుత్తరంతొలగించు
 19. మరొక పూరణ

  విష్ణు వవని కేగఁ వెన్వెంటనే నీవు
  భువికి జేరినా వభూత గతిని
  నాదు ప్రేమ దెలుప ననుజుని కడ బల
  రామ ! రమ్మటంచు రాధ పిలిచె

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. భాగవతుల కృష్ణారావు గారూ,
   మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించు
 20. ఏమీ పున్నమి రేల భామ లొకటై యింపార బృందావనిన్
  శ్యామా వేణువు నూది రమ్మనిన రాచక్రీడ కేతెంచమే
  కామా నీకిక మమ్ము వీడి చన నిష్కాముండవై రమ్మనన్
  రామా రమ్మని కేలు సాచి పిలచెన్ రమ్యమ్ముగా రాధయే.

  ప్రత్యుత్తరంతొలగించు
 21. శ్యామ వేచి యుండ చల్లని వెన్నెలన్
  ప్రేమ నిన్ను గోరి వేగ రావు
  భామ ముందు మేము పలుచనయ పనికి
  రామ రమ్మటంచు రాధ పిలచెన్.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. మిస్సన్న గారూ,
   రమ్మంటే రామా? అనీ, పనికి రామా? అనీ ఎంతటి వైవిధ్యాన్ని, చమత్కారాన్ని చూపారు మీ పూరణలలో? రెండు బాగున్నవి. మీకు నమోవాకాలు!

   తొలగించు
  2. ధన్యవాదాలు గురువుగారూ

   తొలగించు
 22. వందనీయు, మిత్రు! నందాంగనా పుత్రు!
  సతత హర్ష భరితు, సాధుచరితు
  ప్రేమమీర జూచి క్షేమంబె సుగుణాభి
  రామ! రమ్మటంచు రాధ పిలిచె
  హ.వేం.స.నా.మూర్తి

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
   సుగుణాభిరామునితో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 23. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 24. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 25. కామంబెచ్చెను, కౌగిలింతఁ గొనగన్ కాయంబు పొంగారె, నా
  రామంబందున వేసియుంటి కనుమా! లక్ష్మీసుతుండున్ వెసన్
  తా మైకమ్మడరంగ వేసె కుసుమా స్త్రంబుల్ సఖా! తాప వి
  శ్రామా! రమ్మని కేలు చాచి పిలిచెన్ రమ్యంబుగా రాధయే

  ప్రత్యుత్తరంతొలగించు
 26. ప్రత్యుత్తరాలు
  1. అన్నపరెడ్డి వారూ,
   మీ తాజా పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

   తొలగించు
 27. రజితపతకం సాధించినసింధూ పైనాపూరణ. సింధూరేపటి సత్కారానికి స్నేహితురాలురాధపిలచుట
  ఆమోదంబగు నాట తీరుగనగా?నాశ్చర్యమౌ భాగ్యమే|
  సామాన్యంబని నెంచుటౌన?మన విశ్వాసంబుసింధూరమై|
  ధీమాగా గెలుపొంద ?ఆంధ్రవనితాతేజంబుభాసిల్ల?”మా
  రామా|రమ్మని కేలుసాచి పిలిచెన్ రమ్యంబుగారాధయే”.
  2.కలసి విద్య నేర్చి కల్మష మేలేని
  మిత్ర వర్యు లైన మెతకవారు
  రామ “రమ్మటంచు రాధపిలిచెవెళ్లి
  పెళ్లి కూతురయ్యు పెళ్లికొరకు”|  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ఈశ్వరప్ప గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించు
 28. ఏమాయెన్ దనుజాంతకా!మురహరీ! నీకేల కోపంబు నా
  ధామంబున్ తిలకించ వైతివి కదా దాక్షిణ్య మేపారగా
  క్షేమంబే కద యెల్ల నీ ప్రియసఖుల్ శ్రీ కృష్ణ! సమ్మోహ నా
  రామా ! రమ్మని కేలు సాచి పిలిచెన్ రమ్యంబుగా రాధయే"

  ప్రత్యుత్తరంతొలగించు
 29. ఏమాయెన్ దనుజాంతకా!మురహరీ! యేమైన కోపంబ నా
  ధామంబున్ తిలకించ వైతివి కదా దాక్షిణ్య మేపారగా
  క్షేమంబే కద యెల్ల నీ ప్రియసఖుల్ శ్రీ కృష్ణ! సమ్మోహ నా
  రామా ! రమ్మని కేలు సాచి పిలిచెన్ రమ్యంబుగా రాధయే"
  the first one is incorrect

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 30. ఎదను పొదవు కొనగ మదిఁ దోచి
  నావయ్య
  జాగు సేయఁ బోకు మాగలేను
  పడగలెత్తు తపనలడఁచ కాళీయ సం
  గ్రామ! రమ్మటంచు రాధ పిలిచె

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 31. కామోత్కంఠత గోపికల్ గడపలన్ గన్నారు సన్మౌనులే
  ప్రేమోత్సర్గము జేసి కృష్ణు భృకుటిన్బన్నేరు యోగమ్మునన్
  మేమో సర్వ సమర్పణాధృతినినిన్ మెప్పింతుమో భక్త సు
  త్రామా రమ్మని కేలుసాచి పిలిచెన్ రమ్యంబుగా రాధయే

  ప్రత్యుత్తరంతొలగించు
 32. గోపికలింద్రియాల్ గుడువ నానందంపు
  రాసకేళి గోరి రహిని గాని
  నాదు ప్రాణమైన నళిన బాంధవ హృద్వి
  రామ రమ్మటంచు రాధ పిలిచె

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. పిట్టా సత్యనారాయణ గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి.
   మొదటి పూరణలో 'భృకుటిన్ బన్నేరు'.. అర్థం కాలేదు.
   రెండవ పూరణలో 'గోపిక లింద్రియాల్' అన్నచోట గణదోషం.

   తొలగించు
 33. మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  ఏమో నీవిట దాగియుందువని యెంతేనిన్ మనోనేత్రమా..
  రామాంతస్థిత కుంద చంపక తరుగ్రామమ్ములన్ జూచుచున్
  స్వామీ ! నీకయి వేచియుండె గనుమా ! చాలించు నీ బెట్టు , మా..
  రామా ? రమ్మని కేలు సాచి పిలిచెన్ రమ్యమ్ముగా రాధయే !!

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. మైలవరపు మురళీకృష్ణ గారూ,
   మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

   తొలగించు
 34. రూపము యౌవనంబుగనిరో తను వీరుడటంచు జెప్పినన్
  కూపము నందు గూల్చిరిసగోత్రుని కిచ్చిరి పెండ్లదంట ఏ
  శాపమొ ఉగ్ర మూకలవశంబయివిడ్వడెనైన నొక్క సే
  నాపతి యేగుదెంచగని నాపతి భీతిని నక్కె నొక్కెడన్

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. పిట్టా సత్యనారాయణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 35. కానమయోధ్య రామునిటు గట్టిన మందిరమందు నాడు నా
  గానమె రామనామ మను గౌరవ వాచకమయ్యె కాని ఓ
  లేని మసీదు వచ్చెనట లీలగ జూచుటదెట్టి భక్తియో
  వానరులెల్ల నొక్కటయి వర్ధిలు కాలము వచ్చుటెన్నడో

  ప్రత్యుత్తరంతొలగించు
 36. కామోత్కంఠత గోపికల్ గడపనే గన్నారు సన్మౌనులో
  ప్రేమోత్సర్గము జేసి కృష్ణు భృకుటిన్ బన్నేరు యోగమ్మునన్..పన్ను..నిలుపు సాలె పరికరమును పన్నును
  మేమో సర్వ సమర్పణాధృతిని నిన్మెప్పింతు మో భక్త సు
  త్రామా రమ్మని కేలుసాచి పిలిచెన్ రమ్యంబుగా రాధయే

  ప్రత్యుత్తరంతొలగించు
 37. కానల గూల్చి పురంబులు గా నిల్పిన నీతి గని దగాపడి కోతుల్
  బోనుల జిక్కెను హరి యీ వానరులొక్కటిగ జేరి వర్ధిలుటెపుడో.
  జన్యువు లెట్టివొ కూతుకు.ధన్యము నరుసేవ తపముదారత గొనెనో
  కన్యల సేవాశ్రమ పతి.సన్యాసికి బిల్లనిచ్చి సంబరపడియెన్

  ప్రత్యుత్తరంతొలగించు
 38. భూతలమందునెందరొవిభూతిని బంచిరి బ్రహ్మచారులై.మాతృపితౄణ సద్గతుల మాన్యములాయెనొయేమొగానిస
  ద్భూత ఋణంబు దీర్చుకొన బోరినయౌవన కర్మయోగి సుమ్మా. తను బెండ్లియాడిజనమాన్యుడుగా నుతికెక్కె మిత్రమా

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. పిట్టా సత్యనారాయణ గారూ,
   మీ పూరణలన్నీ బాగున్నవి. అభినందనలు.

   తొలగించు
 39. మురళిరవము వినగ ముదముతో వేచితి
  రారగోపబాల రసికరాజ
  శౌరి వేగ రార సకలజన మనోభి
  రామ రమ్మటంచు రాధ పిలిచె.

  పంక్తిరథుడు పిలిచె బాధతో నచ్చోట
  రామ రమ్మటంచు:రాధ పిలిచె
  నందగోప బాలు నందముతో తన్ను
  చేర రమ్మటంచు చీరి పిలిచె/శీఘ్రముగను.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించు
 40. క్రొవ్విడి వెంకట రాజారావు గారి పూరణలు.....

  1.

  పిన్నతనమునుండి భీకరాసురులను
  భుజ బలము తోడ పొగరు మార్చి
  నడరు కృష్ణు నెంతొ ననుగుతో ధీబల
  రామ రమ్మటంచు రాధ పిలిచె.

  2.

  నోముల్ పండగ బుట్టినట్టి తనయున్ నోరార రాధారఘుల్
  రామాయంచుచు బిల్చుచున్ మమతతో రమ్యంబు నాడించు చుం
  డన్ మాటున్ గల రాముడటన్ బడినేడ్వన్, యంత డగ్గుత్తితో
  రామా రమ్మని కేలుసాచి పిలిచెన్ రమ్యంబుగా రాధయే.

  ప్రత్యుత్తరంతొలగించు
 41. ఆ.వె. చిలిపి వాడ వీవు చేరవచ్చు చెలికి
  అంతలోకనబడి ఇంతలోనె
  మాయ మగుదు వీవు మరులు గొలిపి! "రామ!
  రామ"!రమ్మ టంచు రాధ పిలిచె.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. గుఱ్ఱం జనార్దన రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు