13, ఆగస్టు 2016, శనివారం

సమస్య - 2114 (భారత యుద్ధరంగమున...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"భారత యుద్ధరంగమున పార్థుఁడు సచ్చెను భీముఁ డేడ్వఁగన్"
లేదా...
"భారత యుద్ధమున నోడి పార్థుఁడు సచ్చెన్"

29 కామెంట్‌లు:

  1. వీరుని పార్థ కుమారుని
    భీరువులందరును జేరి బేలగ జంపన్
    కౌరవ సేనలు భ్రమసిరి
    భారత యుద్ధమున నోడి పార్థుఁడు సచ్చెన్

    రిప్లయితొలగించండి
  2. కురుక్షేత్రమున బంధువులన్న పాశముతో నిస్సత్తువ యావహించగ భీరువువలె వింటిని క్రిందవైచి హరి మ్రోలవాలిన అర్జునుని గాంచి సామాన్య సైనికుని మానసము..

    ధీరుఁడని యోధు లెల్లరు
    నూరక గగ్గోలు పెట్ట నుచితంబౌరా!
    జూరుచు విలుతో హరికడ
    భారతయద్ధమున నోడి పార్థుఁడు సచ్చెన్

    రిప్లయితొలగించండి
  3. శ్రీగురుభ్యోనమః

    వారిసుతుండు రోషమున పాండుతనూజుల నడ్డగించగా
    నూరట జెంది స్వప్నమున నూహల గాంచె సుయోధనుండు తాన్
    భారత యుద్ధరంగమున పార్థుఁడు సచ్చెను భీముఁ డేడ్వఁగన్
    కోరికలెట్లు దీరు మరి కూలెను స్వప్నములెల్ల కల్లలై

    రిప్లయితొలగించండి
  4. పోరన ధర్మయుద్ధమని పొందుగ హింసనుమాని హూణులన్
    ఊరికి బంపె గాంధియన నొక్కెడ పార్థుడె .మూర్ఖ గోడ్సె తా నూరకజంపెనాతనిని
    యొక్క ఛలంబున మ్రొక్క వచ్చి స.ర్దారొక భీముడేడ్చె నతి ధౌర్యత వీరనిజామునీడ్చె చే.కూర సుతంత్ర భారత సుఘో షణ బర్వ ప్రపంచమెల్లెడన్.భారత యుద్ధ రంగమున పార్థుడుసచ్చెను భీముడేడ్వగన్.
    పోర. యిదేమి చిత్రమిట.సారవిహీనా. చరిత్ర సౌగంధము నీ. సారకు కిక్కై హెచ్చెనొ.భారత యుద్ధమున నోడి పార్థుడు సచ్చెన్..ప్రశ్నార్థకము

    రిప్లయితొలగించండి

  5. పార్థసారథి పలుకులు


    సారథి నేనై యుండగ
    భారత యుద్ధమున నోడి పార్థుఁడు సచ్చెన్
    పోరాడలేక యనునది
    కారాదు జనుల పలుకులు కదనము సలుపూ

    జిలేబి

    రిప్లయితొలగించండి
  6. పౌరుడెపార్ధునిగ నిలిచి
    భారతదేశమున నీతి భారత పెంచన్
    వీరునిగపోరు చేసియు
    భారతయుద్దమున నోడి పార్ధుడు సచ్చెన్

    రిప్లయితొలగించండి
  7. ధీరత్వంబును జూపుచు
    పోరాడెను కడవరకును పుడమిన తానున్
    శూరుడె శాపవశంబున
    భారత యుద్ధమున నోడి పార్థుడు సచ్చెన్.

    పార్థుడు=కర్ణుడు(పృథ కుమారుడు)

    సారథిగ కృష్ణుడుండగ
    భారత యుద్ధమున నోడి పార్థుడు సచ్చెన్
    ఘోరంబిదటంచు పలుకు
    వారికి నవకాశ మిడుట పాడియె పార్థా/చెపుమా!

    రిప్లయితొలగించండి
  8. ఒౌరాయేమనిపలికిరి
    భారతయుధ్ధముననోడిపార్ధుడుసచ్చెన్
    వీరునినటులుగననుటకు
    నారయమరిన్యాయమగునె నార్యామీకున్

    రిప్లయితొలగించండి
  9. భారతయుధ్ధరంగమునపార్ధుడుజూపుచుబాహుతీక్ష్ణతన్
    మారణహోమమున్జరుపమాటలుబేలగబల్కనేలకో
    భారతయుధ్ధరంగమునపార్ధుడుసచ్చెనుభీముడేడ్వగన
    న్నూరకమాటలేలయికయోర్పుననేర్పునబల్కగాదగున్

    రిప్లయితొలగించండి
  10. వీరుని రీతిగ నరపతి
    పోరాటము చేయుచుండె పౌరుషమొప్పన్
    కారము జల్లుచుపొడవగ
    భారత యద్ధమున నోడిపార్థుడుజచ్చెన్


    పార్థుడు- రాజు

    రిప్లయితొలగించండి
  11. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    { భారతయుధ్ధమనే నాటకములో అర్జునపాత్రధారి పొడవైన రాగము పాడ లేక గు౦డె పోటుచే ర౦గస్థలముపైననే నీల్గెను }
    …………………………………………………………


    ఘోరమగు నాటకమ్మున >

    "భారత యుధ్ధమున" నోడి పార్థుడు చచ్చె

    న్నార౦గస్థలి c | బాడగ


    మూరెడు రాగమును , గు౦డె పోటు తగిలెగా

    రిప్లయితొలగించండి
  12. సారవిశాల విక్రముడు శంభునిగెల్చిన వీరుడయ్యు నా
    "భారతయుద్ధరంగమున బార్థుడు సచ్చెను భీముడేడ్వగం"
    బోరున దిగ్విజేతనయిపోయితినంచును రాజరాజిల
    న్నారయ వేకువంగనెను నద్భుత స్వప్నము కాంక్షదీరగన్.

    రిప్లయితొలగించండి
  13. కారణజన్ముడు నరుడగు
    పోరున నపజయమెఱుగ డపూర్వయశుండై
    వీరులపాలిట కాలుడే
    భారతయుద్ధమున నోడి పార్థుడు సచ్చెన్?

    రిప్లయితొలగించండి
  14. రిప్లయిలు
    1. పారక ధైర్యచిత్తుడు కృపామయు డా ద్రుపదుండు వీరుడే
      కౌరవపాండవేయ చిరకాల మహోద్ధిత వైర భావ సా
      కార మహానలజ్వలిత గాఢ సుగోత్ర నికాయ తుల్య మా
      భారత యుద్ధరంగమున పార్థుఁడు సచ్చెను భీముఁ డేడ్వఁగన్
      [ పార్థుఁడు = రాజు]


      ధర్మా రాజు భీమునితో నర్జునుని గురించి చెప్పు సందర్భము:

      నారీ మణులను గొని కాం
      తారమ్మున బోయల నల తాకగ లేకన్
      భీరువు వలె తా నక్కట
      భారత! యుద్ధమున నోడి పార్థుఁడు సచ్చెన్
      [సచ్చు= శక్తియుడుగు]

      తొలగించండి
  15. ధీరుడగు కర్ణుడు సమ సె
    భారతయుద్ధమున నోడి,పార్థుడు చచ్చెన్
    పోరున రవిసుతుని దునిమి
    వీరుడుతన సోదరుడని వెన్నుడు చెప్పన్

    రిప్లయితొలగించండి
  16. మేరలు మీరి యొక్కరుడు మిక్కిలి మద్యము ద్రావి దూలుచున్
    చేరి యసంగతంబు లిటు చెప్పుచు నుండెను రావణాసురుం
    డారఘురాము గూల్చె విను డందరు నీ యితిహాస వాక్యముల్
    భారత యుద్ధరంగమున పార్థుడు సచ్చెను భీము డేడ్వగన్.
    హ.వేం.స.నా.మూర్తి

    రిప్లయితొలగించండి
  17. వీరుడు కర్ణుడు,కన్యగ
    వారిజముఖి పృథకు బుట్ట పార్థు డనదగున్
    కౌరవ సేనాపతిగా
    భారత యుధ్ధమున నోడి పార్థుడు సచ్చెన్.

    రిప్లయితొలగించండి
  18. పోరునకు జంక దగునా
    భారత! యుద్ధమున నోడి పార్ధుడు సచ్చెన్
    వీరునిగ దివికఱిగెనని
    బేరొందుట శూరుని కిల బేరిమి కాదే!
    (యుద్ధ రంగమున అస్త్ర సన్యాసమునకు సిద్ధమైన పార్ధునికి పరమాత్మ గీతోపదేశం చేసిన సందర్భం)

    రిప్లయితొలగించండి
  19. తోరంపు సంతసంబున
    రారాజు సుయోధనుండు రాణికి దెలిపెన్
    కోరగ స్వప్నోదంతము
    భారతయుద్ధమున నోడి పార్థుడు సచ్చెన్.
    (హ.వేం.స.నా.మూర్తి)

    రిప్లయితొలగించండి
  20. పోరున నల్లనయ్యజత పోవనె డమ్ముగ తేరుపై వెసన్
    భారతయుద్ధరంగమున పార్థుడు,సచ్చెను భీముడేడ్వగన్
    వీరుడు పార్ధుసూనుడని వేవురు వైరులు చుట్టుముట్టగా
    క్రూరుడు సైoధవుండుతను రుద్రువరమ్ముల చేయసాయమున్

    రిప్లయితొలగించండి
  21. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  22. భారవి గురువును నడిగెను
    ఏరణమందున కిరీటి యెక్కడజచ్చెన్?
    “ఏరా దెలియద వినుమనె
    భారత యుద్దమున నోడి పార్థుడు సచ్చేన్| {పరధ్యాస పండితుని పలుకు}
    2.ప్రేరణచేత కర్ణుడట పీడిత దాడిగ వేయ బాణముల్
    భారత యుద్దరంగమున పార్థుడు సచ్చెను భీము డేడ్వగన్
    ధీరులు దిక్కుకొక్కరుగ దీనులుగా కలయందు జూచితిన్
    చేరిన సైనికుండొకడుజెప్పగ ?తప్పని దిట్టిరందరున్


    రిప్లయితొలగించండి
  23. ఆ రాతిరి స్వప్నము గని

    ఘోరముగా నఱచినాడు కురురాజిటులన్

    " మీరలు వినుడీ ముదమున

    భారత యుద్ధమున నోడి పార్ధుడు సచ్చెన్."

    రిప్లయితొలగించండి
  24. ఆ రాతిరి స్వప్నము గని

    ఘోరముగా నఱచినాడు కురురాజిటులన్

    " మీరలు వినుడీ ముదమున

    భారత యుద్ధమున నోడి పార్ధుడు సచ్చెన్."

    రిప్లయితొలగించండి
  25. కౌరవ నాధుడొక్క కల గాంచెను, పెక్కురు యోధులండగా
    చేరి విచిత్ర వ్యూహమున సేనను నిల్పి రణంబు చేయగా,
    ఘోర పరాజయమ్ముగని గోడున యేడ్చిరి పాండవుల్; మహా
    భారత యుద్ధరంగమున పార్థుఁడు సచ్చెను భీముఁ డేడ్వఁగన్

    భారంబగుతల, జ్వరమును,
    నీరసముగ నుండి కలతనిద్రాస్థితికిన్
    జారుచు నొక కవి బలికెను
    భారత యుద్ధమున నోడి పార్థుఁడు సచ్చెన్

    రిప్లయితొలగించండి
  26. శంకరాభరణం బ్లాగు గురుదేవులు శ్రీ కంది శంకరయ్య గారికి , కవిమిత్రులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
    వడ్డూరి అచ్యుత రామకవి,స్వాతంత్ర్య సమరయోధులు- భరతమాత
    భూరి సస్యఫల ప్రపూర్ణ సంపూర్ణ సౌభాగ్య భాగ్యోపేత భరతమాత
    భరతాది సుగుణ సంభరిత పాలిత నిత్యఫలిత పుణ్య వ్రాత భరతమాత
    హతపాతక వ్రాత నుతలోక సంఘాత బహువిధాఖ్యాత మా భరతమాత
    భరతాది సుగుణ సంభరిత పాలిత నిత్య ఫలిత పుణ్యవ్రాత భరత మాత
    హతపాతక వ్రాత నుతలోక సంఘాత బహువిధాఖ్యాత మా భరతమాత
    పూర్వ సంచిత భాగ్య భోగ్య సంధాత దుర్భర దుఃఖ నాశ శ్రీ భరతమాత

    మహిత విష్ణు పదీపూత భరతమాత
    వర మహావీరమాత మా భరతమాత
    భవ్యరత్న ప్రసూతి మాభరతమాత
    మాతలకు మాత భారతమాత దలతు

    స్వాతంత్ర్య సమరోర్వి సత్యాగ్రహంబులు శాసనోల్లంఘనల్ జరిపినాము
    అమల జాతీయ గీతాలాపనంబుల బేర్చి యుత్సాహంబు గూర్చినాము
    ఇంగ్లీషు వారిపై యేవగింపును బెంచు వరపద్య గేయముల్ వ్రాసినాము
    ఇల్లు పిల్లలవీడి ఇంగ్లీషువారిచే చెఱసాల నిడుములు జెందినాము

    గుండుదెబ్బల కేదురేగి గుండెలిచ్చి
    రక్షక భఠాళి లాఠీల రాటుదేలి
    భరతమాత విముక్తికి పాటుబడిన
    తొల్లిటి స్వతంత్ర్య వీరయోధులము మేము
    రచన :వడ్డూరి అచ్యుతరామ కవి,స్వాతంత్ర్య సమరయోధులు (సమర్పణ వడ్డూరి రామకృష్ణ )

    రిప్లయితొలగించండి
  27. పోరెను నన్నతో నరుడు పొందును కోరుచు ద్రౌపదమ్మతో
    కారెను కన్నులన్ జలము కర్ణుడు గాంచగ కుంతిమాతనున్
    తీరును తెన్నునున్ విడిచి ధీరుల గాధలు నేను వ్రాయగా
    భారత యుద్ధరంగమున పార్థుఁడు సచ్చెను భీముఁ డేడ్వఁగన్

    రిప్లయితొలగించండి