శరణం పండిత మానసాపహరణం శశ్వద్యశఃకారణం సరసానందద వాగ్విలాస చరణం, శబ్దార్థ సంపూరణమ్ | చరదత్యద్భుత సత్కవీశ్వరగణం సాలంబనం ‘శంకరా భరణం’ నిత్యమహం స్మరామి విలసద్ వాగ్దివ్య సింహాసనమ్ ||

ఆదివారం 22 జనవరి 2012

చమత్కార పద్యాలు - 180

2 వ్యాఖ్యలు
ప్రహేళిక

లంబోదర తవ చరణౌ
ఆదరతో యో న పూజయతి |
స భవతి విశ్వామిత్రో
దుర్వాసా గౌతమ శ్చేతి ||


"ఓ వినాయకా! ఎవడు నీ పాదాలను ఆదరంతో పూజింపడో వాడు విశ్వామిత్రుడో, దుర్వాసుడో, గౌతముడో అవుతా డంటారు" అని విపరీతార్థం.
మరి ఇందలి విశేషార్థం ఏమిటో చెప్పగలరా?

(శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారు సేకరించిన ‘ప్రహేళికలు’ గ్రంథం నుండి)

2 వ్యాఖ్యలు:

వెంకట రాజారావు . లక్కాకుల చెప్పారు...

వినాయకుని పాదపూజకు నోచుకోనినాడు ఎంతటివాడైనా విశ్వానికిశత్రువౌతాడు.దుర్నివాసుడౌతాడు.పశూత్వాన్నిపొందుతాడు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

విశ్వామిత్రుడు = అవిస్వస నీయుడు [ నమ్మకము లేనివాడు , నమ్మ దగని వాడు , తనయందు తనకు నిలకడ లేని వాడు ]
దుర్వాసుడు = దుర్వ్య సనములు కలిగిన వాడు
గౌతముడు = గోహత్య చేసిన వాడు . అగుదురు
నాకు తెలిసి కాదు . ఊరికే వ్రాసానంతే

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి