7, ఆగస్టు 2016, ఆదివారం

సమస్య - 2108 (కవిసన్మాన మ్మనుచు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"కవి సన్మాన మని చెప్పఁగా భీతిల్లెన్"
లేదా...
"కవి సన్మానము సేతుమంచుఁ బలుకం గంపించె భీతాత్ముఁడై"

52 వ్యాఖ్యలు:

 1. గురువు గారికి నమస్కారములు కందపాదమైతే గణదోషమేమో చూడండి .

  ప్రత్యుత్తరంతొలగించు
 2. (పుత్తడి బొమ్మ సినిమాలో, సుత్తి వీరభద్రరావుకు ఏనుగును బహుమానముగా ఇచ్చే సంఘటనాధారముగా....)

  కవితల్ పాడుచు సుత్తి వేయు కవియే కాంగారుఁ జెందంగ వా
  ని వెతల్ తీరగ హస్తి కానుకన మన్నింపంగ నానా వ్యథల్
  చవి జూసెన్ కద సుత్తి వీర వరుడే జంధ్యాల చిత్రంబునన్
  కవిసన్మానము సేతుమంచుఁ బలుకం గంపించె భీతాత్ముఁడై!!

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. జిగురు సత్యనారాయణ గారూ,
   హాస్యరస స్ఫోరకమైన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   కంగారు.. కాంగారు అని టైపయింది.

   తొలగించు


 3. బిరుదు పేరు చూసి భయపడిన కవి :)


  అవసరమవసరముగను బి
  లువనంపి తమరికి నేడు "లుబ్ధప్రతిభా
  కవివరు" డను బిరుదులతో
  కవిసన్మాన మని జెప్పఁగా భీతిల్లెన్

  జిలేబి

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. జిలేబీ గారూ,
   పూరణలోని దోషాన్ని సవరించినందుకు ధన్యవాదాలు.
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'అని చెప్పఁగా' అన్నపుడు సరళాదేశం రాదు.

   తొలగించు
  2. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

   తొలగించు
 4. మిత్రులందఱకు నమస్సులు!

  [నేనును సుత్తి వీరభద్రుని కరి సన్మానమునే గ్రహించి వ్రాసితిని]

  కవి కావ్యమ్ముల వ్రాయఁగాను, ప్రజలున్ గాంక్షించి సన్మానమున్
  జవియౌ రీతినిఁ జేయఁబూని, కవినిం జక్కంగఁ జేరంగ, మున్
  గవి సుత్తీశుఁడు గొన్నయట్టి "కరి సత్కారమ్ము" నూహించియున్,

  "కవి సన్మానము సేతు" మంచుఁ బలుకం, గంపించె భీతాత్ముఁడై!

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. గుండు మధుసూదన్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 5. పవనా !సన్మానంబును
  నవిరళముగజేయుచుండ్రి యచ్చట గనుమా
  కవిగా జేతురు నీకును
  కవిసన్మానమని చెప్ప గాభీతిల్లె న్

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. పోచిరాజు సుబ్బారావు గారూ,
   మీ పూరణలో భావం స్పష్టంగా లేదు. వివరించండి.

   తొలగించు
 6. "సవినయమున నే బలుకుదు
  కవితల జదివితి సభలన గడగడ, వినుమా
  అవి యన్నియు కాపీలే!"
  కవి సన్మానమని చెప్పఁగా భీతిల్లెన్
  (సన్మానం లో ఎక్కడ మళ్ళీ కవిత్వం చెప్పమంటారో అని భయపడ్డ ఓ కాపీ-కవి
  వద్దని పలికిన పలుకులు)

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
   మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

   తొలగించు
 7. అవినీతు యశఃకాము న
  పవిత్రు నింకఁ బొగడంగ వలెనని యొక స
  త్కవి చింతాక్రాంతు డగుచుఁ
  గవి సన్మాన మని చెప్పఁగా భీతిల్లెన్


  అవనీ జాత కవీశ్వరోత్తముడ వయ్యా యంచుఁ గీర్తించుచుం
  జివరం గప్ప భుజాగ్ర సీమలను కౌశేయోత్తరీయంబునున్
  వివశత్వంబునఁ బోవగా వలెను దా వెచ్చంబు లెట్లో యనం
  గవి సన్మానము సేతుమంచుఁ బలుకం గంపించె భీతాత్ముఁడై

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. పోచిరాజు కామేశ్వరరావు గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించు
 8. నవరసములు చిలికించుచు
  కవనము వినిపించగ కవి , గానము సలుపన్
  యువతరము గేలి సేయుచు
  కవి సన్మాన మని చెప్పఁగా భీతిల్లెన్

  శవ సాహిత్య పిశాచ నాట్య గతులే సర్వం సహాయంచునున్
  కవనం బంచని, తోడుగా యువతయున్ కాంక్షించగా గంతులన్
  కవి సన్మానము సేతుమంచుఁ బలుకం గంపించె భీతాత్ముఁడై
  కవి సామ్రాట్టును బోలు నట్టి కవి యీ కాలంపు వారిన్గనన్

  నిన్నటి సమస్యకు నా పూరణలు

  ఆకసమునుండి యంఋవులద్భుతముగ
  కురియ జేయగ పంటలు నరుల కొసగ
  వరుణదేవుఁడు కరుణించెఁ; గరువు వచ్చె
  పంటలు సునామి కి నశించి మంట గలియ

  మౌని వర్యులు పండితాఢ్యులు మంత్రముల్ పఠియించగా
  పూని యాగములెన్నొ జేయగ భూరి పంటలు పండవే!
  వానదేవుఁడు చూపఁగా దయ; వచ్చెఁ గాటక మెల్లడన్
  హీనులై ధరనుగ్రవాదులు హింస కై తగులెట్టగా

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. భాగవతుల కృష్ణారావు గారూ,
   మీ పూరణలన్నీ బాగున్నవి. అభినందనలు.
   'కవిసమ్రాట్టును' అనండి.

   తొలగించు
 9. నవజామాత యొకండు పండుగకునై నారీసమాయుక్తుడై
  స్తవనీయశ్వశురాలయం బరుగగా స్వశ్యాలకుం డచ్చటన్
  భవనాగ్రంబున వృశ్చికాది గణముం బల్మారు చూపించి, నీ
  కవి సన్మానము సేతుమంచు బలుకం గంపించె భీతాత్ముడై.
  (హ.వేం.స.నా.మూర్తి)

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
   మీకు+అవి అన్న విరుపుతో మీ పూరణ వైవిధ్యంగా చక్కగా ఉంది. అభినందనలు.

   తొలగించు
 10. కవి,పండితుడె|నిరాశా
  కవి|సన్మానమని చెప్పగా భీతిల్లెన్
  వివరణ దెలుపక,సవరణ
  కవనములోజెప్పలేక కలతయు జెందెన్ {కవిత్వము వ్రాయగలడు కవి,సభయందుచెప్పబోడు}
  2.కవితాశక్తియు లేని డాంభికుని సంకల్పంబు నూహించకన్
  కవిసమ్మేళన మందు నెంచుకొని లౌఖ్యంబందునొప్పించగా?
  కవిసన్మానము సేతుమంచు బలుకం గంపించె భీతాత్ముడై
  అవమానంబగునో యటంచు తననాహ్వానంబు సూచించగన్

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ఈశ్వరప్ప గారూ,
   మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
   లౌక్యం బనండి.

   తొలగించు
 11. మాన్యులు శంకరయ్యగారికి.... వృత్తంలో 3వ పాదంలో పొరపాట్లు దొర్లాయి. మరల వ్రాస్తాను.

  కవితావేశమునాపలేక నిది ప్రఖ్యాతంపు భావంబునాన్
  జవనాశ్వంబు విధంబునంజెలగి సంచారంబుగావించుచున్
  సవియున్సారములేని వ్యర్థ కవితల్ సంధించ వానిన్, సఖా!
  కవిసన్మానముసేతుమంచు బలుకం గంపించె భీతాత్ముడై.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. పొన్నెకంటి సూర్య నారాయణ రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   లేక యిది... అనండి.

   తొలగించు
  2. సూర్యనారాయణ గారు "చవియున్సారములేని" అనియా మీ యభిమతము? అయినచో నచ్చట సరళాదేశమవుతుందనుకుంటాను. "స" రాదు గదా? "గావించుచుం / జవియున్సారములేని" సాధువనుకుంటాను. పరిశీలించండి.

   తొలగించు
  3. కామేశ్వరరావుగారు నమస్సులు. చవి పదమే సరియైనది. సవి ఉన్నట్లు భ్రమపడ్డాను. అపుడు సరళాదేశమే. సూచించినందుకు ధన్యవాదములు.

   తొలగించు
  4. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

   తొలగించు
 12. భువిలోనపూర్వరీతిని
  కవిలోకము విస్తుజెంద కామేశ్వరుడా!
  శ్రవణశుభగముగ చిటికల
  కవిసన్మానమనిచెప్పగా భీతిల్లెన్.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. పొన్నెకంటి వారూ,
   బాగున్నది మీ పూరణ. అభినందనలు.

   తొలగించు
 13. కవితాగానము సేయగ
  'కవికోకిల' బిరుదమొసగి కానుకగా మా
  వివగరు చిగురుల హారమె
  'కవిసన్మాన'మని జెప్పగా భీతిల్లెన్

  ప్రత్యుత్తరంతొలగించు
 14. కవనము సెప్పగ వలె, నా
  శువుగా, సమయోచితముగ సూక్తుల్ వినిపిం
  చవలే, నవధానమున ,మీ
  కవి,సన్మానమని జెప్పగా భీతిల్లెన్

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   రెండవ పూరణలో 'చవలె' అని ఉండాలి. లేకుంటే గణదోషం.

   తొలగించు
 15. సన్మానము కోరిన కవి వద్దకు,ప్యాకేజీ వివరాలు దెలుప వచ్చిన సన్మాన కర్తలు:

  'కవికోకిళ' పదివేలౌ
  'కవిసామ్రాట్టు'నకు లక్ష ఖర్చౌనని, మీ
  యవసరము మేర నొసఁగిన
  కవిసన్మానమని జెప్పఁగా భీతిల్లెన్!

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. సన్మానము చేయుదమని కవీశ్వరుని వద్దకు వచ్చిన వారు:

   కవి'సంపన్నులు' యోగ్యమౌ బిరుదు మీకందించ మా భాగ్యమౌ
   'కవిసమ్మోహన' నెంతురేని యరలక్షౌ! చాలదన్పించినన్
   'కవిసామ్రాట్టది' లక్షకున్ రయమె సాకారమ్ము! జాగేల నా
   కవిసన్మానము సేతుమంచుఁబలుకం గంపించె భీతాత్ముఁడై!

   తొలగించు
  2. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'కవిసమ్రాట్టు' సాధువు.

   తొలగించు
 16. వివిధంబైన స్వకావ్యరాశి యొక డావిర్భూత మోదంబు తో
  నవనిన్ సద్యశమందగోరి కరమం దావేళ తాబూని సా
  గువిధిం గొందరు దండధారు లచటన్ గుర్తించి యవ్వాని నో
  కవి! సన్మానము సేతుమంచు బలుకం గంపించె భీతాత్ముడై.
  (హ.వేం.స.నా.మూర్తి)

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 17. అవినీతిపరుడనియెనిటు
  కవనమునకు లక్ష కొలది కాసుల నిత్తున్
  భువిలో వ్రాసిన,చేతును
  కవిసన్మాన మని చెప్పగా భీతిల్లెన్.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 18. కవనమున తన 'తెరవెనుక
  కవి 'ని మది తలచి యొకింత కలవరమందన్,
  కవిగా తగననుచు వగచి
  కవి సన్మానమని జెప్పగా భీతిల్లెన్!
  (తన 'తెరవెనుక కవి ' అంటే తను నియమించుకున్న అద్దె కవి, ఆంగ్లంలో 'ఘోస్ట్ రైటర్ ' అనే అర్ధంలో వ్రాశాను.)

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. శ్రీధర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 19. శివకామేశ్వర ప్రోక్తమైన కవితన్ చిత్రంబుదోషంబనన్
  కవి నక్కీరుని వంటివారి సభలో కాలాన ధర్మాత్ముడై
  కవిరాజొక్కని రాజుఁబిల్చిఁ దగు సత్కారంబు సేయించగన్
  కవి సన్మానము సేతుమంచుఁ బలుకం గంపించె భీతాత్ముఁడై

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ఫణి కుమార్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 20. కవి సన్మానమనుచు నా

  కవినే ధనమడుగు వారు కలరని తెలిసెన్

  కవికిన్; వారేతెంచియు

  కవి సన్మానమని చెప్పగా భీతిల్లెన్.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. పిన్నక నాగేశ్వరరావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు


 21. " శివశివ యేలను నాకి
  ట్లు వరిష్ఠుడ నంచు నిదియ, డుండుకమును నే "
  నివి శంకరయ్య పలుకులు
  కవి సన్మానమని చెప్పగా భీతిల్లెన్.

  ప్రత్యుత్తరంతొలగించు
 22. అవునా! చాలును! నాకు నీ బిరుదు లేలా నవ్వరే యందరున్?
  ఎవరీ వన్నె కనర్హుడైన నను ని ట్లిబ్బందిలో నెట్టినా?
  రివి 'కందీశుని' యష్ట దిగ్గజ ప్రశస్తిన్ గూర్చి మోమాటముల్!
  కవి సన్మానము సేతుమంచు బలుకం గంపించె భీతాత్ముడై.

  ప్రత్యుత్తరంతొలగించు
 23. మిస్సన్న గారూ,
  నేను భయపడలేదు కాని ఇబ్బంది పడ్డ విషయం వాస్తవమే. నాకెందుకో వేదిక లెక్కడం మాట్లాడటం అంటే ఇష్టం ఉండదు.
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 24. Bhuvi naadokkate sooti maargamani sadbhuddhin manan jalakan
  Evaraa Maarksani padya vidya gadagan eddeiva paaljeya yoa
  ddhavarul taamayi pampi raathani gonan 'Tath-Thath--Thi- dheim'anna naa
  Kavi sanmaanamu seithumanchu balukan gampinche bheethaathmudai P.Satyanarayana

  ప్రత్యుత్తరంతొలగించు
 25. కవులని విరసుల కందిన
  ఛవి పత్రికలెల్ల జాట జాలిని గను నా
  కవియొల్లడు దంభప్రభ
  కవిసన్మా నమనిచెప్ప గాభీతిల్లెన్.

  ప్రత్యుత్తరంతొలగించు
 26. భువి నాదొక్కటె సూటివాదమనిసద్బుద్ధిన్ మనం జాలకన్
  ఎవడా మార్క్సనియేవగింపుదొరగన్ యెద్దేవ పాల్జేయ యో
  ద్ధవరుల్ తామయి పంపిరాతని గొన న్తత్తత్తిదేమన్న నా
  కవి.......................

  కవులని విరసుల కందిన
  ఛవి యని పత్రికలు జాట జాలిని గనెనా
  కవియొల్లడు దంభప్రభ
  కవి సన్మా.............
  కవి.........................................

  ప్రత్యుత్తరంతొలగించు