14, ఆగస్టు 2016, ఆదివారం

పద్యరచన - 1227

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనాంశము
 

 "కృష్ణవేణీ పుష్కరములు"

22 కామెంట్‌లు:

  1. పుష్కరమ్ములువచ్చునుబుణ్యమీయ
    యొక్కొకనదికివరుసగనొక్కసారి
    వచ్చుశంకర!పన్నెండువత్సరముల
    కిప్పుడరయగగృష్ణమ్మకొప్పుగాను
    వచ్చెశుభములీయమనకుభవ్యముగను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పద్యం బాగున్నది. '...బుణ్య మీయ। నొక్కొకనదికి..' అనండి.

      తొలగించండి
  2. సహ్య పర్వత సానువు జననమంది
    నాల్గు రాష్టాల ప్రాంగణ నాగరికత
    నొలుక బోయుచు వెలుగులు తొలుక జేసి
    పంట మాగాణ భూములన్ పైరు బెంచి
    కొండ కోనల దారుల గూడు కొనుచు
    తేట నీరము స్వరములు మీటుకొనుచు
    చెంగలింతువు కృష్ణా తరంగిణిగను
    పుష్కరమ్మున ప్రణతులు పుష్కలముగ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శిశ్ట్లా శర్మ గారూ,
      కృష్ణమ్మకు ప్రణుతు లిడిన మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  3. గురువట కన్యా రాశినిఁ
    బరగఁ గలుగు కృష్ణ కంత వర పుష్కరముల్
    తరియించెదరు పితృవరులు
    కరమ నురక్తి నిడ తటిని ఘన పిండములన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీకు జ్వరము తగ్గి స్వస్థత చేకూరినట్లు తలుస్తాను.

      తొలగించండి
    2. కామేశ్వర రావు గారూ,
      పుష్కర వివరాలను చిన్న పద్యంలో చక్కగా వివరించారు. బాగుంది. అభినందనలు.
      ఉదయం నుండి సాయంత్రం వరకు తగ్గినట్టే అనిపించింది. మళ్ళీ ఇప్పుడు జ్వరం వస్తున్నది.

      తొలగించండి
  4. శివకేశవ సంగమమై
    యవనీ స్థలిఁ గృష్ణవేణి యానముఁ జూడన్
    జవసత్వములొసఁగి జనుల
    భవదూరులఁజేయు పుణ్య భాగీరథియై!

    సందోహమ్మున సురలున్
    చిందుల కృష్ణమ్మఁ జేరఁ జిన్మయమున నా
    నందమ్ముగ సంధానిత
    కుందూనదిఁ బుష్కరమ్ము కూడెను మాకై!


    రిప్లయితొలగించండి

  5. ఆ.వె:పసిడి పంట లొసగు బంగారు కృష్ణమ్మ
    ఆంధ్రప్రజలకెల్ల యన్నపూర్ణ
    సాగరు దరి చేరె సవ్వడితోతాను
    వాయనమ్ములొసగ వడిగ రండు.

    ఆ.వె:పుష్కరమ్ములకొరకు పుత్ర బాంధవులతో
    కూర్మి తోడ రండు కోర్కె దీరు
    భక్తి తోడ మునగ ముక్తి దొరకునిట
    తథ్యమనుచు నుంద్రు తపసు లెల్ల.

    ఆ.వె:పదియురెండు నైన వత్సరములకొక
    సారి వచ్చు చుండు సరిగ గనుడు
    పుష్కరములు,నపుడు పూజలు చేయంగ
    పుణ్య మబ్బు నంట పుడమి యందు.

    ఆ.వె:పుష్కరముల యందు పూజాదికములతో
    పిండ మిడుచు నుండ పితరు లెల్ల
    సంబరమ్ము తోడ సాధు సాధు యనుచు
    సాదరమున మిమ్ము సన్ను తింత్రు

    సీ:అఘరాశి తొలగించి యానంద మొసగంగ
    బిరబిరా చకచకా బిరుసు గాను
    మహరాష్ట్రలో పుట్టి మంజుల రవముతో
    తరలి వచ్చేనమ్మ తానె వడిగ
    సాగి తెలంగాణ సరిహద్దులో కృష్ణ
    సాగరుఁ గలిశేను చక్కగాను
    అన్నదాతలకెల్ల నాలంబనమగాను
    హర్షంబు నొసగంగ హంగు తోడ

    ఆ.వె:కదలివచ్చె తాను కలకల రవముతో
    జనుల కోర్కె దీర్చు జనని వోలె
    గలగలా జలజల గంభీర ధ్వని తోడ
    వచ్చె కృష్ణవేణి వరము లొసగ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      పుష్కరాలపై మీరు వ్రాసిన ఖండకృతి బాగున్నది. అభినందనలు.
      రెండవపద్యం మొదటిపాదంలో గణదోషం. 'పుష్కరముల కొరకు...' అనండి. టైపాటు కావచ్చు. 'మునగ' కాదు, 'మునుగ' అనండి.
      నాలుగవపద్యంలో 'సాధు+అనుచు=సాధనుచు' అవుతుంది. 'సాధు సాధు నుడుల' అనండి.
      సీసపద్యంలో 'వచ్చేనమ్మ' అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. 'తరలి వచ్చెను తల్లి తాను వడిగ' అనండి. '..గలిశేను' గ్రామ్యం. 'సాగరుం గలియును..' అనండి. '..నాలంబనము..' అని ఉండాలి.'గంభీర ధ్వని' అన్నపుడు ర గురువై గణదోషం. 'గంభీర ఘోషతో' అందామా?
      'గురజాడ ఫౌండేషన్, అమెరికా' వారి పురస్కారాన్ని అందుకొంటున్నందుకు శుభాభినందనలు!

      తొలగించండి
  6. శ్రీకరమీ పుష్కరవిధి
    యాకరము సుఖాలకింక హర్షదమౌచున్
    చేకుర జేయును సఫలం
    బాకాంక్షలను పితృదేవతాశీస్సులతోన్.

    పదిరెండు వత్సరంబుల
    నదనెంచి ప్రవేశమందు నాపుష్కరుడీ
    నదులందు క్రమత జూపుచు
    సదయుండై శుభములొసగు సద్భావముతోన్.

    గురు డాత్మగతిని జూపుచు
    నరయంగా కన్యలోని కానందమునన్
    సురుచిరముగ జేరినచో
    నిరుపమయగు కృష్ణకగును నిత్యోత్సవముల్.

    భవమంది పశ్చిమంబున
    జవమున పూర్వంపు దిశకు సత్త్వోన్నతవై
    స్తవనీయ వగుచు చేరెద
    వవురా! కొను కృష్ణవేణి యభివాదములన్.

    నీవేగు మార్గమందున
    పావనమౌ క్షేత్రరాజి బహువరదముగా
    భావింపబడుచు నుండును
    దేవీ! నీసాహచర్య దీప్తిని గృష్ణా!


    ఈపుష్కరకాలంబున
    నీపంచను జేరు జనుల నిఖిలాఘములన్
    కోపాది దుర్గుణంబుల
    బాపంగా కృష్ణవేణి! ప్రార్థింతు నినున్.
    హ.వేం.స.నా.మూర్తి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
      పెక్కు దినాల పిదప మీ ఖండికను చూచే అదృష్టం దక్కింది. బాగుంది. అభినందనలు.

      తొలగించండి
  7. తుందిలుని తపో మహిమను
    అందిం చెనుజల శక్తి నదులన్నింటన్
    పొందుగ పుష్కర మందున
    విందగు జనులకు ముక్తి వేయివిధమ్ముల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      పద్యం బాగుంది. రెండవ పాదంలో గణం, యతి రెండూ తప్పాయి. 'మహిమ। న్నందించెను వారిశక్తి నదులన్నింటన్' అనండి. చివరి పాదంలో 'జనులకును ముక్తి' అనండి. లేకుంటే గణదోషం.

      తొలగించండి
    2. తుందిలుని తపో మహిమన్
      న్నందించెను వారిశక్తి నదులన్నింటన్
      పొందుగ పుష్కర మందున
      విందగు జనులకును ముక్తి వేయివిధమ్ముల్

      తొలగించండి
  8. మహరాష్ట్ర వాసుల మంగళ హారతి
    -------గైకొన్న కృష్ణమ్మ కదలికదలి
    కర్నాటకంబున కళలచే పయనించి
    -------తెలగాణ మందున,నిలిచి వలచి
    ఆంద్ర రాష్ట్రము లందు ఆరాధ్య దైవమై
    -------నీటిని బంచుచు నిధులు నింపి|
    పుష్కరములె మన పుణ్య ఫలంబని
    ------కృష్ణమ్మ పరుగుల తృష్ణబెరుగ?
    వర్షమున కొక్కరోజుగ వరలునట్లు
    పుష్క రాలిల పండ్రెండుపొద్దు పొడుపు
    రోజులందున హారతుల్ తేజమలర
    భక్త వర్యులు నివ్వగ యుక్తమేగ?
    తుంగభద్రలు ప్రక్కగా తొంగిచూడ|


    రిప్లయితొలగించండి
  9. పుష్కర కృష్ణవేణి తటి పున్నెపు నీటను తానమాడగా
    ముష్కర పాపపంకిలము మొత్తము వాసెను గుండెలోతులో
    నిష్కపటత్వ బుద్ధియును నిర్మల తత్త్వము పల్లవించి నే
    పుష్కలమైన దీవెనలు పొందితి పెద్దల నీడజేరితిన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మడిపల్లి రాజకుమార్ గారూ,
      మీ పద్యం చాలా బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  10. నమస్తే అన్నయ్యగారు.ధన్యవాదాలు.
    మీ ఆరోగ్యం ఎలావుంది.

    రిప్లయితొలగించండి
  11. సందెదీపములు వెల్గొంద మాయిండ్లలో
    విద్యుత్తు నీనీట వెలయ వలయుఁ
    దియ్యంగ దాహార్తి తీరంగ వలెనన్న
    నీనీరు మానోళ్ల నిండ వలయు
    నొక్క పూటైన మేమొగి తినవలెనన్న
    మడులన్ని నీనీట తడువ వలయుఁ
    బుణ్య మొక్కింతయొ పొందంగ వలెనన్న
    ముమ్మారు నీనీట మునగ వలయుఁ
    బుష్కరమ్ము పేర పూజించెదము నిన్ను
    కరుణ తోడ మమ్ము కావు మమ్మ
    బిరబిరాపొరలుచుఁ బరవళ్ల కృష్ణమ్మ
    వరల యాంధ్ర భూమి హరితముగను

    రిప్లయితొలగించండి